extraction
-
సౌందర్యం సాధనంగా వెదురు..బోలెడన్ని లాభాలు..!
సాధారణంగా వెదురును ఇళ్ల నిర్మాణ వస్తువుగానే చూస్తాం. మహా అయితే వెదురుతో చేసే వివిధ రకాల వంటకాలు గురించి విని ఉంటాం. అంతేకానీ ఇది ముఖ సౌందర్యం కోసం వాడటం గురించి చాలామందికి తెలియదు. కానీ నిపుణులు ముఖ వర్చస్సుకు ఎంతగానో ఉపయోగ పడుతుందని నొక్కి మరీ చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు వివిధ రకాల సౌందర్య సమస్యల్ని దూరం చేయడంలో సమర్థంగా పనిచేస్తాయంటున్నారు. వెదురుతో ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టే కొరియన్లు తమ సౌందర్య పరిరక్షణలో భాగంగా దీన్ని విరివిగా వాడుతుంటారట! మరీ అలాంటి వెదురు ఎలా సౌందర్యాన్ని పెంచడంలో ఉపయోగపడుతుందంటే..ఎలా ఉపయోగపడుతుందంటే..వెదురులో సిలికా, కొలాజెన్ స్థాయులు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మానికి తేమనందించి మృదువుగా మార్చుతాయి. వృద్ధాప్య ఛాయల్ని దూరం చేస్తుందిఅలాగే సిలికా చర్మానికి రక్తప్రసరణను మెరుగుపరిచి చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది.మొటిమల కారణంగా చర్మం బయటి పొర దెబ్బతింటుంది. తద్వారా వాతావరణంలోని బ్యాక్టీరియా, ఇతర కాలుష్య కారకాలు చర్మంపై దాడి చేస్తాయి. ఇలా జరగకూడదంటే వెదురు ఎక్స్‌ట్రాక్ట్‌తో తయారుచేసిన సౌందర్య సాధనాల్ని ఉపయోగించమంటున్నారు నిపుణులు. తద్వారా మొటిమల సమస్యకు కూడా చెక్ పెట్టచ్చంటున్నారు.డీటాక్సిఫై ఏజెంట్‌గా వెదురుకు పేరుంది. కాబట్టి దీంతో తయారుచేసిన సౌందర్య ఉత్పత్తులు/సాధనాల్ని తరచూ ఉపయోగించడం వల్ల చర్మంలోని మలినాలు, విష పదార్థాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.వెదురు ఎక్స్ట్రాక్ట్స్లో ఉండే అమైనో ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్లు.. సూర్యరశ్మిలో ఉన్న అతినీలలోహిత కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా రక్షణ కల్పిస్తాయి.ఫ్రీరాడికల్స్ చర్మ కణాల్ని దెబ్బతీస్తాయి. తద్వారా ముఖంపై ముడతలు, గీతలు.. వంటివి ఏర్పడే ప్రమాదముంది. అదే వెదురుతో తయారుచేసిన ఉత్పత్తుల్ని తరచూ వాడితే ఫలితం ఉంటుంది. వీటి వల్ల చర్మం తేమగా, మృదువుగా మారుతుంది.వెదురు ఎక్స్ట్రాక్ట్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలుంటాయి. ఇవి అలర్జీలు, రాషెస్ వంటి చర్మ సమస్యల్ని దూరం చేయడంలో సహకరిస్తాయి. అందుకే వెదురు ఎక్స్‌ట్రాక్ట్‌తో తయారుచేసిన క్లెన్సర్లు, బాడీవాష్‌లను చర్మానికి ఉపయోగించడం మేలంటున్నారు నిపుణులు.వెదురులోని సిలికా చర్మ సౌందర్యానికే కాదు.. జుట్టు ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. ఇది జుట్టు కుదుళ్లకు పోషణను అందించడంతో పాటు రక్తప్రసరణ, ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. ఫలితంగా జుట్టు ఒత్తుగా, ప్రకాశవంతంగా పెరిగేందుకు దోహదం చేస్తుంది. గోళ్లు పొడవుగా పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు కొందరు. అయితే సరైన పోషణ అందక అవి పదే పదే విరిగిపోతుంటాయి. అలా జరగకూడదంటే వెదురు ఎక్స్‌ట్రాక్ట్‌తో తయారుచేసిన గోళ్ల సంరక్షణ ఉత్పత్తుల్ని వాడడం మంచిదంటున్నారు నిపుణులు. ఇందులోని సిలికా గోళ్లకు కావాల్సిన పోషణను అందించడంతో పాటు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.ఎలా ఉపయోగించాలంటే..చర్మ సంరక్షణ, కేశ సౌందర్యం, గోళ్ల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే వెదురు ప్రస్తుతం మార్కెట్లో.. సీరమ్, షీట్ మాస్కులు, ఫేస్ మిస్ట్, మాయిశ్చరైజర్లు, క్లెన్సర్ల రూపంలో అందుబాటులో ఉంది. అలాగే వెదురు ఎక్స్ట్రాక్ట్ పరిమాణం ఎక్కువగా ఉన్న కొరియన్ బ్యూటీ ఉత్పత్తుల్ని నిపుణుల సలహా మేరకు వాడచ్చు. ఇక జుట్టు విషయానికొస్తే.. వెదురు ఎక్స్‌ట్రాక్ట్‌తో తయారుచేసిన షాంపూలు, కండిషనర్లు సైతం లభిస్తున్నాయి. అలాగే గోళ్ల ఆరోగ్యాన్ని పెంచే క్రీమ్స్, వెదురుతో తయారుచేసిన మానిక్యూర్ స్టిక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఎంచుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం, ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు.(చదవండి: ఈ విటమన్ని తక్కువగా తీసుకుంటే ఎక్కువ కాలం జీవించొచ్చట..! పరిశోధనలో షాకింగ్ విషయాలు..ఝ) -
రిలీజైన నెలలోనే అత్యధిక వ్యూస్ సాధించిన ఓటీటీ సిత్రాలు..
Top 10 Most Viewed Netflix Movies In One Month: విభిన్నమైన కథాంశాలతో ఉన్న చిత్రాలను చూడాలనుకునే మూవీ లవర్స్‌కు, ఆడియెన్స్‌కు ఓటీటీలు బెస్ట్ ఆప్షన్‌గా మారాయి. ప్రేక్షకుల అభిరుచిని తెలుసుకున్న ఓటీటీ దిగ్గజ సంస్థలు డిఫరెంట్ కథలతో వెబ్ సిరీస్‌లు, సినిమాలు చిత్రీకరిస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్. ఈ సంస్థ విభిన్నమైన చిత్రాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఎప్పుడూ సరికొత్త హంగులతో ఆడియెన్స్‌కు బోర్ కొట్టించకుండా కొత్తదనంలో ఆకట్టుకుంటోంది. ఇక నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్ రూపొందించిన అనేక చిత్రాలు, వెబ్ సిరీస్‌లు సినీ ప్రేమికులను అలరించాయి. అందులో విడుదలైన మొదటి నెలలోనే అత్యధిక వ్యూస్ సాధించిన ఈ టాప్ 10 మూవీస్ సినీ లవర్స్ కోసం అందిస్తున్నాం. ఇక ఒక్కో చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయండి మరి. 1. రెడ్ నోటీస్- 129 మిలియన్ వ్యూస్ (4 నవంబర్ 2021) 2. ఎక్స్ట్రాక్షన్- 99 మిలియన్ వ్యూస్ (24 ఏప్రిల్ 2020) 3. బర్డ్ బాక్స్- 89 మిలియన్ వ్యూస్ (14 డిసెంబర్ 2018) 4. స్పెన్సర్ కాన్ఫిడెన్షియల్- 85 మిలియన్ వ్యూస్ (6 మార్చి 2020) 5. 6 అండర్ గ్రౌండ్- 83 మిలియన్ వ్యూస్ (10 డిసెంబర్ 2019) 6. మర్డర్ మిస్టరీ- 83 మిలియన్ వ్యూస్ (14 జూన్ 2019) 7. ది ఓల్డ్ గార్డ్- 78 మిలియన్ వ్యూస్ (10 జూలై 2020) 8. ఎనోలా హోమ్స్- 76 మిలియన్ వ్యూస్ (23 సెప్టెంబర్ 2020) 9. ప్రాజెక్ట్ పవర్- 75 మిలియన్ వ్యూస్ (14 ఆగస్టు 2020) 10. ఆర్మీ ఆఫ్ ది డెడ్- 75 మిలియన్ వ్యూస్ (21 మార్చి 2021) -
కర్నూలులో బంగారు నిక్షేపాల వెలికితీత
తుగ్గలి: బంగారు నిక్షేపాల వెలికితీతలో భాగంగా కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని పగిడిరాయి–జొన్నగిరి గ్రామాల మధ్య డ్రిల్లింగ్ పనులను మంగళవారం జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభించింది. తుగ్గలి మండలంలోని పగిడిరాయి, బొల్లవానిపల్లి, జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో 40 ఏళ్లుగా వివిధ కంపెనీలు సర్వేలు చేసి, బంగారం నిక్షేపాలున్నాయని గుర్తించాయి. దాదాపు 15 ఏళ్లుగా సర్వే చేస్తున్న జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిక్షేపాల వెలికితీతకు సిద్ధమై.. 2013లోనే ప్రభుత్వ అనుమతులు పొందింది. నిక్షేపాల వెలికితీతపై కొందరు కోర్టుకు వెళ్లడంతో పనుల్లో జాప్యమైంది. గతేడాది ఎకరా రూ.12 లక్షలు చొప్పున 300 ఎకరాలు కొనుగోలు చేసి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, భూములు కోల్పోయే రైతులకు డబ్బులు చెల్లించడంలో జాప్యం జరగడం, కొన్నాళ్ల పాటు కంపెనీ ప్రతినిధులు మొహం చాటేయడంతో మైనింగ్ ప్రాజెక్టు కలగా మిగిలింది. ఎట్టకేలకు రెండు రోజుల క్రితం కంపెనీ ప్రతినిధులు వచ్చి రైతులతో మాట్లాడి ఏడాది కౌలు చెల్లించి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. సోమవారం డ్రిల్లింగ్ పనులు మొదలు పెట్టారు. -
ఇసుక తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, కొవ్వూరు: జిల్లాలో ఇసుక తవ్వకాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కేవలం నాడు–నేడు, ఎన్ఆర్ఈజీఎస్ పథకం పనులకు మాత్రమే ఇసుక సరఫరా చేయనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని డోర్ డెలివరీ పథకానికి ప్రస్తుతానికి అనుమతి లేదని అధికారులు చెప్పారు. ముందస్తుగా స్టాకు యార్డులకు ఇసుక తరలించి నిల్వ చేయడం ద్వారా వర్షకాలంలో ఇసుక కష్టాలను గట్టెక్కించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని ర్యాంపులను తెరిచి ఇసుకను స్టాక్ యార్డులకు తరలిస్తున్నారు. గండేపల్లి, జగ్గంపేటలతో పాటు జిల్లాలోని తాడేపల్లిగూడెం స్టాకు యార్డుకి ఇసుక చేరవేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా గత నెల 22 నుంచి నిలిచిన తవ్వకాలు మళ్లీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఇసుక ర్యాంపుల్లో పడవ యాజమానులతో కొవ్వూరు ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. వాడపల్లి, ఔరంగబాద్, ఏరినమ్మ, కొవ్వూరు, దండగుండరేవు, ఆరికిరేవుల, దండగుండ రేవు, కొవ్వూరు–1 ర్యాంపుల నిర్వహణ సొసైటీలతో సమీక్షించారు. ర్యాంపులో సామాజిక దూరం పాటించడం, మాస్క్ లు ధరించడం వంటి నిబంధనలు తప్పని సరిగా పాటించాలని సూచించారు. కాగా జిల్లాలో పోలవరం, తాడిపూడి, ప్రక్కిలంక, గుటాల ర్యాంపులు వారం రోజుల క్రితమే తెరిచారు. నాడు–నేడు, ఎన్ఆర్ఈజీఎస్ పనులకు సరఫరా చేస్తున్నారు. జ స్టాకు యార్డుల ఏర్పాటు జిల్లాలో తాడేపల్లిగూడెం స్టాకుయార్డుకి తూర్పు గోదావరి జిల్లా నుంచి మూడు రోజుల్లో 35 వేల టన్నుల ఇసుక తరలించారు. సోమవారం నుంచి ఐ.పంగిడిలో నూతనంగా స్టాకు యార్డు ప్రారంభం కానుంది. రానున్న రోజుల్లో భీమవరం, ఉండి, కాపవరం వంటి స్టాకు యార్డులకు ఇసుక తరలిస్తాం. –కె.మనోరంజన్ రెడ్డి, ఏపీఎండీసీ జిల్లా ఇన్చార్జ్ -
రాయల్ వశిష్ట ఆచూకీ దొరికింది..
-
రేపటి నుంచి ఆపరేషన్ రాయల్ వశిష్ట
సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి): గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటు వెలికితీతకు రేపటి (ఆదివారం) నుంచి ఆపరేషన్ ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లాంచీని వెలికితీస్తామని కొందరు ముందుకు వచ్చారని.. వారు ఇచ్చిన సలహాలపై కమిటీ వేశామన్నారు. కమిటీ సూచన మేరకు కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం(బాలాజీ మెరైన్)కు లాంచీ వెలికితీత పనులు అప్పగించామని వెల్లడించారు. గత పది రోజులకు పైగా లాంచీ మునిగిన ప్రదేశంలో ఈ బృందం ఉండటంతో అక్కడి పరిస్థితులపై వారికి అవగాహన వచ్చిందన్నారు. వెలికితీత కోసం రూ.22.70 లక్షల వర్క్ ఆర్డర్ ఇచ్చామని కలెక్టర్ చెప్పారు. ఆపరేషన్‌లో పాల్గొనే ప్రతిఒక్కరికి రిస్క్ కవరేజ్ ఉండాలని.. పూర్తి భద్రత చర్యలు తీసుకోవాలని సూచించామని తెలిపారు. తాడు సాయంతో లాంచీ వెలికి తీస్తానని సోషల్ మీడియాలో తెలిపిన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన శివ అనే వ్యక్తి కూడా ఈ ఆపరేషన్‌కు సహకరిస్తానని తెలిపారని కలెక్టర్ వెల్లడించారు. ఇంకా ఆచూకీ లభించాల్సిన 15 మంది పర్యాటకుల డెత్ సర్టిఫికెట్ల జారీ కోసం ప్రత్యేక అనుమతులు ఇచ్చామని చెప్పారు. గోదావరిలో ఇంకా రెస్క్యూ బృందాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. -
గంగను తోడేస్తున్నారు..!
బేల: ఈ సారి అసలే వర్షాభావం, ఆపై ఇటీవల నుంచి మండుతున్న ఎండలతో ఇప్పటికే భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలను రూపొందిస్తూ భూగర్భ జలాలను పెంచడానికి కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాయి. ఇంకుడు గుంతలు, చెక్‌డ్యాంలు, చేన్లలో నీటి కుంటలు, తదితర వాటిని ఏర్పాటు చేస్తూ భూగర్భ జలాలను పెంచడానికి ప్రయత్నాలు చేస్తుంటే, మరో పక్క మండలంలోని పెన్‌గంగా నదిలో ఇసుక త్రవ్వకాలు ‘మాముల్’గానే సాగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక మాఫియా విచ్చల విడిగా, ఈ ఇసుకను అక్రమంగా తరలిస్తుండడంతో పెన్‌గంగాలో గుంతలు ఏర్పడుతున్నాయి. ఈ ఇసుకను మండలకేంద్రంతో పాటు జిల్లా కేంద్రంలోని సిమెంటు ఇటుకల కేంద్రాలతో పాటు ఇతరత్ర వ్యాపార కేంద్రాలకు ఈ ఇసుకను తరలిస్తూ, లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు. కానీ సంబంధిత ‘రెవెన్యూ’ శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇదిలాగైతే..మండలంలోని మాంగ్రుడ్, కోగ్ధూర్, గూడ, బెదోడ, సాంగిడి గ్రామాల శివారులకు సమీపాన (మహారాష్ట్ర సరిహద్దుల్లో) పెన్‌గంగా నది ప్రాంతం ఉంటుంది. ఇందులో కోగ్ధూర్, బెదోడ గ్రామాల శివారులోని పెన్‌గంగా ప్రాంతం బాగా ఎత్తుగా ఉండడంతో వాహనాల రాకపోకలకు అవకాశం ఉండదు. కాగా మిగితా మాంగ్రుడ్, గూడ, సాంగిడి గ్రామాల శివారుల్లో ఇసుక త్రవ్వకాలకు వీలు ఉంటుంది. దీంతో అత్యధికంగా ఈ మూడు ప్రాంతాల్లోని పెన్‌గంగాలో కూలీలే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రొక్లెయిన్, డోజర్లతో అక్రమ ఇసుక త్రవ్వకాలు యథేచ్ఛగా చేపడుతున్నారు. రాత్రి వేళల్లోనూ జోరు.. రాత్రి వేళల్లోనూ ఈ ఇసుక త్రవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయి. పగలు వేళల్లో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను పెన్‌గంగా ఒడ్డును దాటించి, గ్రామ శివారుల్లోని ప్రాంతాల్లోని చాలా చోట్ల ఇసుక నిల్వలను వేయిస్తున్నారు. ఇక్కడ నుంచి ఈ ఇసుకను ప్రత్యేకంగా రాత్రివేళల్లో అక్రమంగా తరలిస్తున్నారు. రాత్రివేళ ఇలా ఇసుక తరలింపుతో ట్రాక్టర్ల రాకపోకల శబ్ధాలతో తీవ్రంగా ఇబ్బందులు పడక తప్పడం లేదని కాఫ్రి, బెదోడ, మణియార్‌పూర్, గూడ, దహెగాం, కొబ్బాయి గ్రామాల ప్రజలు అంటున్నారు. ఈ తరలింపుపై పలువురు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా, ఏమాత్రం పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఇసుక త్రవ్వకాలను కట్టడి చేయకుంటే రాబోయే రోజుల్లో భూగర్భజలాలు తగ్గి, త్రాగు నీళ్లకు ఇబ్బంది ఏర్పడే ప్రమాదముందని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వ పనులకు ఈ ఇసుకను తీసుకెళ్తున్నారంటూ, ఈ త్రవ్వకాలపై రెవెన్యూ అధికారులు ‘మాముల్’గానే వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి, ఇసుక త్రవ్వకాలను ఎంతైనా కనీసం రాత్రివేళైనా అరికట్టాల్సి ఉందని మండల వాసులు అంటున్నారు. ఇసుక అక్రమ తరలింపు విషయమై మండల తహసీల్దార్ సుగుణాకర్ రెడ్డిని ‘సాక్షి’ ఫోన్లో వివరణ కోరగా..ఇప్పటిదాకా ఈ ఇసుక తరలింపు విషయం మా దృష్టికి రాలేదని పేర్కొన్నారు. మా దృష్టికి వచ్చినట్లైతే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఖననం చేసిన మృతదేహం వెలికితీత
చాగల్లు : ప్రేమ పేరుతో వంచనకు గురై తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తల్లి అనుమానం వ్యక్తం చేయడంతో ఖననం చేసిన మృతదేహాన్ని పోలీసులు శనివారం వెలికి తీయించి పోస్ట్‌మార్టం చేయిం చారు. వివరాలిలా ఉన్నాయి.. చా గల్లు మండలం ఊనగట్ల గ్రామానికి చెందిన తొర్లపాటి విమల (19) ఈనెల 23న ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదే రోజు ఆమెను గ్రామంలోని శ్శశానంలో ఖననం చేశారు. విమల ఇటీవల ఇంటర్ పరీక్షలు రాసింది. 22 న రాత్రి ఇంటికి ఆలస్యంగా రావడంతో తల్లి సుభద్ర మందలిం చింది. మరునాడు ఉదయం తల్లి పనికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో చీరతో ఊరేసుకుని విమల ఆత్మహత్యకు పాల్ప డింది. ఈ నెల 24న ఆమె పుస్తకాల్లో సూసైట్‌నోట్ కనిపిం చింది. దీనిలో గ్రామానికి చెందిన నూతంగి జయంత్, విమల ప్రేమిం చుకున్నారని, విమలను జయంత్ మోసం చేసి మరో యువతిని పెళ్లిచేసుకున్నట్టు ఉంది. దీంతో తల్లి సుభ్రద శనివారం చాగల్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఖననం చేసిన విమల మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి తహసీల్దార్ ఎం.మెరికమ్మ సమక్షంలో శవపంచనామా చే శారు. అనంతరం నిడదవోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇన్చార్జ్ ఎస్సై భగవాన్‌ప్రసాద్ ఆధ్వర్యంలో ఏఎస్సై ఎం.ధనరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ప్రేమ పేరుతో వంచించాడు తన కుమార్తె విమలను అల్లారుముద్దుగా పెంచుకున్నానని, ప్రేమ పేరుతో జయంత్ వంచించి, శారీరకంగా అనుభవించి మోసం చేశాడని సుభద్ర ఆరోపించింది. జయంత్ మరో యువతిని వివాహం చేసుకోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిందని కన్నీరుమున్నీరుగా విలపించింది. -
పాతిపెట్టిన మృతదేహం వెలికితీత
యాడికి: యాడికిలో పాతిపెట్టిన చౌడేశ్వరి కాలనీకి చెందిన నాగార్జున(36) మృతదేహాన్ని పోలీస్, రెవెన్యూ అధికారులు మంగళవారం వెలికితీయించారు. కాలనీకి చెందిన నాగార్జున ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలనే విషయం తెలియని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ కత్తి శ్రీనవాసులు, సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. ఘటనపై ఆరా తీశారు. ఆ తరువాత తహశీల్దార్ కుమారస్వామి, వీఆర్ఓ పవిత్ర సమక్షంలో పంచనామా నిర్వహించారు. డాక్టర్ పుల్లయ్యను అక్కడికే పిలిపించి పోస్టుమార్టం చేయించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. -
పూడ్చిన శవం వెలికితీత
♦ తల్లి మృతిపై అనుమానం వ్యక్తం చేసిన కూతుళ్లు ♦ బస్వాపూర్‌లో వెలుగు చూసిన సంఘటన ములుగు : పూడ్చిపెట్టిన మహిళ శవాన్ని పోలీసులు వెలికి తీసిన సంఘటన ములుగు మండలం బస్వాపూర్ గ్రామంలో సోమవారం జరిగింది. తమ తల్లి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఆమె కూతుళ్లు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ములుగు పోలీసులు సోమవారం మృతదేహాన్ని తీశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పదిరోజుల క్రితం జరిగిన మహిళ మృతికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చెలిమల లక్ష్మమ్మ(75) భర్త శంకరయ్య గతంలోనే మరణించడంతో కుమారుడు రాజయ్య వద్ద ఉంటోంది. అయితే కిడ్నీలు పాడైపోవడంతో రాజయ్య గత ఆరునెలలుగా బాధ పడుతున్నాడు. వ్యాధి నయం చేయించుకునేందుకు ఇటీవల రాజయ్య తనకున్న కొద్దిపాటి భూమిని అమ్ముకోవడంతో కొద్ది మొత్తంలో డబ్బులు వచ్చాయి. ఈ డబ్బుల విషయంలో రాజయ్య చెల్లెళ్లు సుగుణ, ముత్యాలమ్మల మధ్య గొడవ జరిగింది. ఇంతలో ఏమయిందో తెలియదు కానీ ఈ నెల 19న లక్ష్మమ్మ మృతి చెందింది. దీంతో తమ తల్లి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఈ నెల 25న లక్ష్మమ్మ కుమార్తెలు సుగుణ, ముత్యాలమ్మ ఎస్పీకీ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ములుగు తహశీల్దార్ శకుంతలరెడ్డి సమక్షంలో పోలీసులు శవ పంచనామా నిర్వహించారు. గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన డాక్టర్ బాలకృష్ణ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.