న్యూఢిల్లీ : యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్‌ను అత్యవసర పరిస్థితుల్లో కరోనా వైరస్ రోగులకు చికిత్స అందించటానికి ఉపయోగించవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతమంది కరోనా వైరస్ రోగులు బంగ్లాదేశ్‌నుంచి రెమ్‌డెసివిర్‌ను అక్రమంగా దిగుమతి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఔషద నియంత్రణ విభాగం ‘సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీఓ) అక్రమంగా యాంటీ వైరల్ మందులను దిగుమతి చేసుకోవటాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌కు చెందిన కంపెనీలకు రెమ్‌డెసివిర్ అమ్మకాలకు సంబంధించి భారత్‌లో అనుమతులు లేవని, ఏ విధంగా ఔషధాన్ని దిగుమతి చేసుకుంటారని ప్రశ్నించింది. భారత్‌లోని జనరిక్ ఔషధ తయారీ దారులు ఉత్పత్తి చేస్తున్న రెమ్‌డెసివిర్ నాణ్యతపై తనిఖీలు జరుగుతున్నాయని తెలిపింది. అలాంటి సమయంలో అక్రమ దిగుమతులను అడ్డుకోవటంపై దృష్టి సారిస్తామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment