సాక్షి, హైదరాబాద్: ఫార్మా కంపెనీ పేరుతో మత్తు పదార్థాల తయారీ కోసం నిబంధనలకు విరుద్ధంగా ముడిసరుకును సరఫరా చేసిన హైగ్రో కెమికల్స్ ఫార్మాటెక్ కంపెనీకి చెందిన రూ.1.93 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ)ను ఈడీ శుక్రవారం జప్తు చేసింది. మెదక్ జిల్లా బొల్లారంలో ఉన్న ఈ కంపెనీ డెక్స్‌ట్రో ప్రొపాక్సీపిన్ హైడ్రోక్లోరైడ్ అనే ముడిసరుకును ఢిల్లీకి చెందిన జేకే ఫార్మాకు అక్రమంగా నార్కోటిక్ డ్రగ్స్ తయారీకి తరలించినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ గతేడాది కేసు నమోదుచేసింది.
ఈ కేసు ఆధారంగా మనీల్యాండరింగ్ లింకులో దర్యాప్తు చేసిన ఈడీ.. కంపెనీ అకౌంట్లోకి వచ్చిన రూ.1.93 కోట్లను గుర్తించింది. ఈ డబ్బును సంబంధిత కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయగా, ఆ డిపాజిట్‌ను జప్తు చేసినట్లు తెలిపింది. ఈ ముడిసరుకును కేజీ రూ.3 వేల చొప్పున జేకే ఫార్మాకు అక్రమ పద్ధతిలో అమ్మడంతో పాటు 26 ఎయిర్ వే బిల్లులను లెక్కల్లో చూపించలేదని ఈడీ స్పష్టంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment