
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాట్కో ఫార్మా ఖాతాలో మరో మైలురాయి పడింది. గ్లాటిరామర్ ఎసిటేట్ ఇంజెక్షన్ విక్రయానికై సంస్థ మార్కెటింగ్ భాగస్వామి అయిన మైలాన్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతినిచ్చింది. 20 ఎంజీ, 40 ఎంజీ సామర్థ్యం గల ఇంజెక్షన్లను నాట్కో తయారు చేయనుంది. కేంద్ర నాడీ మండల సంబంధ చికిత్సలో వాడే గ్లాటిరామర్ ఎసిటేట్ ఔషధం టెవా ఫార్మా తయారీ కోపాగ్జోన్ బ్రాండ్‌కు జనరిక్ రూపం.
యూఎస్‌లో ప్రాచుర్యంలో ఉన్న కోపాగ్జోన్ వార్షిక అమ్మకాలు రూ.28,000 కోట్లపైమాటే. మైలాన్‌తో ఉన్న ఒప్పందం ప్రకారం నాట్కో ఫార్మా 20 ఎంజీ ఉత్పాదనపై 30 శాతం, 40 ఎంజీ ఉత్పాదనపై 50 శాతం లాభం అందుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment