ఎట్టకేలకు హైదరాబాద్ బోణీ | Finally to Boney Hyderabad | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు హైదరాబాద్ బోణీ

Published Fri, Jan 9 2015 2:25 AM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM

ఎట్టకేలకు హైదరాబాద్ బోణీ - Sakshi

ఎట్టకేలకు హైదరాబాద్ బోణీ

అగర్తలా: ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టు ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. 9 వికెట్ల తేడాతో త్రిపురపై గెలుపొందింది. నాలుగో రోజు 240/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన త్రిపుర 119.1 ఓవర్లలో 351 పరుగుల వద్ద ఆలౌటైంది. రాకేశ్ సోలంకి (127 బంతుల్లో 85, 12 ఫోర్లు) అర్ధసెంచరీ చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో మిలింద్ 4, అన్వర్, ఆకాశ్ భండారి చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత 45 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 6.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 48 పరుగులు చేసి ఛేదించింది. అక్షత్ 27, అగర్వాల్ 21 (నాటౌట్) పరుగులు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement