సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో రోజు రోజుకూ డ్రగ్స్ దందా పెరుగుతోంది. నగరంలో రెండు వేరు వేరుప్రాంతాల్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు నార్కోటిక్ పోలీసులు. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహారాష్ట్రకు డ్రగ్స్ సప్లై చేస్తున్న అరుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు భారీగా నగదు, మొబైల్ ఫోన్లు, వాహనాలు సీజ్ చేశారు.
అరెస్ట్ అయిన వారిలో మామూనూరు బెటాలియన్ కానిస్టేబుల్ ప్రశాంత్ నాయక్ ఉన్నారు. పోలీస్ సైరన్ వేసుకొని చెక్‌పోస్ట్‌ను దాటేస్తున్న ఈ ముఠా.. పుష్పసినిమా తరహాలో వాహనాల్లో ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు తేలింది.
మరోవైపు ఫిలింనగర్‌లోనూ భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఫిలింనగర్‌లో డ్రగ్స్ పిల్స్ విక్రయిస్తున్న బెంగళూరుకు చెందిన అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ పాస్టర్ డేవిసన్‌ను నార్కోటిక్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద రూ 11 లక్షల విలువైన ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.డేవిసన్.. ఆల్ ఇండియా నైజీరియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఛైర్మన్‌గా ఉన్నారు. బెంగళూరు కేంద్రంగా దక్షిణ భారత్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. నకిలీ వీసా, పాస్‌పోర్టుతో ఇండియాలో ఉంటున్నట్లు తేలింది.
Comments
Please login to add a commentAdd a comment