న్యూఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్ల మధ్య వ్యాక్సిన్ డీల్ కుదిరింది. పొరుగు దేశానికి మూడు కోట్ల వ్యాక్సిన్ డోసులు సరఫరా చేసేందుకు భారత్ అంగీకరించింది. ఈ మేరకు భారత్, బంగ్లాదేశ్, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, బెక్సిమ్కో ఫార్మాస్యూటికల్స్ మధ్య ఎంఓయూ కుదిరింది. సీరం ఇన్‌స్టిట్యూట్, బ్రిటీస్ డ్రగ్ మేకర్ ఆస్ట్రాజెనెకాతో కలిసి అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్ మూడు కోట్ల డోసులు కొనుగోలు చేసేందుకు బంగ్లాదేశ్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ మహమ్మారి సమయంలో అన్ని దేశాలు కలసికట్టుగా పొరాటం చేయలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా ఆయన పొరుగు దేశాలకు సాయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తామని తెలిపారు. (చదవండి: 2 డోసుల వ్యాక్సిన్ రూ. 1,000కే!)
ఈ మేరకు భారత బంగ్లాదేశ్ హైకమిషనర్ విక్రమ్ దోరైస్వామి బంగ్లాదేశ్‌తో లోతైన సంబంధం ఏర్పర్చుకోవడంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యింది అంటూ ట్వీట్ చేశారు. బంగ్లాదేశ్ హెల్త్ మినిస్టర్ జాహిద్ మాలెక్ మాట్లాడుతూ.. ‘సీరం ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ అన్ని అనుమతులు పొందిన తర్వాత మొదటి దశలో భాగంగా మూడు కోట్ల డోసులు ఇచ్చేందుకు అంగీకరించింది. ఇందుకు సంబంధించి ఢాకాలో ఒప్పందం కుదుర్చుకున్నాం’ అన్నారు. ఇక ప్రస్తుతం భారత్‌లో అభివృద్ధి చేస్తోన్న ఐదు కరోనా వైరస్ వ్యాక్సిన్‌లలో నాలుగు ఫేజ్ 2/3లో ఉండగా.. ఒకటి 1/2 దశలో ఉంది. బంగ్లాదేశ్ కాకుండా మయన్మార్, ఖతార్, భూటాన్ స్విట్జర్‌లాండ్, బహ్రెయిన్, ఆస్ట్రియా, దక్షిణ కొరియా దేశాలు మన వ్యాక్సిన్ అభివృద్ధిలో భాగం పంచుకోవాలని.. వినియోగించాలని భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment