లారస్ ల్యాబ్స్ ఐపీవో నేడు ప్రారంభం
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఫార్మా కంపెనీ లారస్ ల్యాబ్స్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) సోమవారం నుంచి ప్రారంభం అవుతోంది. ఈ ఇష్యూ ఈ నెల 8 (బుధవారం)తో ముగుస్తుంది. ఒక్కో షేరుకు కనిష్ట ధర రూ.426 కాగా గరిష్ట ధర రూ.428. గరిష్ట ధర ప్రకారం చూస్తే ఈ ఇష్యూ ద్వారా సమీకరించే మొత్తం రూ.1,332 కోట్లు. రూ.300 కోట్ల విలువ మేర షేర్లను కంపెనీ తాజాగా జారీ చేయనుంది. ఇక కంపెనీలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టి వాటా కలిగిన ఆప్‌ట్యూట్ (ఏసియా), బ్లూవాటర్ ఇన్వెస్ట్‌మెంట్, ఎఫ్‌ఐఎల్ కేపిటల్ మేనేజ్‌మెంట్ (మారిషస్), ఫిడెలిటీ ఇండియా ప్రిన్సిపల్స్ సంస్థలు 2,41,07,440 షేర్లను ఈ ఇష్యూలో విక్రయానికి ఉంచుతున్నారుు. తాజా షేర్ల జారీ ద్వారా సమకూరే రూ.300 కోట్లను రుణాలను తీర్చివేయడంతోపాటు కార్పొరేట్ అవసరాలకు వినియోగించుకోనున్నట్టు కంపెనీ తెలిపింది.