క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఐపీఎల్ 2022 సీజన్ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. సింగిల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డును (1000) 15వ ఐపీఎల్ ఎడిషన్ సొంతం చేసుకుంది. ఆదివారం సన్‌రైజర్స్-పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదైంది. పంజాబ్ హిట్టర్ లివింగ్‌స్టోన్ సిక్సర్‌తో (1000వ సిక్సర్) ఐపీఎల్ 2022 సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఈ స్థాయిలో సిక్సర్లు నమోదవడం ఇదే తొలిసారి.
1000 sixes hit in this season of tata ipl.97 metre six by Liam Livingstone.First time in the history of ipl.Most sixes in any ipl season
— Shreyans Subham (@ShreyansSubham2) May 22, 2022
1)1001* in ipl 2022(still playoffs left)
2)872 in ipl 2018 pic.twitter.com/HJAgD2rSR6
అంతకుముందు 2018 సీజన్‌లో నమోదైన 872 సిక్సర్లు ఈ సీజన్ ముందు వరకు అత్యధికం కాగా, ప్రస్తుత సీజన్‌లో ఆ రికార్డు బద్దలైంది. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్, ఫైనల్ కలిపి మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో మరో వంద సిక్సర్లు నమోదయ్యే అవకాశముంది. ఈ సీజన్ తొలి సిక్సర్‌ను సీఎస్‌కే బ్యాటర్ రాబిన్ ఉతప్ప బాదగా.. థౌజండ్ వాలా సిక్సర్‌ను లివింగ్‌స్టోన్ పేల్చాడు. ఈ సీజన్ లాంగెస్ట్ సిక్సర్ రికార్డు కూడా లివింగ్‌స్టోన్ పేరిటే నమోదై ఉండటం విశేషం.
సీజన్ల వారీగా సిక్సర్ల వివరాలు:
2022 : 1001 (అత్యధికం)
2018 : 872
2009 : 506 (అత్యల్పం)
2022 సీజన్‌లో లాంగెస్ట్ సిక్సర్లు:
లివింగ్‌స్టోన్ : 117 మీటర్లు
టిమ్ డేవిడ్: 114 మీటర్లు
డెవాల్డ్ బ్రెవిస్ : 112 మీటర్లు
చదవండి: పంత్‌ను ఏకి పారేసిన రవిశాస్త్రి.. బ్రెయిన్ దొబ్బిందా అంటూ ఘాటు వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment