ఢాకా: తగ్గిందనుకున్న కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పొరుగుదేశం బంగ్లాదేశ్లో మరోసారి లాక్‌డౌన్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 5(సోమవారం) నుంచి వారం రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ అమలులోకి రానున్నది. తాజాగా దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో షేక్ హసీనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఢాకాలో జరిగిన మీడియా సమావేశంలో రోడ్డు రవాణాశాఖ మంత్రి అబ్దుల్ ఖాదిర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
కేవలం ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే లాక్‌డౌన్ నుంచి మినహాయింపు కల్పించారు. ఫ్యాక్టరీలను తెరిచి ఉంచనున్నారు. కార్మికులు షిఫ్ట్ పద్దతుల్లో పనిచేసుకునే వీలు కల్పించారు. బంగ్లాదేశ్‌లో ఇప్పటి వరకు ఏడు లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సుమారు పది వేల మంది వైరస్ వల్ల మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment