Wicket
-
బ్యాటింగ్ చేసేది గిల్ అయితే కీపింగ్ చేసేది ధోని...
-
మ్యాచ్ ఓడిపోయుండొచ్చు.. అతని వికెట్‌తో కల నెరవేరింది
వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను టీమిండియా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో టీమిండియా బ్యాటింగ్‌లో కొందరు క్లిక్ అయితే.. మరికొందరు విఫలమయ్యారు. ఈ మధ్యనే అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా పక్కకు తప్పుకున్న కోహ్లి విండీస్‌తో రెండు వన్డేల్లోనూ విఫలమయ్యాడు. తొలి వన్డేలో 8 పరుగులు చేసిన కోహ్లి.. రెండో వన్డేలో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా రెండో వన్డేలో విండీస్ తరపున రీఎంట్రీ ఇచ్చిన ఓడియన్ స్మిత్ బౌలింగ్‌లోనే కోహ్లి వెనుదిరిగాడు. కోహ్లి వికెట్‌తో పాటు కీలకమైన పంత్ వికెట్‌ను కూడా స్మిత్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌గా మ్యాచ్‌లో ఏడు ఓవర్లు వేసిన ఓడియన్ స్మిత్ 29 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో స్మిత్ కోహ్లి వికెట్ తీయడంపై ట్విటర్ ద్వారా స్పందించాడు. ' వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్ అయిన కోహ్లి వికెట్ తీయడం నాకు కలగా ఉండేది. నిన్నటి మ్యాచ్‌తో అది నెరవేరింది.' అని చెప్పుకొచ్చాడు. ఇక శుక్రవారం జరగనున్న మూడో వన్డేకు టీమిండియా జట్టులో పలు మార్పులు ఉండే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్‌తో పాటు రవి బిష్ణోయికి జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు విండీస్ మాత్రం కనీసం మూడో వన్డే గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. చదవండి: అతిథిలా వచ్చి ఆటగాళ్లను పరుగులు పెట్టించింది 'అది నీ తప్పు కాదు'.. ఇషాన్ కిషన్‌తో మెసేజ్ -
4 ఓవర్లు.. 4 మెయిడెన్స్..4 వికెట్లు.. చెలరేగిన మహిళా బౌలర్
అబుజా: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫైయర్ మ్యాచుల్లో పలు రికార్డులు నమోదు అవుతున్నాయి. కామెరూన్‌కు చెందిన మేవా డౌమా తన అంతర్జాతీయ అరంగేట్ర మ్యాచ్‌లో నాలుగు మన్కడింగ్‌లు చేసి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే కామెరూన్, నైజీరియా జట్ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌లో తాజాగా మరో రికార్డు నమోదైంది. నైజీరియా బౌలర్ బ్లెస్సింగ్ ఎటిమ్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా నాలుగు మెయిడెన్లు వేసి, నాలుగు వికెట్లు సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కామెరూన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లో కేవలం 47 పరుగులకే కూప్పకులిపోయింది. కామెరూన్ బ్యాట్స్ఉమెన్లో 23 పరుగులు సాదించి నాంటియా కెన్‌ఫెక్ టాప్ స్కోరర్‌గా నిలిచింది. నైజీరియా బౌలర్ ఎటిమ్ నాలుగు వికెట్లు సాధించి కామెరూన్ నడ్డి విరిచింది. అలాగే మిరాకిల్ ఇమ్మోల్, మేరీ డెస్మండ్ చెరో రెండు వికెట్లు సాధించారు. అనంతరం 48 పరగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన నైజీరియా కేవలం 6.3 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేధించింది. చదవండి: MS Dhoni: పాకిస్తాన్‌పై చారిత్రత్మక విజయానికి నేటికి 14 ఏళ్లు.. -
ఆ క్షణం ఎంతో మధురం...
అబుదాబి: చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ధోని వికెట్‌ను దక్కించుకోవడం మధురమైన క్షణమని కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అన్నాడు. బుధవారం నాటి మ్యాచ్‌లో కీలక సమయంలో ధోనిని బౌల్డ్ చేసిన వరుణ్ మ్యాచ్‌ను కోల్‌కతా వైపు తిప్పాడు. మ్యాచ్ అనంతరం సహచరుడు రాహుల్ త్రిపాఠితో మాట్లాడుతూ వరుణ్ ఆ సంగతిని గుర్తు చేసుకున్నాడు. ‘మూడేళ్ల క్రితం కేవలం ధోని బ్యాటింగ్ చూసేందుకే చెపాక్ స్టేడియానికి వెళ్లేవాడిని. ఇప్పుడు అతని ప్రత్యర్థిగా ఆడుతున్నా. దీన్ని నమ్మలేకపోతున్నా. జట్టును గెలిపించేందుకు మహి భాయ్ పోరాడుతున్నాడు. మంచి లెంగ్త్‌లో బంతిని సంధిస్తే అతని వికెట్ దక్కించుకోవచ్చు అని ఆశించా. అలాగే చేసి వికెట్ సాధించా. మ్యాచ్ తర్వాత ధోని సర్‌తో ఫొటో కూడా తీసుకున్నా’ అని వరుణ్ చెప్పుకొచ్చాడు. -
కోహ్లి వికెట్ తీస్తేనే మజా: బౌల్ట్
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకోవాలని చూస్తున్నాడు. ఈనెల 21న మొదలయ్యే తొలి టెస్టులో నంబర్‌వన్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి వికెట్ తీస్తేనే అసలైన మజా ఉంటుందని చెప్పాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ‘బాక్సింగ్ డే’ టెస్టులో బౌల్ట్ కుడి చేతికి గాయమైంది. దీంతో అతను ఆరు వారాల పాటు ఆటకు దూరమయ్యాడు. భారత్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లలో పాల్గొనలేకపోయాడు. ఇప్పుడు సంప్రదాయ క్రికెట్‌తో మళ్లీ తాజాగా బరిలోకి దిగబోతున్న బౌల్ట్ మీడియాతో మాట్లాడుతూ... ‘కోహ్లి అసాధారణ బ్యాట్స్‌మన్. తన గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. అతనెంతటి గొప్ప ఆటగాడో అందరికీ తెలుసు. అలాంటి మేటి బ్యాట్స్‌మన్‌ని అవుట్ చేయడం ద్వారా నా సత్తాను నేనే పరీక్షించుకుంటాను. అందుకే మ్యాచ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను’ అని అన్నాడు. ఐదు రోజుల ఆట కోసం బాగా సన్నద్ధమయ్యానని చెప్పాడు. వెల్లింగ్టన్లో ఆడటం తనకెంతో ఇష్టమని అన్నాడు. భారత్ చేతిలో సొంతగడ్డపై టి20ల్లో క్లీన్‌స్వీప్ (0–5) కావడం బాధించిందని... అయితే తమ జట్టు వన్డే సిరీస్‌ను వైట్‌వాష్ చేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకుందని చెప్పాడు. 65 టెస్టులాడిన ఈ లెఫ్టార్మ్ పేసర్ 256 వికెట్లు తీశాడు. -
ఆ ఔట్‌ను చూసి నవ్వుకుంటాం
-
అర్జున్ టెండూల్కర్ బోణీ కొట్టాడు..
కొలంబొ: టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ టెండూల్కర్ తన అంతర్జాతీయ తొలి వికెట్‌ను సాధించాడు. శ్రీలంకతో రెండు టెస్టులు ఆడనున్న భారత అండర్-19 జట్టులో అర్జున్ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. మంగళవారం శ్రీలంకతో తొలి టెస్టులో భాగంగా భారత్ తరపున ఈ లెఫ్టార్మ్ పేసర్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్ చేపట్టింది. టీమిండియా అండర్-19 సారథి అనుజ్ రావత్ బౌలింగ్ దాడి అర్జున్‌తో ప్రారంభించాడు. తొలి ఓవర్లో ఒక ఫోర్‌తో సహా ఆరు పరుగులిచ్చిన ఈ పేసర్ తన తరువాతి ఓవర్లో లంక ఓపెనర్ ఆర్వీపీకే మిశ్రా (9) వికెట్ సాధించాడు. దీంతో అర్జున్ టెండూల్కర్ తన తొలి అంతర్జాతీయ వికెట్ సాధించాడు. ఇక మిగతా బౌలర్లు హర్ష్ త్యాగి (4/92), ఆయూష్ బడొని (4/24) చెలరేగడంతో లంక తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్జున్ 33 పరుగులిచ్చి ఒక్క వికెట్ సాధించాడు. వినోద్కాంబ్లి అనందభాష్పాలు అర్జున్ టెండూల్కర్ తొలి వికెట్ సాధించడం పట్ల టీమిండియా మాజీ ఆటగాడు, సచిన్ బాల్య స్నేహితుడు వినోద్ కాంబ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ యువ ఆటగాడికి శుభాకాంక్షలు తెలపుతూ భావోద్వేగంగా ట్వీటర్లో ట్వీట్ చేశాడు. ‘అర్జున్ వికెట్ తీయడం చూసి ఆనందభాష్పాలతో నా నోట మాట రావడం లేదు. నీ ఆట చూస్తుంటే నువ్వు పడిన కష్టం కనబడుతోంది. ఈ వికెట్‌తోనే సంతోషపడకు.. ఇది కేవలం ప్రారంభమాత్రమే. నువ్వు సాధించాల్సిన విజయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. తొలి వికెట్ ఆనందాన్ని ఆస్వాదించు’ అంటూ కాంబ్లీ ట్వీట్ చేశాడు. Tears of joy rolled down when I saw this, have seen him grow up and put in the hard work in his game. Could not be more happy for you, Arjun. This is just the beginning, I wish you tons and ton of success in the days to come. Cherish your first wicket and enjoy the moment.👌 pic.twitter.com/vB3OmbaTWM — VINOD KAMBLI (@vinodkambli349) July 17, 2018 -
కోహ్లి వికెట్‌ను గుర్తుంచుకుంటా: ఫిలాండర్
కేప్‌టౌన్ టెస్టులో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిని అవుట్ చేసిన క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ ఫిలాండర్ తెలిపాడు. ‘కోహ్లి దూకుడైన ఆటగాడు. ముందుగా అతడి ఆట కట్టించాలనుకున్నాం. ఆ అవకాశం నాకే దక్కింది. దీనిని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటా’ అని ఫిలాండర్ అన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి క్రీజ్‌లో ఉన్నపుడు టీమిండియా స్కోరు 71/3... విజయానికి చేయాల్సింది ఇంకా 137 పరుగులే. అప్పటివరకు రెండు స్పెల్స్‌లో విరాట్‌కు ఆఫ్ స్టంప్‌పై 13 బంతులు విసిరిన ఫిలాండర్... ఒక బంతిని మాత్రం లోపలకు సంధించాడు. దానిని ఫ్లిక్ చేయబోయిన కోహ్లి వికెట్ల ముందు దొరికిపోయాడు. -
అదరహో అశ్విన్...
నిలకడైన ప్రదర్శనకు మారుపేరుగా మారిన ఆఫ్ స్పిన్నర్ భారత విజయాల్లో కీలకపాత్ర ఒక రికార్డుతో ఇమ్రాన్‌ఖాన్‌లాంటి దిగ్గజాన్ని దాటేశాడు. మరో రికార్డుతో మాల్కం మార్షల్‌లాంటి మరో లెజెండ్‌ను మరిపించాడు. కుంబ్లేకు, హర్భజన్‌కు కూడా సాధ్యం కాని అనేక గణాంకాలు అలవోకగా వచ్చి చేరుతున్నారుు. అతనిని వదిలి పెట్టలేమన్నట్లుగా అంకెలు అతనితో అనుబంధాన్ని పెనవేసుకుంటున్నారుు! భారత్‌లో భారత్ టెస్టు సిరీస్ గెలవడం, స్పిన్నర్లు గెలిపించడం మొదటిసారి కాదు, ఆ విజయాలు మనకు కొత్త కాదు. కానీ ఇలా చేతి నుంచి బంతి దాటడమే ఆలస్యం... అలా వికెట్లు అతని ఒళ్లో వాలిపోతున్నారుు. రవిచంద్రన్ అశ్విన్ చేస్తున్న మాయాజాలానికి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ పాహిమాం అంటున్నారు. సూర్యుడు తూర్పున ఉదరుుంచడంలాంటిదే ఇన్నింగ్సలో అశ్విన్ ఐదు వికెట్లు తీయడం అంటూ అతనిపై అభినందనలు కురుస్తుంటే... అతిశయోక్తిగా అనిపించినా చావుపుట్టుకలు ఎంత సహజమో అశ్విన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కావడం అంతే సహజమంటూ మరో మాజీ క్రికెటర్ తనదైన భావాన్ని ప్రదర్శించాడు. ఐదేళ్ల స్వల్ప కెరీర్లోనే ఎవరికీ అందనంత ఎత్తులో అతని రికార్డులు నిలుస్తుండగా, ఇదే తరహాలో జోరు కొనసాగితే వేరుు వికెట్ల మైలురారుు కూడా చిన్నదిగా మారిపోతుందేమో! ఇప్పటికే వరుసగా నాలుగు జట్లు ఈ చెన్నై స్టార్ దెబ్బ రుచి చూశారుు. ఇక ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలకు ప్రమాద హెచ్చరిక జారీ అరుునట్లే! సాక్షి క్రీడా విభాగం దాదాపు మూడేళ్ల క్రితం జొహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో అశ్విన్ 42 ఓవర్లు పాటు బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఆ దెబ్బకు భారత్ ఆడిన తర్వాతి ఏడు టెస్టుల్లో అతనికి చోటు లభించలేదు. అరుుతే ఈ వైఫల్యం నుంచి అతను పాఠాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత తన యాక్షన్‌లో స్వల్ప మార్పులు చేసుకున్నాడు. క్యారమ్ బాల్‌పై అమితంగా ఆధారపడకుండా రెగ్యులర్ ఆర్మ్ బాల్‌పైనే ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. ఆ తర్వాత జట్టులోకి తిరిగొచ్చిన తర్వాత అశ్విన్‌కు ఎదురు లేకుండా పోరుుంది. అశ్విన్ ఇంజినీరింగ్ బుర్ర కూడా అద్భుతాలు సృష్టించడంలో బాగా పని చేసింది. అప్పటి వరకు హర్భజన్ తర్వాత మాత్రమే ప్రత్యామ్నాయ స్పిన్నర్‌గా అవకాశాలు దక్కించుకుంటూ వచ్చిన అశ్విన్, ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లిపోయాడు. వికెట్లలో, రికార్డులలో భజ్జీని వెనక్కి తోస్తూ ఆల్‌టైమ్ బెస్ట్ స్పిన్నర్లలో ఒకడిగా నిలిచేందుకు కావాల్సిన అర్హతను అందుకున్నాడు. వేదిక ఏదైనా... ‘ప్రస్తుతం స్పిన్నర్ల కోసమే తయారు చేస్తున్న పిచ్‌లను మేం ఆడినప్పుడు రూపొందిస్తే నా వికెట్లు, కుంబ్లే వికెట్ల సంఖ్య ఎక్కడో ఉండేది’ హర్భజన్ సింగ్ చేసిన తాజా వ్యాఖ్య ఇది. విశ్లేషణకంటే ఒక రకమైన అసూయ, ఒక ఆఫ్ స్పిన్నర్‌గా తనను అశ్విన్ దాటేసి వెళుతున్నాడనే బాధ ఈ మాటల్లో ఎక్కువగా కనిపిస్తోంది. కొన్నాళ్ల క్రితం వరకు కూడా ఇందులో వాస్తవం ఉంది. అశ్విన్ అద్భుత బౌలింగ్ అంటూ బ్రాకెట్లో పిచ్ షరతులు వర్తిస్తారుు అంటూ జోక్ చేసిన రోజులు కూడా ఉన్నారుు. కానీ ఇప్పుడు అది పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే చివరి టెస్టు జరిగిన ఇండోర్ వికెట్ స్పిన్‌కు పెద్దగా అనుకూలించలేదు. అనూహ్యంగా టర్న్లాంటివి దొరకలేదు. అరుునా సరే అశ్విన్ తనదైన శైలిలో చెలరేగిపోయాడు. గత దక్షిణాఫ్రికా సిరీస్ సమయంలో పిచ్‌లపై విమర్శలు వచ్చిన విషయం వాస్తవమే అరుునా... న్యూజిలాండ్ వైపు నుంచి కూడా పిచ్‌ల గురించి ఎలాంటి ఫిర్యాదు లేదు. పైగా అశ్విన్ తీసిన వికెట్లు చూస్తే పిచ్ అనుకూలతకంటే అతని తెలివితేటలే ఎక్కువగా కనిపిస్తారుు. కోహ్లి చెప్పినట్లు ‘పిచ్ ఒక్కటే వికెట్లు అందించదు, బౌలర్లో కూడా సత్తా ఉండాలి. బంతిని భుజం నుంచి వదిలేటప్పుడే మనం ఏం చేయాలనేది బుర్రలో ఉండాలి. అప్పుడే పిచ్‌పై పడిన తర్వాత బంతి స్పందిస్తుంది’. ఈ రకంగా చూస్తే అశ్విన్ పక్కా ప్లానింగ్ అతని ప్రదర్శనలో కీలకమని అర్థమవుతుంది. ఇటీవల నాటి పేస్ వికెట్లు లేకపోరుునా... సంప్రదాయంగా స్పిన్‌కు అంతగా అనుకూలించని వెస్టిండీస్‌లో కూడా అశ్విన్ తాజా సిరీస్‌లో 17 వికెట్లు తీయగలిగాడు. అంటే అతని ఆట ఎంతో మెరుగైందనే విషయం మాత్రం వాస్తవం. కుదేలైన కివీస్... రెండు సార్లు మ్యాచ్‌లో పది వికెట్లు, మూడు సార్లు ఇన్నింగ్సలో ఐదు వికెట్లు, కేవలం 17.77 సగటుతో 27 వికెట్లు... తాజాగా న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అశ్విన్ అద్భుత గణాంకాలివి. కేవలం మూడు టెస్టుల్లో 27 వికెట్లతో అతను సత్తా చాటాడు. సుదీర్ఘ స్పెల్‌ల పాటు బౌలింగ్ చేయడం, కెప్టెన్ కోహ్లి ఆశించిన సమయంలో, కీలకమైన క్షణంలో వికెట్ తీసి మ్యాచ్‌ను మళ్లీ మన చేతుల్లోకి తీసుకు రావడం రొటీన్‌గా సాగిపోరుుంది. కాస్తరుునా మెరుగైన ప్రదర్శన ఇద్దామని భారత్‌లో అడుగు పెట్టిన న్యూజిలాండ్‌ను అశ్విన్ దారుణంగా దెబ్బ తీశాడు. మూడు టెస్టుల్లో కొన్ని సందర్భాల్లో కివీస్‌కు ఆధిపత్యం ప్రదర్శించే మంచి అవకాశాలు లభించినా అశ్విన్ వల్లే మన జట్టు కోలుకోగలిగింది. ఇండోర్ టెస్టు తొలి ఇన్నింగ్సలో అతని బౌలింగ్ జోరు చూస్తే పది వికెట్లు అతనికే దక్కుతాయేమోనని అనిపించింది. దిగ్గజ క్రికెటర్ సంగక్కర సొంతగడ్డపై వరుసగా నాలుగు సార్లు అశ్విన్‌కే అవుటైతే, ప్రస్తుతం ప్రపంచ టాప్ బ్యాట్స్‌మెన్‌లో ఒకడైన విలియమ్సన్ కూడా నాలుగు సార్లు తన వికెట్ అశ్విన్‌కే అప్పగించాడు. ఈ రెండింటికి మధ్య మరో టెస్టు స్టార్ హషీం ఆమ్లా కూడా అతని దెబ్బకే తలవంచాడు. 2013లో 0-4తో చిత్తుగా ఓడిన ఆసీస్, ఇప్పటికే అశ్విన్ బౌలింగ్ రుచి చూసింది. అంతకుముందు ఏడాది అశ్విన్‌ను సమర్థంగా ఎదుర్కోవడం వల్లే ఇంగ్లండ్ మన గడ్డపై సిరీస్ గెలవగలిగింది. ఇప్పుడు ఈ రెండు టీమ్‌లు మళ్లీ మన వద్దకు వస్తున్నారుు. ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. సొంతగడ్డపై మరో 10 టెస్టులు వరుసగా ఆడనుండటంతో అశ్విన్ రికార్డుల బాక్స్‌లు బద్దలు చేయడం మాత్రం ఖాయం. ఘనతల గని... 7 అశ్విన్ కెరీర్లో (39 టెస్టులు) ఇది ఏడో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు. అతనికంటే ముందు ఇన్ని సిరీస్ అవార్డులు అందుకోవడానికి ఇమ్రాన్‌ఖాన్‌కు 70 టెస్టులు పట్టారుు. అశ్విన్ అరంగేట్రం తర్వాత భారత్ 8 టెస్టు సిరీస్‌లు గెలిస్తే 7సార్లు అశ్విన్ బెస్ట్ ప్లేయర్‌గా నిలవడం విశేషం. 4 వరుసగా అశ్విన్ నాలుగు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్నాడు. గతంలో ఇమ్రాన్, మార్షల్లు మాత్రం ఇలా అందుకున్నారు. 6 కుంబ్లే (8) తర్వాత అశ్వినే అత్యధికంగా ఆరు పర్యాయాలు మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టాడు. 1 అశ్విన్ 39 టెస్టులోనే 220 వికెట్లను పడగొట్టాడు. ఇన్ని టెస్టుల తర్వాత ఎవరికీ ఇది సాధ్యం కాలేదు. 1 అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన తర్వాత అన్ని ఫార్మాట్లలో కలిపి 413 వికెట్లు తీశాడు. మరే ఇతర బౌలర్ ఇన్ని వికెట్లు తీయలేదు. -
'పిచ్ స్లో కావడంతో.. ఛేజింగ్ కష్టమైంది'
రాజ్‌కోట్: దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో పిచ్ స్వభావం మారడంతో లక్ష్యాన్ని సాధించలేకపోయామని టీమిండియా కెప్టెన్ ధోనీ అన్నాడు. పిచ్ రానురాను స్లోగా మారిందని, దీంతో పరుగులు చేయడం బ్యాట్స్‌మెన్‌కు కష్టమైందని చెప్పాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 18 పరుగులతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. 271 పరుగుల లక్ష్యంతో దిగిన భారత్ లక్ష్యం దిశగా పయనించినా.. చివర్లో కీలక వికెట్లు కోల్పోవడం, సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువగా ఉండటంతో బోల్తాపడింది. రాజ్‌కోట్ వన్డేలో భారత బౌలర్లు రాణించారని ధోనీ కితాబిచ్చాడు. అయితే లక్షసాధనకు దిగాక పిచ్ క్రమేణా నెమ్మదించడంతో, పరుగులు చేయడం కష్టమైందని చెప్పాడు. ఈ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని, స్పిన్నర్లకు సహకరించదని మొదట్లో భావించానని అయితే తన అంచనా తప్పిందని మహీ వివరించాడు. ఇక మిడిలార్డర్లో విఫలమవుతున్న రైనాకు ధోనీ అండగా నిలిచాడు. రైనా షాట్ ఆడబోయిముందు కాస్త సమయం తీసుకోవాలని సూచించాడు. -
భారత్ ‘ఎ’కు భారీ ఆధిక్యం
రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ‘ఎ’ 36/2 బెంగళూరు: బంగ్లాదేశ్ ‘ఎ’తో జరుగుతున్న మొదటి అనధికారిక టెస్టు మ్యాచ్‌పై భారత్ ‘ఎ’ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 183 పరుగుల భారీ ఆధిక్యం లభించగా... మ్యాచ్ రెండో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. బంగ్లాదేశ్ ఇంకా 147 పరుగులు వెనుకబడి ఉంది. మంగళవారం మ్యాచ్‌కు చివరి రోజు. రాణించిన శంకర్, నాయర్: ఓవర్‌నైట్ స్కోరు 161/1తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 5 వికెట్లకు 411 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. శిఖర్ ధావన్ (146 బంతుల్లో 150; 18 ఫోర్లు, 3 సిక్సర్లు) తన జోరు కొనసాగించగా, ఆ తర్వాత విజయ్ శంకర్ (110 బంతుల్లో 86; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), కరుణ్ నాయర్ (97 బంతుల్లో 71; 12 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 108 పరుగులు జోడించారు. బంగ్లా బౌలర్లలో జుబేర్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ తక్కువ వ్యవధిలో అనాముల్ (0), సర్కార్ (19) వికెట్లు కోల్పోయింది. ఈశ్వర్ పాండే, జయంత్ యాదవ్‌లకు ఒక్కో వికెట్ లభించింది. -
ఎట్టకేలకు హైదరాబాద్ బోణీ
అగర్తలా: ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. 9 వికెట్ల తేడాతో త్రిపురపై గెలుపొందింది. నాలుగో రోజు 240/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన త్రిపుర 119.1 ఓవర్లలో 351 పరుగుల వద్ద ఆలౌటైంది. రాకేశ్ సోలంకి (127 బంతుల్లో 85, 12 ఫోర్లు) అర్ధసెంచరీ చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో మిలింద్ 4, అన్వర్, ఆకాశ్ భండారి చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత 45 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 6.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 48 పరుగులు చేసి ఛేదించింది. అక్షత్ 27, అగర్వాల్ 21 (నాటౌట్) పరుగులు చేశారు.