maiden
-
టీ20ల్లో సంచలనం.. ఒక్క రన్ ఇవ్వకుండా 4 ఓవర్లు
టీ20ల్లో మరో సంచలనం నమోదైంది. హాంకాంగ్ బౌలర్ ఆయుష్ శుక్లా ఒక్క రన్ కూడా ఇవ్వకుండా తన 4 ఓవర్లు కోటాను మెయిడిన్లగా ముగించాడు. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫైయర్‌లో భాగంగా మంగోలియాపై ఆయుష్ ఈ ఫీట్ సాధించాడు.తద్వారా ఒకే ఇన్నింగ్స్‌లో వరుసగా నాలుగు మెయిడిన్ ఓవర్లు వేసిన మూడో బౌలర్‌గా శుక్లా చరిత్రకెక్కాడు. అయితే ఈ అరుదైన ఘనత సాధించిన తొలి ఆసియా బౌలర్ శుక్లానే కావడం గమనార్హం. మంగోలియా ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసేందుకు బంతిని అందుకున్న శుక్లా.. తొలి బంతికే వికెట్ తీసాడు.ఆ తర్వాత వరుసగా తన బౌలింగ్ కోటాను అతడు పూర్తి చేశాడు. ఇక ఓవరాల్‌గా ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో న్యూజిలాండ్ స్పీడ్ స్టార్ లాకీ ఫెర్గూసన్, కెనడా కెప్టెన్ సాద్ బిన్ జఫర్ ఉన్నారు. ఈ ఫీట్ణు లాకీ ఫెర్గూసన్ టీ20 వరల్డ్‌కప్‌లో పపువా న్యూగినియాపై సాధించగా.. సాద్ బిన్ జఫర్ పనామాపై సాధించాడు. -
ఆస్ట్రేలియా రోడ్లపై దూసుకుపోనున్న మేడిన్ ఏపీ ఈ-స్కూటర్లు
సాక్షి, అమరావతి: ఆస్ట్రేలియా రోడ్లపై మేడిన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు దూసుకుపోనున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నున్న సమీపంలోని విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ‘అవేరా’ తమ వ్యాపార విస్తరణలో భాగంగా ఆ్రస్టేలియాలో అడుగుపెడుతోంది. కాన్బెర్రా రాష్ట్రానికి పైలట్ ప్రాజెక్టు కింద 100 ఎలక్ట్రిక్ స్కూటర్లను అవేరా సంస్థ ఎగుమతి చేయబోతోంది. ఈ విషయాన్ని అవేరా వ్యవస్థాపక సీఈవో డాక్టర్ వెంకటరమణ ‘సాక్షి’ కి తెలిపారు. ఇటీవల ప్రధాని మోదీ ఆ్రస్టేలియా పర్యటన సందర్భంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై చర్చలు జరిగాయని చెప్పారు. కాన్బెర్రా సీఎం ఆండ్రూ భారత్ పర్యటనలో భాగంగా వచ్చే ఏడాది ఏపీకి వస్తారని, అప్పుదీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. చదవండి: వైఎస్సార్ షాదీ తోఫాలో మార్పులు.. సీఎం జగన్ కీలక నిర్ణయం -
చరిత్ర సృష్టించిన భువనేశ్వర్ కుమార్
టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా నిన్న (నవంబర్ 6) జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు (10) సంధించిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో తొలి బంతికే వికెట్ తీసిన భువీ.. ఆ ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మొయిడిన్ చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మెయిడిన్ ఓవర్ల రికార్డును సహచరుడు జస్ప్రీత్ బుమ్రాతో కలిసి షేర్ చేసుకున్న భువీ.. తాజాగా ఈ అరుదైన రికార్డను తన పేరిట లఖించుకున్నాడు. ఓవరాల్‌గా పొట్టి ఫార్మాట్లో అత్యధిక మెయిడిన్ ఓవర్ల రికార్డు విండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ పేరటి ఉంది. నరైన్ టీ20ల్లో మొత్తం 27 మెయిడిన్ ఓవర్లు బౌల్ చేశాడు. అతని తర్వాతి స్థానంలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఉన్నాడు. షకీబ్ ఖాతాలో 23 మెయిడిన్ ఓవర్లు ఉన్నాయి. వీరి తర్వాత విండీస్ లెగ్ స్పిన్నర్ శ్యాముల్ బద్రీ (21), భువనేశ్వర్ కుమార్ (21) సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో టీమిండియా పేసు గుర్రం బుమ్రా 19 మెయిడిన్లతో ఆరో ప్లేస్‌లో ఉన్నాడు. ఇదిలా ఉంటే, నిన్న జింబాబ్వేపై గెలుపుతో టీమిండియా గ్రూప్-2లో అగ్రస్థానంతో సెమీస్‌కు చేరుకుంది. ఈ గ్రూప్ నుంచి సెమీస్‌కు చేరిన రెండో జట్టుగా పాక్ నిలిచింది. అటు గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించాయి. నవంబర్ 9న జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్-పాకిస్తాన్‌లు.. ఆమరుసటి రోజు (నవంబర్ 10) జరిగే రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన జట్ల మధ్య నవంబర్ 13న ఫైనల్ జరుగుతుంది. -
బుమ్రా ప్రపంచ రికార్డు సమం చేసిన భువీ.. మరో అరుదైన రికార్డు కూడా..!
టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌల్ చేసిన భువీ.. రెండు మెయిడిన్లు వేసి తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. భువీ వేసిన సెన్సేషనల్ స్పెల్‌లో వరుసగా రెండు మెయిడిన్ ఓవర్లు ఉండటం విశేషం. ఈ క్రమంలో భువీ.. బుమ్రా పేరిట ఉన్న అత్యధిక టీ20 మొయిడిన్ ఓవర్ల ప్రపంచ రికార్డును సమం చేయడంతో పాటు అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా రెండు మొయిడిన్లు సంధించిన తొలి భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మొయిడిన్ ఓవర్లు వేసిన రికార్డు బుమ్రా పేరిట ఉండేది. బుమ్రా 56 టీ20ల్లో 9 మొయిడిన్లు సంధించగా.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో భువీ (81 మ్యాచ్‌ల్లో 9 మెయిడిన్లు) బుమ్రా రికార్డును సమం చేశాడు. ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 56 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్ శర్మ (39 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్ కోహ్లి (44 బంతుల్లో 62 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (25 బంతుల్లో 51 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స) అర్ధశతకాలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఛేదనలో టీమిండియా బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో నెదర్లాండ్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులకు మాత్రమే పరిమితమైంది. ఈ విజయంతో భారత్.. మెగా టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి గ్రూప్-2 టాపర్‌గా నిలిచింది. కాగా, టోర్నీ తొలి మ్యాచ్‌లో రోహిత్ సేన్.. పాక్‌ను 4 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఆ మ్యాచ్‌లో కోహ్లి వీరోచితంగా పోరాడి టీమిండియాను ఒంటి చేత్తో గెలిపించాడు. -
వివాదాస్పద మైడెన్కు భారీ షాక్:అక్టోబరు 14 వరకు గడువు
సాక్షి,ముంబై: వివాదాస్పద దేశీయ ఫార్మ కంపెనీ మైడెన్ ఫార్మాకు మరో భారీ షాక్ తగిలింది. కంపెనీ ఉత్పత్తి చేసే దగ్గు మందులు ప్రమాణాలకు అనుగుణంగా లేవంటూ హరియాణా ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సోనెపట్‌లోని దాని తయారీ ప్లాంట్‌లో తనిఖీల అనంతరం హరియాణా స్టేట్ డ్రగ్స్ కంట్రోలర్, లైసెన్సింగ్ అథారిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌తో సంయుక్త తనిఖీ తర్వాత హర్యానా డ్రగ్ అధికారులు మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌కు ఈ నోటీసులిచ్చింది. సంస్థ డైథలిన్ గ్లైకాల్, ఇథిలీన్ ప్రొపైలిన్ గ్లైకాల్ నాణ్యత పరీక్షను నిర్వహించలేదని, సంబంధిత పత్రాలు కూడా సక్రమంగా లేవంటూ ఫార్మా కంపెనీ అక్టోబర్ 14 లోగా నోటీసుకు సమాధానం ఇవ్వాలి, లేని పక్షంలో దానిపై చర్య తీసుకుంటామని అక్టోబరు 7న జారీ చేసిన నోటీసుల్లో తెలిపింది. (చిన్నారులను మింగేసిన దగ్గు మందు: సంచలన విషయాలు) డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్, హర్యానా, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940 రూల్స్, 1945 రూల్ 85(2) ప్రకారం న్యూ ఢిల్లీలోని మైడెన్ ఫార్మాకు నోటీసులిచ్చింది. తమ తనిఖీల్లో అనేక ఉల్లంఘనలను గుర్తించిన నేపథ్యంలో కంపెనీ తయారీ లైసెన్స్‌ను ఎందుకు సస్పెండ్ చేయకూడదో తెలపాలని కోరుతూ నోటీసు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు తన నివేదికను సమర్పించిన రాష్ట్ర ఎఫ్‌డీఏ షోకాజ్ నోటీసు అందిన 7 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని మైడెన్ ఫార్మాను ఆదేశించింది. రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ కమ్ లైసెన్సింగ్ అథారిటీ, హరియాణా ఎఫ్‌డీఏ మన్మోహన్ తనేజా తెలిపారు.ప్రొపైలిన్ గ్లైకాల్ (బ్యాచ్ నంబర్ E009844) తయారీ తేదీ సెప్టెంబర్ 2021, గడువు తేదీ సెప్టెంబరు 2023ని ప్రోమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్మలిన్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్‌ల తయారీలో ఉపయోగించినట్టు కనుగొంది. అలాగే నవంబర్ 2024 నాటికి, ఉత్పత్తి షెల్ఫ్-లైఫ్ ముడి పదార్థం కంటే ఎక్కువ అని తేలింది. కాగా ఇటీవల గాంబియాలో 66 మంది చిన్నారుల మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మైడెన్ దగ్గు సిరప్‌లపై హెచ్చరికలు జారీ చేసింది. మైడెన్ ఫార్మా ఉత్పత్తులు ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్మలిన్ బేబీ కాఫ్ సిరప్, మాకోఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ సిరప్స్లోని నాణ్యత లేని, కలుషితమైన పదార్థాలే పిల్లల మరణాలకు కారణమని పేర్కొన్న సంగతి తెలిసిందే. (ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీ సేల్: ఐఫోన్13పై కళ్లు చెదిరే ఆఫర్) -
చిన్నారులను మింగేసిన దగ్గు మందు: సంచలన విషయాలు
న్యూఢిల్లీ: భారతదేశంలో తయారైన మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన దగ్గు మందు తాగి పశ్చిమ ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది చిన్నారులు మృతిచెందిన ఘటన విషాదం నింపింది. నాలుగు రకాల కాఫ్ సిరప్లు చిన్నారుల మృతికి కారణమంటూ డబ్ల్యూహెచ్ఓ మెడికల్ అలర్ట్ జారీ చేసింది. డైథలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ మోతాదు పరిమితికి మించి ఉన్నాయని తెలిపింది. ఇది విషపూరితమైందనీ, తీవ్రమైన మూత్రపిండాల వ్యాధులకు దారితీస్తుందని తెలిపిన డబ్ల్యూహెచ్ఓ మైడెన్‌పై సమగ్ర విచారణకు ఆదేశించింది. అయితే ఈ ఘటన తరువాత దేశీయ ఫార్మా కంపెనీ మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌కు సంబంధించి సంచలన విషయాలు వెలుగుచూశాయి.ఈ ఫార్మా కంపెనీకి చెందిన అనేక మందులు దేశంలోని నాలుగు రాష్ట్రాలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది. ప్రజారోగ్య కార్యకర్త దినేష్ ఠాకూర్‌ని ఉటంకిస్తూ ఎన్టీటీవీ ఒక కథనాన్ని ప్రచురించింది. (Hong Kong టూరిస్టులకు పండగే: రూ.2వేల కోట్ల విలువైన టికెట్లు ఫ్రీ) వియత్నాం చెత్త రికార్డు ఉన్న ఫార్మా కంపెనీలు బ్లాక్ లిస్ట్ చేసిందనీ, అందులో మైడెన్ కూడా ఒకటని ఠాకూర్ విమర్శించారు. వియత్నాం 2011లో కంపెనీని నిషేధించిందన్నారు. ఇంత పేలవమైన రికార్డును కలిగి ఉన్నప్పుడు అనుమతి ఎలా ఇచ్చారని ఠాకూర్ ప్రశ్నించారు. కంపెనీలో తీవ్రమైన నాణ్యత నియంత్రణా లోపాలున్నాయని,సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) సెంట్రల్ రెగ్యులేటర్ ఉన్నప్పటికీ కానీ ప్రతి రాష్ట్రానికి దాని స్వంత రెగ్యులేటర్ లేదన్నారు. కేరళ, గుజరాత్‌లోని రెగ్యులేటర్లు మైడెన్ మందులు నాణ్యత లేనివిగా తేలియాని గుర్తు చేశారు. బిహార్ ఇప్పటికే దీన్ని బ్లాక్ లిస్ట్ చేసిందని ఆయన పేర్కొన్నారు. ఎగుమతుల అనుమతిని కేంద్ర నియంత్రణ సంస్థ మాత్రమే ఇస్తుంది. కంపెనీ డైరెక్టర్లకు సంబంధించిన కొన్ని కేసులు కూడా కోర్టులో ఉన్నాయన్నారు. ఇవన్నీ దేశంలోని ఔషధ నియంత్రణ వ్యవస్థల పరిస్థితికి అద్దం పడుతున్నాయని ఠాకూర్ మండిపడ్డారు. (Infosys: మాజీ ఎగ్జిక్యూటివ్ ఫిర్యాదు, కోర్టులో ఇన్ఫోసిస్‌కు షాక్) మైడెన్ ఫార్మాస్యూటికల్ మందులు, నాణ్యతా లోపాలు, చర్యలు బిహార్ (2008) : ఎరిత్రోమైసిన్ స్టీరేట్ 125ఎంజీ సిరప్ (4 బ్యాచ్‌లు నాణ్యత లేనివిగా గుర్తించారు బిహార్ (2011) : మిథైలెర్గోమెట్రిన్ ట్యాబ్ (నకిలీ) వియత్నాం: కంపెనీ 2011 నుండి 2013 వరకు నిషేధం గుజరాత్ (2013) : మాసిప్రో ట్యాబ్ (రద్దు సమస్యలు) జమ్మూ కాశ్మీర్ (2020) : సైప్రోహెప్టాడిన్ హైడ్రోక్లోరైడ్ సిరప్ ఐపీ (నాణ్యతాలోపం) కేరళ (2021) : మెట్ఫార్మిన్ 1000 ట్యాబ్ (రద్దు సమస్య) కేరళ (2021) : ఈసిప్రిన్ (ఐపీ ప్రమాణానికి అనుగుణంగా లేదు) కేరళ (2021): మెట్ఫార్మిన్ 500 mg (రద్దు సమస్య) కేరళ (2021) : మైకల్ డి ట్యాబ్ (తక్కువ నాణ్యత) ఇదీ చదవండి: ఫెస్టివ్ బొనాంజా: కెనరా బ్యాంకు కస్టమర్లకు శుభవార్త! కాగా నవంబర్ 1990లో కార్యకలాపాలను ప్రారంభించిన మైడెన్, గాంబియాకు మాత్రమే సిరప్‌ను తయారు చేసి ఎగుమతి చేసిందని భారత మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం. గాంబియా విషాదం తరువాత, మైడెన్ ఫార్మాస్యూటికల్స్ దగ్గు సిరప్‌ల నమూనాలను ఇండియా పరీక్షిస్తోంది. నమూనాలను సెంట్రల్ ఫార్మాస్యూటికల్ లాబొరేటరీకి పంపామని, నేరం నిరూపితమైతే కఠిన చర్యలు తీసుకుంటామని మైడెన్ ఫ్యాక్టరీలున్న హర్యానా రాష్ట్ర ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
WHO: ఆ భారత కంపెనీ సిరప్‌లను వాడొద్దు
జెనీవా: భారత్‌కు చెందిన ఓ ఫార్మా కంపెనీ తయారు చేస్తున్న సిరప్‌ల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. గాంబియాలో 66 మంది మరణాలకు.. ఆ కంపెనీ సిరప్‌లకు సంబంధం ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది డబ్ల్యూహెచ్‌వో. ఈ మేరకు.. డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రెస్ మీడియా ప్రకటన చేశారు. భారత దేశానికి చెందిన మెయిడెన్ ఫార్మాసూటికల్స్ తయారు చేసిన దగ్గు, జలుబు సిరప్‌లను వాడడం వల్లే చిన్నారుల కిడ్నీలు దెబ్బ తిని మరణించి ఉంటారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. చిన్నారుల మృతి ఆ కుటుంబాలకు తీరని శోకం మిగిల్చిందన్న ఆయన.. ఈ కలుషితమైన మందులు పశ్చిమ ఆఫ్రికా దేశం వెలుపల పంపిణీ చేయబడి ఉండవచ్చని, కాబట్టి వాటిని వాడొద్దని హెచ్చరించారు. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి భారత్‌కు చెందిన మెయిడెన్ కంపెనీతో పాటు ఆ దేశ ఔషధ నియంత్రణ మండలిపైనా విచారణ ఉంటుందని ట్రెడోస్ వెల్లడించారు. "WHO has today issued a medical product alert for four contaminated medicines identified in #Gambia that have been potentially linked with acute kidney injuries and 66 deaths among children. The loss of these young lives is beyond heartbreaking for their families"-@DrTedros — World Health Organization (WHO) (@WHO) October 5, 2022 మెయిడెన్ కంపెనీ తయారు చేస్తున్న Promethazine ఓరల్ సొల్యూషన్, Kofexmalin బేబీ కాఫ్ సిరప్, Makoff బేబీ కాఫ్ సిరప్, Magrip N కోల్డ్ సిరప్ ఈ జాబితాలో ఉన్నాయి. డబ్ల్యూహెచ్‌వో బుధవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ రోజు వరకు కూడా తయారీదారు కంపెనీ ఈ ఉత్పత్తుల భద్రత, నాణ్యతపై WHOకు ఎలాంటి హామీలను అందించలేదని తెలిపింది. పిల్లల్లో వాంతులు, డయేరియా, మూత్రవిసర్జనకు ఆటంకం, తలనొప్పి, చివరికి.. కిడ్నీని దెబ్బ తీసి ప్రాణం తీయొచ్చని హెచ్చరించింది. ల్యాబ్ పరీక్షల్లో.. ఆమోద యోగ్యం కానీ రీతిలో డైథెలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్‌తో సిరప్‌లను కలుషితం చేసినట్లు తేలింది. ఇదీ ప్రాణాంతకమని కూడా డబ్ల్యూహెచ్‌వో ప్రకటన స్పష్టం చేసింది. గాంబియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత నెలలో ఆసుపత్రులను పారాసెటమాల్ సిరప్‌లను వాడటం మానేయాలని కోరింది. అయితే.. భారతదేశ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన అందిన సమాచారం ప్రకారం.. తయారీదారు కలుషితమైన మందులను గాంబియాకు మాత్రమే సరఫరా చేసినట్లు WHO తెలిపింది. అయినప్పటికీ.. అనధికార మార్గాల్లో ఆఫ్రికాలోని ఇతర దేశాలకు అవి సరఫరా అయ్యి ఉండొచ్చని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. అంతేకాదు.. మెయిడెన్ కంపెనీ స్థానికంగా(భారత్‌లో కూడా!) అవే కలుషితాలను కలిపి ఉత్పత్తులు విడుదల చేసి ఉంటుందనే అనుమానాల నడుమ ఉత్పత్తుల జాబితా నుంచి వాటిని తొలగించడమే మంచిదని డబ్ల్యూహెచ్‌వో, భారత ఔషధ నియంత్రణ మండలికి సూచించింది. -
ఐపీఎల్ చరిత్రలో ప్రవీణ్ కుమార్ పేరిట ఉన్న అత్యంత అరుదైన రికార్డు ఏంటో తెలుసా..?
Praveen Kumar: బ్యాటర్ల పండుగా పిలిచే ఐపీఎల్లో బౌలర్లు రికార్డులు సాధించడం చాలా అరుదుగా కనిపిస్తుంది. 14 ఎడిషన్ల ఐపీఎల్ జర్నీలో బౌలర్లు రాణించిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. ఇలాంటి బ్యాటర్ల ఆధిపత్యం ఉన్న క్యాష్ రిచ్ లీగ్‌లో ఓ బౌలర్ ఊహకందని అద్భుత రికార్డును చాలాకాలంగా తన పేరిట భద్రపరుచుకున్నాడు. ఆ రికార్డు ఏంటంటే.. టీ20ల్లో ఒక్క డాట్ బాల్ వేయడమే గగనమనుకుంటే ఓ బౌలర్ తన ఐపీఎల్ కెరీర్లో ఏకంగా 14 మెయిడిన్లు వేసి ఔరా అనిపించాడు. ఐపీఎల్లో వివిధ జట్ల తరఫున 119 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్.. 14 మెయిడిన్ ఓవర్లు వేసి, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. అతని తర్వాత టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ (103 మ్యాచ్‌ల్లో 10 మెయిడిన్లు), భువనేశ్వర్ కుమార్ (132 మ్యాచ్‌ల్లో 9 మెయిడిన్లు), ధవల్ కులకర్ణి (92 మ్యాచ్‌ల్లో 8 మెయిడిన్లు), లసిత్ మలింగ (122 మ్యాచ్‌ల్లో 8 మెయిడిన్లు), సందీప్ శర్మ (8 మెయిడిన్లు), డేల్ స్టెయిన్ (7), హర్భజన్ సింగ్ (6), జస్ప్రీత్ బుమ్రా (6), దీపక్ చాహర్ (6), అమిత్ మిశ్రా (6), ఇషాంత్ శర్మ (6) వరుస స్థానాల్లో ఉన్నారు. చదవండి: ఐపీఎల్‌కు ముందు పెళ్లి పీటలెక్కిన మరో స్టార్ క్రికెటర్.. ఎవరంటే..? -
4 ఓవర్లు.. 4 మెయిడెన్స్..4 వికెట్లు.. చెలరేగిన మహిళా బౌలర్
అబుజా: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫైయర్ మ్యాచుల్లో పలు రికార్డులు నమోదు అవుతున్నాయి. కామెరూన్‌కు చెందిన మేవా డౌమా తన అంతర్జాతీయ అరంగేట్ర మ్యాచ్‌లో నాలుగు మన్కడింగ్‌లు చేసి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే కామెరూన్, నైజీరియా జట్ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌లో తాజాగా మరో రికార్డు నమోదైంది. నైజీరియా బౌలర్ బ్లెస్సింగ్ ఎటిమ్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా నాలుగు మెయిడెన్లు వేసి, నాలుగు వికెట్లు సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కామెరూన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లో కేవలం 47 పరుగులకే కూప్పకులిపోయింది. కామెరూన్ బ్యాట్స్ఉమెన్లో 23 పరుగులు సాదించి నాంటియా కెన్‌ఫెక్ టాప్ స్కోరర్‌గా నిలిచింది. నైజీరియా బౌలర్ ఎటిమ్ నాలుగు వికెట్లు సాధించి కామెరూన్ నడ్డి విరిచింది. అలాగే మిరాకిల్ ఇమ్మోల్, మేరీ డెస్మండ్ చెరో రెండు వికెట్లు సాధించారు. అనంతరం 48 పరగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన నైజీరియా కేవలం 6.3 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేధించింది. చదవండి: MS Dhoni: పాకిస్తాన్‌పై చారిత్రత్మక విజయానికి నేటికి 14 ఏళ్లు.. -
అర్జున్ టెండూల్కర్ బోణీ కొట్టాడు..
కొలంబొ: టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ టెండూల్కర్ తన అంతర్జాతీయ తొలి వికెట్‌ను సాధించాడు. శ్రీలంకతో రెండు టెస్టులు ఆడనున్న భారత అండర్-19 జట్టులో అర్జున్ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. మంగళవారం శ్రీలంకతో తొలి టెస్టులో భాగంగా భారత్ తరపున ఈ లెఫ్టార్మ్ పేసర్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్ చేపట్టింది. టీమిండియా అండర్-19 సారథి అనుజ్ రావత్ బౌలింగ్ దాడి అర్జున్‌తో ప్రారంభించాడు. తొలి ఓవర్లో ఒక ఫోర్‌తో సహా ఆరు పరుగులిచ్చిన ఈ పేసర్ తన తరువాతి ఓవర్లో లంక ఓపెనర్ ఆర్వీపీకే మిశ్రా (9) వికెట్ సాధించాడు. దీంతో అర్జున్ టెండూల్కర్ తన తొలి అంతర్జాతీయ వికెట్ సాధించాడు. ఇక మిగతా బౌలర్లు హర్ష్ త్యాగి (4/92), ఆయూష్ బడొని (4/24) చెలరేగడంతో లంక తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్జున్ 33 పరుగులిచ్చి ఒక్క వికెట్ సాధించాడు. వినోద్కాంబ్లి అనందభాష్పాలు అర్జున్ టెండూల్కర్ తొలి వికెట్ సాధించడం పట్ల టీమిండియా మాజీ ఆటగాడు, సచిన్ బాల్య స్నేహితుడు వినోద్ కాంబ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ యువ ఆటగాడికి శుభాకాంక్షలు తెలపుతూ భావోద్వేగంగా ట్వీటర్లో ట్వీట్ చేశాడు. ‘అర్జున్ వికెట్ తీయడం చూసి ఆనందభాష్పాలతో నా నోట మాట రావడం లేదు. నీ ఆట చూస్తుంటే నువ్వు పడిన కష్టం కనబడుతోంది. ఈ వికెట్‌తోనే సంతోషపడకు.. ఇది కేవలం ప్రారంభమాత్రమే. నువ్వు సాధించాల్సిన విజయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. తొలి వికెట్ ఆనందాన్ని ఆస్వాదించు’ అంటూ కాంబ్లీ ట్వీట్ చేశాడు. Tears of joy rolled down when I saw this, have seen him grow up and put in the hard work in his game. Could not be more happy for you, Arjun. This is just the beginning, I wish you tons and ton of success in the days to come. Cherish your first wicket and enjoy the moment.👌 pic.twitter.com/vB3OmbaTWM — VINOD KAMBLI (@vinodkambli349) July 17, 2018 -
ఖననం చేసిన మృతదేహం వెలికితీత
చాగల్లు : ప్రేమ పేరుతో వంచనకు గురై తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తల్లి అనుమానం వ్యక్తం చేయడంతో ఖననం చేసిన మృతదేహాన్ని పోలీసులు శనివారం వెలికి తీయించి పోస్ట్‌మార్టం చేయిం చారు. వివరాలిలా ఉన్నాయి.. చా గల్లు మండలం ఊనగట్ల గ్రామానికి చెందిన తొర్లపాటి విమల (19) ఈనెల 23న ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదే రోజు ఆమెను గ్రామంలోని శ్శశానంలో ఖననం చేశారు. విమల ఇటీవల ఇంటర్ పరీక్షలు రాసింది. 22 న రాత్రి ఇంటికి ఆలస్యంగా రావడంతో తల్లి సుభద్ర మందలిం చింది. మరునాడు ఉదయం తల్లి పనికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో చీరతో ఊరేసుకుని విమల ఆత్మహత్యకు పాల్ప డింది. ఈ నెల 24న ఆమె పుస్తకాల్లో సూసైట్‌నోట్ కనిపిం చింది. దీనిలో గ్రామానికి చెందిన నూతంగి జయంత్, విమల ప్రేమిం చుకున్నారని, విమలను జయంత్ మోసం చేసి మరో యువతిని పెళ్లిచేసుకున్నట్టు ఉంది. దీంతో తల్లి సుభ్రద శనివారం చాగల్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఖననం చేసిన విమల మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి తహసీల్దార్ ఎం.మెరికమ్మ సమక్షంలో శవపంచనామా చే శారు. అనంతరం నిడదవోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇన్చార్జ్ ఎస్సై భగవాన్‌ప్రసాద్ ఆధ్వర్యంలో ఏఎస్సై ఎం.ధనరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ప్రేమ పేరుతో వంచించాడు తన కుమార్తె విమలను అల్లారుముద్దుగా పెంచుకున్నానని, ప్రేమ పేరుతో జయంత్ వంచించి, శారీరకంగా అనుభవించి మోసం చేశాడని సుభద్ర ఆరోపించింది. జయంత్ మరో యువతిని వివాహం చేసుకోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిందని కన్నీరుమున్నీరుగా విలపించింది.