
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ రంగ కంపెనీ నాట్కో ఫార్మా గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 50.5 కోట్ల నికర నష్ట్రం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 53 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 331 కోట్ల నుంచి రూ. 597 కోట్లకు జంప్ చేసింది.
అయితే నిల్వల విలువలో రైటాఫ్‌తోపాటు.. క్రెడిట్ నష్టాల అంచనాలకు అనుగుణంగా కేటాయింపులు చేపట్టడం ప్రధానంగా క్యూ4లో నష్టాలకు కారణమైనట్లు కంపెనీ వివరించింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నాట్కో ఫార్మా నికర లాభం దాదాపు 62 శాతం క్షీణించి రూ. 170 కోట్లకు పరిమితమైంది. 2020–21లో రూ. 442 కోట్లకుపైగా ఆర్జించింది.
ఫలితాల నేపథ్యంలో నాట్కో ఫార్మా షేరు 3.2 శాతం పతనమై రూ. 658 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment