ప్రవీణ్ కుమార్(PC: IPL)
Praveen Kumar: బ్యాటర్ల పండుగా పిలిచే ఐపీఎల్‌లో బౌలర్లు రికార్డులు సాధించడం చాలా అరుదుగా కనిపిస్తుంది. 14 ఎడిషన్ల ఐపీఎల్ జర్నీలో బౌలర్లు రాణించిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. ఇలాంటి బ్యాటర్ల ఆధిపత్యం ఉన్న క్యాష్ రిచ్ లీగ్‌లో ఓ బౌలర్ ఊహకందని అద్భుత రికార్డును చాలాకాలంగా తన పేరిట భద్రపరుచుకున్నాడు. ఆ రికార్డు ఏంటంటే.. టీ20ల్లో ఒక్క డాట్ బాల్ వేయడమే గగనమనుకుంటే ఓ బౌలర్ తన ఐపీఎల్ కెరీర్‌లో ఏకంగా 14 మెయిడిన్లు వేసి ఔరా అనిపించాడు.
ఐపీఎల్‌లో వివిధ జట్ల తరఫున 119 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్.. 14 మెయిడిన్ ఓవర్లు వేసి, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. అతని తర్వాత టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ (103 మ్యాచ్‌ల్లో 10 మెయిడిన్లు), భువనేశ్వర్ కుమార్ (132 మ్యాచ్‌ల్లో 9 మెయిడిన్లు), ధవల్ కులకర్ణి (92 మ్యాచ్‌ల్లో 8 మెయిడిన్లు), లసిత్ మలింగ (122 మ్యాచ్‌ల్లో 8 మెయిడిన్లు), సందీప్ శర్మ (8 మెయిడిన్లు), డేల్ స్టెయిన్ (7), హర్భజన్ సింగ్ (6), జస్ప్రీత్ బుమ్రా (6), దీపక్ చాహర్ (6), అమిత్ మిశ్రా (6), ఇషాంత్ శర్మ (6) వరుస స్థానాల్లో ఉన్నారు.
చదవండి: ఐపీఎల్‌కు ముందు పెళ్లి పీటలెక్కిన మరో స్టార్ క్రికెటర్.. ఎవరంటే..?
Comments
Please login to add a commentAdd a comment