cdsco
-
పారాసిటమాల్ నాసిరకం
న్యూఢిల్లీ: ఒళ్లు కాస్తంత వేడిగా అనిపించినా వెంటనే మింగే మాత్ర పారాసిటమాల్. అది నాసిరకం మాత్ర అని కేంద్ర ఔషధాల ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) తేల్చింది! పారాసిటమాల్ 500 ఎంజీతో పాటు విటమిన్ సి, విటమిన్ డీ3, విటమిన్ బి కాంప్లెక్స్ వంటి 53 సర్వసాధారణ ఔషధాల నాణ్యత కూడా ప్రమాణాల మేరకు లేదని ప్రకటించింది. తాజా నెలవారీ నాణ్యతా పరీక్షలో ఇవన్నీ ఫెయిలైనట్టు పేర్కొంది. యాంటీబయాటిక్స్, రక్తపోటు ఔషధాలు, విటమిన్ల మాత్రల్లో కూడా నాణ్యత లోపించిందని వెల్లడించింది. పలు రాష్ట్రాల్లో డ్రగ్ ఆఫీసర్లు ర్యాండమ్‌గా ఆయా విభాగాల ఔషధాలను చెక్ చేసి ఈ మేరకు నిర్ధారించారు. విటమిన్ సీ సాఫ్ట్‌జెల్స్, ఎసిడిటీ నివారణకు వాడే పాన్ డీతో పాటు చక్కెరవ్యాధికి వాడే గ్లిమిపిరిడిన్. బీపీకి వాడే టెల్మీసార్టాన్ మందులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.ఆల్కెమ్ లేబొరేటరీస్, హిందుస్తాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్, కర్ణాటక యాంటీబయోటిక్స్, ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, మెగ్ లైఫ్‌సైన్సెస్, ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్‌కేర్, హెటెరో డ్రగ్స్ సహా చాలా ఔషధ తయారీ సంస్థల డ్రగ్స్ పరీక్షల్లో ఫెయిలయ్యాయి. జీర్ణకోశ, ఉదర సంబంధ ఇన్ఫెక్షన్లకు అత్యంత ఎక్కువగా వాడే మెట్రోనిడజోల్ (హిందుస్తాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్) కూడా నాణ్యత పరీక్షలో విఫలమైంది. షెల్కాల్ (టోరెంట్ ఫార్మాస్యూటికల్స్), క్లావమ్ 625, పాన్ డీ (ఆల్కెమ్ హెల్త్‌కేర్ సైన్సెస్), పారాసిటమాల్ (కర్ణాటక యాంటీబయోటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్), సెపోడెమ్ చిన్నారులకు తీవ్రమైన బాక్టీరియా ఇన్ఫెక్షన్ చికిత్సకు ఎక్కువగా వాడే ఎక్స్పీ50 (హెటిరో–హైదరాబాద్) కూడా ప్రమాణాలను అందుకోలేకపోయాయని సీడీఎస్సీఓ పేర్కొంది. భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న 156 ఫిక్స్ డోస్ డ్రగ్ కాంబినేషన్ ఔషధాలు హానికరమంటూ సీడీఎస్సీఓ వాటిని గత ఆగస్ట్‌లో నిషేధించడం తెల్సిందే. సర్వసాధారణంగా వాడే జ్వరం మందులు, నొప్పి నివారిణులు, అలర్జీని తగ్గించే ఔషధాల వంటివి వాటిలో ఉన్నాయి. -
ప్రాణాలు తీస్తున్న దగ్గు సిరప్!.. క్వాలిటీ టెస్ట్‌లో షాకింగ్ విషయాలు
దగ్గుకు వాడుతున్న సిరప్లు ప్రాణాంతకం.. మరణానికి దారితీసే అవకాశం ఉందని.. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) వెల్లడించింది. 100 కంటే ఎక్కువ ఫార్మా యూనిట్ల నుంచి సేకరించిన దగ్గు సిరప్ నమూనాలు, క్వాలిటీ టెస్టులో విఫలమయ్యాయని నివేదికలో స్పష్టం చేసింది.పరీక్షించిన చాలా సిరప్‌లలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు వెల్లడైంది. డైథలీన్ గ్లైకాల్ (DEG), ఇథిలీన్ గ్లైకాల్ (EG) పీహెచ్ వంటివన్నీ తగిన పరిమితులలో లేదని నివేదికలో పేర్కొన్నారు. మొత్తం 7,087 బ్యాచ్‌ల మందులను పరీక్షిస్తే.. 353 బ్యాచ్‌లలో క్వాలిటీ ప్రమాణాలు లేవని నిర్దారణ అయ్యాయి.డైఇథిలిన్ గ్లైకాల్ (DEG), ఇథిలీన్ గ్లైకాల్ (EG) పరిమాణం తొమ్మిది బ్యాచ్‌లలో తక్కువగా ఉన్నట్లు, మరికొన్ని సిరప్‌లలో వీటి పరిమాణం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇవి కూడా ప్రాణాంతకమని వెల్లడించారు.భారతదేశం ఉత్పత్తి చేసిన దగ్గు సిరప్‌లను ప్రపంచవ్యాప్తంగా 141 మంది పిల్లల మరణాలకు కారణమైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తరువాత భారత ప్రభుత్వం రంగంలోకి దిగి.. సిరప్ నాణ్యతలను టెస్ట్ చేయడం మొదలుపెట్టింది.గాంబియాలో చిన్నారుల మరణాలుఅక్టోబర్ 2022లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కిడ్నీ సమస్యల కారణంగా.. గాంబియాలో సుమారు 70 మంది చిన్నారులు మరణించారని, దీనికి భారతదేశంలో తయారయ్యే దగ్గు, జలుబు సిరప్లు కారణమై ఉండొచ్చని వెల్లడించింది. ఆ తరువాత సంబంధిత అధికారులు దగ్గు సిరప్ తయారీ యూనిట్ల తనిఖీలను నిర్వహించి.. ఫార్మా-గ్రేడ్ ప్రొపైలిన్ గ్లైకాల్ వాడకంపై తయారీదారులకు అవగాహన కల్పించారు.మే 2023లో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఎగుమతి కోసం ఉద్దేశించిన తయారీదారుల నుంచి దగ్గు సిరప్ నమూనాలను టెస్ట్ చేయడానికి గుర్తింపు పొందిన ల్యాబ్‌లను అనుమతివ్వాలని రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్లను ఆదేశించింది. గత జూన్ నుంచి దగ్గు సిరప్ ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను ప్రభుత్వ ప్రయోగశాలలలో పరీక్షించి.. సర్టిఫికేట్ అందించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT)ను కోరింది. -
వివాదాస్పద మైడెన్కు భారీ షాక్:అక్టోబరు 14 వరకు గడువు
సాక్షి,ముంబై: వివాదాస్పద దేశీయ ఫార్మ కంపెనీ మైడెన్ ఫార్మాకు మరో భారీ షాక్ తగిలింది. కంపెనీ ఉత్పత్తి చేసే దగ్గు మందులు ప్రమాణాలకు అనుగుణంగా లేవంటూ హరియాణా ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సోనెపట్‌లోని దాని తయారీ ప్లాంట్‌లో తనిఖీల అనంతరం హరియాణా స్టేట్ డ్రగ్స్ కంట్రోలర్, లైసెన్సింగ్ అథారిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌తో సంయుక్త తనిఖీ తర్వాత హర్యానా డ్రగ్ అధికారులు మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌కు ఈ నోటీసులిచ్చింది. సంస్థ డైథలిన్ గ్లైకాల్, ఇథిలీన్ ప్రొపైలిన్ గ్లైకాల్ నాణ్యత పరీక్షను నిర్వహించలేదని, సంబంధిత పత్రాలు కూడా సక్రమంగా లేవంటూ ఫార్మా కంపెనీ అక్టోబర్ 14 లోగా నోటీసుకు సమాధానం ఇవ్వాలి, లేని పక్షంలో దానిపై చర్య తీసుకుంటామని అక్టోబరు 7న జారీ చేసిన నోటీసుల్లో తెలిపింది. (చిన్నారులను మింగేసిన దగ్గు మందు: సంచలన విషయాలు) డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్, హర్యానా, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940 రూల్స్, 1945 రూల్ 85(2) ప్రకారం న్యూ ఢిల్లీలోని మైడెన్ ఫార్మాకు నోటీసులిచ్చింది. తమ తనిఖీల్లో అనేక ఉల్లంఘనలను గుర్తించిన నేపథ్యంలో కంపెనీ తయారీ లైసెన్స్‌ను ఎందుకు సస్పెండ్ చేయకూడదో తెలపాలని కోరుతూ నోటీసు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు తన నివేదికను సమర్పించిన రాష్ట్ర ఎఫ్‌డీఏ షోకాజ్ నోటీసు అందిన 7 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని మైడెన్ ఫార్మాను ఆదేశించింది. రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ కమ్ లైసెన్సింగ్ అథారిటీ, హరియాణా ఎఫ్‌డీఏ మన్మోహన్ తనేజా తెలిపారు.ప్రొపైలిన్ గ్లైకాల్ (బ్యాచ్ నంబర్ E009844) తయారీ తేదీ సెప్టెంబర్ 2021, గడువు తేదీ సెప్టెంబరు 2023ని ప్రోమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్మలిన్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్‌ల తయారీలో ఉపయోగించినట్టు కనుగొంది. అలాగే నవంబర్ 2024 నాటికి, ఉత్పత్తి షెల్ఫ్-లైఫ్ ముడి పదార్థం కంటే ఎక్కువ అని తేలింది. కాగా ఇటీవల గాంబియాలో 66 మంది చిన్నారుల మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మైడెన్ దగ్గు సిరప్‌లపై హెచ్చరికలు జారీ చేసింది. మైడెన్ ఫార్మా ఉత్పత్తులు ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్మలిన్ బేబీ కాఫ్ సిరప్, మాకోఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ సిరప్స్లోని నాణ్యత లేని, కలుషితమైన పదార్థాలే పిల్లల మరణాలకు కారణమని పేర్కొన్న సంగతి తెలిసిందే. (ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీ సేల్: ఐఫోన్13పై కళ్లు చెదిరే ఆఫర్) -
కోవోవ్యాక్స్, మొల్న్యుపిరావర్ అత్యవసర వాడుకకు సిఫార్సు
న్యూఢిల్లీ: కరోనాను అరికట్టే ప్రక్రియలో సీరమ్ సంస్థ తయారీ కోవోవ్యాక్స్ టీకాను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు అనుమతించవచ్చని సీడీఎస్సీఓకు చెందిన నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. అదేవిధంగా కరోనా చికిత్సలో మొల్న్యుపిరావర్ మాత్రల ఉత్పత్తి, అత్యవసర వినియోగ అనుమతికి కూడా పచ్చజెండా ఊపింది. కోవోవ్యాక్స్పై నిపుణుల కమిటీ రెండుమార్లు పరిశీలన జరిపి చివరకు కొన్ని పరిస్థితుల్లో అత్యవసరంగా వాడేందుకు అనుమతించవచ్చని సిఫార్సు చేసింది. ఇప్పటికే ఈ టీకా ఎమర్జన్సీ వాడుకకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంగీకరించింది. కరోనా సోకిన వయోజనుల్లో ఆక్సిజన్ స్థాయి పడిపోయి, రిస్కు పెరిగిన సందర్భాల్లో మొల్న్యుపిరావర్ను వినియోగించవచ్చని నిపుణుల కమిటీ సూచించింది. ఈ ఔషధాన్ని డా. రెడ్డీస్ సహా పలు కంపెనీ కన్సార్టియం ఉత్పత్తి చేస్తోంది. ఐదు రోజుల కన్నా ఎక్కువ రోజులు దీన్ని వాడకూడదని, గర్భిణీలకు ఇవ్వకూడదని కమిటీ సిఫార్సు చేసింది. -
విదేశీ టీకాలకు మూడు రోజుల్లోనే అనుమతులు
న్యూఢిల్లీ: దేశంలో అత్యవసర వినియోగానికి విదేశీ కోవిడ్ టీకా సంస్థలు పెట్టుకునే దరఖాస్తులపై మూడు రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. విదేశీ కంపెనీలు పెట్టుకున్న పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులు అవి అందిన మూడు పనిదినాల్లోగా డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆధ్వర్యంలో పనిచేసే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీవో) అనుమతి మంజూరు చేస్తుందని వివరించింది. సదరు విదేశీ సంస్థ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఉత్పత్తి ప్రాంతం, ఉత్పత్తి) దిగుమతి అనుమతి పత్రాలను సీడీఎస్‌సీవో పరిశీలిస్తుందని పేర్కొంది. సంతృప్తికరంగా ఉంటే ఆయా కోవిడ్ టీకాలను పరిమితులకు లోబడి అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి మాత్రమే అనుమతిస్తుందని తెలిపింది. మార్గదర్శకాలకు లోబడి ఆ టీకాను వినియోగించాల్సి ఉంటుందని పేర్కొంది. విదేశీ టీకా కంపెనీలు భారత్‌లోని తమ అనుబంధ సంస్థ ద్వారా గానీ అధీకృత ఏజెంట్ ద్వారా గానీ సీడీఎస్‌సీవోకు దరఖాస్తు చేసుకోవాలనిఆరోగ్య శాఖ తెలిపింది. ‘వ్యాక్సినేషన్లో వినియోగించటానికి ముందుగా సదరు విదేశీ టీకాను 100 మంది లబ్ధిదారులకు వేసి, వారం రోజుల పరిశీలన తర్వాత ప్రభుత్వ నిపుణుల కమిటీ వారి పరిస్థితిని అధ్యయనం చేస్తుంది. ఆ టీకా రోగ నిరోధక శక్తి, భద్రతలను బేరీజు వేశాకే అనుమతి ఇస్తుంది’అని వివరించింది. సీడీఎస్‌సీవో ప్రోటోకాల్ ప్రకారం సదరు విదేశీ టీకాల ప్రతి బ్యాచ్‌ను కసౌలీలోని సెంట్రల్ డ్రగ్స్ రీసెర్చి లేబొరేటరీ(సీడీఎల్) ద్వారానే విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అమెరికా, యూకే, జపాన్‌ల్లో అత్యవసర వినియోగానికి అనుమతించిన కోవిడ్ టీకాలకు దేశంలో ఫాస్ట్‌ట్రాక్ విధానంలో అనుమతులివ్వాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. -
‘స్పుత్నిక్’ అత్యవసర వినియోగానికి అనుమతివ్వండి
న్యూఢిల్లీ: రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ)కు చెందిన విషయ నిపుణుల కమిటీ(ఎస్ఈసీ) సిఫార్సు చేసింది. భారత్‌లో ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేయాలని డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ సంస్థ చేసిన విజ్ఞాపనను నిపుణుల కమిటీ పరిశీలించింది. అనుమతి ఇవ్వొచ్చంటూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు సిఫార్సు చేసింది. డీసీజీఐ సైతం ఆమోదిస్తే స్పుత్నిక్ టీకా భారత్‌లో అందుబాటులోకి వస్తుంది. దేశంలో ప్రజలకు అందే మూడో కోవిడ్–19 టీకా ఇదే అవుతుంది. అన్ని అనుమతులు లభిస్తే స్పుత్నిక్ టీకాను అత్యవసర వినియోగం కోసం రష్యా నుంచి దిగుమతి చేసుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇండియాలో ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, సరఫరా హక్కులను డాక్టర్ రెడ్డీస్ సంస్థ దక్కించుకుంది. ఈ మేరకు గత ఏడాది సెప్టెంబర్‌లో రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్)తో భాగస్వామిగా మారింది. స్పుత్నిక్ వ్యాక్సిన్ 91.6 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో నిర్ధారణ అయ్యింది. డీసీజీఐ భారత్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాల అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. వీటిని ప్రస్తుతం లబ్ధిదారులకు అందజేస్తున్నారు. -
టీకాకు అటు..ఇటు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరులో నిర్ణయాత్మక ముందడుగు పడింది. కోవిడ్–19పై చేస్తున్న యుద్ధంలో భారతీయులకు సునిశిత ఆయుధం లభించింది. దేశంలో కరోనా టీకా అత్యవసర, నియంత్రిత వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) ఆదివారం ఆమోదం తెలిపింది. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ భాగస్వామ్యంతో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన స్వదేశీ టీకా ‘కోవాగ్జిన్’, బ్రిటన్‌కి చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ–ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్ ‘కోవిషీల్డ్’లకు షరతులతో డీసీజీఐ అనుమతించింది. ఈ రెండు టీకాలకు అనుమతివ్వాలని జాతీయ ఔషధ ప్రామాణికాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ)కు చెందిన నిపుణుల కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా డీసీజీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికి తొలి అడుగు పడినట్లయింది. అలాగే, జైడస్ క్యాడిలా అభివృద్ధి చేస్తున్న టీకా ఫేజ్–3 క్లినికల్ ట్రయల్స్‌కు కూడా డీసీజీఐ అనుమతించింది. ఈ టీకా అభివృద్ధి కోసం జైడస్ క్యాడిలాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కేంద్ర బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి రేణు స్వరూప్ వెల్లడించారు. కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలకు అనుమతి లభించడాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వాగతించారు. కరోనా వైరస్‌పై భారత్ చేస్తున్న పోరాటంలో ఇది నిర్ణయాత్మక మేలి మలుపు అని అభివర్ణించారు. ‘భారత్ ఆరోగ్యకర, కోవిడ్ రహిత దేశంగా మారే ప్రయాణం దీంతో మరింత వేగవంతం కానుంది. కంగ్రాచ్యులేషన్స్ ఇండియా. టీకా కోసం అహర్నిశలు కృషిచేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు’అని ప్రధాని ట్వీట్ చేశారు. భారత్‌లో కరోనా టీకాల అత్యవసర వినియోగానికి అనుమతి లభించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హర్షం వ్యక్తం చేసింది. మరోవైపు, ఈ టీకాలను ఆగమేఘాలపై అభివృద్ధి చేసిన నేపథ్యంలో.. వాటి సమర్ధత, భద్రతలపై పలువురు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సంపూర్ణ అధ్యయనం తరువాతే అనుమతి.. ఆయా సంస్థలు ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా విశ్లేíషించిన అనంతరం, నిపుణుల సిఫారసుల మేరకు కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలకు అత్యవసర పరిస్థితుల్లో నియంత్రిత వినియోగానికి అనుమతినివ్వాలని నిర్ణయించామని డీసీజీఐ వీజీ సోమానీతెలిపారు. ఈ రెండు టీకాలను రెండు డోసుల్లో ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వీటిని 2 నుంచి 8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయాల్సి ఉంటుందని వివరించారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ 70.42% సామర్థ్యంతో పని చేస్తోందని తెలిపారు. 23,745 మంది వలంటీర్లపై చేసిన ‘కోవిషీల్డ్’ప్రయోగ ఫలితాల సమగ్ర వివరాలను సీరమ్ ఇన్స్టిట్యూట్ తమకు అందించిందన్నారు. కోవాగ్జిన్‌ను భారత్ బయోటెక్ అత్యంత సురక్షిత వీరోసెల్ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేసిందని తెలిపారు. ఫేజ్ 1, 2 క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయని, ఎలాంటి దుష్ప్రభావాలు కలగలేదని సోమానీ వెల్లడించారు. ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్‌ను దేశవ్యాప్తంగా 22,500 మంది వలంటీర్లపై నిర్వహించారని, ఫలితాలు సానుకూలంగా వచ్చాయన్నారు. కోవాగ్జిన్ ప్రత్యామ్నాయమే! భారత్ బయోటెక్ చేసినకోవాగ్జిన్ను ప్రస్తుతానికి ప్రత్యామ్నాయమేనని ఎయిమ్స్ డైరెక్టర్, జాతీయ టాస్క్‌ఫోర్స్ బృందం సభ్యుడు డాక్టర్ రణ్‌దీప్ గులేరియా చెప్పారు. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ తొలిదశలో ఆక్స్ఫర్డ్– ఆస్ట్రాజెనెకా సాయంతో సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ టీకానే వాడుతామన్నారు. ‘వీటికి అనుమతులు లభించడం కొత్త ఏడాది ప్రారంభంలో చోటుచేసుకున్న శుభ పరిణామం. ఈ రెండు టీకాలు చౌకైనవి. భద్రపరచడం, పంపిణీ సులువు. దేశీయంగా తయారైన వీటితో త్వరలోనే వ్యాక్సినేషన్ ప్రారంభించవచ్చు. కోవిషీల్డ్ పనితీరు ఎంతమేర పనిచేస్తుందనేది ఇంకా పూర్తి స్థాయిలో రుజువు కానందున, సైడ్ ఎఫెక్ట్స్ కనిపించిన అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సినేషన్‌కు కోవాగ్జిన్‌ను ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు’అని ఆయన అన్నారు. యూకే కరోనా కొత్త వేరియంట్ కేసులు దేశంలో అదుపుతప్పినా, లేదా మూడో దశ హ్యూమన్ ట్రయల్స్ పూర్తయినా.. కోవాగ్జిన్‌ను పూర్తిస్థాయిలో వాడే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. సీరం సంస్థ 5 కోట్ల డోసులు సిద్ధం చేసినందున, తొలి విడత వ్యాక్సినేషన్లో 3 కోట్ల మందికి కోవిషీల్డ్ వాడుతామన్నారు. సమర్థతపై అనుమానాలు.. కరోనా విజృంభణను అడ్డుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేసిన టీకాల సామర్ధ్యం, భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోవిషీల్డ్ సమర్ధత 70.42%గా డీసీజీఐ ప్రకటించింది. కానీ కోవాగ్జిన్ సమర్ధతపై స్పష్టమైన వివరణ రాలేదు. అలాగే, ఫేజ్–3 క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు పూర్తిగా వెలువడకముందే, టీకా సమర్ధతపై, సురక్షితమేనా అన్న విషయంపై పూర్తిస్థాయి సమాచారం అందకముందే కోవాగ్జిన్‌కు అనుమతినివ్వడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా టీకా వినియోగం ప్రారంభమైన తరువాత దుష్ప్రభావాలు వెల్లడైతే, పరిస్థితి అదుపుతప్పే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు, యూకేలో గుర్తించిన కరోనా కొత్త వైరస్ స్ట్రెయిన్‌పై ఈ టీకాలు ఎంతవరకు సమర్ధంగా పనిచేస్తాయనే దానికి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తు చేస్తున్నారు. కోవాగ్జిన్ ఫేజ్ –3 క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైన సామర్ధ్యం, భద్రతలకు సంబంధించిన డేటా ఇంకా తమ వద్దకు రాలేదని ఆదివారం ఐసీఎంఆర్ కూడా స్పష్టం చేసింది. అయితే, కోవాగ్జిన్ అత్యున్నత సామర్థ్య, భద్రత ప్రమాణాలతో రూపొందుతున్న సంకేతాలున్నాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ వెల్లడించారు. ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ నివేదిక మరి కొన్ని వారాల్లో అందనుందన్నారు. కోవాగ్జిన్ ఫేజ్ 1, 2 ట్రయల్స్ ఫలితాలు సామర్ధ్యం, భద్రత పరంగా సానుకూలంగా ఉన్నాయన్నారు. ట్రయల్స్‌లో కోవాగ్జిన్ సమర్థతను నిరూపించుకుందని భారత్ బయోటెక్ ప్రకటించింది. కోవాగ్జిన్‌కు అనుమతి ఎలా ఇచ్చారు: కాంగ్రెస్ కోవాగ్జిన్‌కు డీసీజీఐ అనుమతులు ఇవ్వడంపై కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ టీకా మూడో దశ ప్రయోగాలు ముగియకుండానే అనుమతులివ్వడం ప్రమాదకరమని కాంగ్రెస్ నేతలు శశిథరూర్, ఆనంద్ శర్మ, జైరామ్ రమేశ్ హెచ్చరించారు. అత్యంత కీలక అంశాన్ని రాజకీయం చేయడం అవమానకరమంటూ కేంద్ర ఆరోగ్య మంత్రి ఎదురుదాడికి దిగారు. ఇప్పటివరకు ఏ దేశం కూడా వ్యాక్సిన్ సామర్థ్యం ఎంతో తెలుసుకోకుండా అనుమతులు ఇవ్వలేదని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ అన్నారు. తొలి విడతలో ఫ్రంట్‌లైన్ వర్కర్లకి టీకాలు ఇస్తున్నారని, వారి ఆరోగ్యానికి ఎవరు భరోసా ఇస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా కోవాగ్జిన్‌కు అనుమతులివ్వడాన్ని తప్పు పట్టారు. అంతవరకు కోవిషీల్డ్‌ను వాడుకోవాలని సూచించారు. కోవాగ్జిన్ టీకా అంశంలో నిబంధనలు ఎందుకు మార్చాల్సి వచ్చిందని మరో నేత జైరాం రమేష్ ప్రశ్నించారు. అయితే కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా స్వదేశీ టీకాకి అనుమతులివ్వడాన్ని స్వాగతించారు. శాస్త్రవేత్తల కృషిని ఆయన కొనియాడారు. కీలక అంశాల్లో రాజకీయాలా ? కాంగ్రెస్ నేతల ప్రశ్నలకి కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ట్విట్టర్ వేదికగా బదులిచ్చారు. ఇలాంటి కీలక అంశాల్ని రాజకీయం చేయడం అత్యంత అవమానకరమని అన్నారు. ‘కళ్లు తెరిచి చూడండి ఇలా మాట్లాడి మీకు మీరే అభాసు పాలవుతున్నార’ని మంత్రి అన్నారు. బీజేపీ ఎదురు దాడి కోవాగ్జిన్ అనుమతులపై కాంగ్రెస్ నేతలు కేంద్రాన్ని నిలదీయడంతో బీజేపీ ఎదురు దాడికి దిగింది. కాంగ్రెస్ ప్రతీది రాజకీయం చేస్తోందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ విమర్శించారు. ఒకప్పుడు సైనికుల త్యాగాలను ప్రశ్నించారని, ఇప్పుడు స్వదేశీ టీకాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారంటూ మండిపడ్డారు. భారత్ సాధించిన ఘనతలు ఎప్పటికీ కాంగ్రెస్‌కి గర్వకారణంగా అనిపించవని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కరోనా వైరస్‌పై భారత్ చేస్తున్న పోరాటంలో ఇది నిర్ణయాత్మక మేలి మలుపు. ‘భారత్ ఆరోగ్యకర, కోవిడ్ రహిత దేశంగా మారే ప్రయాణం దీంతో మరింత వేగవంతం కానుంది. కంగ్రాచ్యులేషన్స్ ఇండియా. అహర్నిశలు కృషిచేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు. – ప్రధాని మోదీ భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ టీకా యూకేలో గుర్తించిన వేరియంట్ సహా కొత్త కరోనా వైరస్ వేరియంట్లపై సమర్ధవంతంగా పనిచేసే అవకాశాలున్నాయి. – హర్షవర్ధన్ , ఆరోగ్య శాఖ మంత్రి మూడో దశ ప్రయోగాలు ముగియకుండానే వ్యాక్సిన్‌కు ఎలా అనుమతినిచ్చారు? ప్రొటోకాల్ నిబంధనలు పాటించకుండా, మూడో దశ ప్రయోగాలపై ఫలితాలు తేలకుండా అనుమతులు ఇవ్వడం ప్రమాదకరం. – కాంగ్రెస్ నేతలు శశిథరూర్, ఆనంద్ శర్మ, జైరామ్ రమేశ్ భారత్ బయోటెక్ తయారు చేసిన కోవిడ్ టీకా కోవాగ్జిన్ ప్రస్తుతానికి ప్రత్యామ్నాయమే. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ తొలిదశలో ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా సాయంతో సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ టీకానే వాడతాం. కోవిషీల్డ్ పనితీరు ఎంతమేర పనిచేస్తుందనేది ఇంకా పూర్తి స్థాయిలో రుజువు కానందున సైడ్ ఎఫెక్ట్స్ కనిపించే అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సినేషన్‌కు కోవాగ్జిన్‌ను ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. – డాక్టర్ రణ్‌దీప్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టర్, జాతీయ టాస్క్‌ఫోర్స్ బృందం సభ్యుడు భద్రత పరంగా ఏ చిన్న సమస్య ఉన్నా అనుమతించేవాళ్లం కాదు. ఈ టీకాలు 110% సురక్షితం. స్వల్ప జ్వరం, ఒళ్లు నొప్పులు, అలర్జీ కనిపించవచ్చు. ఏ వ్యాక్సిన్‌కైనా అది సాధారణమే. – వి.జి. సోమానీ, డీసీజీఐ భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ టీకా యూకేలో గుర్తించిన వేరియంట్ సహా కొత్త కరోనా వైరస్ వేరియంట్లపై సమర్ధవంతంగా పనిచేసే అవకాశాలున్నాయి. – హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి -
హైదరాబాద్ టీకాకు ఓకే
న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి సీడీఎస్సీఓ(కేంద్ర ఔషధాల ప్రమాణిక నియంత్రణ సంస్థ) నియమించిన నిపుణుల కమిటీ శనివారం ఆమోదం తెలిపింది. టీకాకు సంబంధించి కంపెనీ సమర్పించిన ట్రయిల్స్ డేటాను పరిశీలించిన అనంతరం కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆక్స్ఫర్డ్ రూపొందించిన కోవిషీల్డ్ టీకా భారత్‌లో వినియోగానికి ఆమోదముద్ర సంపాదించిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం కోవాగ్జిన్ రెండు దశల ట్రయిల్స్ పూర్తి చేసుకుంది. ఈ రెండిటిలో సత్ఫలితాలు వచ్చినందున టీకా అత్యవసర వినియోగానికి నిపుణులు అంగీకారం తెలిపారు. ఫేజ్3 ట్రయిల్స్ కొనసాగించమని సూచించారు. ఐసీఎంఆర్ సహకారంతో భారత్ బయోటెక్ ఈ టీకాను రూపొందించింది. కోవాగ్జిన్ వినియోగానుమతుల కోసం భారత్ బయోటెక్ గతనెల 7న డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. కోవాగ్జిన్‌తో పాటు కోవిషీల్డ్ వినియోగంపై డీసీజీఐ అంతిమ ఆమోదం తెలపాల్సిఉంది. మరోవైపు కాడిలా రూపొందిస్తున్న టీకాపై ఫేజ్ 3 ట్రయిల్స్ జరపవచ్చని కూడా నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. తర్వాతేంటి? టీకాల వినియోగానికి డీసీజీఐ పచ్చజండా చూపిన అనంతరం ఆయా కంపెనీలు తమ టీకాను మార్కెట్లో ఆథరైజ్ చేసేందుకు, భారీగా ఉత్పత్తి చేసేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆతర్వాతే మార్కెట్లోకి టీకాను తీసుకురావడానికి వీలవుతుంది. ఒక వ్యాధికి ప్రత్యామ్నాయ చికిత్సలేవీ అందుబాటులో లేవన్నప్పుడు కొన్ని ఔషధాలు లేదా టీకాల అత్యవసర వినియోగం కోసం ఔషధ నియంత్రణా సంస్థలు అనుమతి ఇస్తారు. ప్రస్తుతం కరోనాకు సరైన చికిత్స లేకపోవడం, మరోవైపు కొత్త స్ట్రెయిన్ గుర్తింపు నేపథ్యంలో ఆయా దేశాలు కోవిడ్ టీకాలకు అత్యవసర అనుమతులు ఇస్తున్నాయి. ఇలాంటి అత్యవసర అనుమతులు పొందిన వ్యాక్సిన్ ఇచ్చే ముందు ప్రతి రోగి నుంచి ముందస్తు అనుమతి పత్రం తీసుకుంటారు. అలాగే సదరు టీకా వల్ల తలెత్తే అవకాశమున్న దుష్ప్రభావాల గురించి రోగికి, వారి కుటుంబ సభ్యులకు ముందుగానే వివరిస్తారు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తికాక ముందే మధ్యంతర ఫలితాల ఆధారంగా అనుమతులు ఇస్తున్నందున ఈ షరతులు విధిస్తారు. అతి త్వరలో ముందుగా నిర్ణయించిన ప్రాధాన్య క్రమంలో టీకాను ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఆదివారం రోజు డీసీజీఐ పత్రికా సమావేశం నిర్వహించనుంది. ఇందులో టీకాల అనుమతిపై వెల్లడించే అవకాశం ఉంది. -
కరోనా అంతానికిది ఆరంభం
న్యూఢిల్లీ: భారత్‌లో తయారవనున్న రెండు కరోనా టీకాలు ‘కొవాక్సిన్’, ‘జైకొవ్– డీ’లకు హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతించడంతో కరోనా అంతం ప్రారంభమైనట్లయిందని కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా కరోనా టీకాలు ప్రయోగదశలో ఉన్నాయని, అందులో 11 మాత్రమే హ్యూమన్ ట్రయల్స్ దశకు చేరుకున్నాయని పేర్కొంది. భారత్‌లో కరోనా టీకాను రూపొందించేందుకు ఆరు సంస్థలు కృషి చేస్తున్నాయని తెలిపింది. వాటిలో కొవాక్సిన్, జైకొవ్–డీలకు మాత్రం హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ) అనుమతించిందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ వెల్లడించింది. ప్రముఖ ఆస్ట్రాజెనెకా(బ్రిటన్), మోడెర్నా(అమెరికా) ఫార్మా కంపెనీలతోనూ భారత కంపెనీలు ఉత్పత్తి ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, అయితే, అవి రూపొందించిన టీకాలు సురక్షితం, సమర్ధవంతమని రుజువు కావాల్సి ఉందని వివరించింది. కరోనా వైరస్‌కు టీకా ఆగస్ట్ 15 నాటికి సిద్ధమవుతుందని ఐసీఎంఆర్ చేసిన ప్రకటనపై వివాదం తలెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం విశేషం. రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రకటన చేశారని విపక్షాలు ఆరోపించాయి. ఆగస్ట్ 15 నాటికి వ్యాక్సిన్‌ను సిద్ధం చేయడం సాధ్యం కాదని నిపుణులు వాదిస్తున్నారు. ఐసీఎంఆర్ సహకారంతో హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ ‘కొవాక్సిన్’ను రూపొందించే పనిలో ఉంది. అలాగే, ‘జైకొవ్–డీ’ని రూపొందించేందుకు జైడస్ క్యాడిలా కృషి చేస్తోంది. ప్రస్తుతం ఈ రెండింటికి ఫేజ్ 1, ఫేజ్ 2 ప్రయోగాలకు అనుమతి లభించింది. కొవాక్సిన్ ఫేజ్ 1 ట్రయల్స్ ముగిసేందుకే కనీసం 28 రోజులు పడుతుంది. ఆ తరువాత ఫేజ్ 2, ఫేజ్ 3 ట్రయల్స్ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 15 నాటికి వ్యాక్సిన్ ఎలా సిద్ధమవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
ఆ ఔషధ అక్రమ దిగుమతిని అడ్డుకుంటాం
న్యూఢిల్లీ : యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్‌ను అత్యవసర పరిస్థితుల్లో కరోనా వైరస్ రోగులకు చికిత్స అందించటానికి ఉపయోగించవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతమంది కరోనా వైరస్ రోగులు బంగ్లాదేశ్‌నుంచి రెమ్‌డెసివిర్‌ను అక్రమంగా దిగుమతి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఔషద నియంత్రణ విభాగం ‘సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ) అక్రమంగా యాంటీ వైరల్ మందులను దిగుమతి చేసుకోవటాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌కు చెందిన కంపెనీలకు రెమ్‌డెసివిర్ అమ్మకాలకు సంబంధించి భారత్‌లో అనుమతులు లేవని, ఏ విధంగా ఔషధాన్ని దిగుమతి చేసుకుంటారని ప్రశ్నించింది. భారత్‌లోని జనరిక్ ఔషధ తయారీ దారులు ఉత్పత్తి చేస్తున్న రెమ్‌డెసివిర్ నాణ్యతపై తనిఖీలు జరుగుతున్నాయని తెలిపింది. అలాంటి సమయంలో అక్రమ దిగుమతులను అడ్డుకోవటంపై దృష్టి సారిస్తామని పేర్కొంది. చదవండి : రెమ్డిసివిర్పై గిలియడ్ మరో కీలక అడుగు -
జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ షాంపూ వాడుతున్నారా?
జైపూర్ : అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్‌కు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ మాత్రమే కాదు బేబీ షాంపూ కూడా ప్రమాదకరమైనదేనని తాజా పరీక్షల్లో తేలింది. రాజస్థాన్‌లో జరిపిన నాణ్యతా పరీక్షల్లో జాన్సన్ అండ్ జాన్సన్ షాంపూ భారత ప్రమాణాలను అందుకోలేకపోయింది. ఈ మేరకు రాజస్థాన్ డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ జాన్సన్ అండ్ జాన్సన్‌కు మార్చి 5వ తేదీని నోటీసులు జారీ చేసింది. కంపెనీ బేబీ షాంపూ రెండు బ్యాచ్‌ల నమూనాల పరీక్షల్లో షాంపూలో హాని కారక పదార్థాలు ఉన్నాయని తెలిపింది. ఈ శాంపిల్స్‌లో ప్రమాదకర ఫార్మల్ డిహైడ్ ఉన్నట్లు తేలిందని పేర్కొంది. ఈ ఫార్మల్డిహైడ్ను భవన నిర్మాణ సామగ్రి (కార్సినోజెన్) తయారీలో ఉపయోగిస్తారని వ్యాఖ్యానించింది. మరోవైపు ఈ అంశాన్ని జాన్సన్ అండ్ జాన్సన్ ప్రతినిధి తిరస్కరించారు. తమ కంపెనీకి చెందిన ఎస్యూరెన్స్ ప్రాసెస్ ప్రపంచంలోనే అత్యంత కఠినంగా ఉంటుందనీ అత్యంత సురక్షితంగా తమ ఉత్పత్తులను ఉంచుతామంటూ ఈ ఆరోపణలను తిరస్కరించారు. ఈ ఫలితాలు ఏకపక్షమైనవనీ, వీటిని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమన్నారు. కాగా జే అండ్ జే బేబీ పౌడర్‌లో ప్రమాదకర క్యాన్సర్ కారకాలు ఉన్నాయని ఇప్పటికే తేలింది. అలాగే జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థపై ప్రపంచ వ్యాప్తంగా వేలాది కేసులు విచారణలో ఉన్నాయి. పలు కేసులో భారీ నష్టపరిహారం చెల్లించాలని సంబంధిత కోర్టులు సంస్థను అదేశించిన సంగతి తెలిసిందే. -
జాన్సన్ అండ్ జాన్సన్‌కు మరో ఎదురు దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. జాన్సన్ బేబీ పౌడర్‌లో ఆస్బెస్టాస్ ఆనవాళ్లున్నాయన్న సమాచారంతో దేశీయ ఔషధ నియంత్రణ అధికారులు స్పందించారు. హిమాచల్ ప్రదేశ్‌లో జాన్సన్ ఫ్యాక్టరీలో జాన్సన్ బేబీ పౌడర్ శాంపిళ్లను డ్రగ్ అధికారులు సీజ్ చేసినట్టు సమాచారం. హిమాచల్ ప్రదేశ్‌లోని బడ్డీ ప్లాంట్‌నుంచి ఈ నమూనాలు సేకరించినట్టు పేరు వెల్లడించడానికి అంగీకరించని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీ) అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. అలాగే వార్తా కథనాల ఆధారంగా శాంపిళ్లను సీజ్ చేయాల్సిందేగా ఆదేశించానని తెలంగాణాకు చెందిన రీజనల్ డ్రగ్ ఆఫీసర్ సురేంద్రనాథ్ సాయి ధృవీకరించారు. పరీక్షల అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీని ప్రభావానికి లక్షలాదిమంది పసిపిల్లలు గురి కానున్నారనే అంశం బాధిస్తోందన్నారు. అయితే తాజా పరిణామంపై జాన్సన్ అండ్ జాన్సన్ ఇంకా స్పందించలేదు. మరోవైపు ఈ వ్యవహరాన్ని పరిశీలించేందుకు సుమారు 100మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లను నియమించినట్టు వార్తలొచ్చాయి. జాన్సన్ ఇండియాతో సంబంధమున్న వేర్వేరు ఉత్పాదక యూనిట్లు, హోల్‌సేలర్స్, పంపిణీదారులను పరిశీలించడానికి నియమించారు. దీనిపై సంప్రదించినప్పుడు ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. అయితే ఈ రిపోర్టులో నివేదించిన అంశాలు చాలా ఆందోళన కరమని మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించినట్టు తెలిపింది. కాగా జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్‌లో క్యాన్సర్కారకాలు ఉన్నాయన్న సంగతిని మూడు దశాబ్దాలుగా కంపెనీ దాచి పెట్టిందంటూ ఇటీవల రాయిటర్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ ఆరోపణలను జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ప్రతినిధులు తిరస్కరించిన సంగతి తెలిసిందే. -
ఆ మాత్రలు నాసిరకం.. జరభద్రం!
జలుబు చేస్తే మెడికల్ షాపు వద్దకు వెళ్లి డీకోల్డ్ టోటల్.. ఒళ్లు నొప్పులుగా ఉండే కాంబిఫ్లామ్ లాంటి మాత్రలు వేసుకోవడం చాలామందికి అలవాటు. అయితే, సామాన్య ప్రజల్లో కూడా ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ రెండు మాత్రలు ప్రమాణాలకు ఆమడదూరంలో ఉన్నాయని, పూర్తిగా నాసిరకం అని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) చెబుతోంది.కాంబిఫ్లామ్ మాత్రలను సనోఫి ఇండియా సంస్థ తయారు చేస్తుండగా, డీకోల్డ్ టోటల్‌ను రెకిట్ బెంకిజర్ హెల్త్‌కేర్ ఇండియా సంస్థ తయారు చేస్తోంది. సీడీఎస్సీఓ సంస్థ పలు రకాల ఔషధాలను గత నెలలో పరిశీలించింది. వీటితో పాటు సిప్లా తయారు చేసే ఓఫ్లాక్స్-100 డీటీ, థియో ఆస్థలిన్ టాబ్లెట్లు, కాడిలా వాళ్లు తయారుచేసే కాడిలోస్ సొల్యూషన్ కూడా ప్రమాణాలకు దూరంగానే ఉన్నట్లు ఆ పరీక్షలలో తేలింది. వీటిలో ఆఫ్లాక్స్-100 డీటీ అనేది యాంటీబయాటిక్ కాగా, థియో ఆస్థలిన్ మందును శ్వాసకోశ సమస్యలకు వాడతారు. అజీర్ణ సమస్యకు పరిష్కారంగా కాడిలోస్ ఉపయోగిస్తారు. వీటితో పాటు మరో 55 మందుల విషయంలో కూడా సీడీఎస్సీఓ హెచ్చరించింది.