ప్రేమ పేరుతో వంచనకు గురై తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తల్లి అనుమానం వ్యక్తం చేయడంతో ఖననం చేసిన మృతదేహాన్ని పోలీసులు శనివారం వెలికి తీయించి...
ఖననం చేసిన మృతదేహం వెలికితీత
Mar 26 2017 1:07 AM | Updated on Apr 3 2019 5:32 PM
చాగల్లు : ప్రేమ పేరుతో వంచనకు గురై తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తల్లి అనుమానం వ్యక్తం చేయడంతో ఖననం చేసిన మృతదేహాన్ని పోలీసులు శనివారం వెలికి తీయించి పోస్ట్‌మార్టం చేయిం చారు. వివరాలిలా ఉన్నాయి.. చా గల్లు మండలం ఊనగట్ల గ్రామానికి చెందిన తొర్లపాటి విమల (19) ఈనెల 23న ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదే రోజు ఆమెను గ్రామంలోని శ్శశానంలో ఖననం చేశారు. విమల ఇటీవల ఇంటర్ పరీక్షలు రాసింది. 22 న రాత్రి ఇంటికి ఆలస్యంగా రావడంతో తల్లి సుభద్ర మందలిం చింది. మరునాడు ఉదయం తల్లి పనికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో చీరతో ఊరేసుకుని విమల ఆత్మహత్యకు పాల్ప డింది. ఈ నెల 24న ఆమె పుస్తకాల్లో సూసైట్‌నోట్ కనిపిం చింది. దీనిలో గ్రామానికి చెందిన నూతంగి జయంత్, విమల ప్రేమిం చుకున్నారని, విమలను జయంత్ మోసం చేసి మరో యువతిని పెళ్లిచేసుకున్నట్టు ఉంది. దీంతో తల్లి సుభ్రద శనివారం చాగల్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఖననం చేసిన విమల మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి తహసీల్దార్ ఎం.మెరికమ్మ సమక్షంలో శవపంచనామా చే శారు. అనంతరం నిడదవోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇన్‌చార్జ్ ఎస్సై భగవాన్‌ప్రసాద్ ఆధ్వర్యంలో ఏఎస్సై ఎం.ధనరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
ప్రేమ పేరుతో వంచించాడు
తన కుమార్తె విమలను అల్లారుముద్దుగా పెంచుకున్నానని, ప్రేమ పేరుతో జయంత్ వంచించి, శారీరకంగా అనుభవించి మోసం చేశాడని సుభద్ర ఆరోపించింది. జయంత్ మరో యువతిని వివాహం చేసుకోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిందని కన్నీరుమున్నీరుగా విలపించింది.
Advertisement
Advertisement