అబుజా: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫైయర్ మ్యాచుల్లో పలు రికార్డులు నమోదు అవుతున్నాయి. కామెరూన్‌కు చెందిన మేవా డౌమా తన అంతర్జాతీయ అరంగేట్ర మ్యాచ్‌లో నాలుగు మన్కడింగ్‌లు చేసి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే కామెరూన్, నైజీరియా జట్ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌లో తాజాగా మరో రికార్డు నమోదైంది. నైజీరియా బౌలర్ బ్లెస్సింగ్ ఎటిమ్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా నాలుగు మెయిడెన్లు వేసి, నాలుగు వికెట్లు సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కామెరూన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లో కేవలం 47 పరుగులకే కూప్పకులిపోయింది.
కామెరూన్ బ్యాట్స్‌ఉమెన్‌లో 23 పరుగులు సాదించి నాంటియా కెన్‌ఫెక్ టాప్ స్కోరర్‌గా నిలిచింది. నైజీరియా బౌలర్ ఎటిమ్ నాలుగు వికెట్లు సాధించి కామెరూన్ నడ్డి విరిచింది. అలాగే మిరాకిల్ ఇమ్మోల్, మేరీ డెస్మండ్ చెరో రెండు వికెట్లు సాధించారు. అనంతరం 48 పరగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన నైజీరియా కేవలం 6.3 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేధించింది.
చదవండి: MS Dhoni: పాకిస్తాన్‌పై చారిత్రత్మక విజయానికి నేటికి 14 ఏళ్లు..
Comments
Please login to add a commentAdd a comment