ఫార్మా, మెడికల్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఇకపై రెండుగా విడిపోతుంది. ఇంత కాలం జాన్సన్ అండ్ జాన్సన్ కిందనే ఔషధాలు, వైద్య పరికరాలు, ఉత్పత్తులను అందిస్తోంది. ఇకపై ఔషధాలు, మెడికల్ ఉత్పత్తులను వేర్వేరు విభాగాలుగా చేయాలని నిర్ణయించింది.
తమ గ్రూపు ద్వారా అందుతున సేవలను విడగొట్టడం ద్వారా మరింత నాణ్యమైన సేవలు వేగంగా అందుతాయనే నమ్మకం ఉందని జాన్సన్ అండ్ జాన్సన్ పేర్కొంది. గ్రూపును రెండుగా విడగొట్టే ప్రక్రియ పద్దెనిమిది నెలల నుంచి రెండేళ్లలోపు పూర్తి చేస్తామని తెలిపింది. అన్ని వివరాలు పూర్తిగా సమీక్షించి తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు గ్రూపు సీఈవో అలెక్స్ గోర్కి వెల్లడించారు. జాన్సన్ అండ్ జాన్సన్‌కి ప్రపంచ వ్యాప్తంగా 1.36 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా పెద్ద కంపెనీలను రెండుగా విడగొడుతున్న సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ, తోషిబాలు ఇటీవల తమ గొడుకు కింద అందున్న సేవలు, ఉత్పత్తులను రెండుగా విడగొడుతున్నట్టు ప్రకటించాయి. వాటి విభజన ప్రక్రియ పూర్తి కాకముందే అదే తరహా ప్రకటన జాన్సన్ అండ్ జాన్సన్ నుంచి వెలువడింది.
Comments
Please login to add a commentAdd a comment