బంగ్లా ప్రపంచకప్‌లో మంచు ప్రభావం చాలా ఎక్కువగానే కనిపిస్తోంది. రాత్రి మ్యాచుల్లో టాస్ గెలిచిన వెంటనే కెప్టెన్ బౌలింగ్‌కు మొగ్గు చూపడం తప్పనిసరిగా మారిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ సమయంలో బంతిపై బౌలర్లకు ఏ మాత్రం పట్టు చిక్కడం లేదు. ఆటగాళ్లు పదే పదే కర్చీఫ్‌తో బంతిని తుడుస్తూ తిప్పలు పడుతున్నారు. దాంతో మంచు మ్యాచ్ ఫలితాన్నీ మార్చేస్తోంది. మరి దీనిని ఎదుర్కోవడం ఎలా? అసలే పేలవ బౌలింగ్ వనరులు ఉన్న ఇంగ్లండ్ కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించింది. కివీస్‌తో మ్యాచ్‌కు ముందు రోజు ఆ జట్టు ప్రాక్టీస్ సెషన్ పక్కన ఒక పెద్ద బకెట్ నిండా నీళ్లు తెచ్చి పెట్టారు. అందుబాటులో ఉన్న బంతులన్నీ అందులో వేసేశారు.
అంతే...నెట్స్‌లో ఏ బౌలర్ బౌలింగ్ చేసినా నేరుగా అక్కడినుంచే బంతిని అందుకోవాలి. తుడిచే ప్రయత్నం చేయకుండా అలాగే తడిగా ఉన్న బంతితోనే బౌలింగ్ చేయాలి. ఈ తరహా ప్రాక్టీస్‌తో మ్యాచ్‌లో బంతి తడిగా మారినా పట్టు దొరుకుతుందని వారి ప్రయత్నం. అయితే శనివారం కివీస్‌తో మ్యాచ్‌లో తర్వాత బౌలింగ్ చేయాల్సి వచ్చినా మంచు సమస్య రాకుండానే మ్యాచ్ ముగిసిపోయింది!
మంచు ముంచకుండా...
Published Sun, Mar 23 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 5:01 AM
Advertisement