సాక్షి,ముంబై: వివాదాస్పద దేశీయ ఫార్మ కంపెనీ మైడెన్ ఫార్మాకు మరో భారీ షాక్ తగిలింది. కంపెనీ ఉత్పత్తి చేసే దగ్గు మందులు ప్రమాణాలకు అనుగుణంగా లేవంటూ హరియాణా ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సోనెపట్‌లోని దాని తయారీ ప్లాంట్‌లో తనిఖీల అనంతరం హరియాణా స్టేట్ డ్రగ్స్ కంట్రోలర్, లైసెన్సింగ్ అథారిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది.
సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌తో సంయుక్త తనిఖీ తర్వాత హర్యానా డ్రగ్ అధికారులు మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌కు ఈ నోటీసులిచ్చింది. సంస్థ డైథలిన్ గ్లైకాల్, ఇథిలీన్ ప్రొపైలిన్ గ్లైకాల్ నాణ్యత పరీక్షను నిర్వహించలేదని, సంబంధిత పత్రాలు కూడా సక్రమంగా లేవంటూ ఫార్మా కంపెనీ అక్టోబర్ 14 లోగా నోటీసుకు సమాధానం ఇవ్వాలి, లేని పక్షంలో దానిపై చర్య తీసుకుంటామని అక్టోబరు 7న జారీ చేసిన నోటీసుల్లో తెలిపింది. (చిన్నారులను మింగేసిన దగ్గు మందు: సంచలన విషయాలు)
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్, హర్యానా, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940 రూల్స్, 1945 రూల్ 85(2) ప్రకారం న్యూ ఢిల్లీలోని మైడెన్ ఫార్మాకు నోటీసులిచ్చింది. తమ తనిఖీల్లో అనేక ఉల్లంఘనలను గుర్తించిన నేపథ్యంలో కంపెనీ తయారీ లైసెన్స్‌ను ఎందుకు సస్పెండ్ చేయకూడదో తెలపాలని కోరుతూ నోటీసు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు తన నివేదికను సమర్పించిన రాష్ట్ర ఎఫ్‌డీఏ షోకాజ్ నోటీసు అందిన 7 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని మైడెన్ ఫార్మాను ఆదేశించింది.
రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ కమ్ లైసెన్సింగ్ అథారిటీ, హరియాణా ఎఫ్‌డీఏ మన్మోహన్ తనేజా తెలిపారు.ప్రొపైలిన్ గ్లైకాల్ (బ్యాచ్ నంబర్ E009844) తయారీ తేదీ సెప్టెంబర్ 2021, గడువు తేదీ సెప్టెంబరు 2023ని ప్రోమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్‌మలిన్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్‌ల తయారీలో ఉపయోగించినట్టు కనుగొంది. అలాగే నవంబర్ 2024 నాటికి, ఉత్పత్తి షెల్ఫ్-లైఫ్ ముడి పదార్థం కంటే ఎక్కువ అని తేలింది.
కాగా ఇటీవల గాంబియాలో 66 మంది చిన్నారుల మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మైడెన్ దగ్గు సిరప్‌లపై హెచ్చరికలు జారీ చేసింది. మైడెన్ ఫార్మా ఉత్పత్తులు ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్‌మలిన్ బేబీ కాఫ్ సిరప్, మాకోఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ సిరప్స్‌లోని నాణ్యత లేని, కలుషితమైన పదార్థాలే పిల్లల మరణాలకు కారణమని పేర్కొన్న సంగతి తెలిసిందే. (ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీ సేల్: ఐఫోన్13పై కళ్లు చెదిరే ఆఫర్)
Comments
Please login to add a commentAdd a comment