IPL Sixes Records In History: IPL 2022 Becomes Season With Most Sixes, Check Top Sixes Details - Sakshi
Sakshi News home page

Most Sixes In IPL 2022: బౌలర్ల పాలిట సింహ స్వప్నాల్లా మారిన బ్యాటర్లు.. ఐపీఎల్‌ 2022 పేరిట అరుదైన రికార్డు

Published Tue, May 17 2022 10:34 AM | Last Updated on Tue, May 17 2022 2:36 PM

IPL 2022 Records Most Sixes In A Single Edition - Sakshi

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో బ్యాటర్ల హవా కొనసాగుతుంది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో బ్యాటర్లు ఏయేటికాయేడు రెచ్చిపోతున్నారు. బౌలింగ్‌లో అడపాదడపా ప్రదర్శనలు నమోదవుతుంటే.. బ్యాటింగ్‌లో మాత్రం రికార్డులు బద్ధలవుతున్నాయి. బౌలర్ల పాలిట సింహస్వప్నాల్లా మారిన బ్యాటర్లు.. సిక్సర్ల విషయంలో పోటీపడిమరీ ఇరగదీస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత సీజన్‌ పలు భారీ సిక్సర్ల రికార్డులు కనుమరుగయ్యాయి.

అలాగే, సిక్సర్ల విషయంలో ప్రస్తుత ఐపీఎల్‌ ఎడిషన్‌ ఓ ఆల్‌టైమ్‌ రికార్డును నమోదు చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు (ఢిల్లీ-పంజాబ్‌ మ్యాచ్ వరకు) జరిగిన మ్యాచ్‌ల్లో ఏకంగా 896 సిక్సర్లు నమోదయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో ఓ సీజన్‌లో ఇన్ని సిక్సర్లు నమోదవడం ఇదే తొలిసారి.  అంతకుముందు 2018లో నమోదైన 872 సిక్సర్లు ఈ సీజన్‌ ముందు వరకు అత్యధికం కాగా, ప్రస్తుత సీజన్‌లో ఆ రికార్డు బద్దలైంది.

బ్యాటర్లు ఇదే జోరు కొనసాగిస్తే.. ఈ సీజన్‌లో 1000 సిక్సర్లు నమోదవడం ఖాయంగా కనిపిస్తుంది. 64 మ్యాచ్‌ల్లోనే 896 సిక్సర్లు బాదిన బ్యాటర్లకు మరో 10 మ్యాచ్‌ల్లో (ఫైనల్‌ వరకు) 104 సిక్సర్లు కొట్టడం పెద్ద విషయమేమీ కాదు.

సీజన్ల వారీగా సిక్సర్ల  వివరాలు:

2022 : 896 (అత్యధికం)
2018 : 875
2009 : 506 (అత్యల్పం)

2022 సీజన్‌లో లాంగెస్ట్ సిక్సర్లు: 

లివింగ్ స్టోన్ : 117 మీటర్లు
డెవాల్డ్ బ్రెవిస్ : 112 మీటర్లు 
లివింగ్ స్టోన్ : 108 మీటర్లు
పూరన్ : 108 మీటర్లు
జోస్ బట్లర్ : 107 మీటర్లు
చదవండి: బౌలర్‌ను చూసి బ్యాటింగ్‌ ఎండ్‌ మార్చుకున్న వార్నర్‌.. తొలి బంతికే ఔట్‌..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement