langar house
-
హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో రోజు రోజుకూ డ్రగ్స్ దందా పెరుగుతోంది. నగరంలో రెండు వేరు వేరుప్రాంతాల్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు నార్కోటిక్ పోలీసులు. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహారాష్ట్రకు డ్రగ్స్ సప్లై చేస్తున్న అరుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు భారీగా నగదు, మొబైల్ ఫోన్లు, వాహనాలు సీజ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో మామూనూరు బెటాలియన్ కానిస్టేబుల్ ప్రశాంత్ నాయక్ ఉన్నారు. పోలీస్ సైరన్ వేసుకొని చెక్‌పోస్ట్‌ను దాటేస్తున్న ఈ ముఠా.. పుష్పసినిమా తరహాలో వాహనాల్లో ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు తేలింది. మరోవైపు ఫిలింనగర్లోనూ భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఫిలింనగర్లో డ్రగ్స్ పిల్స్ విక్రయిస్తున్న బెంగళూరుకు చెందిన అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ పాస్టర్ డేవిసన్‌ను నార్కోటిక్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద రూ 11 లక్షల విలువైన ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.డేవిసన్.. ఆల్ ఇండియా నైజీరియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఛైర్మన్‌గా ఉన్నారు. బెంగళూరు కేంద్రంగా దక్షిణ భారత్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. నకిలీ వీసా, పాస్పోర్టుతో ఇండియాలో ఉంటున్నట్లు తేలింది. -
హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లో వ్యక్తి దారుణహత్య
-
లంగర్ హౌస్ ఖాదర్ బాగ్ లో విషాదం
-
అసాంఘిక చర్యలకు అడ్డాగా మారిన బాపూఘాట్..
సాక్షి, హైదరాబాద్: అసాంఘిక కార్యకలాపాలకు లంగర్‌హౌస్‌లోని బాపూఫట్ అడ్డాగా వరింది. జాతిపిత మహాత్మాగాంధీని ప్రపంచ దేశ ప్రజలంతా గౌరవిస్త ఆయన సమాధిని పవిత్ర మందిరంగా భావిస్తారు. అయితే దక్షిణాదిలో ఉన్న బాపూజీ ఏకైక సమాధి లంగర్‌హౌస్ త్రివేణి సంగం వద్ద ఉన్నది. ఇంతటి పవిత్రమైన ప్రాంతం మందుబాబులకు అడ్డాగా మారింది. పోలీసులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరించడంతో వీరి ఆగడాలకు హద్దులు లేకుండా పోయాయి. పేకాట, మద్యం, మాంసం.. మామూలుగానే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరం. అయితే పోకిరీలు నిత్యం బాపూ సమాధి ఎదురుగా కూర్చొని మద్యం సేవిస్తున్నారు. ఆ ఖాళీ మద్యం బాటిళ్లు బాపూ సమాధి ప్రాంగణంలోకి విసురుతున్న సంఘటనలు ఉన్నాయి. ఓ వైపు దేవాలయం, మరో వైపు బాపూ సమాధి ఉన్నాయని ఇక్కడ మద్యం సేవించకూడదని చెప్పిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. సమాధి ప్రాంతాన్ని తమ అదుపులో పెట్టుకున్న తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు కూడా పోకిరీల బెడదను అరికట్టడంలో విఫలమవుతున్నారు. ఇక్కడే మాంసాహారం తింటూ పేకాట ఆడుతున్నారు. తాజాగా శనివారం మద్యం సేవిస్త వంసం తింటున్న వారిని స్థానికులు, భక్తులు నిలదీయగా వారిపై దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. రాత్రివేళల్లో.. పోకిరీలు ఇంతటితో ఆగకుండా రాత్రి వేళ్లలో మరింతగా ర్చెపోతున్నారు. ఏటవాలు ఆకారంలో బాపూ సమాధి నిర్మాణం ఉండటంతో దాని కింద అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. రాత్రయితే చాలు బాపూ సమాధి కింద యథేచ్ఛఫగా వ్యభిచారకార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆలయం, బాపూ సవధి ఉన్న ఇంతటి పవిత్ర ప్రాంతంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అరికట్టాలని స్థానికులు, ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు. బాపూఫట్ నిర్వహణపై ప్రైవేట్ వ్యక్యులకు, ప్రభుత్వానికి హక్కు ఉండటంతో ఎవర పట్టించుకోవడంలేదని దీంతో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. అధికారులు స్పందిం బాపూ సమాధి, రామాలయాల పవిత్రతను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యమే.... బాపూ సమాధి ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలకు అధికారుల నిర్లక్ష్యమే కారణం. బాపూఫట్ ప్రాంగణానికి కొద్ది దరంలోనే త్రివేణి సంగం ఒడ్డున మహాత్ముని సమాధి నిర్మించారు. దీని నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంతో వారు నిత్యం బాపూఫట్‌కు తాళం వేసి, సవధి ఉన్న ప్రాంగణాన్ని గాలికి వదిలేస్తున్నారు. వీరితో పాటు పర్యాటక శాఖ అధికారులు కూడా తమకు సంబంధం లేదని దాటవేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి బాపూ సమాధి ప్రాంతంలో సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి: అది బస్తీ దవాఖానా.. కానీ అక్కడికి ఐఏఎస్‌లూ వస్తారు -
‘ఈ కేసులో క్షుద్ర పూజల అంశం లేదు’
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని సంచలనం రేపిన లంగర్‌హౌస్ జంట హత్యల మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్కాచెల్లెళ్లైన యాదమ్మ, సుమిత్రలను ఒకే వ్యక్తి చంపినట్లు పేర్కొన్నారు. మృతుల తలలపై బలమైన గాయాలు ఉండటంతో క్షుద్రపూజల కోసమే నరబలి ఇచ్చారంటూ అనుమానాలు నెలకొనడంతో.. ఈ కేసును ఛాలెంజింగ్‌గా భావించిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 24 గంటల్లోనే మిస్టరీని ఛేదించారు. ఈ సందర్భంగా వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ.. కమ్మల కోసమే నిందితుడు మహిళలను హత్య చేశాడని పేర్కొన్నారు. ఈ హత్యలో క్షుద్ర పూజల అంశం లేదని స్పష్టం చేశారు. నిందితుడిని మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెడతామని తెలిపారు. కాగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దెబ్బడగూడ గ్రామానికి చెందిన దంపతులు రాజు–యాదమ్మ, లక్ష్మణ్–సుమిత్ర 15 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం సిటీకి వలసవచ్చారు. వీళ్లు ప్రస్తుతం మీర్‌పేట పరిధిలోని బాలాపూర్ చౌరస్తా సమీపంలో ఉన్న లెనిన్‌నగర్‌లో నివసిస్తున్నారు. అక్కాచెల్లెళ్లు అయిన యాదమ్మ, సుమిత్రలు సమీపంలోని ఇళ్లల్లో పని చేస్తుండగా... రాజు, లక్ష్మణ్‌లు అడ్డా కూలీలుగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి నలుగురు చొప్పున సంతానం. సుమిత్ర భర్త లక్ష్మణ్ మద్యానికి బానిసై ఐదేళ్ల క్రితం చనిపోయాడు. -
క్షుద్రపూజల కోసం మహిళల నరబలి!
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని లంగర్ హౌజ్ పరిధిలోని మూసీనదిలో ఇద్దరు గుర్తుతెలియని మహిళల మృతదేహాలు బయటపడటం కలకలం రేపుతోంది. మహిళలను చంపిన దుండగులు మృతదేహాలను మూసీ నదిలో పారేశారు. మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిన్న రాత్రి మహిళల హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. తలపై బలమైన గాయాలు ఉండటంతో క్షుద్రపూజల కోసమే నరబలి ఇచ్చారని పోలీసులు అనుమానిస్తునారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. -
లంగర్‌హౌజ్ నుంచి ఫ్రారంభమైన తొట్టెల ఊరేగింపు
-
భర్త చనిపోయాడనే మనస్తాపంతో..
లంగర్‌హౌస్ : తన కంటే ముందే భర్త చనిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వృద్ధురాలు(80) భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు ప్పాలడిన సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై జగన్ తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో నివాస ముండే జానకమ్మ, వెంకటేశ్వర్లులు దంపతులు. వారి కుమారుడు సంవత్సరం క్రితం జీవనోపాధి కోసం నగరానికి వచ్చి లంగర్‌హౌస్ బాపునగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. జానకమ్మ భర్త వెంకటేశ్వర్లు గత సంవత్సరం ఆగస్టులో అనారో గ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి జానకమ్మ లంగర్‌హౌస్‌లోని కుమారుని వద్దనే ఉంటుంది. భర్త బతికి ఉండగానే భార్య చనిపోవాలని, తన భర్తే మొదలు చనిపోయాడని జాన కమ్మ తీవ్ర మనస్తాపానికి గురై తాను ఇక బతకలేనంటూ అందరికి చెబుతూ బాధపడేది.. పొలం పనులు చూసుకోడానికి కుమారుడు రాంచందర్ పది రోజుల క్రితం ఒంగోలు వెళ్లాడు. కోడలు మంగళవారం ఉదయం సంగం దేవాలయానికి వెళ్లింది. ఇంట్లో ఎవరు లేని విషయం గమనించిన జానకమ్మ రెండ తస్తుల భవనంపైకెక్కి అక్కడ నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. -
కారులో మంటలు: తప్పిన ప్రమాదం
హైదరాబాద్: లంగర్ హౌజ్ టిప్పుఖాన్ ఫూల్ బ్రిడ్జిపై ఓ కారులో మంటలు వ్యాపించాయి. మంటలను గమనించి అందులోని నలుగురు ప్రయాణికులు కిందకు దిగారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లంగర్‌హౌస్‌లో తాగుబోతులు వీరంగం
-
ఏటీఎంల వద్ద గంటల కొద్ది నిరీక్షణ
-
లంగర్‌హౌజ్‌లో వ్యాపారి కిడ్నాప్ కలకలం..
హైదరాబాద్ : నగరంలో ఓ వ్యాపారి కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. లంగర్‌హౌజ్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారిపై బుధవారం స్ప్రే కొట్టి కారులో దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపారి లావాదేవీలపై బాధితుడి కుటుంబ సభ్యుల నుంచి పోలీసులు వివరాలు సేకరించడంతో పాటు స్థానిక సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కిడ్నాప్‌కు గురైన వ్యాపారి వివరాలతో పాటు ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
లంగర్‌హౌస్‌లో కార్డన్ సెర్చ్: 63 మంది అరెస్ట్
హైదరాబాద్ : నగరంలోని లంగర్‌హౌస్, గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కాలనీల్లో శనివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 63 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే సరైన పత్రాలు లేని 59 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 200 మంది పోలీసులు పాల్గొన్నారు. -
చిరునామా అడిగి మళ్లీ స్నాచింగ్
హైదరాబాద్ : మరోసారి చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. చిరునామా అడుగుతూ లంగర్‌హౌస్‌లో మహిళ మెడలోని మంగళసూత్రాన్ని తెంచుకెళ్లారు. ఐదు రోజుల క్రితం ఇదే విధంగా ఇదే ప్రాంతంలో దుండగులు ఓ మహిళ మెడలోని మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. ఆ ఘటన మరువక ముందే మళ్లీ స్నాచింగ్ జరగడంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం.... లంగర్‌హౌస్ గాంధీనగర్‌లో నివాసముండే కల్పలతా రెడ్డి(45) సోమవారం ఉదయం 7 గంటలకు తన ఇంటి వాకిలి ఊడుస్తోంది. ఆ సమయంలో పల్సర్ వాహనంపై వచ్చిన ఇద్దరు ఆమె ఇంటికి సమీపంలో వాహనాన్ని ఆపారు. వారిలో ఒకడు వాహనం దిగి కల్పలతారెడ్డి వద్దకు వచ్చాడు. తమకు ఓ చిరునామా చెప్పాలని అడుగుతూనే ఆమె మెడలోని 6 తులాల బంగారు మంగళసూత్రాన్ని తెంచుకొని అప్పటికే బైక్ వేచి ఉన్న వ్యక్తితో కలిసి పారిపోయారు. వారిని స్థానికులు వెండించినా ఫలితం లేకపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు లంగర్‌హౌస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పొద్దున్నే తెంపేశారు
-
పొద్దున్నే తెంపేశారు
లంగర్‌హౌజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయాన్నే చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. గాంధీనగర్‌కు చెందిన ఓ మహిళ తన ఇంటి ముందు ఉండగా బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు అడ్రస్ అడుగుతూనే ఆమె మెడలోని ఆరు తులాల బంగారు గొలుసును లాక్కుని క్షణాల్లో మాయమయ్యారు. కొద్దిసేపటికి తేరుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ఆడశిశువు మృతదేహం లభ్యం
హైదరాబాద్‌సిటీ: లంగర్‌హౌస్‌పరిధిలోని మొగలినగర్ చౌరస్తా వద్ద ఆడశిశువు మృతదేహం గురువారం లభ్యమైంది. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 15 రోజుల శిశువును గొంతు నులిమి చంపివేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
కోరిక తీర్చలేదని ఆ ఇంటి ఓనర్ ఏం చేశాడంటే....
-
స్నేహితుని ఇంట్లో చోరీ... ఓఎల్ఎక్స్లో విక్రయం
ఇద్దరి అరెస్టు లంగర్‌హౌస్: స్నేహితుడి ఇంట్లో వస్తువులు చోరీ చేసి.. వాటిని ఓఎల్ఎక్స్లో విక్రయిస్తున్న ఇద్దరి లంగర్‌హౌస్ పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై అంజయ్య కథనం ప్రకారం... సాయిశ్రీకాంత్ లంగర్‌హౌస్ దుర్గానగర్‌లో ఉంటూ అమేజాన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. పశ్చిమ బెంగాల్లో ఎన్ఐటీ చేసిన ఇతను గతనెల 7న యూనివర్సిటీలో పట్టా అందుకొనేందుకు పశ్చిమ బెంగాల్ వెళ్లాడు. 16న నగరానికి తిరిగి వచ్చే సరికి దొంగలు కిటికీలోంచి చొరబడి కంప్యూటర్, ట్యాప్ తదితర వస్తువులు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు... చోరీ అయిన వస్తువుల్లో సామ్సంగ్ ట్యాబ్ ఓఎల్ఎక్స్లో రూ. 6 వేలకు విక్రయించినట్టు కనుగొన్నారు. మరింత లోతుగా దర్యాప్తు చేపట్టగా సాయి స్నేహితులే ఈ చోరీకి పాల్పడినట్టు తేలింది. గతంలో ఇదే అపార్ట్మెంట్లో ఉండి ప్రస్తుతం భెల్ ఎంప్లాయ్ అసోసియేట్‌లో పని చేస్తున్న ఉప్పర్‌పల్లికి చెందిన శ్రీకాంత్, లంగర్‌హౌస్‌లో ఉంటూ బీటెక్ చదువుతున్న రాంపల్లి విక్రమ్‌తో కలిసి చోరీ చేసినట్టు గుర్తించి సోమవారం ఇద్దరినీ అరెస్టుచేశారు. వీరి వద్ద నుంచి కంప్యూటర్ సీపీయూ, మానీటర్, సెల్‌ఫోన్, సామ్సంగ్ ట్యాబ్, 2 గడియారాలు, బ్లూటూత్ తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితుల్లో శ్రీకాంత్ పాతనేరస్తుడని పోలీసులు తెలిపారు. -
కారు బీభత్సం..ఇద్దరికి గాయాలు
లంగర్‌హౌస్: యువకుడు నిర్లక్ష్యంగా కారు నడిపి బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఇద్దరు అయ్యప్ప మాలధారులకు తీవ్ర గాయాలయ్యాయి. లంగర్‌హౌస్ పోలీసుల కథనం ప్రకారం..విశాఖపట్నానికి చెందిన కృష్ణారెడ్డి(24), ఏడుకొండలురెడ్డి(28) రాజేంద్రనగర్ మండలం హైదర్షాకోట్లో నివాసముంటున్నారు. ఇటీవల అయ్యప్ప మాల వేసుకుని అత్తాపూర్‌లోని సన్నిధానంలో ఉంటున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు బైక్‌పై బాపూఘాట్ మీ దుగా లంగర్‌హౌస్‌కు వెళుతున్నారు. అదే సమయం లో బషీర్‌బాగ్‌కు చెందిన గుల్జార్ అగర్వాల్(24) కారులో పోలీస్ అకాడమీ నుంచి లంగర్‌హౌస్ వైపు వేగంగా వచ్చాడు. అతడి కారు ఒక్కసారిగా గుండ్రంగా తిరుగుతూ కృష్ణారెడ్డి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. రోడ్డు పక్కకు దూసుకెళ్లి టైర్లలో గాలి పెట్టించుకుంటున్న మరో కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో గుల్జార్ స్వల్ప గాయాలతో బయటపడగా, కృష్ణారెడ్డి, ఏడుకొండలరెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. రెండు కార్లు, ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న లంగర్‌హౌస్ 108 ఈఎంటీ రఘుపతి, ఫైలట్ ముజాఫర్లు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కృష్ణారెడ్డి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంత జరిగినా గుల్జార్, అతడి సంబందీకులు స్థానికులు, బాధితుల పై దాడికి పాల్పడటం అందరిని నిశ్చేష్టులను చేసింది. -
ప్రియురాలి ఇంట్లో ప్రియుడి ఆత్మహత్య
లంగర్‌హౌస్: ప్రియురాలు తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనస్తాపం చెంది ఆమె ఇంట్లోనే ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. లంగర్‌హౌస్ ఎస్సై శశిధర్ కథనం ప్రకారం... ఖమ్మం జిల్లాకు చెందిన పిచ్చయ్య(42) గుడిమల్కాపూర్‌లో కుటుంబసభ్యులతో కలిసి ఉంటూ మేస్త్రీ పని చేస్తూ జీవిస్తున్నాడు. తన వద్ద కూలీ పనిచేసే లంగర్‌హౌస్ కనకదుర్గా కాలనీకి చెందిన యాదమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం పూటుగా మద్యం తాగిన పిచ్చయ్య యాదమ్మ ఇంటికి వచ్చాడు. డబ్బుల విషయంలో ఇద్దరూ రెండు గంటల పాటు గొడవపడ్డారు. యాదమ్మ ఆదివారం రాత్రి పిచ్చయ్య తన ఇంట్లో ఉండగానే పరుగు పరుగున లంగర్‌హౌస్ పోలీసుస్టేషన్‌కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు యాదమ్మ ఇంటికి వెళ్లగా.. లోపలి నుంచి గడియపెట్టి ఉంది. పిలిచినా యాదయ్య తలుపు తీయకపోవడంతో పోలీసులు తలుపులు బద్ధలుకొట్టి చూడగా.. చీరతో ఉరికి వేలాడుతూ కనిపించాడు. కొన ఊపిరితో ఉన్న యాదయ్యను సమీపంలోనే ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. డబ్బుల విషయంలో తమ మధ్య గొడవ జరిగిందని యాదమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనస్తాపం చెంది యాదయ్య ఆత్మహత్య చేసుకున్నాడా? వేరే కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
లంగర్ హౌస్ బోనాలు ప్రారంభం
-
టిప్పర్ బీభత్సం
=8 మందికి గాయాలు =ఇద్దరి పరిస్థితి విషమం నాలుగు వాహనాలు ధ్వంసం రాజేంద్రనగర్/మణికొండ, న్యూస్‌లైన్: వేగంగా వెళ్తున్న టిప్పర్ అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న వాహనాలతో పాటు పార్కు చేసిన వాహనాలను, బస్సుకోసం వేచివున్న మహిళను, రోడ్డు పక్కన టీ తాగుతున్న యువకుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎనిమిది మంది గాయపడగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మద్యం మత్తులో ఉన్న టిప్పర్ డ్రైవర్‌ను స్థానికులు చితకబాదారు. నార్సింగ్ ఎస్సై ప్రభాకర్‌రెడ్డి, స్థానికుల కథనం ప్రకారం... ఆదివారం ఉదయం 11.30కి డ్రైవర్ అబ్దుల్నయాం (35) టిప్పర్ (ఏపీ 12 టి 4007)ను వేగంగా నడుపుకుంటూ లంగర్‌హౌస్ మీదుగా ఖాళీమందిర్ వైపు వస్తున్నాడు. హైదర్షాకోట్ సన్‌సిటీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్దకు రాగానే టిప్పర్ అదుపుతప్పింది. వాహనాన్ని ఆపేందుకు డ్రైవర్ ప్రయత్నించగా బ్రేక్ ఫెయిలై ముందు వెళ్తున్న బైక్ (ఏపీ 28 డిజె 0570)ను ఢీకొట్టడంతో పాటు రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న మరో ఆక్టివా (ఏపీ 28 డిఎ 9636), ఆటో (ఏపీ 28 వి 2417)లను ఢీకొట్టింది. అంతటితో రోడ్డుపై వెళ్తున్న కారు ( ఏపీ 09 ఎఎ 2460)ను, బస్టాప్‌లో బస్సు కోసం వేచిచూస్తున్న మణెమ్మ(45), పక్కనే టీ తాగుతున్న ఫిలిప్స్(35)లను ఢీకొట్టింది. మణెమ్మ కాళ్లు నుజ్జునుజ్జు కాగా.. ఫిలిప్స్ ఎగిరి రోడ్డు పక్కన పడటంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. కారులో వెళ్తున్న గాయత్రినగర్ కాలనీకి చెందిన మామాఅల్లుళ్లు సుదర్శన్, బాలబ్రహ్మంలు తీవ్రగాయాలయ్యాయి. వీరి తో పాటు పూడురు సుందర్, కొల్లూరు నగేశ్, కె.జె. నితానియల్, మహామూద్లతో పాటు మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వివిధ ఆస్పత్రులకు తరలించారు. స్థానికులు పట్టరానికి కోసంతో టిప్పర్ డ్రైవర్ నయీమ్‌ను చితకబాదారు. సకాలంలో చేరుకున్న పోలీసులు స్థానికులను చెదరగొట్టి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరుగు తీసిన పాదచారులు, వాహనదారులు... ఆదివారం కావడంతో సన్‌సిటీ రోడ్డు వాహనాలు, పాదచారులతో కిటకిటలాడుతోంది. మృత్యుశకటంలా దూసుకొస్తున్న టిప్పర్‌ను చూసి పాదచారులతో పాటు రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులు తమ వాహనాలు దిగి అక్కడి నుంచి పరుగు తీశారు. భయానకంగా ఘటనాస్థలం... చెల్లాచెదురైన వాహనాల విడిభాగాలు, అద్దాలు, క్షతగాత్రుల రక్తపుమరకలతో ఘటనా స్థలం భయానకంగా మారింది. కుమారుడు వాహనాన్ని మళ్లించేలోపు... బాకారం వెళ్లేందుకు మణెమ్మ తన కుమారుడు శ్రీకాంత్ ద్విచక్రవాహనంపై సన్‌సిటీ బస్టాప్‌కు వచ్చింది. కుమారుడు బస్టాప్‌లో దించి తన వాహనాన్ని మళ్లిస్తుండగానే టిప్పర్ మణెమ్మను ఢీకొట్టింది. ఈ సంఘటనను చూసిన శ్రీకాంత్ బోరున విలపించాడు. తల్లిని హుటాహుటిన కేర్ ఆస్పత్రికి తరలించాడు. టీ తాగేందుకు వచ్చి.... సన్‌సిటీ ప్రాంతంలో ఓ ఇంటికి రంగులు వేస్తున్న సఫిల్‌గూడకు చెందిన ఫిలిప్స్ ఉదయం టీ తాగేందుకు రోడ్డుపైకి వచ్చాడు. బస్టాప్ పక్కనే ఉన్న టీకొట్టు వద్ద టీ తాగుతుండగా టిప్పర్ ఢీకొట్టింది. తీవ్రగాయాలకు గురైన ఫిలిప్స్ చావుబతుకుల మధ్య చికిత్సపొందుతున్నాడు. కారు నుజ్జునుజ్జైనా చిన్నపాటి గాయాలతో... బండ్లగూడ గాయత్రినగర్‌కు చెందిన మామాఅల్లుళ్లు సుదర్శన్, బాలబ్రహ్మంలు కారులో వెళ్తుండగా వెనుకనుంచి వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. కారు వెనుక భాగం పూర్తిగా దెబ్బతింది. కాగా, ముందు సీట్లో కూర్చున్న మామాఅల్లుళ్లు స్వల్పగాయాలతో బయటపడ్డారు.