మైలాన్‌ నాసిక్‌ ప్లాంటుకు ఎఫ్‌డీఏ వార్నింగ్‌! | FDA warning to Milan | Sakshi
Sakshi News home page

మైలాన్‌ నాసిక్‌ ప్లాంటుకు ఎఫ్‌డీఏ వార్నింగ్‌!

Published Fri, Apr 14 2017 2:33 AM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM

FDA warning to Milan

న్యూఢిల్లీ: ఫార్మా సంస్థ మైలాన్‌కి చెందిన నాసిక్‌ ప్లాంట్‌లో ఔషధాల తయారీలో ప్రమాణాల ఉల్లంఘనకు గాను అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డీఏ వార్నింగ్‌ లెటర్‌ జారీ చేసింది. గతేడాది సెప్టెంబర్‌ 5–14 మధ్యలో నాసిక్‌ ప్లాంటులో ఎఫ్‌డీఏ తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా నాణ్యత ప్రమాణాల నియంత్రణలో వైఫల్యాలు, డేటా అనుసంధానంలో లోపాలు మొదలైనవి గుర్తించినట్లు మైలాన్‌ ఫార్మా ప్రెసిడెంట్‌ రాజీవ్‌ మాలిక్‌కు పంపిన లేఖలో పేర్కొంది.

తయారైన ఔషధాల నాణ్యతపై వీటి ప్రభావాలు ఎలా ఉండవచ్చు, తీసుకుంటున్న దిద్దుబాటు చర్యలు మొదలైన వాటిపై వివరణ ఇవ్వాల్సిందిగా కంపెనీకి సూచించింది. ప్రమాణాలు పూర్తి స్థాయిలో పాటిస్తున్నట్లు నిర్ధారణ అయ్యే దాకా కొత్త ఔషధాల దరఖాస్తులకు అనుమతులు నిలిపివేసే అవకాశముందని, నాసిక్‌ ప్లాంటులో తయారయ్యే ఉత్పత్తుల దిగుమతులపైనా ఆంక్షలు విధించవచ్చని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement