యాడికిలో పాతిపెట్టిన చౌడేశ్వరి కాలనీకి చెందిన నాగార్జున(36) మృతదేహాన్ని పోలీస్, రెవెన్యూ అధికారులు మంగళవారం వెలికితీయించారు.
యాడికి: యాడికిలో పాతిపెట్టిన చౌడేశ్వరి కాలనీకి చెందిన నాగార్జున(36) మృతదేహాన్ని పోలీస్, రెవెన్యూ అధికారులు మంగళవారం వెలికితీయించారు. కాలనీకి చెందిన నాగార్జున ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలనే విషయం తెలియని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు.
సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ కత్తి శ్రీనవాసులు, సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. ఘటనపై ఆరా తీశారు. ఆ తరువాత తహశీల్దార్ కుమారస్వామి, వీఆర్‌ఓ పవిత్ర సమక్షంలో పంచనామా నిర్వహించారు. డాక్టర్ పుల్లయ్యను అక్కడికే పిలిపించి పోస్టుమార్టం చేయించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.