Maiden Pharmaceuticals
-
కోర్టు తీర్పు.. మైడెన్ ఫార్మా ఫౌండర్ జైలుకి!
చాలా సంవత్సరాల క్రితం వియత్నాంకు నాసిరకం మందులను ఎగుమతి చేయడం వల్ల గాంబియాలో ఎంతో మంది పిల్లలు మరణించారు. పిల్లల మరణాలకు దగ్గు సిరప్లు కారణమని కొన్ని నెలల తర్వాత ఇద్దరు ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లకు రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించినట్లు ఇటీవల వెల్లడైంది. 2022 అక్టోబర్‌లో మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌లో తయారీ ప్రమాణాలను ఉల్లంఘించి తయారైన నాలుగు దగ్గు సిరప్లు ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఆ తరువాత ఈ విషయం తెలుసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ కేంద్ర ప్రభుత్వంతో చెప్పి ఉత్పత్తిని నిలిపివేసింది. (ఇదీ చదవండి: భారతదేశ భవిష్యత్తుని మార్చేది ఇలాంటివారే: ఆనంద్ మహీంద్రా) పిల్లల మరణాలకు గాంబియాలో తమ ఔషధాలే కారణం అనటాన్ని కంపెనీ కండించింది. అంతే కాకుండా గవర్నమెంట్స్ నిర్వహించిన టెస్ట్‌లో కూడా అందులో విషపదార్థాలు లేదని తేలింది. అయినప్పటికీ కంపెనీ కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంది. హర్యానా సోనిపట్‌లోని కోర్టు ప్రాసిక్యూషన్ ఆరోపణను సముచితంగా రుజువు చేశారని హార్ట్‌బర్న్ ఔషధాన్ని వియత్నాంకు ఎగుమతి చేసినందుకు కంపెనీ వ్యవస్థాపకుడు నరేష్ కుమార్ గోయెల్, టెక్నికల్ డైరెక్టర్ ఎంకే శర్మలకు జైలు శిక్ష విధించింది. అయితే పై కోర్టులో అప్పీలు చేసుకోవడానికి కోర్టు 2023 మార్చి 23 వరకు గడువు ఇచ్చింది. రెనిటిడిన్ టాబ్లెట్స్ బిపి (మాంటెక్-150) మెడిసిన్ వియత్నాంకు ఎగుమతి చేసినందుకు ఇద్దరికి ఒక్కొక్కరికి లక్ష జరిమానా విధించారు.అయితే గోయెల్ కాల్లకు సమాధానం ఇవ్వలేదు. అయితే ఎంకే శర్మ సంప్రదింపు వివరాలను అందించడానికి నిరాకరించినట్లు తెలిసింది. -
చిన్నారుల ప్రాణం తీసిన దగ్గు మందు..మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌కు ఊరట!
69 మంది చిన్నారుల మరణానికి కారణమని డబ్ల్యూహెచ్ఓ అనుమానం వ్యక్తం చేసిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. పశ్చిమ ఆఫ్రికా దేశం గాంబియాలో పదుల సంఖ్యలో చిన్నారుల మరణాలకు మైడెన్ ఫార్మా తయారు చేసిన డైథలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ మోతాదు పరిమితికి మించి ఉన్నాయంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అనుమానం వ్యక్తంచేసింది. తాజాగా ఆ సంస్థ తయారు చేసిన దగ్గు మందు సిరప్‌ల నుండి తీసిన నమూనాలను ప్రభుత్వ ప్రయోగశాలలో టెస్టులు నిర్వహించగా అందులో ఎలాంటి తప్పు లేదని తేలింది. కాబట్టి, తన ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించేలా ప్రభుత్వ అనుమతి కోరినట్లు మైడెన్ ఫార్మాస్యూటికల్స్ తెలిపింది. ఈ సందర్భంగా మైడెన్ ఫార్మా మేనేజింగ్ డెరెక్టర్ నరేష్ కుమార్ గోయల్ మాట్లాడుతూ.. భారతీయ నియంత్రణ, న్యాయ వ్యవస్థలపై మాకు పూర్తి నమ్మకం ఉంది. మేం ఎలాంటి తప్పు చేయలేదు. ‘మేం ఇప్పుడు ఫ్యాక్టరీని పునప్రారంభించేలా అధికారులను కోరుతున్నాం. కానీ అది ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు. అనుమతుల కోసం మేం ఇంకా వేచి ఉన్నాం అని తెలిపారు. ఈ ఏడాది నవంబర్ నెలలో 69 మంది పిల్లల మరణాలకు మైడెన్ ఫార్మా కంపెనీ దగ్గు,జలుబు సిరప్లు సంబంధం కలిగి ఉండవచ్చని డబ్ల్యూహెచ్ఓ నివేదిక అనుమానం వ్యక్తం చేసింది. డబ్ల్యూహెచ్ఓ నివేదికలతో అప్రమత్తమైన ఆరోగ్యశాఖ అధికారులు హర్యానాలోని సోనేపట్‌లోని మైడెన్ మ్యానిఫ్యాక్చరింగ్ కంపెనీలో మెడిసిన్ తయారీని నిలిపివేశారు. దగ్గు మందుపై కేంద్రం టెస్టులు నిర్వహించింది. ఈ తరుణంలో డిసెంబర్ 13న ఇండియన్ డ్రగ్స్ కంట్రోల్ జనరల్ వీజీ సోమాని..డబ్ల్యూహెచ్ఓకి లేఖ రాశారు. ఆ లేఖలో మైడెన్ ఉత్పత్తి చేసిన దగ్గు మందులపై టెస్టులు నిర్వహించాం. ఆ నమోనాలు సంస్థ వెల్లడించిన స్పెసిఫికేషన్లకు అనుగుణంగా ఉన్నట్లు కనిపెట్టాం. వాటిలో చిన్న పిల్లలో తీవ్రమైన మూత్రపిండాల వ్యాధులకు దారితీసే డైథలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాలు నమోనాలు లేవని గుర్తించామని పేర్కొన్నారు. పరీక్షల ఫలితాలను తదుపరి చర్య కోసం నిపుణుల బృందానికి పంపామని డబ్ల్యూహెచ్ఓకి రాసిన లేఖలో సోమాని తెలిపారు. చండీగఢ్‌లోని రాష్ట్ర ప్రభుత్వ రీజినల్ డ్రగ్ టెస్టింగ్ లాబొరేటరీ ఈ పరీక్షలను నిర్వహించిందని ప్రభుత్వం ముందుగా తెలిపింది. ఆ లేఖపై డబ్ల్యూహెచ్ఓ ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు అక్టోబర్‌లో యూఎన్ ఏజెన్సీ మైడెన్ తయారు చేసిన ఉత్పత్తులలో విషపూరితమైన, తీవ్రమైన కిడ్నీలను నాశనం చేసే డైథైలిన్ గ్లైకాల్,ఇథిలీన్ గ్లైకాల్ మోతాదుకు మించి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించిన విషయం తెలిసిందే. -
వివాదాస్పద మైడెన్కు భారీ షాక్:అక్టోబరు 14 వరకు గడువు
సాక్షి,ముంబై: వివాదాస్పద దేశీయ ఫార్మ కంపెనీ మైడెన్ ఫార్మాకు మరో భారీ షాక్ తగిలింది. కంపెనీ ఉత్పత్తి చేసే దగ్గు మందులు ప్రమాణాలకు అనుగుణంగా లేవంటూ హరియాణా ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సోనెపట్‌లోని దాని తయారీ ప్లాంట్‌లో తనిఖీల అనంతరం హరియాణా స్టేట్ డ్రగ్స్ కంట్రోలర్, లైసెన్సింగ్ అథారిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌తో సంయుక్త తనిఖీ తర్వాత హర్యానా డ్రగ్ అధికారులు మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌కు ఈ నోటీసులిచ్చింది. సంస్థ డైథలిన్ గ్లైకాల్, ఇథిలీన్ ప్రొపైలిన్ గ్లైకాల్ నాణ్యత పరీక్షను నిర్వహించలేదని, సంబంధిత పత్రాలు కూడా సక్రమంగా లేవంటూ ఫార్మా కంపెనీ అక్టోబర్ 14 లోగా నోటీసుకు సమాధానం ఇవ్వాలి, లేని పక్షంలో దానిపై చర్య తీసుకుంటామని అక్టోబరు 7న జారీ చేసిన నోటీసుల్లో తెలిపింది. (చిన్నారులను మింగేసిన దగ్గు మందు: సంచలన విషయాలు) డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్, హర్యానా, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940 రూల్స్, 1945 రూల్ 85(2) ప్రకారం న్యూ ఢిల్లీలోని మైడెన్ ఫార్మాకు నోటీసులిచ్చింది. తమ తనిఖీల్లో అనేక ఉల్లంఘనలను గుర్తించిన నేపథ్యంలో కంపెనీ తయారీ లైసెన్స్‌ను ఎందుకు సస్పెండ్ చేయకూడదో తెలపాలని కోరుతూ నోటీసు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు తన నివేదికను సమర్పించిన రాష్ట్ర ఎఫ్‌డీఏ షోకాజ్ నోటీసు అందిన 7 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని మైడెన్ ఫార్మాను ఆదేశించింది. రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ కమ్ లైసెన్సింగ్ అథారిటీ, హరియాణా ఎఫ్‌డీఏ మన్మోహన్ తనేజా తెలిపారు.ప్రొపైలిన్ గ్లైకాల్ (బ్యాచ్ నంబర్ E009844) తయారీ తేదీ సెప్టెంబర్ 2021, గడువు తేదీ సెప్టెంబరు 2023ని ప్రోమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్మలిన్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్‌ల తయారీలో ఉపయోగించినట్టు కనుగొంది. అలాగే నవంబర్ 2024 నాటికి, ఉత్పత్తి షెల్ఫ్-లైఫ్ ముడి పదార్థం కంటే ఎక్కువ అని తేలింది. కాగా ఇటీవల గాంబియాలో 66 మంది చిన్నారుల మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మైడెన్ దగ్గు సిరప్‌లపై హెచ్చరికలు జారీ చేసింది. మైడెన్ ఫార్మా ఉత్పత్తులు ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్మలిన్ బేబీ కాఫ్ సిరప్, మాకోఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ సిరప్స్లోని నాణ్యత లేని, కలుషితమైన పదార్థాలే పిల్లల మరణాలకు కారణమని పేర్కొన్న సంగతి తెలిసిందే. (ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీ సేల్: ఐఫోన్13పై కళ్లు చెదిరే ఆఫర్)