narcotic
-
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత
-
హైదరాబాద్ పబ్బుల్లో తనిఖీలు.. డ్రగ్స్ పరీక్షలో 11 మందికి పాజిటివ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జోర పబ్బులో నార్కెటిక్ బ్యూరో పోలీసులు తనిఖీలు చేశారు. పబ్బులోని ఓ ఈవెంట్లో పాల్గొన్న వారికి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో 11 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్‌గా తేలడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పబ్బు లోపలికి డ్రగ్స్ ఏ విధంగా చేరాయి? ఎవరు సరఫరా చేశారు? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. -
డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం
-
డ్రగ్స్ ముఠాపై నార్కోటిక్ ఉక్కుపాదం
-
హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
-
హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో రోజు రోజుకూ డ్రగ్స్ దందా పెరుగుతోంది. నగరంలో రెండు వేరు వేరుప్రాంతాల్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు నార్కోటిక్ పోలీసులు. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహారాష్ట్రకు డ్రగ్స్ సప్లై చేస్తున్న అరుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు భారీగా నగదు, మొబైల్ ఫోన్లు, వాహనాలు సీజ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో మామూనూరు బెటాలియన్ కానిస్టేబుల్ ప్రశాంత్ నాయక్ ఉన్నారు. పోలీస్ సైరన్ వేసుకొని చెక్‌పోస్ట్‌ను దాటేస్తున్న ఈ ముఠా.. పుష్పసినిమా తరహాలో వాహనాల్లో ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు తేలింది. మరోవైపు ఫిలింనగర్లోనూ భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఫిలింనగర్లో డ్రగ్స్ పిల్స్ విక్రయిస్తున్న బెంగళూరుకు చెందిన అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ పాస్టర్ డేవిసన్‌ను నార్కోటిక్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద రూ 11 లక్షల విలువైన ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.డేవిసన్.. ఆల్ ఇండియా నైజీరియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఛైర్మన్‌గా ఉన్నారు. బెంగళూరు కేంద్రంగా దక్షిణ భారత్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. నకిలీ వీసా, పాస్పోర్టుతో ఇండియాలో ఉంటున్నట్లు తేలింది. -
మత్తిచ్చి.. రెండ్రోజులపాటు కీచకపర్వం!
డబీర్‌పురా: హైదరాబాద్ పాతబస్తీలో ఘోరం చోటుచేసుకుంది. రాత్రి వేళ ఇంటి సమీపంలోని ఓ మందుల షాప్‌కు వెళ్లిన మైనర్ బాలిక (14)ను ఇద్దరు యువకులు కిడ్నాప్ చేసి ఆమెకు మత్తుమందు ఇచ్చి ఏకంగా రెండు రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడటం కలకలం సృష్టించింది. రెండు నెలల కిందట సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ ఉదంతాన్ని మరచిపోక ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. డబీర్‌పురా పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీర్‌చౌక్ ఏసీపీ ప్రసాద్‌రావు... డబీర్‌పురా ఇన్స్పెక్టర్ కోటేశ్వర్రావు, ఎస్సైలతో కలిసి నిందితుల వివరాలను వెల్లడించారు. డబీర్‌పురా ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక (14) తొమ్మిదో తరగతి మధ్యలోనే ఆపేసి ఇంట్లోనే ఉంటోంది. ఈ నెల 12న రాత్రి 8 గంటల సమయంలో తన తల్లి కాస్త అస్వస్థతకు గురికావడంతో మందులు తీసుకొచ్చేందుకు ఇంటి సమీపంలోని మందుల దుకాణానికి వెళ్లింది. అదే సమయంలో రెయిన్‌బజార్ షా కాలనీకి చెందిన సయ్యద్ నైమత్ అహ్మద్ (26), సయ్యద్ రవిష్ అహ్మద్ మెహదీ (20) క్వాలిస్ కారు (ఏపీ28 డీబీ 2729)లో అక్కడకు చేరుకున్నారు. సయ్యద్ రవిష్ స్కూల్ డ్రాపవుట్ కాగా సయ్యద్ నైమత్ సౌదీ అరేబియాలో కళ్లద్దాల దుకాణం నిర్వహిస్తూ ఇటీవలే నగరానికి వచ్చాడు. రవిష్ బాలికకు పరిచయస్తుడే. వారు మాయమాటలు చెప్పి బాలికను కారులో ఎక్కించుకొని తొలుత నాంపల్లిలోని సృజన ఇన్ లాడ్జికి తీసుకెళ్లారు. అనంతరం బాలికకు కూల్‌డ్రింక్‌లో మత్తు ట్యాబ్లెట్లు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ మర్నాడు త్రీ క్యాజిల్స్ డీలక్స్ లాడ్జికి తరలించి మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి 12న అర్ధరాత్రి దాటాక డబీర్‌పురా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ నెల 14న బాలిక తల్లికి ఫోన్ చేసిన నిందితులు.. బాలిక తమ వద్దే ఉందని చెప్పి ఆమెను చాదర్‌ఘాట్–ఎంజీబీఎస్ నాలా వద్ద విడిచిపెట్టి పరారయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న డబీర్‌పురా పోలీసులు బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. నిందితుల ఫోన్ నంబర్ ఆధారంగా సయ్యద్ నైమత్ అహ్మద్, సయ్యద్ రవిష్ అహ్మద్ మెహదీలను అరెస్టు చేయడంతోపాటు వారు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కిడ్నాప్, గ్యాంగ్‌రేప్ కేసులతోపాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అలాగే లాడ్జీల గదుల నుంచి ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించారు. అక్కడి సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. కాగా, తమ కుమార్తె చేతిపై ఇంజక్షన్లు ఇచ్చిన గుర్తులు ఉన్నట్లు బాధితురాలి తల్లి పేర్కొంది. -
నిషా ముక్త్ నగరమే లక్ష్యం
సాక్షి, సిటీబ్యూరో: రాజధాని నగరాన్ని డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చాలనే లక్ష్యంతో ఏర్పాటైన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్– న్యూ), నార్కోటిక్ ఇన్వెస్టిగేషన్ సూపర్ విజన్ వింగ్ (ఎన్‌ఐఎస్‌డబ్ల్యూ) బుధవారం నుంచి పని ప్రారంభించాయి. బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌లో జరిగిన కార్యక్రమంలో కొత్వాల్ సీవీ ఆనంద్ సమక్షంలో డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి వీటిని ఆవిష్కరించారు. వీటి కోసం ప్రత్యేకంగా కేటాయించిన చాంబర్లను ఆయన ప్రారంభించారు. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్స్ కోసం ఏర్పాటైన ఎస్ఐబీ, గ్రేహౌండ్స్ స్ఫూర్తితో.. వాటి మాదిరిగా ఏకైక లక్ష్యంగా ఈ రెండు విభాగాలు సమన్వయంతో పని చేయనున్నాయి. హెచ్– న్యూ చీఫ్‌గా డీసీపీ చక్రవర్తి గుమ్మి, ఎన్‌ఐఎస్‌డబ్ల్యూ ఏసీపీగా కె.నర్సింగ్‌రావు బాధ్యతలు స్వీకరించారు. వీటికోసం వాహనాలతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పించారు. మాదకద్రవ్యాల మూలాల నుంచి రవాణా, విక్రయం, వినియోగంపై నిఘా ఉంచి దాడులు చేసే హెచ్– న్యూకు 28 మంది, ఆ కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు నుంచి కేసు విచారణ పూర్తయ్యే వరకు పర్యవేక్షించే ఎన్ఐఎస్డబ్ల్యూకు తొమ్మిది మంది సిబ్బందిని ప్రాథమికంగా కేటాయించారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్యను అవసరాలకు తగ్గట్టు పెంచనున్నారు. ఎన్‌ఐఎస్‌డబ్ల్యూ డ్రగ్స్ సంబంధిత కేసులను దర్యాప్తును పర్యవేక్షించడంతో పాటు పోలీసు స్టేషన్లలోని సిబ్బందికీ శిక్షణ ఇస్తుంది. డ్రగ్స్‌పై సమాచారం తెలిసిన వాళ్లు 94906 16688 లేదా 040– 27852080లకు ఫోన్ చేయొచ్చు. సరదాగా మొదలెట్టి బానిసలుగా యుక్త వయసులో, కాలేజీ రోజుల్లో స్నేహితుల బలవంతంతోనే, తమకు ఉన్న ఉత్సుకత నేపథ్యంలోనే అనేక మంది సరదాగా డ్రగ్స్ వాడటం మొదలెడుతున్నారు. ఆపై వాటికి బానిసలుగా మారి జీవితాలను నిర్వీర్యం చేసుకుంటున్నారు. ఎంతోమంది యువత ఈ మహమ్మారికి సంబంధించిన చట్రంలో ఇరుక్కుంటున్నారు. దీన్ని గుర్తించిన ముఖ్యమంత్రి మాదకద్రవ్యాలను రాష్ట్రంలో లేకుండా చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఈ రెండు కొత్త విభాగాలు ఏర్పాటయ్యాయి. – డీఎస్ చౌహాన్, అదనపు సీపీ (శాంతిభద్రతలు) త్వరలోనే రాష్ట్ర స్థాయి విభాగం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వెయ్యి మందితో ఏర్పాటు చేయనున్న రాష్ట్ర స్థాయి యాంటీ నార్కోటిక్స్ వింగ్‌కు సంబంధించిన ప్రతిపాదనలు త్వరలోనే ప్రభుత్వానికి పంపుతాం. ఈలోపే హైదరాబాద్ పోలీసులు ఇలాంటి విభాగాలు ఏర్పాటు చేయడం అభినందనీయం. వీటి పనితీరులో పరిశీలించిన అంశాల ఆధారంగా రాష్ట్ర స్థాయి విభాగంలో మార్పుచేర్పులు చేస్తాం. డ్రగ్ మాఫియాపై పోరాడి, విజయం సాధించిన న్యూయార్క్ వంటి నగరాలను అనుసరించిన విధానాలు అధ్యయనం చేయాలి. – ఎం.మహేందర్‌రెడ్డి, డీజీపీ టాస్క్‌ఫోర్స్ మాదిరిగా హెచ్–న్యూ హెచ్– న్యూ ప్రస్తుతం ఉన్న టాస్క్‌ఫోర్స్ మాదిరిగా పని చేస్తుంది. ఇది కేవలం మాదకద్రవ్యాల వ్యవహారాలను మాత్రమే పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం డ్రగ్స్ మహమ్మారి అన్ని ప్రాంతాలనూ కుదిపేస్తోంది. దీన్ని గుర్తించిన సీఎం అలాంటి పరిస్థితులు రాకూడదనే చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే టోనీ కేసులో వ్యాపారులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామిక వేత్తలను అరెస్టు చేశాం. ఇది ప్రభుత్వం తీసుకున్న సంచలనం నిర్ణయం. ప్రతి పోలీసు స్టేషన్లోనూ కనీసం ఇద్దరికి డ్రగ్స్ కేసుల దర్యాప్తు తదితరాలపై పూర్తి అవగాహన కల్పించాలన్నదే మా లక్ష్యం. – సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ -
హైగ్రో కెమికల్స్ రూ.1.93 కోట్ల ఎఫ్‌డీల జప్తు
సాక్షి, హైదరాబాద్: ఫార్మా కంపెనీ పేరుతో మత్తు పదార్థాల తయారీ కోసం నిబంధనలకు విరుద్ధంగా ముడిసరుకును సరఫరా చేసిన హైగ్రో కెమికల్స్ ఫార్మాటెక్ కంపెనీకి చెందిన రూ.1.93 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)ను ఈడీ శుక్రవారం జప్తు చేసింది. మెదక్ జిల్లా బొల్లారంలో ఉన్న ఈ కంపెనీ డెక్స్ట్రో ప్రొపాక్సీపిన్ హైడ్రోక్లోరైడ్ అనే ముడిసరుకును ఢిల్లీకి చెందిన జేకే ఫార్మాకు అక్రమంగా నార్కోటిక్ డ్రగ్స్ తయారీకి తరలించినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ గతేడాది కేసు నమోదుచేసింది. ఈ కేసు ఆధారంగా మనీల్యాండరింగ్ లింకులో దర్యాప్తు చేసిన ఈడీ.. కంపెనీ అకౌంట్లోకి వచ్చిన రూ.1.93 కోట్లను గుర్తించింది. ఈ డబ్బును సంబంధిత కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్ చేయగా, ఆ డిపాజిట్‌ను జప్తు చేసినట్లు తెలిపింది. ఈ ముడిసరుకును కేజీ రూ.3 వేల చొప్పున జేకే ఫార్మాకు అక్రమ పద్ధతిలో అమ్మడంతో పాటు 26 ఎయిర్ వే బిల్లులను లెక్కల్లో చూపించలేదని ఈడీ స్పష్టంచేసింది. -
సీబీడీ ఆయిల్‌ను లీగల్ చేయాలి: నటుడి భార్య
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చిన తరువాత నార్కోటిక్స్ డ్రగ్స్ పై తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా కన్నాబిడియోల్ లేదా సీబీడీ ఆయిల్ వినియోగం చట్టవిరుద్ధమా, కాదా అనే విషయం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ భార్య సుతాపా సికదర్ సంచలన విజ్ఞప్తి చేశారు. సీబీడీ ఆయిల్‌ను ఇండియాలో చట్టబద్ధం చేయాలనే హ్యాష్ ట్యాగ్ యాడ్ చేశారు. ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ చికిత్స తీసుకున్న లండన్ ఆసుపత్రి ఫోటోను సుతాపా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో షేర్ చేశారు. దాదాపు రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతూ ఇర్ఫాన్ ఈ ఏడాది ఏప్రిల్ 29న కన్ను మూశారు. మరోవైపు ఇప్పటికే గాయని సోనా మోహపాత్రా కూడీ సీబీడీ ఆయిల్ ప్రయోజనాలపై ఫేస్బుక్లోఒక పోస్ట్ పెట్టారు. గత ఏడాది తన సోదరి క్యాన్సర్ చికిత్స సందర్భంగా పలు, శస్త్రచికిత్సలు చేయించుకున్నప్పుడు నొప్పి నివారణకు, త్వరగా కోలుకోవటానికి ఈ డ్రగ్ మాజిక్ లా పనిచేసిందని పేర్కొనడం విశేషం. కాగా ఆన్ లైన్ ద్వారా నటి శ్రధ్ధాకపూర్ కి తానే సీబీడీ ఆయిల్ ఆర్డర్ చేశానని సుశాంత్ మాజీ మేనేజర్ జయాసాహా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో తెలిపారు. సుశాంత్ కి ఎలా ఇవ్వాలో రియా చక్రవర్తికి వాట్సాప్ ద్వారా వివరంగా తెలియజేశానని వెల్లడించింది. సీబీడీ ఆయిల్ కోసం సాహాతో చాట్ చేసినట్లు ఆరోపణలు రావడంతో శ్రద్ధాను ఎన్సీబీ విచారిస్తోంది. దీంతోపాటు బాలీవుడ్ డ్రగ్గిస్టులపై అధికారులు కూపీ లాగుతున్నారు. (చదవండి: డ్రగ్స్ కేసులో ముగ్గురు బడా హీరోలు!) సీబీడీ ఆయిల్ అంటే ఏమిటి ? సీబీడీ ఆయిల్‌ను గంజాయి ఆకుల నుంచి తయారు చేస్తారు. గంజాయి ఆకుల నుంచి పలు పదార్థాలను వెలికి తీసి వాటితో సీబీడీ ఆయిల్‌ను తయారు చేస్తారు. సీబీడీ ఆయిల్‌ను కన్నాబిడియోల్ అని కూడా పిలుస్తారు. గంజాయి మోతాదు 40 శాతం వరకు ఉంటుందట. అయితే ఇతర దేశాల్లో వైద్యులు పలువురు రోగులకు సీబీడీ ఆయిల్‌ను ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. మానసిక సమస్యలు, జాయింట్ పెయిన్స్, నిద్రలేమి, గుండె సంబంధ సమస్యలకు ఔషధంగా వాడతారు. ఇండియా సహా పలు దేశాల్లో ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి నిషేధం లేదు. అంతేకాదు దీన్ని ఎక్కువగా వినియోగించే దేశాలలో భారత్ కూడా ఒకటి. అమెజాన్ లాంటి ఆన్లైన్ సైట్ల ద్వారా దేశంలో అందుబాటులో ఉన్నట్టు సమాచారం. View this post on Instagram London revist looking at his hospital room from outside like everytime I did while he was there#walkingalone#wishyouwerethere#cancerpain#LegalizeCBDoilinindia A post shared by Sutapa Sikdar (@sikdarsutapa) on Sep 29, 2020 at 5:22am PDT -
భారత్ లోకి డేంజరస్ ‘చైనా వైట్’
సాక్షి, న్యూఢిల్లీ : మార్ఫిన్ లేదా హెరాయిన్ల కన్నా వంద రెట్లు శక్తివంతమైనది, అంతకంటే ప్రమాదకరమైన డ్రగ్ ‘చైనా వైట్’ మయన్మార్ మీదుగా భారత్ నార్కోటిక్స్ మార్కెట్లోకి ప్రవేశించింది. దేశ రాజధానిలోని యువత ఈ డ్రగ్‌ను ఎక్కువగా వాడుతుండడంతో స్మగ్లర్లు మయన్మార్ నుంచి మిజోరమ్, మణిపూర్‌ల మీదుగా ఢిల్లీకి చేరవేస్తున్నారు. దీని అధిక డోస్ కారణంగా కెనడాలో ఇప్పటికే రోజుకు ఇద్దరు చొప్పున మరణిస్తున్నారు. మొన్నటి వరకు కెనడా, అమెరికాలకే పరిమితమైన ఈ డ్రగ్ భారత్ మార్కెట్లోకి ప్రవేశించడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. హెరాయిన్ తరహాలోనే దీన్ని కూడా ముక్కుతో పీల్చడం, ఇంజెక్షన్ ద్వారా రక్తంలోకి ఎక్కించుకుంటారు. చైనా వైట్‌గా పిలిచే ఈ డ్రగ్‌ను ఫెంటానిల్ అనే మొక్కల నుంచి తయారు చేస్తారు. మయన్మార్ నుంచి వచ్చిన ఈ డ్రగ్‌ను మిజోరమ్‌లో బుధవారం పోలీసులు భారీ ఎత్తున పట్టుకున్నారు. అంతకుముందు ఢిల్లీ పోలీసులు నగరంలో 12 కిలోల చైనా వైట్‌ను పట్టుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో 50 కోట్ల రూపాయలు ఉంటుంది. మయన్మార్, లావోస్, థాయ్‌లాండ్ మధ్యనున్న గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతంలో దీన్ని ఎక్కువగా పండిస్తున్నారు. గంజాయిని అక్రమంగా పండిస్తున్న దేశాల్లో మయన్మార్ ప్రపంచంలోనే రెండవ స్థానాన్ని ఆక్రమించింది. ఒక్క 2006 నుంచి 2013 మధ్య కాలంలోనే ఆ దేశంలో గంజాయి సాగు రెండింతలు పెరిగింది. సబ్బు పెట్టెలు, బొమ్మలు, బూట్లు, కాస్మోటిక్స్ వస్తువుల ద్వారా ఈచైనా వైట్ డ్రగ్‌ను అక్రమంగా రవాణా చేస్తున్నారు. విమాన మార్గాల్లో కూడా వస్తున్నట్లు తెల్సింది. గసగసాలకు ఫెంటానిల్ మొక్కల ఆకులను, కొద్ది మోతాదులో హెరాయిన్‌ను కలిపి చైనా వైట్‌ను తయారు చేస్తున్నట్లు తెల్సింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పాప్ గాయకుడు ప్రిన్స్ కూడా ఈ డ్రగ్‌ను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల మరణించినట్లు అమెరికా వైద్యులు ధ్రువీకరించారు. ఒక్క 2016లోనే అమెరికాలో 20,100 ఈ డ్రగ్ ఓవర్ డోస్ కారణంగా మరణించారు. గతంతో పోలిస్తే మృతుల సంఖ్య 540 రెట్లు పెరిగిందని అమెరికా పోలీసు అధికారులు చెబుతున్నారు. -
భారీ మొత్తం పట్టుబడ్డ మాదక ద్రవ్యాలు
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం గండిచెరువులో భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలను నార్కోటిక్స్ ట్రోల్ బ్యూరో అధికారులు మంగళవారం సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ గోడౌన్లో అక్రమంగా నిల్వ చేసినట్లు సమాచారం అందటంతో అధికారులు దాడులు నిర్వహించారు. డ్రగ్స్ సీజ్ చేసి, కేసు నమోదు చేశారు.