mailan
-
నాట్కో ఖాతాలో మరో మైలురాయి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాట్కో ఫార్మా ఖాతాలో మరో మైలురాయి పడింది. గ్లాటిరామర్ ఎసిటేట్ ఇంజెక్షన్ విక్రయానికై సంస్థ మార్కెటింగ్ భాగస్వామి అయిన మైలాన్‌కు యూఎస్ఎఫ్డీఏ అనుమతినిచ్చింది. 20 ఎంజీ, 40 ఎంజీ సామర్థ్యం గల ఇంజెక్షన్లను నాట్కో తయారు చేయనుంది. కేంద్ర నాడీ మండల సంబంధ చికిత్సలో వాడే గ్లాటిరామర్ ఎసిటేట్ ఔషధం టెవా ఫార్మా తయారీ కోపాగ్జోన్ బ్రాండ్‌కు జనరిక్ రూపం. యూఎస్‌లో ప్రాచుర్యంలో ఉన్న కోపాగ్జోన్ వార్షిక అమ్మకాలు రూ.28,000 కోట్లపైమాటే. మైలాన్‌తో ఉన్న ఒప్పందం ప్రకారం నాట్కో ఫార్మా 20 ఎంజీ ఉత్పాదనపై 30 శాతం, 40 ఎంజీ ఉత్పాదనపై 50 శాతం లాభం అందుకోనుంది. -
మైలాన్ నాసిక్ ప్లాంటుకు ఎఫ్‌డీఏ వార్నింగ్!
న్యూఢిల్లీ: ఫార్మా సంస్థ మైలాన్కి చెందిన నాసిక్ ప్లాంట్‌లో ఔషధాల తయారీలో ప్రమాణాల ఉల్లంఘనకు గాను అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ వార్నింగ్ లెటర్ జారీ చేసింది. గతేడాది సెప్టెంబర్ 5–14 మధ్యలో నాసిక్ ప్లాంటులో ఎఫ్‌డీఏ తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా నాణ్యత ప్రమాణాల నియంత్రణలో వైఫల్యాలు, డేటా అనుసంధానంలో లోపాలు మొదలైనవి గుర్తించినట్లు మైలాన్ ఫార్మా ప్రెసిడెంట్ రాజీవ్ మాలిక్‌కు పంపిన లేఖలో పేర్కొంది. తయారైన ఔషధాల నాణ్యతపై వీటి ప్రభావాలు ఎలా ఉండవచ్చు, తీసుకుంటున్న దిద్దుబాటు చర్యలు మొదలైన వాటిపై వివరణ ఇవ్వాల్సిందిగా కంపెనీకి సూచించింది. ప్రమాణాలు పూర్తి స్థాయిలో పాటిస్తున్నట్లు నిర్ధారణ అయ్యే దాకా కొత్త ఔషధాల దరఖాస్తులకు అనుమతులు నిలిపివేసే అవకాశముందని, నాసిక్ ప్లాంటులో తయారయ్యే ఉత్పత్తుల దిగుమతులపైనా ఆంక్షలు విధించవచ్చని పేర్కొంది.