Second innings
-
India vs Bangladesh, 2nd Test: విజయం వేటలో... మెరుపు వేగంతో...
తొలి మూడు రోజుల ఆటలో రెండు రోజులు ఒక్క బంతి కూడా పడలేదు. మొదటి రోజు కూడా 35 ఓవర్లకే ఆట పరిమితమైంది. ఇలాంటి స్థితిలో మిగిలిన రెండు రోజుల్లో ‘డ్రా’కే అవకాశం తప్ప మరో ఫలితం వస్తుందా అని సోమవారం ఉదయం అంతా ఊహించారు. కానీ భారత జట్టు మాత్రం భిన్నంగా ఆలోచించింది. మ్యాచ్‌లో ఆధిక్యం ప్రదర్శించి విజయంపై గురి పెట్టాలంటే అసాధారణంగా ఆడాలని నిశ్చయించుకుంది. బ్యాటర్లంతా ఒక్కసారిగా టి20 ఫార్మాట్‌కు మారిపోయారు. అంతే... 50, 100, 150, 200, 250... ఇలా అన్ని పరుగుల మైలురాళ్లను వేగంగా, తక్కువ బంతుల్లో అధిగమించిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. రోహిత్‌తో మొదలు పెట్టి జైస్వాల్, గిల్, కోహ్లి, రాహుల్ ధాటిగా ఆడటంతో ఏకంగా 8.22 రన్‌రేట్‌తో భారీగా పరుగులు, ఆపై ఆధిక్యం కూడా వచ్చేశాయి. అనంతరం 45 నిమిషాల్లోనే బంగ్లాదేశ్‌ను ఒత్తిడిలోకి నెట్టి రెండు వికెట్లతో పైచేయి సాధించింది. చివరి రోజు బంగ్లా పోరాడుతుందా లేక భారత్ ఇదే ఊపులో మ్యాచ్ గెలిచేస్తుందా చూడాలి. కాన్పూర్: వర్షంతో వృథా అయిన సమయాన్ని మర్చిపోయేలా గ్రీన్‌పార్క్ స్టేడియంలో భారత జట్టు అభిమానులకు ఒక్క రోజులో పూర్తి స్థాయిలో వినోదాన్ని అందించింది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో మెరుపు బ్యాటింగ్‌తో జట్టు సత్తా చాటింది. సోమవారం భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 34.4 ఓవర్లలో 9 వికెట్లకు 285 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఫలితంగా భారత్‌కు 52 పరుగుల ఆధిక్యం లభించింది. యశస్వి జైస్వాల్ (51 బంతుల్లో 72; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), కేఎల్ రాహుల్ (43 బంతుల్లో 68; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) విరాట్ కోహ్లి (35 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్), శుబ్‌మన్ గిల్ (36 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిని ప్రదర్శించగా... షకీబ్, మిరాజ్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లలో 2 వికెట్లకు 26 పరుగులు చేసింది. ఆ జట్టు మరో 26 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఉదయం 107/3తో ఆట కొనసాగించిన బంగ్లా తమ తొలి ఇన్నింగ్స్‌లో 74.2 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. మోమినుల్ హక్ (107 నాటౌట్; 17 ఫోర్లు, 1 సిక్స్) కీలక సెంచరీ సాధించారు. సోమవారం ఒక్కరోజే 18 వికెట్లు నేలకూలడం విశేషం. మోమినుల్ మినహా... రెండు రోజుల పాటు మైదానానికి దూరంగా ఉన్న తర్వాత ఎట్టకేలకు 107/3 స్కోరుతో బంగ్లాదేశ్ తమ ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. సోమవారం మరో 39.2 ఓవర్లు ఆడిన జట్టు మరో 126 పరుగులు జోడించి మిగిలిన 7 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు ఆరంభం నుంచే ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. ముష్ఫికర్ (11)ను బౌల్డ్ చేసి బంగ్లా పతనానికి బుమ్రా శ్రీకారం చుట్టాడు. బుమ్రా తర్వాతి ఓవర్లో దాస్ మూడు ఫోర్లు కొట్టి జోరు ప్రదర్శించినా... రోహిత్ అద్భుత క్యాచ్‌తో అతని ఇన్నింగ్స్ ముగిసింది. మరో ఎండ్‌లో మోమినుల్ మాత్రం పట్టుదలగా నిలబడి పరుగులు సాధించాడు. కొద్ది సేపటికే సిరాజ్ అసాధారణ క్యాచ్ షకీబ్ (9)ను పెవిలియన్ పంపించింది. 93, 95 పరుగుల వద్ద పంత్, కోహ్లి క్యాచ్‌లు వదిలేయడంతో బతికిపోయిన మోమినుల్ ఆ తర్వాత కెరీర్లో 13వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంచ్ విరామం తర్వాత మిగిలిన 4 వికెట్లను పడగొట్టేందుకు భారత్ కు ఎక్కువ సమయం పట్టలేదు. ఖాలెద్‌ను అవుట్ చేసి జడేజా తన ఖాతాలో 300వ వికెట్‌ను వేసుకున్నాడు. ధనాధన్... దూకుడే మంత్రంగా భారత్ ఇన్నింగ్స్ సాగింది. మహమూద్ వేసిన తొలి ఓవర్లో జైస్వాల్ 3 వరుస ఫోర్లు బాదగా... ఖాలెద్ వేసిన తర్వాతి ఓవర్లో తాను ఎదుర్కొన్న తొలి రెండు బంతులను రోహిత్ శర్మ (11 బంతుల్లో 23; 1 ఫోర్, 3 సిక్స్‌లు) సిక్సర్లుగా మలిచాడు. అనంతరం మహమూద్ ఓవర్లో వీరిద్దరు 2 సిక్స్‌లు, 2 ఫోర్లతో 22 పరుగులు రాబట్టారు. అయితే నాలుగో ఓవర్లోనే స్పిన్నర్ మిరాజ్ బౌలింగ్ కు దిగి రోహిత్‌ను వెనక్కి పంపాడు. 31 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో జైస్వాల్ అర్ధసెంచరీ పూర్తయింది. మరో వైపు గిల్ కూడా కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. అయితే వేగంగా ఆడే క్రమంలో 32 పరుగుల వ్యవధిలో జైస్వాల్, గిల్, పంత్ (9) అవుటయ్యారు. ఈ దశలో కోహ్లి, రాహుల్ జోరు తగ్గకుండా బంగ్లా బౌలర్లపై ఆధిక్యం ప్రదర్శించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 59 బంతుల్లోనే 87 పరుగులు జోడించడం విశేషం. 33 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీని అందుకోగా, కోహ్లి ఆ అవకాశం చేజార్చుకున్నాడు. షకీబ్ ఓవర్లో రెండు వరుస సిక్సర్లతో ఆకాశ్‌దీప్ కూడా తానూ ఓ చేయి వేశాడు. 16 పరుగుల వ్యవధిలో తర్వాతి 4 వికెట్లు కోల్పోయిన తర్వాత భారత్ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం 11 ఓవర్లపాటు క్రీజ్‌లో బంగ్లా బ్యాటర్లు తడబడుతూనే ఆడారు. 7 ఓవర్లలో జట్టు 18 పరుగులు చేసింది. అయితే తర్వాతి ఓవర్ తొలి బంతికే జాకీర్ (10)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అశ్విన్... తన తర్వాతి ఓవర్లో నైట్‌వాచ్‌మన్ మహమూద్ (4)ను బౌల్డ్ చేసి బంగ్లా ఆందోళనను మరింత పెంచాడు. అంతకుముందు 3 పరుగుల వద్ద షాద్మన్ ఇచి్చన క్యాచ్‌ను స్లిప్‌లో రాహుల్ వదిలేశాడు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: జాకీర్ (సి) జైస్వాల్ (బి) ఆకాశ్‌దీప్ 0; షాద్మన్ (ఎల్బీ) (బి) ఆకాశ్‌దీప్ 24; మోమినుల్ (నాటౌట్) 107; నజ్ముల్ (ఎల్బీ) (బి) అశి్వన్ 31; ముష్ఫికర్ (బి) బుమ్రా 11; లిటన్ దాస్ (సి) రోహిత్ (బి) సిరాజ్ 13; షకీబ్ (సి) సిరాజ్ (బి) అశి్వన్ 9; మిరాజ్ (సి) గిల్ (బి) బుమ్రా 20; తైజుల్ (బి) బుమ్రా 5; మహమూద్ (ఎల్బీ) (బి) సిరాజ్ 1; ఖాలెద్ (సి అండ్ బి) జడేజా 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (74.2 ఓవర్లలో ఆలౌట్) 233. వికెట్ల పతనం: 1–26, 2–29, 3–80, 4–112, 5–148, 6–170, 7–224, 8–230, 9–231, 10–233. బౌలింగ్: బుమ్రా 18–7–50–3, సిరాజ్ 17–2–57–2, అశి్వన్ 15–1–45–2, ఆకాశ్‌దీప్ 15–6–43–2, జడేజా 9.2–0–28–1. భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) మహమూద్ 72; రోహిత్ (బి) మిరాజ్ 23; గిల్ (సి) మహమూద్ (బి) షకీబ్ 39; పంత్ (సి) మహమూద్ (బి) షకీబ్ 9; కోహ్లి (బి) షకీబ్ 47; రాహుల్ (స్టంప్డ్) దాస్ (బి) మిరాజ్ 68; జడేజా (సి) నజు్మల్ (బి) మిరాజ్ 8; అశ్విన్ (బి) షకీబ్ 1; ఆకాశ్‌దీప్ (సి) ఖాలెద్ (బి) మిరాజ్ 12; బుమ్రా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (34.4 ఓవర్లలో 9 వికెట్లకు డిక్లేర్డ్) 285. వికెట్ల పతనం: 1–55, 2–127, 3–141, 4–159, 5–246, 6–269, 7–272, 8–284, 9–285. బౌలింగ్: మహమూద్ 6–0–66–1, ఖాలెద్ 4–0–43–0, మిరాజ్ 6.4–0–41–4, తైజుల్ 7–0–54–0, షకీబ్ 11–0–78–4. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: షాద్మన్ (బ్యాటింగ్) 7; జాకీర్ (ఎల్బీ) (బి) అశ్విన్ 10; మహమూద్ (బి) అశ్విన్ 4; మోమినుల్ (బ్యాటింగ్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (11 ఓవర్లలో 2 వికెట్లకు) 26. వికెట్ల పతనం: 1–18, 2–26. బౌలింగ్: బుమ్రా 3–1–3–0, అశి్వన్ 5–2–14–2, ఆకాశ్‌దీప్ 3–2–4–0.4: మూడు ఫార్మాట్లో కలిపి అంతర్జాతీయ క్రికెట్లో 27 వేల పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో ఆటగాడిగా విరాట్ కోహ్లి నిలిచాడు. సచిన్ (34,357), సంగక్కర (28,016), రికీ పాంటింగ్ (27,483) ఈ జాబితాలో అతనికంటే ముందున్నారు. కోహ్లి ప్రస్తుతం 27,012 పరుగులు చేశాడు. -
India vs Bangladesh 1st Test: పంత్, గిల్ సెంచరీల మోత
దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడిన రిషభ్ పంత్ అంచనాలను అందుకుంటూ తనదైన శైలిలో సాధించిన శతకం... శుబ్‌మన్ గిల్ ఎప్పటిలాగే ప్రశాంతంగా ఆడుతూ పూర్తి చేసుకున్న సెంచరీ...ఆపై చెపాక్ బాయ్ అశి్వన్ మూడు కీలక వికెట్లతో ప్రత్యర్థి పని పట్టిన తీరు... చెన్నై టెస్టులో మూడో రోజు భారత్ హవానే కొనసాగింది. ముందుగా పంత్, గిల్ సెంచరీల తర్వాత తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి భారీ లక్ష్యంతో బంగ్లాదేశ్‌కు భారత్ సవాల్ విసరగా... తడబడుతూ ఆడిన బంగ్లా కుప్పకూలిపోకుండా కాస్త నిలవగలిగింది. వెలుతురులేమితో బంగ్లా ఓటమి ఆలస్యమైనట్లు కనిపించినా... ఆదివారం మిగిలిన ఆరు వికెట్లు తీయడం భారత్‌కు కష్టం కాకపోవచ్చు. చెన్నై: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు విజయంపై గురి పెట్టింది. భారత్ విధించిన 515 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన బంగ్లా శనివారం ఆట ముగిసే సమయానికి 37.2 ఓవర్లలో 158 పరుగులు చేసింది. కెపె్టన్ నజ్ముల్ హసన్ (60 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), షకీబ్ అల్ హసన్ (5 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో అశి్వన్‌కు మూడు వికెట్లు దక్కాయి. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా బంగ్లా మరో 357 పరుగులు చేయాల్సి ఉంది. వెలుతురులేమి కారణంగా ఆటను అంపైర్లు కాస్త ముందుగా నిలిపివేశారు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 81/3తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 64 ఓవర్లలో 4 వికెట్లకు 287 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. శుబ్‌మన్ గిల్ (176 బంతుల్లో 119 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెరీర్లో ఐదో సెంచరీ... రిషభ్ పంత్ (128 బంతుల్లో 109; 13 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెరీర్లో ఆరో సెంచరీ సాధించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 167 పరుగులు జోడించారు. శనివారం భారత్ మొత్తం 41 ఓవర్లు ఆడి 206 పరుగులు జత చేసింది. శతకాల జోరు... మూడో రోజు ఆటలో పంత్, గిల్‌ను బంగ్లా బౌలర్లు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. ప్రత్యర్థి పేలవ బౌలింగ్‌ను సొమ్ము చేసుకున్న భారత బ్యాటర్లిద్దరూ దూకుడుగా ఆడారు. మిరాజ్ ఓవర్లో రెండు సిక్స్‌లు బాది గిల్ ముందుగా అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, ఆ తర్వాత పంత్ కూడా హాఫ్ సెంచరీని అందుకున్నాడు. 72 పరుగుల వద్ద పంత్ ఇచ్చిన క్యాచ్‌ను కెప్టెన్ నజ్ముల్ వదిలేశాడు. షకీబ్ ఓవర్లో పంత్ రెండు వరుస ఫోర్లు కొట్టడంతో తొలి సెషన్ ముగిసింది. లంచ్ తర్వాత కూడా షకీబ్ ఓవర్లో సిక్స్, ఫోర్ బాది పంత్ దూసుకుపోయాడు. ఎట్టకేలకు అభిమానులు ఎదురు చూసిన క్షణం వచి్చంది. షకీబ్ ఓవర్లో లాంగాఫ్ దిశగా దిశగా ఆడి రెండు పరుగులు తీయడంతో 124 బంతుల్లో పంత్ సెంచరీ పూర్తి కాగా...భారత శిబిరం మొత్తం తమ సహచరుడిని చప్పట్లతో అభినందించింది. తర్వాతి ఓవర్లోనే అతను వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే గిల్ కూడా 161 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. మరో నాలుగు ఓవర్లకు రోహిత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. నజ్ముల్ హాఫ్ సెంచరీ... భారీ లక్ష్యం ముందుండగా బంగ్లా ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు జాకీర్ హసన్ (47 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్స్), షాద్మన్ ఇస్లామ్ (68 బంతుల్లో 35; 3 ఫోర్లు) దూకుడుగా ఆరంభించారు. సిరాజ్ ఓవర్లో జాకీర్ 2 ఫోర్లు, సిక్స్‌తో 14 పరుగులు రాబట్టాడు. దాంతో స్కోరు 62/0కు చేరింది. అయితే టీ విరామం తర్వాత బుమ్రా చక్కటి బంతితో జాకీర్‌ను అవుట్ చేసి తొలి దెబ్బ కొట్టాడు. షాద్మన్ వికెట్ అశి్వన్ ఖాతాలో చేరింది. మరో వైపు నజు్మల్ ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో అశ్వి న్ కూడా నాలుగు సిక్స్‌లు సమరి్పంచుకున్నాడు. ఆ తర్వాత అశ్విన్ మరో రెండు వికెట్లు తీయడంతో స్కోరు 86/1 నుంచి 146/4కు చేరింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 376; బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 149; భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి (సి) దాస్ (బి) నాహిద్ 10; రోహిత్ (సి) జాకీర్ (బి) తస్కీన్ 5; గిల్ (నాటౌట్) 119; కోహ్లి (ఎల్బీ) (బి) మిరాజ్ 17; పంత్ (సి) అండ్ (బి) మిరాజ్ 109; రాహుల్ (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (64 ఓవర్లలో 4 వికెట్లకు డిక్లేర్డ్) 287. వికెట్ల పతనం: 1–15, 2–28, 3–67, 4–234.బౌలింగ్: తస్కీన్ 7–1–22–1, హసన్ మహమూద్ 11–1–43–0, నాహిద్ రాణా 6–0–21–1, షకీబ్ 13–0–79–0, మెహదీ హసన్ మిరాజ్ 25–3–10–3–2, మోమినుల్ 2–0–15–0. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: జాకీర్ (సి) యశస్వి (బి) బుమ్రా 33; షాద్మన్ (సి) గిల్ (బి) అశ్విన్ 35; నజు్మల్ (బ్యాటింగ్) 51; మోమినుల్ (బి) అశ్విన్ 13; ముషి్ఫకర్ (సి) రాహుల్ (బి) అశి్వన్ 13; షకీబ్ (బ్యాటింగ్) 5; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (37.2 ఓవర్లలో 4 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–62, 2–86, 3–124, 4–146.బౌలింగ్: బుమ్రా 7–2–18–1, సిరాజ్ 3.2–1–20–0, ఆకాశ్ దీప్ 6–0–20–0, అశ్విన్ 15–0–63–3, జడేజా 6–0–29–0. -
త్రిష బాటలో మరో హీరోయిన్ రీఎంట్రీతో దుమ్మురేపుతున్న బ్యూటీ
-
Lok Sabha Election 2024: పొలిటికల్ టాప్ గన్స్.. రాజకీయాల్లో రాణించిన సైనికాధికారులు
వారు కదన రంగంలో శత్రువుల భరతం పట్టిన వీర సైనికులు. రెండో ఇన్సింగ్స్‌లో రాజకీయ రణరంగంలోనూ అంతే గొప్పగా రాణించారు. త్రివిధ దళాల్లో పలు హోదాల్లో దేశానికి సేవలందించిన సైనిక ఉన్నతాధికారులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులుగా చక్రం తిప్పారు. జశ్వంత్‌సింగ్, రాజేశ్ పైలట్ మొదలుకుని తాజాగా ఎయిర్ చీఫ్ మార్షల్ (రిటైర్డ్) బదౌరియా దాకా ఈ జాబితా పెద్దదే...జశ్వంత్ సింగ్ బహుముఖ ప్రజ్ఞాశీలి సైనికాధికారిగా శత్రువులతో పోరాడిన జశ్వంత్ రాజకీయాల్లో చేరి రక్షణ మంత్రిగా త్రివిధ దళాలకు బాస్ అయ్యారు. 1965లో ఇండో–పాక్ యుద్ధంలో పాల్గొన్న జశ్వంత్ మేజర్ హోదాలో 1966లో పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. భారతీయ జన సంఘ్, ఆర్ఎస్ఎస్ సభ్యుడు. బీజేపీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 1980లో బీజేపీ తరఫున తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2004 దాకా ఐదుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 1989లో సొంత రాష్ట్రం రాజస్తాన్‌లోని జో«ద్‌పూర్ నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో 1998 నుంచి 2004 దాకా కీలకమైన ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణ వంటి శాఖలు చూశారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్‌గా, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అత్యధిక కాలం పార్లమెంటు సభ్యునిగా కొనసాగిన కొద్దిమందిలో జశ్వంత్ ఒకరు. రాజేశ్ ‘పైలట్’ అసలు పేరు రాజేశ్వర్ ప్రసాద్ బిధూరి. పైలట్ వృత్తినే పేరులోనే చేర్చుకుని రాజకీయాల్లో వెలుగు వెలిగారు. భారత వైమానిక దళంలో బాంబర్ పైలట్‌గా 1971 భారత్–పాక్ యుద్ధంలో పోరాడారు. స్క్వాడ్రన్ లీడర్ హోదాలో రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజీవ్‌కు సన్నిహితుడు. 1980లో కాంగ్రెస్ తరఫున భరత్పూర్ లోక్‌సభ స్థానం నుంచి ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి 1999 దాకా ఎంపీగా గెలిచారు. కేంద్రంలో పలు కీలక శాఖలకు మంత్రిగా చేశారు. 2000 జూన్‌లో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన తనయుడు సచిన్ పైలట్ కాంగ్రెస్‌లో కీలక నేతగా కొనసాగుతున్నారు.అమరీందర్ కెప్టెన్ టు సీఎం కెపె్టన్ అమరీందర్ సింగ్ జవాన్ల కుటుంబం నుంచి వచ్చారు. 1965 ఇండో–పాక్ యుద్ధంలో శత్రువుకు చుక్కలు చూపించారు. కెపె్టన్ హోదాలో రిటైరైన ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది రాజీవ్. అమరీందర్ 1980లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999 నుంచి 2017 దాకా మూడుసార్లు పంజాబ్ పీసీసీ చీఫ్‌గా, 2002 నుంచి 2007 దాకా సీఎంగా చేశారు. 2017లో మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి రెండోసారి సీఎం అయ్యారు. కాంగ్రెస్ వర్గ విభేదాలతో పార్టీకి, సీఎం పదవికి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టారు. తర్వాత దాన్ని బీజేపీలో విలీనం చేశారు. బి.సి.ఖండూరీ స్వర్ణ చతుర్భుజి సారథి మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నత విద్యనభ్యసించిన భువన్ చంద్ర ఖండూరీ 1954 నుంచి 1990 దాకా భారత సైన్యంలో సేవలందించారు. ఇండియన్ ఆర్మీ చీఫ్ ఇంజనీర్ స్థాయి నుంచి ఆర్మీ ఇంజనీర్ ఇన్ చీఫ్ విభాగంలో అదనపు డైరెక్టర్ జనరల్ దాకా కీలక హోదాల్లో పని చేశారు. 1971 ఇండో–పాక్ యుద్ధంలో రెజిమెంట్ కమాండర్‌గా పోరాడారు. మేజర్ జనరల్ హోదాలో రిటైరయ్యారు. 1991లో తొలిసారి ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్ లోక్‌సభ స్థానం నుంచి నెగ్గారు. ఐదుసార్లు ఎంపీ అయ్యారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో రహదారులు, హైవేల మంత్రిగా చేశారు. దేశ నలు దిక్కులను కలిపిన స్వర్ణ చతుర్భుజి హైవేల ప్రాజెక్టును దిగ్విజయంగా అమలు చేసిన ఘనత ఖండూరీదే. నిజాయితీకి మారుపేరైన ఆయన ఉత్తరాఖండ్ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజేతగా నిలిపి సీఎం అయ్యారు.అయూబ్ ఖాన్ వార్ హీరో సైనికుల కుటుంబం నుంచి వచ్చిన అయూబ్ ఖాన్ 1965 ఇండో పాక్ యుద్ధంలో వీరోచితంగా పోరాడారు. భారత సైన్యంలోని 18వ సాయుధ అశి్వక దళంలో రిసాల్దార్గా పని చేస్తున్న అయూబ్‌ను యుద్ధంలో జమ్మూకశీ్మర్ సియాల్కోట్ సెక్టార్లో నియమించారు. పాకిస్తాన్ సైన్యం యుద్ధ ట్యాంకులతో మన జవానులను చుట్టుముడుతున్న తరుణంలో నాలుగు పాక్ యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయడంతో పాటు ఒక ట్యాంకును స్వా«దీనం చేసుకుని శత్రువుకు చుక్కలు చూపించారు. ఆ యుద్ధంలో పరాక్రమానికి వీర్ చక్ర పురస్కారం అందుకున్నారు. గౌరవ కెపె్టన్ హోదా కూడా దక్కింది. ‘నేను పాక్ అధ్యక్షుడు జనరల్ అయూబ్ ఖాన్‌ను కలుసుకోలేదు గానీ భారతీయ అయూబ్‌ను కలిసినందుకు గర్వంగా ఉంది’ అంటూ నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఈ వీర సైనికున్ని హత్తుకోవడం విశేషం. 1983లో రిటైరయ్యాక అయూబ్ రాజకీయాల్లోనూ సత్తా చాటారు. నాటి ప్రధాని రాజీవ్ గాంధీ అయూబ్‌ను ఒప్పించి మరీ ఎన్నికల్లో నిలబెట్టారు. రాజస్తాన్‌లోని ఝుంఝును నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. ఆ రాష్ట్రం నుంచి తొలి ముస్లిం ఎంపీగా కూడా చరిత్ర సృష్టించారు. 1991లో రెండోసారి విజయం సాధించి, పీవీ కేబినెట్లో వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా పని చేశారు.కాండెత్ గోవా విముక్తి వీరుడు దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినా గోవాలో మాత్రం 1961 దాకా పోర్చుగీసు వలస పాలనే సాగింది. 1961లో భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ ద్వారా గోవాను విలీనం చేసుకుంది. ఈ కీలక సైనిక చర్యకు సారథ్యం వహించిన ధీరుడు కేరళకు చెందిన మేజర్ జనరల్ కున్హిరామన్ పాలట్ కాండెత్. తర్వాత కొంతకాలం గోవా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా చేశారు. 1971 ఇండో–పాక్ యుద్ధంలో పశి్చమ కమాండ్ సైనిక బలగాన్ని నడిపించారు. పరమ విశిష్ట సేవా మెడల్‌తో పాటు పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. 1972లో లెఫ్టినెంట్ జనరల్‌గా రిటైరయ్యారు. 1990ల్లో బీజేపీలో చేరారు. పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా చేశారు. జనరల్ వీకే సింగ్... రాజకీయాల్లో సక్సెస్ భారత సైన్యంలో కమాండో స్థాయి నుంచి ఆర్మీ ఛీఫ్ అయిన తొలి వ్యక్తి జనరల్ విజయ్ కుమార్ సింగ్. 1971 ఇండో–పాక్ యుద్ధంతో సహా అనేక ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించారు. 2010 నుంచి 2012 దాకా సైనిక దళాధిపతిగా చేశారు. రిటైరయ్యాక 2014లో బీజేపీలో చేరారు. స్వరాష్ట్రం యూపీలోని ఘాజియాబాద్ నుంచి ఎంపీ అయ్యారు. 2019లో రెండోసారి విజయం సాధించారు. మోదీ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా చేశారు.విష్ణు భగవత్... గురి తప్పిన టార్పెడో భారత నావికాదళంలో అత్యంత ప్రతిభాపాటవాలతో అత్యున్నత పదవికి చేరుకున్న అడ్మిరల్ విష్ణు భగవత్... వివాదాస్పద వ్యవహార శైలితో అపకీర్తిని కూడా మూటగట్టుకున్నారు. 1971 ఇండో–పాక్ యుద్ధంలో, పోర్చుగీస్ చెర నుంచి గోవాకు విముక్తి కలి్పంచిన ఆపరేషన్ విజయ్‌లో కీలక పాత్ర పోషించారు. ఎన్డీఏ ప్రభుత్వంతో విభేదాల కారణంగా 1998లో ఉద్వాసనకు గురయ్యారు. నేవీ చీఫ్‌గా ఉంటూ వేటుకు గురైన తొలి వ్యక్తి ఆయనే. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అడ్మిరల్ హోదానూ కోల్పోయారు. తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బిహార్ రాజకీయాల్లో కొంతకాలం చురుగ్గా వ్యవహరించారు. ‘ఉత్తమ’ ఫైటర్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి. వైమానిక దళంలో మిగ్ 21, మిగ్ 23 వంటి ఫైటర్ జెట్లు నడిపి శత్రువులపై పోరాడారు. రాజకీయాల్లోనూ రియల్ ఫైటర్‌గా కొనసాగుతున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ 1982 నుంచి 1991 దాకా ఎయిర్‌ఫోర్స్‌లో ఫైటర్ పైలట్‌గా చేశారు. 1994లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలి ఎన్నికల్లో కోదాడ నుంచి ఓడినా 1999లో అక్కడి నుంచే విజయఢంకా మోగించారు. మూడు దశాబ్డాల రాజకీయ జీవితంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి నల్లగొండ ఎంపీగా, పీసీసీ అధ్యక్షునిగా, మంత్రిగా చేశారు. తాజాగా హుజారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, తెలంగాణలో తొలి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఉత్తమ్ భార్య పద్మావతి కూడా రెండుసార్లు కోదాడ ఎమ్మెల్యేగా గెలిచారు. 2016లో వచి్చన టెర్రర్ అనే తెలుగు సినిమాలో ఆయన సీఎం పాత్ర పోషించడం విశేషం!జేజే సింగ్... తొలి సిక్కు ఆర్మీ చీఫ్ జోగిందర్ జస్వంత్ సింగ్. తొలి సిక్కు ఆర్మీ జనరల్. 2005 నుంచి 2007 దాకా దేశ 21వ ఆర్మీ చీఫ్‌గా సేవలందించారు. రిటైరయ్యాక 2008లో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా అయ్యారు. 2017లో అకాలీదళ్‌లో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కెపె్టన్ అమరీందర్ సింగ్ చేతిలో ఓడారు. 2019లో అకాలీదళ్ (తక్సలీ)లో నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. 2022లో బీజేపీలో చేరారు. వీకే సింగ్ తర్వాత కాషాయం తీర్థం పుచ్చుకున్న రెండో జనరల్‌గా నిలిచారు.బదౌరియా... పొలిటికల్ టేకాఫ్ రాజకీయాల్లోకి వచి్చన తొలి వైమానిక దళపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ బదౌరియా చరిత్ర సృష్టించారు. ఎయిర్‌ఫోర్స్ ఫైటర్‌గా విధుల్లో చేరిన ఆయన 41 ఏళ్ల కెరీర్లో 26 రకాల ఫైటర్ జెట్స్, రవాణా విమానాలు నడిపిన విశేష ప్రతిభావంతుడు. స్వదేశీ యుద్ధ విమానం తేజస్ చీఫ్ టెస్ట్ పైలట్‌గా, ప్రాజెక్ట్ టెస్టింగ్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు. 2019 నుంచి 2021 దాకా ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా చేసి రిటైరయ్యారు. ఇటీవలే బీజేపీలో చేరారు. రాథోడ్ గురి పెడితే... టార్గెట్ తలొంచాల్సిందే! యుద్ధభూమి అయినా, క్రీడా మైదానమైనా ఆయన గురి పెడితే టార్గెట్ తలొంచాల్సిందే! ఆయనే కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. విశ్వ క్రీడా ప్రపంచంలో భారత్‌కు ఘన కీర్తి సాధించి పెట్టిన అభినవ అర్జునుడు. చదువులోనూ, ఆటలోనూ ‘గోల్డెన్’ బాయ్‌గా నిలిచిన రాథోడ్ కార్గిల్ యుద్ధంలో పోరాడారు. 2002 కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ కొట్టారు. ఆ ఈవెంట్లో ఆయన నెలకొలి్పన రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. 2004 గ్రీస్ ఒలింపిక్స్ డబుల్ ట్రాప్ ఈవెంట్లో వెండి పతకం కొట్టడంతో రాథోడ్ పేరు మారుమోగింది. ఒలింపిక్స్‌లో భారత్‌కు అదే తొలి వ్యక్తిగత వెండి పతకం! కెరీర్లో ఏకంగా 25 అంతర్జాతీయ పతకాలను సొంతం చేసుకున్నారు. 2013లో ఆర్మీ నుంచి రిటైరై బీజేపీలో చేరారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. మోదీ ప్రభుత్వంలో సమాచార, క్రీడా మంత్రిగా చేశారు. 2019లోనూ ఎంపీగా గెలిచారు. 2023లో రాజస్తాన్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కార్తీక 2.ఒ
కార్తీక వీకే... ఎంతోమంది సాహిత్యాభిమానులకు సుపరిచితమైన పేరు. ‘క్వీన్ ఆఫ్ ఇండియన్ పబ్లిషింగ్’గా కీర్తి అందుకున్న వెస్ట్‌ల్యాండ్ బుక్స్ (అమెజాన్ కంపెనీ) పబ్లిషర్‌గా ఎంతోమంది రచయితలను ప్రపంచానికి పరిచయం చేసింది. పాఠకుల నాడి పట్టుకుంది. మారుమూల పల్లె నుంచి హైటెక్ సిటీ వరకు ఏ చిన్న మెరుపు మెరిసినా ఆ మెరుపును అందుకోగలిగింది. కారణాలపై స్పష్టత ఇవ్వకపోయినా అమెజాన్ కంపెనీ వెస్ట్‌ల్యాండ్ బుక్స్‌ను మూసివేసింది. ఆ తరువాత ఏమైంది? ‘ప్రతిలిపి’తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది కార్తీక. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ‘ప్రతిలిపి’ దేశంలోని పన్నెండు భాషలకు సంబంధించిన సృజనాత్మక రచనలకు, సాహిత్యభిమానుల మధ్య చర్చలకు వేదిక అయింది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ‘ప్రతిలిపి’ వెస్ట్‌ల్యాండ్ పబ్లిషింగ్, ఎడిటోరియల్, మార్కెటింగ్, సేల్స్ టీమ్‌ను యథాతథంగా తీసుకొని కొత్త ప్రయాణం మొదలు పెట్టింది. ఈ కొత్త వెంచర్‌ని ‘వెస్ట్‌ల్యాండ్ 2.ఒ’ అని పిలుస్తున్నారు. దేశంలోని మోస్ట్ పవర్ఫుల్ ఎడిటర్లలో ఒకరిగా పేరుగాంచిన కార్తీకకు వెస్ట్ల్యాండ్లాగే ‘ప్రతిలిపి’ని పాపులర్ చేయాల్సిన బాధ్యత ఉంది. ‘ప్రతిలిపి పేపర్‌బ్యాక్స్’ శీర్షికతో తమ యాప్‌లో పాపులర్ అయిన రచనలను కార్తీక నేతృత్వంలో పుస్తకాలుగా తీసుకు రానుంది ప్రతిలిపి. ‘గతానికి ఇప్పటికీ తేడా ఏమిటంటే అప్పుడు పాపులర్ రచనలను పుస్తకాలుగా ప్రచురించేదాన్ని. ఇప్పుడు యాప్‌లో పాపులర్ అయిన రచనలను పుస్తకంగా ప్రచురించబోతున్నాను’ అంటుంది కార్తీక. ‘పుస్తకం అంటే కొన్ని పేజీల సముదాయం కాదు. అదొక ప్రపంచం’ అని చెప్పే కార్తీకకు ‘సంప్రదాయ పబ్లిషర్’ అని పేరు ఉంది. అయితే ఇప్పుడు ఈ సంప్రదాయ పబ్లిషర్ ఆడియోబుక్, యాప్, పాడ్‌కాస్ట్... మొదలైన ఫార్మాట్లలో సాహిత్యాభిమానులకు చేరువ కావడానికి కొత్తదారిలో ప్రయాణం చేస్తుంది. ‘కాలంతోపాటు నడవాలి. కొత్త ఫార్మాట్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ఇది సవాలు మాత్రమే కాదు ఎంతో ఉత్సాహం ఇచ్చే పని కూడా’ అంటుంది కార్తీక. కార్తీకతో కలిసి మరోసారి పనిచేయడానికి రచయితలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఆ ఉత్సాహమే ఆమె బలమని చెప్పాల్సి అవసరం లేదు కదా! వైవిధ్యమే బలం ప్రచురణ రంగానికి వైవిధ్యమే ప్రధాన బలం. అందుకే ఎప్పటికప్పుడు పాఠకుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుంటాను. పాఠకులకు ఎలా చేరువ కావాలనేదానిపై రకరకాలుగా ఆలోచిస్తాను. పాఠకులకు చేరువ కావాలనే లక్ష్యం కోసం వక్రమార్గాల్లో పయనించడం నా సిద్ధాంతం కాదు. సమాజానికి హాని చేసే కంటెంట్‌ను దగ్గరికి రానివ్వను. వ్యాపారానికి నైతికత అనేది ముఖ్యం. విలువలకు ప్రాధాన్యత ఇస్తాను. ఎంపికకు సంబం«ధించిన విషయంలో కూడా ‘నాదే రైట్’ అనే ధోరణితో కాకుండా ఇతరులతో విస్తృతంగా చర్చిస్తాను. సోకాల్ట్–మెయిన్ స్ట్రీమ్ ఆలోచనలకు పక్కకు జరిగితే ఎంతో అద్భుతమైన ప్రతిభను వెలుగులోకి తీసుకురావచ్చు. నా కెరీర్లో సంతోషకరమైన విషయం ఏమిటంటే యువతలో చదివే వారి సంఖ్య పెరగడం. ‘కొత్త పాఠకులు ఎలాంటి కంటెంట్‌ను ఇష్టపడుతున్నారు?’ అని తెలుసుకోవడం ముఖ్యం. శక్తిమంతమైన, సృజనాత్మకమైన ఆలోచనలు ఎక్కడో ఒకచోట ఉంటాయి. అవి ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి వెలుగులోకి తీసుకురావడమే పబ్లిషర్ బలం. – కార్తీక వీకే -
ప్రభుదేవాతో ఆ పాట చేయడానికి కారణం ఎవరంటే..
-
Border-Gavaskar Trophy: ‘జడ్డూ’ తిప్పేశాడు...
న్యూఢిల్లీ: భారత్‌కు అచ్చొచ్చిన ఢిల్లీ వికెట్‌పై పర్యాటక జట్టే స్పిన్‌తో అల్లాడిస్తే... ఆతిథ్య జట్టు అంతకుమించే చేయాలి కదా! సరిగ్గా... టీమిండియా కూడా అదే చేసింది. ఒక్క సెషన్ అయినా పూర్తిగా ఆడనివ్వకుండానే ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసింది. రవీంద్ర జడేజా (7/42) బిగించిన ఉచ్చులో ఆస్ట్రేలియా క్లీన్‌బౌల్డయింది. 31.1 ఓవర్లలోనే 113 పరుగులకే ఆ జట్టు కుప్పకూలింది. ఇందులో 12 ఓవర్లు, 61 పరుగులు క్రితం రోజువే కాగా... మూడో రోజు ఆసీస్ ఆడింది 19.1 ఓవర్లే! చేసింది కూడా 52 పరుగులే! అంటే సగటున ప్రతి రెండు ఓవర్లకు ఓ వికెట్‌ను సమర్పించుకుంది. అంతలా ప్రపంచ నంబర్‌వన్ టెస్టు జట్టు జడుసుకుంది. ‘జడ్డూ’ ఏకంగా ఐదుగురు బ్యాటర్లను బౌల్డ్ చేశాడు. అనంతరం 115 పరుగుల సులువైన లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 26.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసి గెలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో రెండు జట్ల బౌలర్లు ఎక్స్‌ట్రాలు ఇవ్వకపోవడం విశేషం. మ్యాచ్ మొత్తం లో పది వికెట్లు తీయడంతోపాటు కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన జడేజాకు వరుసగా రెండోసారీ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 2–0తో ఉన్న భారత్ ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ని తమ వద్దే అట్టిపెటుకుంది. క్రితంసారి కూడా భారతే గెలిచింది. ఇక ఈ సిరీస్‌లో మూడో టెస్టు మార్చి 1 నుంచి ఇండోర్‌లో జరుగుతుంది. ఇండోర్ టెస్టులోనూ భారత్ గెలిస్తే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా అర్హత సాధిస్తుంది. ఇలా మొదలై... అలా కూలింది! ఓవర్‌నైట్ స్కోరు 61/1తో ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా పతనం తొలి ఓవర్ నుంచే మొదలైంది. ఓపెనర్ హెడ్ (46 బంతుల్లో 43; 6 ఫోర్లు, 1 సిక్స్) అశ్విన్ బౌలింగ్‌లో ఒక బౌండరీ కొట్టి ఆఖరి బంతికి అవుటయ్యాడు. కాసేపటికే సీనియర్ బ్యాటర్ స్మిత్ (19 బంతుల్లో 9; 1 ఫోర్) కూడా అతని బౌలింగ్‌లోనే వికెట్ల ముందు దొరికాడు. తర్వాత జడేజా మాయాజాలం మొదలవడంతో కొత్తగా ఇంకెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ఓవర్‌నైట్ బ్యాటర్ లబుషేన్ (50 బంతుల్లో 35; 5 ఫోర్లు) సహా స్వల్ప వ్యవధిలో క్యారీ (7), కమిన్స్ (0), లయన్ (8), కున్మన్ (0)లను జడేజా క్లీన్‌బౌల్డ్ చేశాడు. కచ్చితత్వం లేని స్వీప్ షాట్లు, అనవసరమైన రివర్స్ స్వీప్ షాట్లు ఆస్ట్రేలియన్ల కొంపముంచాయి. ప్రపంచంలో ఎక్కడైనా పేస్ బంతులు బ్యాటర్లను బెంబేలెత్తిస్తాయి. కానీ ఇక్కడ స్లో డెలివరీలకే విలవిలలాడారు. దీంతో ఆదివారం ఆటలో 9 వికెట్లు చేతిలో ఉన్న ఆసీస్ కనీసం 20 ఓవర్లయినా ఆడలేకపోయింది. అశ్విన్‌కు 3 వికెట్లు దక్కాయి. స్పిన్ తిరగడంతో భారత ప్రధాన సీమర్ మొహమ్మద్ సిరాజ్‌కు బంతిని అప్పగించాల్సిన అవసరమే రాలేదు. లంచ్ బ్రేక్ అనంతరం సులువైన లక్ష్యఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్ ఆడాడు. కానీ కేఎల్ రాహుల్ (1) తన వైఫల్యం కొనసాగించాడు. 100వ టెస్టు ఆడుతున్న పుజారా (74 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు) కుదురుగా ఆడగా, మధ్యలో విరాట్ కోహ్లి (31 బంతుల్లో 20; 3 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (12)ల వికెట్లు కూలాయి. అప్పటికే టీమిండియా విజయతీరానికి దగ్గరవగా మిగతా లాంఛనాన్ని కోన శ్రీకర్ భరత్ (22 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి పుజారా పూర్తి చేశాడు. 27వ ఓవర్ వేసిన మర్పీ బౌలింగ్‌లో నాలుగో బంతిని పుజారా మిడ్ వికెట్ మీదుగా బౌండరీకి తరలించి భారత్‌ను గెలిపించాడు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 263; భారత్ తొలి ఇన్నింగ్స్: 262; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: ఉస్మాన్ ఖాజా (సి) శ్రేయస్ అయ్యర్ (బి) జడేజా 6; ట్రవిస్ హెడ్ (సి) శ్రీకర్ భరత్ (బి) అశ్విన్ 43; లబుషేన్ (బి) జడేజా 35; స్మిత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 9; రెన్షా (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 2; హ్యాండ్స్కాంబ్ (సి) కోహ్లి (బి) జడేజా 0; క్యారీ (బి) జడేజా 7; కమిన్స్ (బి) జడేజా 0; లయన్ (బి) జడేజా 8; మర్ఫీ (నాటౌట్) 3; కున్మన్ (బి) రవీంద్ర జడేజా 0; మొత్తం (31.1 ఓవర్లలో ఆలౌట్) 113. వికెట్ల పతనం: 1–23, 2–65, 3–85, 4–95, 5–95, 6–95, 7–95, 8–110, 9–113, 10–113. బౌలింగ్: అశ్విన్ 16–3–59–3, మొహమ్మద్ షమీ 2–0–10–0, రవీంద్ర జడేజా 12.1–1–42–7, అక్షర్ పటేల్ 1–0–2–0. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (రనౌట్) 31; కేఎల్ రాహుల్ (సి) అలెక్స్ క్యారీ (బి) లయన్ 1; చతేశ్వర్ పుజారా (నాటౌట్) 31; విరాట్ కోహ్లి (స్టంప్డ్) క్యారీ (బి) మర్ఫీ 20; శ్రేయస్ అయ్యర్ (సి) మర్ఫీ (బి) నాథన్ లయన్ 12; శ్రీకర్ భరత్ (నాటౌట్) 23; మొత్తం (26.4 ఓవర్లలో 4 వికెట్లకు) 118. వికెట్ల పతనం: 1–6, 2–39, 3–69, 4–88. బౌలింగ్: కున్మన్ 7–0–38–0, నాథన్ లయన్ 12–3–49–2, టాడ్ మర్ఫీ 6.4–2–22–1, ట్రవిస్ హెడ్ 1–0–9–0. 100: అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి ఆస్ట్రేలియాపై భారత్‌కిది 100వ విజయం. మూడు ఫార్మాట్లలో రెండు జట్ల మధ్య 273 మ్యాచ్‌లు జరిగాయి. ఆసీస్‌తో 104 టెస్టులు ఆడిన భారత్ 32 విజయాలు అందుకొని, 43 పరాజయాలు చవిచూసింది. ఒక మ్యాచ్ ‘టై’కాగా, 28 ‘డ్రా’గా ముగిశాయి. 143 వన్డేల్లో టీమిండియా 53 మ్యాచ్‌ల్లో గెలిచి, 80 మ్యాచ్‌ల్లో ఓడింది. 10 మ్యాచ్‌లు రద్దయ్యాయి. 26 టి20 మ్యాచ్‌ల్లో భారత్ 15 విజయాలు సాధించి, 10 మ్యాచ్‌ల్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దయింది. 25012: అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్ (టెస్టు, వన్డే, టి20)లలో కలిపి కోహ్లి సాధించిన పరుగులు (492 మ్యాచ్‌లు). సచిన్ (664 మ్యాచ్‌ల్లో 34, 357 పరుగులు) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ క్రికెటర్ కోహ్లి కాగా... 25 వేల పరుగులు సాధించిన క్రికెటర్ల జాబితా లో కోహ్లి ఆరో స్థానంలో ఉన్నాడు. 8: సొంతగడ్డపై టెస్టుల్లో జడేజాకిది ఎనిమిదో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు. భారత్ తరఫున అనిల్ కుంబ్లే (9 సార్లు) ‘టాప్’లో ఉండగా, సచిన్ (8 సార్లు) సరసన జడేజా నిలిచాడు. సిరాజ్, కోహ్లి, భరత్, జడేజా, అక్షర్ పటేల్ -
Ind Vs Sl 2nd Test: క్లీన్‌స్వీప్ చేసే సమయం ఆసన్నమైంది...
భారత్ టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసే సమయం ఆసన్నమైంది...తొలిరోజు బౌలింగ్‌లో కొంతైనా ప్రతాపం చూపిన శ్రీలంక రెండో రోజు ఇటు బ్యాటింగ్‌లో అటు బౌలింగ్‌లో పూర్తిగా కుదేలైంది. వంద పరుగులు దాటిన కాసేపటికే తొలి ఇన్నింగ్స్‌ను ముగించుకున్న లంక తర్వాత రెండో ఇన్నింగ్స్‌కు దిగిన భారత్‌ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయింది. దీంతో కొండంత లక్ష్యం ముందు లంక ఓడేందుకు చేరువవుతోంది. పంత్ మెరుపు బ్యాటింగ్, అయ్యర్ మరో చక్కటి ఇన్నింగ్స్ రెండో రోజు హైలైట్‌గా నిలిచాయి. బెంగళూరు: రెండో టెస్టులో విజయానికి అవసరమైన ఏర్పాట్లన్నీ భారత్ రెండో రోజే చేసేసింది. ప్రత్యర్థి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ను తక్కువ స్కోరుకే ముగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యానికి తోడు రెండో ఇన్నింగ్స్‌లో పటిష్టమైన స్కోరుతో భారీ లక్ష్యాన్ని నిర్మించింది. ఆదివారం హాయిగా స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులకు రిషభ్‌పంత్ (31 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) పసందైన బ్యాటింగ్ విందు ఇచ్చాడు. రెండో రోజుకు సరిపడే వినోదం అతనిదైతే... మొత్తం మ్యాచ్‌లో భారత్‌ను శ్రేయస్ అయ్యర్ (87 బం తుల్లో 67; 9 ఫోర్లు) పటిష్ట స్థితిలో నిలిపాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 303/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసి శ్రీలంక ముందు 447 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. బుమ్రా వేసిన మూడో బంతికే తిరిమన్నె (0) అవుట్ కాగా, కరుణరత్నే (10 బ్యాటింగ్), కుశాల్ మెండిస్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. శ్రీలంక 109 ఆలౌట్ రెండో రోజు లంకను ఆలౌట్ చేసేందుకు భారత్‌కు ఎక్కువ సేపు పట్టలేదు. ఆదివారం మరో ఆరు ఓవర్లయినా పూర్తిగా ఆడలేకపోయిన ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 35.5 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌ టైంది. ఓవర్‌నైట్ స్కోరుకు మరో 23 పరుగులు మాత్రమే జోడించి జట్టు మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. బుమ్రా కెరీర్లో 8వ సారి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగుల ఆధిక్యం లభించింది. అయ్యర్ మళ్లీ సూపర్ రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (79 బంతుల్లో 46; 4 ఫోర్లు), మయాంక్ అగర్వాల్ (22; 5 ఫోర్లు) నిలకడగా ఆడారు. వీళ్లిద్దరి తర్వాత హనుమ విహారి (35; 4 ఫోర్లు) కాస్త మెరుగనిపించగా, కోహ్లి (13) విఫలమయ్యాడు. మరో వైపు శ్రేయస్ అయ్యర్ మళ్లీ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఐదో వికెట్‌కు పంత్, అయ్యర్ 6.2 ఓవర్లలోనే 45 పరుగులు జోడించారు. జడేజాతో కలిసి శ్రేయస్ కుదురుగా బ్యాటింగ్ చేశాడు. డిన్నర్ బ్రేక్ పూర్తయిన వెంటనే జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. ఆరో వికెట్‌కు వీళ్లిద్దరు 63 పరుగులు జత చేశాక జడేజా (22) అవుటయ్యాడు. ఆ తర్వాత 69 బంతుల్లో అయ్యర్ అర్ధ సెంచరీ పూర్తయింది. వరుసగా రెండు రోజుల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అతను ఫిఫ్టీలతో అదరగొట్టాడు. స్కోరు 300 దాటి 9వ వికెట్ పడగానే భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 252; శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 109; భారత్ రెండో ఇన్నింగ్స్: మయాంక్ (సి) ధనంజయ (బి) ఎంబుల్డెనియా 22; రోహిత్ (సి) మాథ్యూస్ (బి) ధనంజయ 46; విహారి (బి) జయవిక్రమ 35; కోహ్లి (ఎల్బీ) (బి) జయవిక్రమ 13; పంత్ (సి) అండ్ (బి) జయవిక్రమ 50; అయ్యర్ (ఎల్బీ) (బి) ఎంబుల్డెనియా 67; జడేజా (బి) ఫెర్నాండో 22; అశ్విన్ (సి) డిక్వెలా (బి) జయవిక్రమ 13; అక్షర్ (బి) ఎంబుల్డెనియా 9; షమీ నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (68.5 ఓవర్లలో) 303/9 డిక్లేర్డ్. వికెట్ల పతనం: 1–42, 2–98, 3–116, 4–139, 5–184, 6–247, 7–278, 8–278, 9–303. బౌలింగ్: లక్మల్ 10–2–34–0; ఎంబుల్డెనియా 20.5–1–87–3, ఫెర్నాండో 10–2–48–1, ధనంజయ 9–0–47–1, జయవిక్రమ 19–2–78–4. -
అందుకే మళ్లీ సినిమాల్లో నటిస్తున్నా!
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాధేశ్యామ్’. వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేశారు అప్పటి ‘మైనే ప్యార్ కియా’ ఫేమ్ భాగ్యశ్రీ. ఈ సినిమాలో నటించడం గురించి భాగ్యశ్రీ మాట్లాడుతూ – ‘‘హీరోయిన్గా నా మొదటి సినిమా ‘మైనే ప్యార్ కియా’ (హీరోగా సల్మాన్ ఖాన్‌కి కూడా ఇది తొలి సినిమా). ఈ సినిమా తర్వాత మరికొన్ని సినిమాలు చేశాను. కెరీర్ బాగున్నప్పటికీ పెళ్లి చేసుకోవడానికి అది సరైన సమయం అని, అప్పుడు చేసుకుంటే మంచి ఫ్యామిలీ బాండింగ్ ఏర్పడుతుందని హిమాలయ్‌ని పెళ్లి చేసుకున్నాను. కుటుంబ బాధ్యతలు, పిల్లల పోషణతో బిజీగా ఉన్నందువల్ల సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లయ్యారు. అందుకని నా భర్త, పిల్లలు తిరిగి నన్ను సినిమాల్లో నటించమని సపోర్ట్ చేస్తున్నారు. దీంతో సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేశాను. ప్రభాస్ ‘రాధేశ్యామ్’, కంగనా రనౌత్ ‘తలైవి’ (తమిళనాడు మాజీ సీయం, ప్రముఖ నటి జయలలిత బయోపిక్) చిత్రాల్లో యంగ్ మదర్ క్యారెక్టర్స్ చేసే అవకాశాలు వచ్చాయి. అయితే కరోనా వల్ల ‘రాధేశ్యామ్’ విడుదల వాయిదా పడింది. ‘రాధేశ్యామ్’ వంటి సినిమాలో తల్లి పాత్ర చేసినందుకు గర్వంగా ఉంది. ప్రభాస్ గొప్ప నటుడు.. నిగర్వి కూడా. ఈ చిత్రనిర్మాతలు మేకింగ్ విషయంలో రాజీ పడలేదు. జార్జియాలో గడ్డకట్టే చలిలో షూటింగ్ జరిగినప్పుడు కూడా యూనిట్‌ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘బాలీవుడ్‌వారు ఇప్పుడు తెలుగు, తమిళ చిత్రాలవైపే చూస్తున్నారు. తెలుగు పరిశ్రమ నుంచి మంచి సినిమాలు వస్తున్నాయి. తెలుగులో మదర్ క్యారెక్టర్స్ మాత్రమే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న అన్ని పాత్రలు చేయాలని ఉంది’’ అని చెప్పుకొచ్చారు భాగ్యశ్రీ. -
ఎందాక ఈ ఎదురీత!
లీడ్స్: తొలి ఇన్నింగ్స్ వైఫల్యాల్ని అధిగమించేందుకు భారత బ్యాట్స్‌మెన్ రెండో ఇన్నింగ్స్‌లో పట్టుదలతో ఆడుతున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ (156 బంతుల్లో 59; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, చతేశ్వర్ పుజారా (180 బంతుల్లో 91 బ్యాటింగ్; 15 ఫోర్లు) సెంచరీకి చేరువయ్యాడు. కెప్టెన్ కోహ్లి (94 బంతుల్లో 45 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో పాతుకుపోయాడు. 80 ఓవర్లు అంటే దాదాపు రోజంతా (సాధారణంగా 90 ఓవర్లు) బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం రెండే వికెట్లు సమర్పించుకుంది. మూడో రోజు ఆట నిలిచే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 215 పరుగులు చేసింది. రాబిన్సన్, ఓవర్టన్‌లకు చెరో వికెట్ దక్కింది. ప్రస్తుతం భారత్ ఇంకా 139 పరుగులు వెనుకబడే ఉంది. ఆట నాలుగో రోజు పుజారా, కోహ్లి సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడటంతోపాటు ఇతర బ్యాట్స్‌మెన్ రహానే, జడేజా, పంత్ కూడా కదంతొక్కితే ఈ మ్యాచ్‌లో భారత్ కోలుకునే అవకాశం ఉంది. 9 పరుగులే చేసి... మూడో రోజు ఇంగ్లండ్ ఎక్కువ సేపు ఏమీ ఆడలేదు. ఓవర్‌నైట్ స్కోరు 423/8తో శుక్రవారం ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ మరో 9 పరుగులు చేసి 432 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. ఓవర్టన్ (32; 6 ఫోర్లు)ను షమీ ఎల్బీగా పంపించగా... రాబిన్సన్ (0)ను బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేశాడు. షమీ 4 వికెట్లను పడగొట్టగా, బుమ్రా, సిరాజ్, స్పిన్నర్ జడేజా తలా 2 వికెట్లు తీశారు. అయితే ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 354 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆ ఇద్దరు నిలబడ్డారు... ప్రత్యర్థి కొండంత ఆధిక్యంలో ఉంది. దీన్ని కరిగించాలంటే క్రీజులో పాతుకుపోవాలి. ఇంకో దారేం లేదు. ఇలాంటి స్థితితో రోహిత్, రాహుల్ అదే పని చేశారు. 16వ ఓవర్లో రాబిన్సన్ వేసిన బౌన్సర్‌ను రోహిత్ థర్డ్‌మ్యాన్ దిశగా సిక్సర్ బాదాడు. గంటన్నరపాటు క్రీజులో నిలిచిన రాహుల్ (54 బంతుల్లో 8) చివరకు ఓవర్టన్ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. అప్పుడే 34/1 స్కోరు వద్ద భారత్ లంచ్‌కు వెళ్లింది. తర్వాత పుజారా క్రీజులోకి రాగా ఇంగ్లండ్ బౌలర్లకు ఇంకో వికెట్ కోసం సుదీర్ఘ శ్రమ తప్పలేదు. రోహిత్ 125 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. రెండో సెషన్లో ఇంగ్లండ్ పేస్ వాడిపోగా... భారత బ్యాట్స్‌మెన్‌లో ధీమా పెరిగింది. కొన్నాళ్లుగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయిన పుజారా ఈ మ్యాచ్‌లో రోహిత్‌తో చక్కని భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో ఇంగ్లండ్ బౌలర్లకు ఈ సెషన్లో అలసటే తప్ప వికెట్లు రాలేదు. ఆఖరి సెషన్లో రోహిత్ ఔటైనప్పటికీ పుజారా... కెప్టెన్ కోహ్లి అండతో ఫిఫ్టీ సాధించాడు. ఇద్దరు కలిసి జట్టు స్కోరును 200 మార్క్‌ను దాటించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 78; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 432; భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (ఎల్బీడబ్ల్యూ) (బి) రాబిన్సన్ 59; కేఎల్ రాహుల్ (సి) బెయిర్‌స్టో (బి) ఓవర్టన్ 8; పుజారా (బ్యాటింగ్) 91; విరాట్ కోహ్లి (బ్యాటింగ్) 45; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (80 ఓవర్లలో 2 వికెట్లకు) 215. వికెట్ల పతనం: 1–34, 2–116. బౌలింగ్: అండర్సన్ 19–8–51–0, రాబిన్సన్, 18–4–40–1, ఓవర్టన్ 17–6–35–1, స్యామ్ కరన్ 9–1–40–0, మొయిన్ అలీ 11–1–28–0, రూట్ 6–1–15–0. -
రెండే రోజుల్లో మట్టికరిపించేశారు
కొత్త స్టేడియంలో స్పిన్నర్ల బంతులు సుడులు తిరిగాయి. బ్యాట్స్‌మెన్‌ను కట్టిపడేశాయి. స్పిన్ది మాయో లేదంటే పిచ్‌దే మంత్రమో కానీ మ్యాచ్ అయితే రెండు రోజులు కూడా పూర్తిగా జరగముందే ఫలితం వచ్చింది. గిరగిరా తిరిగే బంతులకు ఇరు జట్లు దాసోహమనగా...చివరకు ‘లోకల్ బాయ్’ అక్షర్ పటేల్ 11 వికెట్లతో (రెండు ఇన్నింగ్స్‌ల్లో) భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 2–1తో టెస్టు చాంపియన్‌షిప్ రేసులో టీమిండియా ముందడుగు వేసింది. అహ్మదాబాద్: భారత్ స్పిన్‌తో మరో మ్యాచ్ విన్నయ్యింది. డేనైట్ టెస్టును రెండు రోజుల్లోనే ముగించింది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్ (5/32), అశ్విన్ (4/48) చెలరేగడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 30.4 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌటైంది. అంతకు ముందు గురువారం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 53.2 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలడంతో లభించిన 33 పరుగుల ఆధిక్యాన్ని మినహాయించి భారత్ ముందు 49 పరుగుల లక్ష్యం నిలిచింది. రోహిత్ శర్మ (25 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), శుబ్‌మన్ గిల్ (15 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) 7.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 11 వికెట్లు తీసిన అక్షర్ పటేల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. 46 పరుగులకు 7 వికెట్లు... రెండో రోజు 99/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన భారత్ కేవలం 46 పరుగులే చేసి 7 వికెట్లను కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ రహానే (7), రోహిత్ (96 బంతుల్లో 66; 11 ఫోర్లు) ఆట మొదలైన కాసేపటికే నిష్క్రమించగా... తర్వాత వచ్చిన వారి ఆట ఎంతోసేపు సాగనే లేదు. పిచ్ సానుకూలతల్ని వినియోగించుకున్న ఇంగ్లండ్ కెప్టెన్, పార్ట్‌టైమ్ బౌలర్ రూట్ 5 వికెట్లు పడగొట్టడం విశేషం. మళ్లీ టపటపా వెంటనే ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ వికెట్లు రాలడంతోనే మొదలైంది. తొలి ఓవర్ వేసిన అక్షర్ మొదటి బంతికి క్రాలీ (0)ని, మూడో బంతికి బెయిర్‌స్టో (0)ను ఔట్ చేశాడు. ఇలా మొదలైన పతనంతో డిన్నర్ బ్రేక్‌కు ముందే ఆలౌటైంది. ఇన్నింగ్స్ మొత్తం మీద బెన్ స్టోక్స్ (25), రూట్ (19), పోప్ (12) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఫోక్స్ (8), లీచ్ (9), ఆర్చర్ (0), అండర్సన్ (0) స్పిన్ ఉచ్చులో తేలిగ్గానే పడిపోయారు. దీంతో రెండో ఇన్నింగ్స్ 81 పరుగుల వద్దే ముగియగా భారత్ 49 పరుగుల లక్ష్యాన్ని అబేధ్యమైన ఓపెనింగ్‌తో ముగించింది. ఇంగ్లండ్ ఖేల్ ఖతం! తాజా విజయంతో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్ మరింత చేరువైంది. చివరి టెస్టులో గెలిస్తే 3–1తో ఫైనల్ చేరగలిగే భారత్, మ్యాచ్ ‘డ్రా’ అయినా సరే 2–1తో ముందంజ వేస్తుంది. మూడో టెస్టులో ఓటమితో సొంత గడ్డపై డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే అవకాశాలు ఇంగ్లండ్ చేజార్చుకుంది. ఆ జట్టుకు ఇక ఎలాంటి అవకాశం లేదు. అయితే చివరి టెస్టులో ఇంగ్లండ్ గెలిస్తే 2–2తో సిరీస్ ముగుస్తుంది. అప్పుడు ఇంగ్లండ్‌తో పాటు భారత్‌ను కూడా వెనక్కి నెట్టి ఆస్ట్రేలియా ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 112 భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) లీచ్ 66; గిల్ (సి) క్రాలీ (బి) ఆర్చర్ 11; పుజారా (ఎల్బీ) (బి) లీచ్ 0; కోహ్లి (బి) లీచ్ 27; రహానే (ఎల్బీ) (బి) లీచ్ 7; పంత్ (సి) ఫోక్స్ (బి) రూట్ 1; అశ్విన్ (సి) క్రాలీ (బి) రూట్ 17; సుందర్ (బి) రూట్ 0; అక్షర్ (సి) సిబ్లీ (బి) రూట్ 0; ఇషాంత్ నాటౌట్ 10; బుమ్రా (ఎల్బీ) (బి) రూట్ 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (53.2 ఓవర్లలో ఆలౌట్) 145. వికెట్ల పతనం: 1–33, 2–34, 3–98, 4–114, 5–115, 6–117, 7–125, 8–125, 9–134, 10–145. బౌలింగ్: అండర్సన్ 13–8–20–0, బ్రాడ్ 6–1–16–0, ఆర్చర్ 5–2–24–1, లీచ్ 20–2–54–4, స్టోక్స్ 3–0–19–0, రూట్ 6.2–3–8–5. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (బి) అక్షర్ 0, సిబ్లీ (సి) పంత్ (బి) అక్షర్ 7; బెయిర్‌స్టో (బి) అక్షర్ 0; రూట్ (ఎల్బీ) (బి) 19; స్టోక్స్ (ఎల్బీ) (బి) అశ్విన్ 25; పోప్ (బి) అశ్విన్ 12; ఫోక్స్ (ఎల్బీ) (బి) అక్షర్ 8; ఆర్చర్ (ఎల్బీ) (బి) అశ్విన్ 0; లీచ్ (సి) రహానే (బి) అశ్విన్ 9; బ్రాడ్ నాటౌట్ 1; అండర్సన్ (సి) పంత్ (బి) సుందర్ 0; మొత్తం (30.4 ఓవర్లలో ఆలౌట్) 81. వికెట్ల పతనం: 1–0, 2–0, 3–19, 4–50, 5–56, 6–66, 7–68, 8–80, 9–80, 10–81. బౌలింగ్: అక్షర్ 15–0–32–5, అశ్విన్ 15–3–48–4, సుందర్ 0.4–0–1–1. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ నాటౌట్ 25; గిల్ నాటౌట్ 15; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (7.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 49. బౌలింగ్: లీచ్ 4–1–15–0, రూట్ 3.4–0–25–0. రూట్, రోహిత్ -
చెన్నపట్నం చిన్నోడు.. రవిచంద్రన్ అశ్విన్
‘చెపాక్ మైదానంలో సెంచరీ చేయడం నా చిన్ననాటి కల’... కొన్నాళ్ల క్రితం రవిచంద్రన్ అశ్విన్ చెప్పిన మాట ఇది. 34 ఏళ్ల వయసులో కెరీర్ దాదాపు చివరి దశకు వచ్చిన తర్వాత అతను తన కోరికను నెరవేర్చుకున్నాడు. మళ్లీ చెన్నైలో అతను ఎప్పుడు టెస్టు ఆడగలడో తెలీదు కానీ సోమవారం మాత్రం అతను తన బ్యాటింగ్‌లో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాడు. అందుకే శతకం పూర్తయ్యాక తనకు అండగా నిలిచిన అభిమానులను ఎవరినీ మరచిపోలేదన్నట్లుగా ప్రేక్షకులు ఉన్న ప్రతీ ఒక్క గ్యాలరీ వైపు మళ్లీ మళ్లీ బ్యాట్ చూపిస్తూ ‘థ్యాంక్స్’ చెప్పాడు. ఒక బౌలర్‌గా సొంత మైదానంలో అశ్విన్ ఖాతాలో చెప్పుకోదగ్గ గణాంకాలే ఉన్నాయి. తాజా సిరీస్‌లో రెండుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అశ్విన్ అంతకుముందే మరో రెండుసార్లు చెన్నైలో ఈ ఘనత సాధించాడు. అయితే ఈసారి తన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను అతను చిరస్మరణీయం చేసుకున్నాడు. బ్యాట్స్‌మన్‌గా కెరీర్ మొదలు పెట్టి జూనియర్ స్థాయి వరకు అలాగే కొనసాగి ఆపై ఆఫ్‌స్పిన్నర్‌గా మారిన అశ్విన్‌లోని అసలైన బ్యాట్స్‌మన్ ఇక్కడ మళ్లీ కనిపించాడు. నిజానికి కెరీర్ ఆరంభంలో చక్కటి ఆటతీరు కనబర్చినా ఆ తర్వాత అశ్విన్ బ్యాటింగ్ కళ మసకబారింది. 2017 ఆగస్టు తర్వాత అతను కనీసం ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. అయితే ఇటీవల సిడ్నీలో మ్యాచ్‌ను కాపాడిన ఇన్నింగ్స్ అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచిందనడంలో సందేహం లేదు. ఈ సిరీస్‌లో కూడా జడేజా లేకపోవడంతో బ్యాటింగ్‌పరంగా కూడా అశ్విన్‌పై బాధ్యత పెరిగింది. అయితే గతంలో అతను సాధించిన నాలుగు టెస్టు సెంచరీలతో (అన్నీ వెస్టిండీస్‌పైనే) పోలిస్తే సోమవారం పరిస్థితులు భిన్నం. అశ్విన్ క్రీజ్‌లో వచ్చే సమయానికి భారత్ మంచి ఆధిక్యంలో ఉన్నా సరే... పిచ్ అంత అనుకూలంగా లేదు. పరుగులు సునాయాసంగా వచ్చేలా కనిపించడం లేదు. ఒకే సెషన్లో జట్టు ఐదు వికెట్లు కోల్పోయిందంటే ఇకపై ఎలా ఆడాలన్న ఒక సందిగ్ధతతో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఈ దశలో అతను అతను తన ఇన్నేళ్ల అనుభవాన్ని చూపించాడు. ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య క్రీజ్‌లోకి వచ్చిన ఈ మదరాసీ తొలి ఐదు బంతుల్లోనే రెండు ఫోర్లు కొట్టి తన ఉద్దేశాన్ని ప్రదర్శించాడు. అతని ఇన్నింగ్స్‌లో స్వీప్ షాట్లు హైలైట్‌గా నిలిచాయి. చదవండి: (వహ్వా.. చెపాక్ తలైవా!) మొదటి నాలుగు బౌండరీలను స్వీప్ ద్వారానే రాబట్టిన అశ్విన్ పదే పదే ఆ షాట్‌తో ఫలితం సాధించాడు. ‘ఎప్పుడో అండర్–19 స్థాయిలో స్వీప్ షాట్లు ఆడాను. వాటి కారణంగా తుది జట్టులో చోటు పోవడంతో వదిలేశాను. గత 13–14 ఏళ్లుగా స్వీప్ షాట్ ఆడనే లేదు. ఇప్పుడు మాత్రం పిచ్‌ను దృష్టిలో పెట్టుకొని తీవ్రంగా సాధన చేశాను’ అని అతను స్వయంగా చెప్పాడు. 64 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. సాహసవంతులకే అదృష్టం కూడా కలిసొస్తుందన్నట్లుగా రెండుసార్లు అశ్విన్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బ్రాడ్ బౌలింగ్‌లో స్టోక్స్ క్యాచ్ వదిలేసినప్పుడు అశ్విన్ స్కోరు 29 పరుగులు కాగా, 56 పరుగుల వద్ద బ్రాడ్ బౌలింగ్‌లోనే కీపర్ ఫోక్స్ క్యాచ్ అందుకోలేకపోయాడు. అయితే మరో ఎండ్‌లో కోహ్లి, కుల్దీప్, ఇషాంత్ తక్కువ వ్యవధిలో అవుట్ కావడంతో అశ్విన్ సెంచరీ సాధించడం దాదాపు అసాధ్యంగా అనిపించింది. చివరి బ్యాట్స్‌మన్ సిరాజ్ క్రీజ్‌లోకి వచ్చే సమయానికి అశ్విన్ స్కోరు 77 పరుగులు! ఈ దశలో సిరాజ్ పట్టుదలగా నిలబడి అశ్విన్‌కు సహకరించాడు. పదో వికెట్‌కు వీరిద్దరి మధ్య 49 పరుగులు భాగస్వామ్యం నమోదైంది. లీచ్ బౌలింగ్‌లో ఫోర్‌తో 90ల్లోకి వచ్చిన అశ్విన్... అలీ ఓవర్లో మిడ్ వికెట్ మీదుగా స్లాగ్ స్వీప్‌లో సిక్సర్ బాది 97 వద్ద నిలిచాడు. అదే ఓవర్లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించగా, బంతి స్లిప్స్ మీదుగా బౌండరీని చేరింది. అంతే... తన ఆనందాన్ని ప్రదర్శిస్తూ మైదానంలో అశ్విన్ సంబరాలు చేసుకున్నాడు. మరో ఎండ్‌లో సిరాజ్ కూడా తానే సెంచరీ చేసినంతగా సందడి చేయడం విశేషం. తాను ఓనమాలు నేర్చిన చోట బ్యాట్‌తోనూ అశ్విన్ సాధించిన ఈ ఘనత ఎప్పటికీ అతనికి ప్రత్యేకంగా నిలిచిపోతుంది. చదవండి: వైరల్: అశ్విన్ సెంచరీ.. సిరాజ్ స్పందన కాస్తైనా కనికరం లేదా అశ్విన్..! -
వహ్వా.. చెపాక్ తలైవా!
‘నేను చెప్పింది ఎలాగూ చేస్తాను... కానీ నేను చెప్పనిది కూడా చేస్తాను’... రజినీకాంత్ ‘అన్నామలై’ సినిమాలోని సూపర్‌హిట్ డైలాగ్ ఇది. రజినీకి వీరాభిమాని అయిన చెన్నై తలైవా రవిచంద్రన్ అశ్విన్ ఇదే మాట ఇంగ్లండ్ జట్టుకు చెప్పినట్లున్నాడు. తన బలమైన స్పిన్‌తో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన అశ్విన్, భారత్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తోనూ చెలరేగాడు. స్పిన్ పిచ్, బ్యాటింగ్‌కు కష్టమంటూ చెబుతున్నవన్నీ ఒట్టి మాటలే అంటూ రుజువు చేస్తూ అశ్విన్ అనూహ్యంగా చెలరేగడంతో ప్రత్యర్థి జట్టు నివ్వెరపోయింది. కీలక సమయంలో అద్భుత ప్రదర్శనతో సెంచరీ సాధించిన అతను రెండో టెస్టును పూర్తిగా టీమిండియా చేతుల్లోకి తెచ్చేశాడు. అసాధ్యమైన 482 పరుగుల లక్ష్య ఛేదనలో ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను మరో రెండు రోజులు ఎలాంటి వాన, తుఫాన్లు కూడా రక్షించే పరిస్థితి లేదు. అహ్మదాబాద్‌లో జరిగే ‘పింక్ టెస్టు’కు ముందు టెస్టు సిరీస్ 1–1తో సమం కావడం ఇక లాంఛనమే. చెన్నై: ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో భారత్ విజయం దిశగా సాగుతోంది. 482 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మూడో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. లారెన్స్ (19 బ్యాటింగ్), రూట్ (2 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 54/1తో ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది. రవిచంద్రన్ అశ్విన్ (148 బంతుల్లో 106; 14 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో ఐదో సెంచరీ చేయగా, కోహ్లి (149 బంతుల్లో 62; 7 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 96 పరుగులు జోడించారు. సూపర్ ఫోక్స్... మూడో రోజు తొలి సెషన్లో ఇంగ్లండ్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ సెషన్లో భారత్ ఐదు వికెట్లు కోల్పోవడం విశేషం. సోమవారమే తన 28వ పుట్టిన రోజు జరుపుకున్న వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ ఇందులో కీలకపాత్ర పోషించాడు. తొలి ఓవర్లోనే చతేశ్వర్ పుజారా (7) దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. అలీ బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్ ఆడగా బంతి షార్ట్ లెగ్ ఫీల్డర్ పోప్ వద్దకు వెళ్లింది. అతని త్రోను అందుకొని ఫోక్స్ స్టంప్స్‌ను పడగొట్టాడు. పుజారా సరైన సమయంలోనే వెనుదిరిగినా అతని బ్యాట్ పిచ్‌లో ఇరుక్కుపోవడంతో రనౌట్ తప్పలేదు. అదే స్కోరు వద్ద ఫోక్స్ అద్భుత స్టంపింగ్‌తో రోహిత్ శర్మ (26) అవుటయ్యాడు. కొద్ది సేపటికే లీచ్ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయిన పంత్ (8)ను కూడా ఫోక్స్ స్టంపౌట్ చేశాడు. రహానే (10) కూడా ఎక్కువ సేపు నిలబడలేకపోగా, అక్షర్ పటేల్ (7) వికెట్ల ముందు దొరికిపోయాడు. 1968 (అలెన్ నాట్) తర్వాత ఒక ఇంగ్లండ్ వికెట్ కీపర్ టెస్టు మ్యాచ్‌లో మూడు స్టంపింగ్‌లు చేయడం (ఫోక్స్) ఇదే మొదటిసారి. కోహ్లి నిలకడ... భారత్ స్కోరు 106/6గా నిలిచిన దశలో జట్టును ఆదుకునే బాధ్యత కోహ్లి తనపై వేసుకున్నాడు. అశ్విన్ సహకారంతో అతను ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడుతూ 20వ బంతికి గానీ తొలి పరుగు తీయని కెప్టెన్... నిలదొక్కుకున్న తర్వాత తనదైన శైలిలో చూడచక్కటి షాట్లు ఆడాడు. లంచ్ తర్వాత మరింత ఆత్మవిశ్వాసం ప్రదర్శించిన కోహ్లి 107 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లి, అశ్విన్ భాగస్వామ్యం శతకానికి చేరువవుతున్న దశలో అలీ ఈ జోడీని విడదీశాడు. అలీ బౌలింగ్‌లో విరాట్ ఎల్బీగా వెనుదిరగాల్సి వచ్చింది. అంపైర్ నిర్ణయంపై అతను రివ్యూ కోరినా ఫలితం లేకపోయింది. కుల్దీప్ (3), ఇషాంత్ (7) తొందరగానే వెనుదిరిగినా అశ్విన్‌కు సిరాజ్ (16 నాటౌట్) అండగా నిలిచాడు. చివర్లో సిరాజ్ రెండు భారీ సిక్సర్లతో ప్రేక్షకులను అలరించాడు. అశ్విన్ సెంచరీ తర్వాత కూడా భారత జట్టు డిక్లేర్ చేయకుండా ఆలౌట్ అయ్యే వరకు ఆటను కొనసాగించింది. రోహిత్ స్టంపౌట్ అదే తడబాటు... ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ రెండో ఇన్నింగ్స్‌లోనూ కాస్త పట్టుదల కనబర్చలేకపోయారు. అక్షర్ బంతిని ఆడలేక సిబ్లీ (3) వికెట్ల ముందు దొరికిపోగా, దూకుడు ప్రదర్శించేందుకు ప్రయత్నించిన రోరీ బర్న్స్ (25) ఆటను అశ్విన్ ముగించాడు. నైట్ వాచ్‌మన్ లీచ్ (0) తొలి బంతికే వెనుదిరగడంతో రూట్ బరిలోకి దిగక తప్పలేదు. ఆ తర్వాత రూట్ విషయంలో అంపైర్ నిర్ణయం కోహ్లి ఆగ్రహానికి కారణమైంది. కోహ్లికి కోపమొచ్చింది... ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో రూట్ అవుట్ కోసం భారత్ చేసిన అప్పీల్ఫలితం ప్రతికూలంగా రావడం విరాట్ కోహ్లికి ఆగ్రహం తెప్పించింది. అక్షర్ బౌలింగ్‌లో క్యాచ్ పట్టిన పంత్ అప్పీల్ చేయగా, అంపైర్ నితిన్ మీనన్ నాటౌట్‌గా ప్రకటించాడు. దాంతో భారత్ రివ్యూ కోరింది. అయితే రీప్లేలో బంతి బ్యాట్‌కు తాకలేదని స్పష్టం కావడంతో ఎల్బీడబ్ల్యూ కోసం కూడా థర్డ్ అంపైర్ చెక్ చేశాడు. వికెట్ల ముందే రూట్ ప్యాడ్‌కు బంతి తగిలినట్లుగా స్పష్టంగా కనిపిస్తున్నా... బాల్ ట్రాకర్ ప్రకారం ‘అంపైర్ కాల్’ అంటూ థర్డ్ అంపైర్ ప్రకటించడంతో రూట్ బతికిపోయాడు. దీనిపై కోహ్లి అంపైర్‌తో వాదనకు దిగగా, మైదానం బయట నుంచి హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా ఇదే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 329; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 134; భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (స్టంప్డ్) ఫోక్స్ (బి) లీచ్ 26; గిల్ (ఎల్బీ) (బి) లీచ్ 14; పుజారా (రనౌట్) 7; కోహ్లి (ఎల్బీ) (బి) అలీ 62; పంత్ (స్టంప్డ్) ఫోక్స్ (బి) లీచ్ 8; రహానే (సి) పోప్ (బి) అలీ 10; అక్షర్ (ఎల్బీ) (బి) అలీ 7; అశ్విన్ (బి) స్టోన్ 106; కుల్దీప్ (ఎల్బీ) (బి) అలీ 3; ఇషాంత్ (సి) స్టోన్ (బి) లీచ్ 7; సిరాజ్ (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (85.5 ఓవర్లలో ఆలౌట్) 286. వికెట్ల పతనం: 1–42, 2–55, 3–55, 4–65, 5–86, 6–106, 7–202, 8–210, 9–237, 10–286. బౌలింగ్: స్టోన్ 6.5–1–21–1, లీచ్ 33–6–100–4, మొయిన్ అలీ 32–7–98–4, రూట్ 4–0–15–0, స్టువర్ట్ బ్రాడ్ 9–3–25–0, లారెన్స్ 1–0–7–0. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: బర్న్స్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 25; సిబ్లీ (ఎల్బీ) (బి) అక్షర్ 3; లారెన్స్ (బ్యాటింగ్) 19; లీచ్ (సి) రోహిత్ (బి) అక్షర్ 0; రూట్ (బ్యాటింగ్) 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19 ఓవర్లలో 3 వికెట్లకు) 53. వికెట్ల పతనం: 1–17, 2–49, 3–50. బౌలింగ్: ఇషాంత్ శర్మ 2–1–6–0, అక్షర్ పటేల్ 9–3–15–2, అశ్విన్ 8–1–28–1. ఒక టెస్టులో ఐదు వికెట్లు తీయడంతోపాటు సెంచరీ సాధించడం అశ్విన్‌కు మూడోసారి. రెండుసార్లు ఈ ఫీట్ చేసిన సోబర్స్, ముస్తాక్ మొహమ్మద్, కలిస్, షకీబ్‌లను అశ్విన్ అధిగమించగా... ఇయాన్ బోథమ్ (5 సార్లు) మాత్రమే ముందున్నాడు. సెంచరీతో పాటు మ్యాచ్‌లో పది వికెట్లు తీసిన రికార్డు ఇప్పటి వరకు బోథమ్, ఇమ్రాన్ ఖాన్, షకీబ్ మాత్రమే నమోదు చేయగా, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ మరో 4 వికెట్లు తీస్తే వారి సరసన చేరతాడు. -
చెన్నైలో గెలుస్తారా, మనోళ్లు నిలుస్తారా!
టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక జట్టు నాలుగో ఇన్నింగ్స్‌లో సాధించిన అత్యధిక పరుగుల ఛేదన 418 పరుగులు... ఇప్పుడు భారత్ ముందు దానికంటే మరో రెండు పరుగుల ఎక్కువ విజయ లక్ష్యం నిలిచింది. అందుబాటులో కనీసం 90 ఓవర్లు ఉండగా, తొమ్మిది వికెట్లు ఉన్నాయి. కొన్నాళ్లుగా టీమిండియా పఠిస్తున్న దూకుడు మంత్రంతో ఈ లక్ష్యాన్ని సాధించే సాహసం చేస్తుందా లేక ఆత్మ రక్షణ ధోరణిలో ఆడి ‘డ్రా’గా ముగిస్తే చాలని ప్రయత్నిస్తుందా అనేది ఆసక్తికరం. ఎన్నో ఏళ్లలో భారత జట్టుకు సొంతగడ్డపై ఎదురుకాని పరిస్థితి ఇది! భారత్‌ను ఈ స్థితిలో పడేసిన ఇంగ్లండ్ మాత్రం తొమ్మిది వికెట్లు తీయడమే లక్ష్యంగా గెలుపుపై గురి పెట్టింది. అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్, గింగిరాలు తిరుగుతూ వెళ్లిన కొన్ని బంతులు పర్యాటక జట్టుకు విజయంపై ఆశలు రేపుతున్నాయి. తమ బౌలర్ల ప్రతిభతో మ్యాచ్ నాలుగో రోజు ఏకంగా 241 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కినా, ఫాలోఆన్ ఇవ్వకుండా రూట్ సేన రెండో ఇన్నింగ్స్ ఆడగా... భారత్ మెరుగైన బౌలింగ్‌తో కట్టడి చేయగలిగింది. ఆరు వికెట్లతో అశ్విన్ ఇందులో కీలకపాత్ర పోషించడం విశేషం. చెన్నై: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు ఉత్కంఠభరిత ఘట్టానికి చేరింది. 420 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 39 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (12) పెవిలియన్ చేరగా, ప్రస్తుతం శుబ్‌మన్ గిల్ (15 బ్యాటింగ్), పుజారా (12 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. చివరిరోజు భారత్ విజయం కోసం మరో 381 పరుగులు చేయాల్సి ఉంది. ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 178 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (32 బంతుల్లో 40; 7 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, రవిచంద్రన్ అశ్విన్ (6/61) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అంతకుముందు భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 337 పరుగులకు ఆలౌటైంది. సోమవారం మరో 80 పరుగులు జోడించిన టీమిండియా చివరి 4 వికెట్లు కోల్పోయింది. ఫలితంగా ఇంగ్లండ్‌కు 241 పరుగుల ఆధిక్యం లభించింది. వాషింగ్టన్ సుందర్ (138 బంతుల్లో 85 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి చక్కటి ప్రదర్శన కనబర్చాడు. 80 పరుగులు...4 వికెట్లు... సొంత మైదానంలో సుందర్, అశ్విన్ (91 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్)ల భాగస్వామ్యం భారత జట్టుకు కాస్త చెప్పుకోదగ్గ స్కోరును అందించింది. ఓవర్‌నైట్ స్కోరు 257/6తో సోమవారం ఆటను కొనసాగిస్తూ వీరిద్దరు చకచకా పరుగులు జోడించారు. ఈ క్రమంలో 82 బంతుల్లో సుందర్ టెస్టుల్లో వరుసగా రెండో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎట్టకేలకు ఏడో వికెట్‌కు 80 పరుగులు జోడించాక అశ్విన్‌ను అవుట్ చేసి లీచ్ ఈ జంటను విడగొట్టాడు. ఆ తర్వాత ఒకవైపు సుందర్ ధాటిగా ఆడినా... మరో ఎండ్‌లో నదీమ్ (0), ఇషాంత్ (4), బుమ్రా (0) నిలబడలేకపోవడంతో ఇంగ్లండ్ స్కోరుకు చాలా దూరంలో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. రూట్ మినహా... రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడి తక్కువ సమయంలో ఎక్కువ పరుగులు జోడిద్దామని భావించిన ఇంగ్లండ్ ఆ ప్రయత్నంలో కొంత వరకే సఫలమైంది. భారీ ఆధిక్యంతో ఆట ప్రారంభించిన ఆ జట్టుకు తొలి బంతికే షాక్ తగిలింది. అశ్విన్ చక్కటి బౌలింగ్‌ను ఆడలేక రోరీ బర్న్స్ (0) స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌లో రూట్ మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోరు సాధించలేకపోయారు. సిబ్లీ (16)ని కూడా అశ్విన్ పెవిలియన్ పంపించగా... లారెన్స్ (18)ను అవుట్ చేసి ఇషాంత్ కెరీర్లో 300వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు రూట్ మాత్రం అశ్విన్, నదీమ్ ఓవర్లలో రెండేసి ఫోర్లు బాది ధాటిని ప్రదర్శించాడు. అయితే స్టోక్స్ (7) విఫలం కాగా, రూట్‌ను బుమ్రా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. అనంతరం కొన్ని ఆకట్టుకునే షాట్లు ఆడిన ఒలీ పోప్ (32 బంతుల్లో 28; 3 ఫోర్లు) నదీమ్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. అంతే?... ఈ వికెట్‌తో ఇంగ్లండ్ దృక్పథం మారిపోయింది. అప్పటి వరకు జోరు ప్రదర్శించిన జట్టు రక్షణాత్మకంగా ఆడింది. వేగంగా పరుగులు చేయడంకంటే సాధ్యమైనన్ని ఎక్కువ ఓవర్లు ఆడాలనే భావనతో ఉన్నట్లు కనిపించింది. ఈ దశలో డిక్లేర్ చేయడంకంటే ఆలౌట్ అయ్యే వరకు ఆడేందుకు నిశ్చయించుకుంది. ఈ క్రమంలో డామ్ బెస్ (55 బంతుల్లో 25; 3 ఫోర్లు), జోస్ బట్లర్ (40 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించారు. అయితే అశ్విన్ చక్కటి బౌలింగ్‌తో చివరి నాలుగు వికెట్లలో మూడు పడగొట్టడంతో ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. రోహిత్ మళ్లీ... భారీ లక్ష్యంతో ఆట ప్రారంభించిన భారత్‌కు శుభారంభం లభించలేదు. ఆర్చర్ ఓవర్లో వరుసగా ఫోర్ కొట్టి జోరు మీదున్నట్లు కనిపించిన రోహిత్ ఎక్కువసేపు నిలబడలేదు. లీచ్ వేసిన అద్భుత బంతి అతని స్టంప్స్‌ను ఎగరగొట్టింది. ఈ దశలో గిల్, పుజారా జాగ్రత్తగా ఆడి మరో ప్రమాదం లేకుండా రోజును ముగించగలిగారు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 578, భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (సి) బట్లర్ (బి) ఆర్చర్ 6; గిల్ (సి) అండర్సన్ (బి) ఆర్చర్ 29; పుజారా (సి) బర్న్స్ (బి) బెస్ 73; కోహ్లి (సి) పోప్ (బి) బెస్ 11; రహానే (సి) రూట్ (బి) బెస్ 1; పంత్ (సి) లీచ్ (బి) బెస్ 91; సుందర్ (నాటౌట్) 85; అశ్విన్ (సి) బట్లర్ (బి) లీచ్ 31; నదీమ్ (సి) స్టోక్స్ (బి) లీచ్ 0; ఇషాంత్ (సి) పోప్ (బి) అండర్సన్ 4; బుమ్రా (సి) స్టోక్స్ (బి) అండర్సన్ 0; ఎక్స్‌ట్రాలు 6, మొత్తం (95.5 ఓవర్లలో ఆలౌట్) 337. వికెట్ల పతనం: 1–19, 2–44, 3–71, 4–73, 5–192, 6–225, 7–305, 8–312, 9–323, 10–337. బౌలింగ్: అండర్సన్ 16.5–5–46–2, ఆర్చర్ 21–3–75–2, స్టోక్స్ 6–1–16–0, లీచ్ 24–5–105–2, బెస్ 26–5–76–4, రూట్ 2–0–14–0. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: బర్న్స్ (సి) రహానే (బి) అశ్విన్ 0; సిబ్లీ (సి) పుజారా (బి) అశ్విన్ 16; లారెన్స్ (ఎల్బీ) (బి) ఇషాంత్ 18; రూట్ (ఎల్బీ) (బి) బుమ్రా 40; స్టోక్స్ (సి) పంత్ (బి) అశ్విన్ 7; పోప్ (సి) రోహిత్ (బి) నదీమ్ 28; బట్లర్ (స్టంప్డ్) పంత్ (బి) నదీమ్ 24; బెస్ (ఎల్బీ) (బి) అశ్విన్ 25; ఆర్చర్ (బి) అశ్విన్ 5; లీచ్ (నాటౌట్) 8; అండర్సన్ (సి అండ్ బి) అశ్విన్ 0; ఎక్స్‌ట్రాలు 7, మొత్తం (46.3 ఓవర్లలో ఆలౌట్) 178. వికెట్ల పతనం: 1–0, 2–32, 3–58, 4–71, 5–101, 6–130, 7–165, 8–167, 9–178, 10–178. బౌలింగ్: అశ్విన్ 17.3–2–61–6, నదీమ్ 15–2–66–2, ఇషాంత్ 7–1–24–1, బుమ్రా 6–0–26–1, సుందర్ 1–0–1–0. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (బి) లీచ్ 12, గిల్ (బ్యాటింగ్) 15, పుజారా (బ్యాటింగ్) 12, మొత్తం (13 ఓవర్లలో వికెట్ నష్టానికి) 39. వికెట్ల పతనం: 1–25. బౌలింగ్: ఆర్చర్ 3–2–13–0, లీచ్ 6–1–21–1, అండర్సన్ 2–1–2–0, బెస్ 2–0–3–0. అశ్విన్, రోహిత్ క్లీన్ బౌల్డ్ -
గెలుపు పిలుపు...
భారత బౌలర్లు మళ్లీ మాయ చేశారు. అనుభవజ్ఞుడు షమీ లేకపోయినా, మరో సీనియర్ ఉమేశ్ మూడున్నర ఓవర్లకే గాయంతో తప్పుకున్నా... సమష్టి ప్రదర్శనతో ప్రత్యర్థిని కుప్పకూల్చి విజయానికి బాటలు వేశారు. బుమ్రా చూపిన దారిలో సిరాజ్ రాణించగా, ఇద్దరు స్పిన్నర్లు అశ్విన్, జడేజా సత్తా చాటడంతో మెల్బోర్న్ వేదికలో వరుసగా రెండో సిరీస్‌లో భారత్‌కు గెలుపు పిలుపు వచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ సాధించిన 131 పరుగుల భారీ ఆధిక్యాన్ని తీసివేస్తే ఇప్పుడు ఆస్ట్రేలియా స్కోరు 6 వికెట్ల నష్టానికి 2 పరుగులు మాత్రమే! నాలుగో రోజు చివరి నాలుగు వికెట్లు మరికొన్ని పరుగులు జోడించగలిగినా విజయలక్ష్యం భారత్‌కు అందనంత దూరంలో ఉండకపోవచ్చు. వేగంగా ఆ కొన్ని పరుగులు ఛేదించేస్తే సంతోషంగా సిడ్నీ టెస్టుకు టీమిండియా సిద్ధం కావచ్చు. మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను 1–1తో సమం చేసేందుకు భారత్ చేరువైంది. రెండో రోజు బ్యాటింగ్‌లో జోరు కనబర్చిన రహానే సేన సోమవారం బౌలింగ్‌లో సత్తా చాటి ఆసీస్‌ను పడగొట్టింది. ఫలితంగా ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ (17 బ్యాటింగ్), కమిన్స్ (15 బ్యాటింగ్) పోరాడుతున్నారు. ప్రస్తుతం ఆ జట్టు ఆధిక్యం 2 పరుగులు మాత్రమే. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 277/5తో ఆట ప్రారంభించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటై 131 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. రహానే (223 బంతుల్లో 112; 12 ఫోర్లు), రవీంద్ర జడేజా (159 బంతుల్లో 57; 3 ఫోర్లు) తమ స్కోరుకు మరికొన్ని పరుగులు జోడించగలిగారు. 32 పరుగుల వ్యవధిలో భారత్ చివరి 5 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ బౌలర్లలో లయన్, స్టార్క్ చెరో 3 వికెట్లు తీశారు. రహానే రనౌట్... మూడోరోజు మరో 23.4 ఓవర్లు ఆడిన అనంతరం భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. లయన్ బౌలింగ్‌లో కవర్స్ దిశగా ఆడిన జడేజా సింగిల్ కోసం ప్రయత్నించగా... మరోవైపు నుంచి వచ్చిన రహానే సరైన సమయంలో క్రీజ్‌లోకి చేరలేకపోయాడు. దాంతో 121 పరుగుల ఆరో వికెట్ భాగస్వామ్యానికి తెర పడగా, తర్వాతి ఓవర్లోనే జడేజా అర్ధ సెంచరీ పూర్తయింది. ఇదే సింగిల్‌తో భారత్ ఆధిక్యం కూడా సరిగ్గా 100 పరుగులకు చేరింది. ఈ దశలో వరుసగా షార్ట్ పించ్ బంతులతో జడేజాను ఇబ్బంది పెట్టిన ఆసీస్ పేసర్లు చివరకు ఫలితం సాధించారు. స్టార్క్ బౌన్సర్‌ను పుల్ షాట్ ఆడబోయిన జడేజా డీప్ మిడ్ వికెట్లో కమిన్స్‌కు చిక్కాడు. ఆ తర్వాత ఒకే స్కోరు వద్ద ఉమేశ్ (9), అశ్విన్ (14) వెనుదిరగ్గా, తర్వాతి ఓవర్లో బుమ్రా (0) అవుటయ్యాడు. వరుస కట్టి... భారత్ పదునైన బౌలింగ్ ముందు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ మరోసారి తలవంచారు. ఆద్యంతం తడబడటం మినహా ఒక్కరూ సాధికారికంగా, పట్టుదలగా క్రీజ్‌లో నిలబడి పరుగులు సాధించలేకపోయారు. ఘోరమైన ఫామ్‌లో ఉన్న జో బర్న్స్ (4) దానిని కొనసాగిస్తూ ఆరంభంలోనే వెనుదిరగ్గా, వేడ్, లబ్‌షేన్ (49 బంతుల్లో 28; 1 ఫోర్) కలిసి కొద్దిసేపు ప్రతిఘటించారు. అయితే ఈ జోడీని విడదీసేందుకు భారత్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. అశ్విన్ బంతులను ఎదుర్కొనేందుకు పదే పదే ఇబ్బంది పడిన లబ్‌షేన్ చివరకు ఒక చక్కటి బంతికి స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. రెండో సెషన్ ముగిసేసరికి ఆసీస్ 65/2 స్కోరుతో నిలిచింది. అయితే టీ విరామం తర్వాత ఆసీస్ పతనం వేగంగా సాగింది. స్మిత్ (8) వికెట్‌తో భారత్‌కు పట్టు చిక్కగా... ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్న వేడ్‌ను జడేజా వెనక్కి పంపాడు. ఎల్బీగా అవుట్ ఇవ్వడంపై వేడ్ రివ్యూ కోరినా లాభం లేకపోయింది. పేలవ షాట్‌తో హెడ్ (17) పెవిలియన్ చేరగా, కెప్టెన్ పైన్ (1) కూడా ఏమీ చేయలేకపోయాడు. ఇలాంటి స్థితిలో గ్రీన్, కమిన్స్ కలిసి మ్యాచ్ మూడో రోజే ముగిసిపోకుండా అడ్డుకున్నారు. చివర్లో అశ్విన్ బౌలింగ్‌లో కమిన్స్ (11 వద్ద) ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ పంత్ అందుకోలేకపోయాడు. పాపం స్మిత్! భారత్‌పై అత్యద్భుత రికార్డు ఉండి (71.95 సగటు) ఈసారి ఆస్ట్రేలియా రాత మారుస్తాడని భావించిన ప్రపంచ నంబర్‌వన్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ పేలవ ప్రదర్శన కొనసాగింది. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన అతను ఈసారి బుమ్రా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. బుమ్రా వేసిన బంతి అతని కాళ్ల వెనుకవైపు నుంచి వచ్చి లెగ్‌స్టంప్ బెయిల్స్‌ను మెల్లగా ముద్దాడింది! తాను సరైన లైన్లోనే నిలబడ్డానని పొరబడిన స్మిత్‌కు లెగ్‌స్టంప్‌ను వదిలేసిన విషయం అర్థం కాలేదు. అసలు తాను బౌల్డ్ అయిన విషయాన్నే అతను గుర్తించలేకపోయాడు. బెయిల్ పడిన తర్వాత కీపర్ బంతిని అందుకోకపోవడంతో స్మిత్ పరుగు కోసం కూడా ప్రయత్నించడం గమనార్హం! దానిని గుర్తించేసరికి భారత్ సంబరాల్లో మునిగిపోవడం, అతను నిరాశతో వెనుదిరగడం చకచకా జరిగిపోయాయి. పైన్ అవుట్‌పై వివాదం! తొలి ఇన్నింగ్స్‌లో రనౌట్ విషయంలో బ్యాట్ లైన్పైనే కనిపిస్తున్నా ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’తో బయటపడిన ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ రెండో ఇన్నింగ్స్‌లోనూ వివాదానికి కేంద్రంగా నిలిచాడు. జడేజా వేసిన బంతిని కట్ చేయడానికి ప్రయత్నించగా అది బ్యాట్ అంచును తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. భారత్ అప్పీల్‌కు అంపైర్ స్పందించకపోవడంతో రహానే రివ్యూ కోరాడు. మూడో అంపైర్ పాల్ విల్సన్ పదే పదే రీప్లేలు చూడాల్సి వచ్చింది. ‘హాట్‌స్పాట్’లో బంతి బ్యాట్‌కు తగిలినట్లుగా ఎలాంటి ముద్ర కనిపించలేదు. అయితే తర్వాత ‘స్నికో’లో మాత్రం బంతి బ్యాట్‌ను దాటుతున్న సమయంలో మీటర్లో మార్పు స్పష్టంగా కనిపించింది. దాంతో అంపైర్ అవుట్‌గా ప్రకటించగా, తీవ్ర అసంతృప్తితో పైన్ మైదానం వీడాడు. ఆట ముగిసిన అనంతరం ఆసీస్ ఆటగాడు వేడ్ ప్రశ్నించాడు. డీఆర్ఎస్ నిర్ణయాల్లో నిలకడ లేదని అతను విమర్శించాడు. ‘రెండో రోజు తొలి బంతి ఆడిన పుజారాకు కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. స్నికోలో ఇదే తరహాలో కనిపించింది. కానీ అతడిని నాటౌట్‌గా ప్రకటించి పైన్‌కు మాత్రం అవుట్ ఇచ్చారు. అవుటైనా, నాటౌట్ అయినా అంపైర్ల నిర్ణయాలు ఒకేలా ఉండాలి’ అని వేడ్ అన్నాడు. నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఐదుసార్లు ఐసీసీ ‘అంపైర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచిన దిగ్గజ అంపైర్ సైమన్ టఫెల్ దీనిపై మరింత స్పష్టతనిచ్చారు. పైన్ అవుట్ విషయంలో మూడో అంపైర్ సరిగ్గా వ్యవహరించారన్నారు. ‘నిబంధనల ప్రకారం బంతి దిశ మార్చుకుందా అనేది ముందుగా అంపైర్ చూస్తారు. దీనిపై స్పష్టత లేకపోతే హాట్ స్పాట్‌ను ఆశ్రయిస్తారు. అప్పటికీ తేలకపోతే ప్రొటోకాల్ ప్రకారం రియల్ టైమ్ స్నికోను పరిశీలించాలి. బంతి బ్యాట్‌ను తాకే సమయంలో మీటర్లో అసాధారణ మార్పు కనిపిస్తే దానినే తుది నిర్ణయంగా భావించాల్సి ఉంటుంది. సాధారణంగా స్నికోలో చూసినప్పుడు బంతి బ్యాట్‌ను దాటిన తర్వాత శబ్దం వినిపిస్తుంది. అప్పుడే మీటర్లో కదలిక వస్తుంది. ఇదేమీ తప్పు కాదు. శబ్దంకంటే కాంతి వేగం ఎక్కువ కావడమే దీనికి కారణం. ఐసీసీ రూల్స్ ప్రకారం హాట్ స్పాట్లో ముద్ర కనిపించకపోతేనే స్నికో వరకు వెళ్లాలి. అంతకుముందు జో బర్న్స్ అప్పీల్ చేసినప్పుడు బ్యాట్‌కు బంతి తగిలిన విషయం హాట్స్పాట్లోనే స్పష్టంగా తేలిపోయింది కాబట్టి స్నికో చూడాల్సిన అవసరమే రాలేదు’ అని టఫెల్ వివరించారు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 195; భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ (ఎల్బీ) (బి) స్టార్క్ 0, గిల్ (సి) పైన్ (బి) కమిన్స్ 45, పుజారా (సి) పైన్ (బి) కమిన్స్ 17, రహానే (రనౌట్) 112, విహారి (సి) స్మిత్ (బి) లయన్ 21, పంత్ (సి) పైన్ (బి) స్టార్క్ 29, జడేజా (సి) కమిన్స్ (బి) స్టార్క్ 57, అశ్విన్ (సి) లయన్ (బి) హాజల్‌వుడ్ 14, ఉమేశ్ (సి) స్మిత్ (బి) లయన్ 9, బుమ్రా (సి) హెడ్ (బి) లయన్ 0, సిరాజ్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు 22, మొత్తం (115.1 ఓవర్లలో ఆలౌట్) 326. వికెట్ల పతనం: 1–0, 2–61, 3–64, 4–116, 5–173, 6–294, 7–306, 8–325, 9–325, 10–326. బౌలింగ్: స్టార్క్ 26–5–78–3, కమిన్స్ 27–9–80–2, హాజల్‌వుడ్ 23–6–47–1, లయన్ 27.1–4–72–3, గ్రీన్ 12–1–31–0. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: వేడ్ (ఎల్బీ) (బి) జడేజా 40, బర్న్స్ (సి) పంత్ (బి) ఉమేశ్ 4, లబ్‌షేన్ (సి) రహానే (బి) అశ్విన్ 28, స్మిత్ (బి) బుమ్రా 8, హెడ్ (సి) మయాంక్ (బి) సిరాజ్ 17, గ్రీన్ (బ్యాటింగ్) 17, పైన్ (సి) పంత్ (బి) జడేజా 1, కమిన్స్ (బ్యాటింగ్) 15, ఎక్స్‌ట్రాలు 3, మొత్తం (66 ఓవర్లలో 6 వికెట్లకు) 133. వికెట్ల పతనం: 1–4, 2–42, 3–71, 4–98, 5–98, 6–99. బౌలింగ్: బుమ్రా 17–4–34–1, ఉమేశ్ 3.3–0–5–1, సిరాజ్ 12.3–1–23–1, అశ్విన్ 23–4–46–1, జడేజా 10–3–25–2. -
రిషభ్ పంత్ వీర విహారం
‘పింక్ టెస్ట్’కు ముందు జరుగుతున్న డే అండ్ నైట్ సన్నాహక పోరులో భారత బ్యాట్స్‌మెన్ పండగ చేసుకున్నారు. టెస్టు తుది జట్టులో స్థానాన్ని ఆశిస్తున్న ముగ్గురు ఆటగాళ్లు కూడా రెండో ఇన్నింగ్స్‌లో సత్తా చాటారు. ఆరో బ్యాట్స్‌మన్‌గా అవకాశం కోరుకుంటున్న హనుమ విహారి శతకం సాధించగా... వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాతో పోటీ పడుతున్న రిషభ్ పంత్ తన బ్యాటింగ్ పదునేమిటో మెరుపు సెంచరీతో చూపించాడు. రెండో ఓపెనర్‌గా అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్న శుబ్‌మన్ గిల్ కూడా చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా, ఇప్పటికే ఓపెనర్‌గా ఉన్న మయాంక్‌కు కూడా మంచి ప్రాక్టీస్ లభించింది. అయితే పృథ్వీ షా మాత్రం మరో అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. రెండో రోజు ఆటలో భారత్ ముందు తేలిపోయిన ఆస్ట్రేలియా ‘ఎ’ చివరి రోజు ఓటమిని తప్పించుకోగలదా చూడాలి. సిడ్నీ: మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో తడబడిన భారత బ్యాట్స్‌మెన్ వెంటనే తమ ఆటను చక్కదిద్దుకున్నారు. మ్యాచ్ రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి (194 బంతుల్లో 104 బ్యాటింగ్; 13 ఫోర్లు), రిషభ్ పంత్ (73 బంతుల్లో 103 బ్యాటింగ్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీలతో కదం తొక్కారు. శుబ్‌మన్ గిల్ (78 బంతుల్లో 65; 10 ఫోర్లు), మయాంక్ అగర్వాల్ (120 బంతుల్లో 61; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. తొలి ఇన్నింగ్స్‌లోని 86 పరుగులు కలిపి భారత్ ఓవరాల్ ఆధిక్యం 472 పరుగులకు చేరింది. రెండో రోజు మధ్యలో కొద్దిసేపు వర్షం అంతరాయం కలిగించినా... ఇబ్బంది లేకుండా మొత్తం 90 ఓవర్ల ఆట సాగింది. నేడు మ్యాచ్‌కు ఆఖరి రోజు. పృథ్వీ షా విఫలం... చక్కటి బ్యాటింగ్ పిచ్‌పై కనీసం నిలబడే ప్రయత్నం చేయకుండా పృథ్వీ షా (3) పేలవ షాట్ ఆడి ఆరంభంలోనే నిష్క్రమించాడు. ఈ ప్రదర్శన అతనికి టెస్టు జట్టు అవకాశాలు కూడా దూరం చేయవచ్చు! అయితే ఓపెనర్ స్థానం కోసం షాతో పోటీ పడుతున్న గిల్ మాత్రం మరోసారి సాధికారిక ఆటతీరు కనబర్చాడు. చూడచక్కటి కవర్‌డ్రైవ్‌లు, పుల్ షాట్లతో పాటు బ్యాక్‌ఫుట్‌పై పూర్తి నియంత్రణతో అతను ఆడిన తీరు సరైన టెస్టు బ్యాట్స్‌మన్‌ను చూపించాయి. 49 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే కొద్ది సేపటికే దురదృష్టవశాత్తూ అంపైర్ సందేహాస్పద నిర్ణయంతో గిల్ వెనుదిరిగాడు. స్వెప్సన్ బౌలింగ్‌లో ఎల్బీ కోసం అప్పీల్ చేయగా... బంతి బ్యాట్‌కు తగిలిందని భావించిన అంపైర్ స్లిప్‌లో అబాట్ క్యాచ్ పట్టడంతో అవుట్‌గా ప్రకటించాడు. మరోవైపు మయాంక్ పట్టుదలగా క్రీజ్‌లో నిలబడ్డాడు. స్వెప్సన్ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన అతను 91 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అనంతరం భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. పంత్ దూకుడు... తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన విహారి రెండో ఇన్నింగ్స్‌ను సమర్థంగా ఉపయోగించుకున్నాడు. ఫ్లడ్ లైట్ల వెలుగులో గులాబీ బంతి కొంత ఇబ్బంది పెడుతున్న సమయంలో అతను చక్కటి ఏకాగ్రతతో బ్యాటింగ్ చేశాడు. అందమైన ఆన్ డ్రైవ్‌లు అతని ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచాయి. 98 బంతుల్లో విహారి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విహారి 62 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతనితో పంత్ జత కలిసిన తర్వాత ఆట స్వరూపమే మారిపోయింది. విహారి, పంత్ 147 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యంలో (22.4 ఓవర్లలో) విహారి స్కోరు 42 పరుగులు మాత్రమే కాగా పంత్ సెంచరీతో చెలరేగడం విశేషం. ప్రతీ బౌలర్‌పై విరుచుకుపడ్డ పంత్ 43 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. మరోవైపు విల్డర్‌ముత్ బౌలింగ్‌లో సింగిల్‌తో 188 బంతుల్లో విహారి శతకం పూర్తయింది. అయితే రెండో రోజు చివరి ఓవర్‌కు ముందు ఓవర్ ఆఖరి బంతికి సదర్లాండ్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన పంత్ 81 పరుగుల వద్ద నిలిచాడు. విల్డర్‌ముత్ వేసిన ఆఖరి ఓవర్ మొదటి బంతి అతని పొట్టలో బలంగా తగిలింది. అనంతరం తర్వాతి ఐదు బంతుల్లో 4, 4, 6, 4, 4 బాదిన పంత్ 73 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకొని అజేయంగా నిలిచాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 194; ఆస్ట్రేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 108; భారత్ రెండో ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) స్వెప్సన్ (బి) స్టెకెటీ 3; మయాంక్ (సి) (సబ్) రోవ్ (బి) విల్డర్‌ముత్ 61; గిల్ (సి) అబాట్ (బి) స్వెప్సన్ 65; విహారి (బ్యాటింగ్) 104; రహానే (సి) క్యారీ (బి) స్టెకెటీ 38; పంత్ (బ్యాటింగ్) 103; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (90 ఓవర్లలో 4 వికెట్లకు) 386. వికెట్ల పతనం: 1–4; 2–108; 3–161; 4–239. బౌలింగ్: సీన్ అబాట్ 7–1–24–0; స్టెకెటీ 16–1–54–2; సదర్లాండ్ 16–5–33–0; విల్డర్‌ముత్ 15–2–79–1; స్వెప్సన్ 29–1–148–1; మ్యాడిసన్ 7–1–42–0 బౌలర్లకు ప్రాక్టీస్ కావాలి... విజయానికి సరిపడా స్కోరు సాధించినా భారత్ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయలేదు. మన బ్యాట్స్‌మెన్‌కు ఫ్లడ్‌లైట్ల వెలుగులో రెండో రోజు మంచి ప్రాక్టీస్ లభించింది. అయితే బౌలర్లు మాత్రం డే అండ్ నైట్ మ్యాచ్ కోసం మరింత సాధన కోరుకుంటున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ‘ఎ’ 32.2 ఓవర్లకే కుప్పకూలింది. ఆ జట్టు పేలవ ప్రదర్శనను పరిగణలోకి తీసుకుంటే వారు రోజంతా నిలబడతారా అనేది సందేహమే. చీకటి పడే సమయానికి ముందే ఆసీస్ ‘ఎ’ ఇన్నింగ్స్ ముగిసిపోతే పింక్ బాల్‌తో మన బౌలర్లు ఆశించిన ప్రాక్టీస్ లభించదు. అందుకే ఫలితంతో సంబంధం లేకుండా చివరి రెండు సెషన్లు ప్రత్యర్థికి బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వాలని భారత్ కోరుకుంటోంది. అందుకే భారత్ తమ బ్యాటింగ్‌ను కొనసాగించవచ్చు. -
విజయం దిశగా న్యూజిలాండ్
హామిల్టన్: బౌలర్లు విజృంభించి ఒకేరోజు 16 వికెట్లు పడగొట్టడంతో.... వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ఇన్నింగ్స్ విజయం దిశగా సాగుతోంది. ఆట మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 49/0తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ కివీస్ బౌలర్ల ధాటికి నిలువలేకపోయారు. టిమ్ సౌతీ (4/35), జేమీసన్ (2/25), వాగ్నర్ (2/33) హడలెత్తించడంతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 64 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. దాంతో న్యూజిలాండ్‌కు 381 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఫాలోఆన్‌లోనూ విండీస్ బ్యాట్స్‌మన్ తడబడ్డారు. ఆట ముగిసే సమయానికి విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లకు 196 పరుగులు చేసింది. -
రేణూ రీ ఎంట్రీ
‘బద్రి, జానీ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రేణూ దేశాయ్ ‘ఆద్య’ అనే ఒక పవర్ఫుల్ లేడీ ఓరియంటెడ్ ప్యాన్ ఇండియా చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుడుతున్నారు. ఈ సినిమాతో ఎం.ఆర్. కృష్ణ మామిడాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. డి.ఎస్.కె. స్క్రీన్–సాయికృష్ణ ప్రొడక్ష¯Œ ్స బ్యానర్స్‌పై రావ్. డి.ఎస్–రజనీకాంత్. ఎస్ నిర్మించనున్నారు. ‘హుషారు’ ఫేమ్ తేజ కురపాటì,, గీతికా రతన్ జంటగా నటించనున్న ఈ చిత్రంలో ‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక, నందినీ రాయ్ ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ .ఎస్ మాట్లాడుతూ– ‘‘విజయదశమి రోజున మా ‘ఆద్య’ సినిమా ప్రారంభిస్తాం. రేణూ దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రం జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం’’ అన్నారు. బాలీవుడ్ హీరో వైభవ్ తత్వవాడి ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి కెమెరా: శివేంద్ర దాశరధి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ చైతన్యరెడ్డి .ఎస్. -
నా ఆట అప్పుడు మొదలవుతుంది!
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా భారత జట్టు టెస్టు విజయాల్లో పేస్ బౌలర్ షమీ కూడా కీలకపాత్ర పోషించాడు. అయితే సహచర పేసర్లతో పోలిస్తే తొలి ఇన్నింగ్స్లోకంటే షమీ రెండో ఇన్నింగ్స్ రికార్డు చాలా బాగుంది. తన కెరీర్లో పడగొట్టిన మొత్తం 180 వికెట్లలో షమీ తొలి ఇన్నింగ్స్‌లో 32.50 సగటుతో 92 వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసిన సందర్భంలో కేవలం 21.98 సగటుతో 88 వికెట్లు తీశాడు. మ్యాచ్ సాగినకొద్దీ అతని బౌలింగ్‌లో పదును పెరిగినట్లు కనిపిస్తుంది. దీనిపై షమీ మాట్లాడుతూ... ‘ఇతర బౌలర్లు అలసిపోయిన సందర్భంలో బాధ్యత తీసుకుంటాను. అందుకే రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగిపోతాను. జట్టులో ప్రతీ ఒక్కరు అప్పటికే కనీసం మూడు రోజులు మైదానంలో గడుపుతారు. డీజిల్ ఇంజిన్లతో పోలిస్తే పెట్రోల్ ఇంజిన్ తొందరగా పికప్ అందుకుంటుంది. నాదైన సమయం కోసం వేచి చూస్తాను. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన టెస్టు మ్యాచ్ దానికి మంచి ఉదాహరణ. పిచ్‌లో జీవం, బౌన్స్ లేకున్నా అలాంటి చోట రెండో ఇన్నింగ్స్‌లో నేను ఐదు వికెట్లు తీశాను’ అని షమీ విశ్లేషించాడు. -
మనమంతా రెండో ఇన్నింగ్స్ ఆడుతున్నాం
బెంగళూరు: ప్రజల ప్రాణాలను కబళిస్తోన్న కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోవాలంటే ప్రపంచమంతా సమష్టిగా పోరాడాలని భారత మాజీ కోచ్, మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే పిలుపునిచ్చాడు. వైరస్‌ను ఎదుర్కోవడంలో ప్రస్తుత మన స్థితిని ‘టెస్టు మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్’గా అభివర్ణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కాస్త ఆధిక్యం సాధించామని సంబరపడొద్దని హెచ్చరించాడు. ‘ఈ మహమ్మారిని నిర్మూలించాలంటే మనందరం ఉమ్మడిగా పోరాడాల్సిందే. ఇదో టెస్టు మ్యాచ్‌లాంటిది. టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు మాత్రమే ఉంటాయి. కానీ కరోనాకు ఎన్నో దశలున్నాయి. అందుకే ఇప్పటివరకు కరోనాపై సాధించిన విజయంతో సంతృప్తి చెందవద్దు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంకా గడ్డు సవాళ్లు ఎదురయ్యే అవకాశమున్నందున తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించామని సంబరపడొద్దు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతోనే లభించే విజయం కాదు ఇది. అందుకే దీన్ని జయించేందుకు రెండో ఇన్నింగ్స్‌లో మనమంతా కఠినంగా పోరాడాలి’ అని కుంబ్లే వివరించాడు. వైరస్ నియంత్రణ కోసం నిరంతరం పోరాడుతోన్న వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, అధికారులకు కుంబ్లే కృతజ్ఞతలు తెలిపాడు. ‘వారంతా నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు. హ్యాట్సాఫ్’ అని వారి సేవల్ని కొనియాడాడు. -
బూమ్ బూమ్ బ్లాస్ట్!
‘ప్రపంచంలో ఎవరు వేగంగా పరుగెత్తగలరో చూద్దాం అంటూ చిరుత, శునకాల మధ్య పందెంకు రంగం సిద్ధమైంది... పోటీ ప్రారంభమైనా చిరుత మాత్రం ఒక్క అడుగు కదపకుండా తన స్థానంలోనే ఉండిపోయింది. దాంతో ప్రేక్షకులు ఏమైందంటూ నిర్వాహకులను అడిగారు. ‘అందరికంటే అత్యుత్తమమని నిరూపించుకునే ప్రయత్నం చేయడం కూడా కొన్నిసార్లు పరువు తక్కువగా భావించాలి’... సరిగ్గా వారం క్రితం జస్ప్రీత్ బుమ్రా ఈ ట్వీట్ చేశాడు. బుమ్రా ఆంతర్యం ఏమిటో స్పష్టంగా అంతు పట్టకపోయినా... కొత్తగా దూసుకొచ్చిన ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ను ఆకాశానికెత్తడం, అతడితో తనను పోలుస్తుండటంపైనే ఈ ట్వీట్ అని క్రికెట్ ప్రపంచం అర్థాన్ని అన్వయించుకుంది. ఈ ట్వీట్‌తో ‘బుల్స్ ఐ’ ఇమోజీ కూడా జత చేసిన బుమ్రా ఆదివారం సరిగ్గా లక్ష్యాన్ని ఛేదించాడు. భారత అభిమానులతో సహా అంతా యాషెస్ ఉత్కంఠను అనుభవిస్తున్న సమయంలో తన సత్తా చూపిస్తూ అత్యద్భుత బౌలింగ్ ప్రదర్శనతో రికార్డులు తిరగరాశాడు. నార్త్ సౌండ్: దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్... ఈ నాలుగు దేశాల్లోనే బుమ్రా టెస్టులు ఆడాడు. కానీ నాటి ఇమ్రాన్ ఖాన్ నుంచి నేటి రవిచంద్రన్ అశ్విన్ వరకు ఆసియా దిగ్గజ బౌలర్లు ఎవరికీ సాధ్యం కాని ఘనతను అతను అందుకున్నాడు. ఈ నాలుగు దేశాల్లోనూ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన రికార్డును బుమ్రా నెలకొల్పాడు. ఇవన్నీ తన తొలి పర్యటనలే కావడం విశేషం. దీనిని అందుకునేందుకు అతనికి 11 టెస్టులే సరిపోయాయి. వెస్టిండీస్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్ అతని విలువేమిటో మరోసారి చూపించింది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 75 పరుగుల ఆధిక్యం మాత్రమే కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌లో విజయం కోసం భారత్ నిర్దేశించిన 419 పరుగుల భారీ లక్ష్యం కష్టసాధ్యమే అయినా... సొంతగడ్డపై కొంతయినా పోరాడగలదని అంతా భావించారు. కానీ మరీ ఘోరంగా ఒక సెషన్ లోపు కేవలం 26.5 ఓవర్లు మాత్రమే ఆడి 100 పరుగులకే జట్టు కుప్పకూలింది. ఇదంతా బుమ్రా చలవే! టెస్టుల్లో తొలిసారి బుమ్రాను ఎదుర్కొన్న విండీస్ బ్యాట్స్‌మెన్‌కు అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే కథ ముగిసిపోయింది. బుమ్రా ‘మ్యాజిక్ బంతులు’ తమను దెబ్బ తీశాయంటూ ప్రత్యర్థి కెప్టెన్ హోల్డర్ వాపోయాడు. అవుట్ స్వింగర్లతో... బంతి విసిరేందుకు తీసుకునే రనప్ చిన్నదే కావచ్చు... స్పీడ్‌గన్‌లో లెక్క కడితే బంతి వేగం సాధారణంగానే కనిపించవచ్చు. కానీ బుమ్రా వేసే బంతులు అంకెలకు మించి ప్రమాదకరమైనవి. ఒకనాటి అసలు సిసలు ఫాస్ట్ బౌలర్ల ఆలోచనా ధోరణి అతనిలో కనిపిస్తుంది. తాజా టెస్టులో అతను తన బౌలింగ్ దూకుడును చూపించాడు. చాలా మంది తరహాలో ఆఫ్ స్టంప్ బయటకు వేస్తూ కీపర్ లేదా స్లిప్ వైపు క్యాచ్ వచ్చే అవకాశం సృష్టించే ప్రయత్నం చేయలేదు. పూర్తిగా ఆఫ్ స్టంప్స్ లక్ష్యంగానే బంతులు విసిరాడు. అతని ఐదు వికెట్లలో నాలుగు క్లీన్‌బౌల్డ్‌లు ఉన్నాయంటేనే ఇది అర్థమవుతుంది. ముఖ్యంగా గతంలో పెద్దగా వాడని ‘అవుట్ స్వింగర్’ను బుమ్రా ప్రయోగించాడు. వరల్డ్ కప్ తర్వాత ఈ సిరీస్‌కు ముందు లభించిన విరామంలో అతను దీనిపై ప్రత్యేక సాధన చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ప్రసారకర్త ‘సోనీ’ అంకెల ప్రకారం కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు బుమ్రా వేసిన ప్రతీ పది బంతుల్లో ఏడు అవుట్ స్వింగర్లే ఉన్నాయి! వెన్నునొప్పితో తొలి ఇన్నింగ్స్‌లో పూర్తి వేగంతో బౌలింగ్ చేయలేకపోయిన జస్ప్రీత్... రెండో ఇన్నింగ్స్‌లో స్వింగ్‌కు కొంత అనుకూలంగా కనిపించిన వాతావరణాన్ని పూర్తిగా వాడుకున్నాడు. 8–4–7–5 బుమ్రా వేసిన 48 బంతులు విండీస్ బ్యాట్స్‌మెన్ పాలిట బుల్లెట్లలా మారాయి. అతని తొలి ఓవర్ మూడో బంతిని వెంటాడి బ్రాత్‌వైట్ ఔట్ కావడంతో విండీస్ తొలి వికెట్ కోల్పోయింది. బుమ్రా తర్వాతి ఓవర్లో దూసుకొచ్చిన బంతి క్యాంప్‌బెల్ స్టంప్స్‌ను పడగొట్టింది. మరుసటి ఓవర్లో స్లిప్‌లో కోహ్లి క్యాచ్ వదిలేయకపోతే మరో వికెట్ అప్పుడే దక్కేది. కానీ అతని నాలుగో ఓవర్లో హైలైట్ బంతి వచ్చింది. అద్భుతమైన స్వింగ్‌కు బ్రేవో ఆఫ్ స్టంప్ ఎగిరి ‘బండి చక్రం’లా గిరగిరా తిరిగింది! తొలి ఐదు ఓవర్లలో విండీస్ బ్యాట్స్‌మెన్ చచ్చీ చెడి ఏడు సింగిల్స్ తీయగలిగారు. కానీ కథ అంతటితో ముగియలేదు. బుమ్రా ఆరో ఓవర్ తొలి బంతికి హోప్ స్టంప్ బద్దలైంది. ఎంతో కొంత పోరాడగలడని భావించిన హోల్డర్‌కు కూడా బుమ్రా బంతి అర్థం కాలేదు. ఫలితం మరో సారి ఆఫ్‌స్టంప్‌పై ఎర్రబంతి దాడి! ఇక విరామం అంటూ కోహ్లి 8 ఓవర్ల స్పెల్ తర్వాత ఆపడంతో ఈ తుఫాన్ ఆగింది. మరో అద్భుత విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా ఫాస్ట్ బౌలర్ల గడ్డపై తొలి టెస్టును సంతృప్తిగా ముగించాడు. 5/7ఇన్నింగ్స్‌లో కనీసం ఐదు వికెట్లు పడగొట్టిన సందర్భంలో అతి తక్కువ పరుగులు ఇచ్చిన భారత్ బౌలర్‌గా బుమ్రా గుర్తింపు పొందాడు. 1990లో వెంకటపతిరాజు 12 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. 4 బుమ్రా ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం ఇది నాలుగోసారి కాగా నాలుగు వేర్వేరు జట్లపైనే సాధించాడు. గతంలో ఇన్స్వింగర్లు ఎక్కువగా వేసేవాడిని. అయితే అనుభవం వస్తున్న కొద్దీ అవుట్ స్వింగర్లు కూడా బాగా వేయగలననే విశ్వాసం పెరిగింది. తాజా ప్రదర్శనతో చాలా సంతోషంగా ఉంది. అయితే ఇలాంటి బంతుల కోసం చాలా కష్టపడ్డాను. ఇంకా నేర్చుకోవాలనే తపనతో ఉన్నాను. వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉండటంతో ఏదైనా భిన్నంగా ప్రయత్నించాలని మా పేసర్లు అందరం భావించాం. స్వింగ్‌కు పరిస్థితి కొంత అనుకూలంగా ఉందనిపించడంతో అలా ప్రయత్నించాం –జస్ప్రీత్ బుమ్రా, భారత బౌలర్ -
న్యూజిలాండ్ 195/7
గాలే: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ స్పిన్‌కు తలవంచారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ లసిత్ ఎంబుల్డెనియా (4/71) చెలరేగడంతో మ్యాచ్ మూడో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి కివీస్ 7 వికెట్లకు 195 పరుగులు చేసింది. వికెట్ కీపర్ వాట్లింగ్ (63 నాటౌట్) అజేయ అర్ధసెంచరీ చేయగా, లాథమ్ (45) రాణించాడు. ధనంజయకు 2 వికెట్లు దక్కాయి. సౌతీ (23)తో కలిసి వాట్లింగ్ ఏడో వికెట్‌కు 54 పరుగులు జోడించాడు. ప్రస్తుతం చేతిలో 3 వికెట్లున్న న్యూజిలాండ్ 177 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 227/7తో ఆట కొనసాగించిన శ్రీలంక మరో 40 పరుగులు జోడించి తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆ జట్టుకు 18 పరుగుల ఆధిక్యం లభించింది. డిక్వెలా (61) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, లక్మల్ (40) రాణించాడు. -
కోల్‌కతా కోచ్‌గా మెకల్లమ్
కోల్‌కతా: న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్ ఐపీఎల్లో సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమయ్యాడు. తాను నాయకత్వం వహించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) జట్టుకు ఇప్పుడు హెడ్ కోచ్‌గా నియమితులయ్యాడు. ఈ సీజన్ అనంతరం చీఫ్‌కోచ్ జాక్వస్ కలిస్ సేవలకు మంగళం పాడిన ఫ్రాంచైజీ అతని స్థానంలో మెకల్లమ్‌కు కోచింగ్ బాధ్యతల్ని అప్పగించింది. ఇటీవల గ్లోబల్ టి20లో ఆడిన అతను ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పాటు అదే యాజమాన్యానికి చెందిన కరీబియన్ ప్రీమియర్ లీగ్ జట్టు ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు కూడా మెకల్లమ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. లీగ్‌లో మెకల్లమ్.. 2008లో ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో మెకల్లమ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 73 బంతుల్లో 10 ఫోర్లు, 13 సిక్సర్లతో 158 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అనంతం కేకేఆర్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ప్రారంభ సీజన్ నుంచి 2018 వరకు కేకేఆర్‌తో పాటు, కొచ్చి టస్కర్ కేరళ, గుజరాత్ లయన్స్, చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 109 మ్యాచ్‌లాడిన మెకల్లమ్ 27.69 సగటుతో 2,880 పరుగులు చేశాడు. -
ఇంగ్లండ్ లక్ష్యం 398
బర్మింగ్‌హామ్: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్మిత్ (142; 14 ఫోర్లు), వేడ్ (110; 17 ఫోర్లు) శతక్కొట్టడంతో ఇంగ్లండ్ ముందు 398 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓవర్‌నైట్ స్కోరు 124/3తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను 112 ఓవర్లలో 487/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. తొలుత స్మిత్, ట్రావిస్ హెడ్ (51) నాలుగో వికెట్‌కు 130 పరుగులు జోడించారు. తర్వాత ఐదో వికెట్‌కు వేడ్, స్మిత్ జోడీ 126 పరుగులు జతచేసింది. స్మిత్ యాషెస్ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేసిన ఐదో ఆసీస్ బ్యాట్స్‌మన్‌గా ఘనతకెక్కాడు. గతంలో బార్డ్స్లే, మోరిస్, స్టీవ్ వా, హేడెన్ ఇలా రెండు సెంచరీలు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 3, మొయిన్ అలీ 2 వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ ఆట నిలిచే సమయానికి 7 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 13 పరుగులు చేసింది. ఓపెనర్లు బర్న్స్ (7 బ్యాటింగ్), రాయ్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చివరి రోజు ఇంగ్లండ్ నెగ్గాలంటే మరో 385 పరుగులు చేయాలి. -
ఆసక్తికరంగా యాషెస్ టెస్టు
బర్మింగ్‌హామ్: యాషెస్ సిరీస్ తొలి టెస్టులో మూడో రోజు అనేక మలుపులతో రసవత్తరంగా సాగింది. శనివారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. వార్నర్ (8), బాన్‌క్రాఫ్ట్ (7), ఉస్మాన్ ఖాజా (40) పెవిలియన్‌కు చేరగా... స్టీవ్ స్మిత్ (46 బ్యాటింగ్), ట్రవిస్ హెడ్ (21 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. వెలుతురు లేని కారణంగా ఆటను చాలా ముందుగా నిలిపివేశారు. తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగుల ఆధిక్యం కోల్పోయిన ఆస్ట్రేలియా ప్రస్తుతం 34 పరుగులు మాత్రమే ముందంజలో ఉంది. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చాలా కష్టమని అంచనాలు ఉన్న నేపథ్యంలో నాలుగో రోజు కంగారూలు ఎన్ని పరుగులు జోడించి ఇంగ్లండ్‌కు లక్ష్యాన్ని నిర్దేశిస్తారనేది ఆసక్తికరం. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 267/4తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 374 పరుగులకు ఆలౌటైంది. బర్న్స్ (133) ఆరంభంలోనే వెనుదిరగ్గా, బెన్ స్టోక్స్ (50) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఒక దశలో ఆసీస్ 18 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బ తీసింది. అయితే క్రిస్ వోక్స్ (37 నాటౌట్), స్టువర్ట్ బ్రాడ్ (29) తొమ్మిదో వికెట్‌కు 65 పరుగులు జత చేసి జట్టును మెరుగైన స్థితికి చేర్చారు. చివరకు ఇంగ్లండ్‌కు 90 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కమిన్స్, లయన్ చెరో 3 వికెట్లు తీశారు. బ్రాడ్ తన 128వ టెస్టులో 450 వికెట్ల మైలురాయిని చేరుకోవడం విశేషం. బాల్ ట్యాంపరింగ్ నిషేధం ముగిసిన తర్వాత తొలి టెస్టు ఆడుతున్న స్మిత్, వార్నర్‌లను ఇంగ్లండ్ అభిమానులు తొలి రోజునుంచే గేలి చేస్తున్నారు. అయితే వీరిద్దరు మాత్రం దానిని పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టారు. శనివారం మాత్రం వార్నర్ ప్రేక్షకులకు సమాధానమిచ్చాడు. అయితే అది సరదాగానే సుమా... జేబులో స్యాండ్‌పేపర్ పెట్టుకొని ట్యాంపరింగ్ వివాదానికి కారణమైన వార్నర్ ఇప్పుడు మాత్రం తాను అలాంటి పనేమీ చేయడం లేదని, కావాలంటే మీరే చూసుకోండి అంటూ పోజివ్వడం విశేషం!