Practise session
-
ప్రాక్టీస్ సెషన్‌కు డుమ్మా.. అవమానం తట్టుకోలేకనేనా?
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో మంగళవారం పోర్చుగల్, స్విట్జర్లాండ్ మధ్య ప్రీక్వార్టర్స్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు పోర్చుగల్ కెప్టెన్.. ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను పక్కనబెట్టడం అందరిని ఆశ్చర్యపరిచింది. కీలక నాకౌట్ దశలో రొనాల్డో డగౌట్లో కూర్చోవడం చాలా మందిని బాధించింది. అయితే రొనాల్డోస స్థానంలో జట్టులోకి వచ్చిన రామోస్ హ్యాట్రిక్ గోల్స్‌తో మెరవడం.. ఆపై మరో ముగ్గురు పోర్చుగల్ ఆటగాళ్లు గోల్స్‌తో దుమ్మురేపారు. దీంతో పోర్చుగల్ 6-1 తేడాతో స్విట్జర్లాండ్‌పై ఏకపక్ష విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే తనను జట్టు నుంచి తప్పించారన్న అవమానం తట్టుకోలేక రొనాల్డో ప్రాక్టీస్ సెషన్‌కు డుమ్మా కొట్టినట్లు వార్తలు వస్తున్నాయి. తన జూనియర్లతో కలిసి ప్రాక్టీస్ చేయడానికి రొనాల్డో ఇష్టపడలేదని.. రోజు మొత్తం జిమ్‌లో గడపడానికే ప్రాధాన్యం ఇచ్చాడంటూ స్పెయిన్‌కు చెందిన ఒక వార్తపత్రిక తన కథనంలో వెల్లడించింది. ఇక రొనాల్డోను ఆడించకపోవడంపై జట్టు మేనేజర్ ఫెర్నాండో సాంటోస్ స్పందించాడు. ''రొనాల్డోతో విబేధాలున్నాయన్న మాట నిజం కాదు.అతను ఒక స్టార్ ఆటగాడు. రొనాల్డో లేకుండా జట్టు బలాలు, బలహీనతలు తెలుసుకోవాలని ప్రయత్నించాం. రొనాల్డో స్థానంలో జట్టులోకి వచ్చిన గొంకాలో రమోస్ సూపర్‌గా రాణించాడు. అలా అని రొనాల్డోను పక్కనబెట్టలేం. కానీ మొరాకోతో జరగనున్న క్వార్టర్స్‌లోనూ రొనాల్డో ఆడకపోవచ్చు. కొత్త వాళ్లకు అవకాశాలు రావాలి. మేం కరెక్ట్ స్ట్రాటజీతోనే వెళ్తున్నాం.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక స్విట్జర్లాండ్‌తో జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌కు హాజరైన అభిమానులు రొనాల్డో.. రొనాల్డో అంటూ గట్టిగా అరిచారు. దీంతో ఆట 73వ నిమిషంలో రొనాల్డో గ్రౌండ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. జావో ఫెలిక్స్ స్థానంలో వచ్చిన రొనాల్డో గోల్ కొట్టడంలో మాత్రం విఫలమయ్యాడు. ఫిఫా ప్రపంచకప్ లో పోర్చుగల్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న కొద్దిరోజుల క్రితమే మాంచెస్టర్ యునైటెడ్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. పరస్పర అంగీకారంతో మాంచెస్టర్ యూనైటెడ్ నుంచి బయటకు వచ్చినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అప్పటినుంచి రొనాల్డో ఏ ఫ్రాంచైజీకి సంతకం చేయలేదు. అయితే సౌదీ అరేబియాకు చెందిన అల్ నజర్ క్లబ్ కు ఆడనున్నాడనే వార్తలు వస్తున్నాయి. మూడేండ్ల పాటు అల్ నజర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడని.. ప్రతీ యేటా సుమారు రూ. 600 కోట్లకు పైగా రొనాల్డోకు ముట్టజెప్పేందుకు డీల్ ఓకే అయిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను రొనాల్డో ఖండించాడు. చదవండి: FIFA WC: నమ్మలేకున్నాం.. ఇంత దారుణంగా మోసం చేస్తారా? -
ప్రాక్టీస్ సమయంలో వింత అనుభవం.. మళ్లీ బుక్కైన రసెల్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్ 2022) ఏ ముహూర్తానా మొదలైందో కానీ.. చిత్రమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గతవారం రసెల్‌ను విధి ఆడుకున్న తీరు అంత తొందరగా ఎవరు మరిచిపోలేరు. ఎవరూ ఊహించని రీతిలో రనౌట్ అయిన ఆండ్రీ రసెల్ మరోసారి బుక్కయ్యాడు. ఈసారి రనౌట్ మాత్రం కాదులెండి..హెలికాప్టర్ రూపంలో రసెల్‌ను భయపెట్టింది.బీపీఎల్‌లో భాగంగా చిట్టోగ్రామ్‌లోని ఎంఏ ఆజీజ్ స్టేడియంలో రసెల్ సహా తమీమ్ ఇక్బాల్, మోర్తజా, మహ్మద్ షెహజాద్‌లు సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. చదవండి: Andre Rusell: రసెల్‌తో ఆడుకున్న 'విధి'.. క్రికెట్ చరిత్రలో మిగిలిపోవడం ఖాయం ఇదే సమయంలో స్డేడియంలో ఒక హెలికాప్టర్ ల్యాండ్ అయింది. దీంతో రసెల్ సహా మిగిలిన ఆటగాళ్లు ఏం జరిగిందోనని భయపడిపోయారు. విషయం ఏంటని ఆరా తీయగా.. హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న వ్యక్తికి ఆరోగ్య సమస్య తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అయితే దీనికి ముందు ఎయిర్వేస్ అధికారులు జిల్లా కమిషనర్‌తో పాటు స్పోర్ట్స్ అసోసియేషన్‌తో మాట్లాడారు. వీరి చొరవతో..చట్టోగ్రామ్ స్టేడియం అధికారులు హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారని తెలిసింది. ఆ తర్వాత అంబులెన్స్‌లో ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ విషయం ఆటగాళ్లకు తెలియక కాస్త కంగారుపడ్డారు. అయితే ఈ విషయాన్ని బీపీఎల్ తన ట్విటర్లో షేర్ చేయగా..''పాపం రసెల్‌ను నిజంగా ఏదో వెంటాడుతుంది.. మళ్లీ బుక్కైన రసెల్.. బీపీఎల్‌లో ఈ ఏడాది ఏది కలిసిరావడం లేదు..'' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: BBL 2021-22: రసెల్ సునామీ ఇన్నింగ్స్.. సిక్సర్లతో ఊచకోత..! Helicopter lands suddenly in Chattogram when Andre Russell, Tamim Iqbal were practicing 😲#BPL2022 #AndreRussell #TamimIqbal #Cricket pic.twitter.com/9TpwavCTQ5 — SportsTiger (@sportstigerapp) February 1, 2022 -
విరాట్ సిద్ధమయ్యాడు.. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలే!
దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ (బ్యాక్సింగ్డే టెస్ట్)కు ముందు టీమిండియా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. డిసెంబర్26న సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. కాగా ఇప్పటివరకు దక్షిణాఫ్రికా గడ్డపై ఒక్క టెస్ట్ సిరీస్ కూడా భారత్ గెలవలేదు. ఇక కోహ్లి సారథ్యంలోని భారత జట్టు తొలి టెస్ట్ సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నెట్స్‌లో చెమటోడ్చుతున్నాడు. తన ప్రాక్టీస్ సెషన్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలను ట్విట్టర్లో అభిమానులతో కోహ్లి పంచుకున్నాడు. దీంతో బ్యాక్సింగ్డే టెస్ట్‌కు రన్‌మిషన్ కోహ్లి సిద్దమయ్యాడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా కోహ్లి గత కొంతకాలంగా అంత ఫామ్‌లో లేడు. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లి సెంచరీ సాధించి రెండేళ్లు దాటింది. దీంతో దక్షిణాఫ్రికా సిరీస్‌లోనైనా కోహ్లి సెంచరీ సాధిస్తాడాని అభిమానులు ఆశిస్తున్నారు. అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న కెప్టెన్సీ వివాదం నేపథ్యంలో కోహ్లి ఎలా రాణిస్తాడో వేచి చూడాలి. కాగా విరాట్ కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలిగించి రోహిత్ శర్మను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. చదవండి: ఆసియా కప్‌లో భారత్ శుభారంభం.. దుమ్మురేపిన హర్నర్, యశ్దల్ 🥊day 🏏..⏳ pic.twitter.com/kV3tbqlQdp — Virat Kohli (@imVkohli) December 23, 2021 -
దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియాకు భారీ షాక్.. రోహిత్ ఔట్!
దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా టెస్ట్ సిరీస్‌కు దూరం కానున్నడానే వార్తలు వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్లో గాయపడినట్లు తెలుస్తోంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. సోమవారం ముంబైలో జరిగిన ప్రాక్టీస్ సెషన్లో త్రోడౌన్ స్పెషలిస్ట్ రాఘవేంద్ర వేసిన బంతి రోహిత్ చేతిని బలంగా తాకినట్లు తెలుస్తోంది. దీంతో అతడు కాపేపు నొప్పితో విలవిలాడినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. అయితే ప్రస్తుతం అతడి గాయం తీవ్రంగా మారినట్లు సమాచారం. దీంతో అతడు టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్నట్లు వినికిడి. అతడి స్ధానంలో భారత్-ఏ జట్టు కెప్టెన్ ప్రియాంక్ పాంచల్‌ను ఎంపిక చేసినట్లు రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. అయితే రోహిత్ గాయంకు సంబంధించి బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన కోసం ముంబైలోని ఓ హోటెల్లో మూడు రోజుల క్వారంటైన్ గడుపుతోంది. అనంతరం భారత జట్టు డిసెంబర్16న సౌతాఫ్రికాకు పయనం కానుంది. భారత టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ చదవండి: Virat kohli: ఓపెనర్‌గా రోహిత్ శర్మ.. కోహ్లికి నో ఛాన్స్! -
కబడ్డీతో సందడి చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్స్!
-
ఒక్కసారిగా ఆటనే మార్చేశారు.. వైరల్
మరికొన్ని రోజుల్లో సాకర్ సమరం ఫీఫా వరల్డ్ కప్-2018 ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆతిథ్య దేశం రష్యాకు చేరుకున్న జట్లు.. సాధనలో మునిగిపోయాయి. ఇంగ్లాండ్ జట్టు మేనేజర్ గరేత్ సౌత్‌గేట్ తన బృందంతో సాధన చేయిస్తున్నారు. అయితే ఇంతలో ఊహించని సన్నివేశం దర్శనమిచ్చింది. ఆటగాళ్లు ఉన్నపళంగా మొత్తం ఆటనే మార్చేశారు. బంతిని పక్కన పెట్టి కాసేపు కబడ్డీతో సందడి చేశారు. జట్టు ఆటగాళ్లు హ్యారీ కేన్, డానీ వెల్బెక్, గేరీ కచిల్, జెస్సే లింగార్డ్ తదితరులు కలిసి మైదానంలో కబడ్డీ ఆడారు. ‘మానసిక ఒత్తిడి అధిగమించడానికి కబడ్డీ ఓ మంచి సాధనం. అందుకే మా ఆటగాళ్లను కబడ్డీ ఆడమని ప్రోత్సహిస్తున్నాం’ అని సౌత్‌గేట్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. క్రికెటర్లు ప్రాక్టీస్ సమయంలో ఫుట్‌బాల్ ఆడుతూ కనిపించిన దృశ్యాలు అనేకం. ధోనీ, కోహ్లి లాంటి చాలా మంది ఆటగాళ్లు కూడా సాకర్‌కు వీరాభిమానులే. కానీ సాకర్ ప్లేయర్లు మాత్రం ఇలా కబడ్డీపై పడిపోవటం మాత్రం అరుదైన విషయమే. ఇదిలా ఉండగా జూన్ 14న ఫీఫా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. గ్రూప్-జీ జాబితాలో ట్యూనీషియా, బెల్జియం, పనామాతోపాటు ఇంగ్లాండ్ జట్టు కూడా ఉంది. జూన్ 18న వోల్వోగార్డ్లో ట్యూనీషియాతో తొలి మ్యాచ్ ఇంగ్లాండ్ ఆడుతుంది. -
మైదానంలో సఫారీ డ్రోన్
అడ్డుకున్న బంగ్లా బోర్డు క్షమాపణ చెప్పిన దక్షిణాఫ్రికా జట్టు ఢాకా: తమ ప్రాక్టీస్ సెషన్లో డ్రోన్‌ను ఉపయోగించిన దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ మిలిటరీకి గురువారం క్షమాపణలు చెప్పింది. ఏరియల్ వ్యూ నుంచి ఆటగాళ్ల ఫొటోలను, వీడియోలను తీసేందుకు బుధవారం నాటి సెషన్లో ఈ డ్రోన్‌ను ఉపయోగించారు. అయితే జాతీయ భద్రతా చర్యల కింద బంగ్లాలో ఇలాంటివి వాడడం నిషేధం. విషయం తెలిసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారులు వెంటనే తమ అభ్యంతరాన్ని తెలిపి అడ్డుకున్నారు. ‘జట్టుతో పాటు వచ్చిన ‘బిహైండ్ ది సీన్’ టీవీ సిబ్బంది తమ యూట్యూబ్ చానెల్ కోసం వీడియోలు, సృజనాత్మక ఫొటోల కోసం డ్రోన్‌ను వాడారు. అయితే బంగ్లాదేశ్ గగనతలంపై ఇలాంటి వాటిని నిషేధించిన విషయం మాకు తెలీదు. జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పి వెంటనే దాన్ని ఉపయోగించడం మానేశాం’ అని ప్రొటీస్ టీమ్ మేనేజర్ మొహమ్మద్ మూసజీ తెలిపారు. -
మంచు ముంచకుండా...
బంగ్లా ప్రపంచకప్‌లో మంచు ప్రభావం చాలా ఎక్కువగానే కనిపిస్తోంది. రాత్రి మ్యాచుల్లో టాస్ గెలిచిన వెంటనే కెప్టెన్ బౌలింగ్‌కు మొగ్గు చూపడం తప్పనిసరిగా మారిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ సమయంలో బంతిపై బౌలర్లకు ఏ మాత్రం పట్టు చిక్కడం లేదు. ఆటగాళ్లు పదే పదే కర్చీఫ్‌తో బంతిని తుడుస్తూ తిప్పలు పడుతున్నారు. దాంతో మంచు మ్యాచ్ ఫలితాన్నీ మార్చేస్తోంది. మరి దీనిని ఎదుర్కోవడం ఎలా? అసలే పేలవ బౌలింగ్ వనరులు ఉన్న ఇంగ్లండ్ కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించింది. కివీస్‌తో మ్యాచ్‌కు ముందు రోజు ఆ జట్టు ప్రాక్టీస్ సెషన్ పక్కన ఒక పెద్ద బకెట్ నిండా నీళ్లు తెచ్చి పెట్టారు. అందుబాటులో ఉన్న బంతులన్నీ అందులో వేసేశారు. అంతే...నెట్స్‌లో ఏ బౌలర్ బౌలింగ్ చేసినా నేరుగా అక్కడినుంచే బంతిని అందుకోవాలి. తుడిచే ప్రయత్నం చేయకుండా అలాగే తడిగా ఉన్న బంతితోనే బౌలింగ్ చేయాలి. ఈ తరహా ప్రాక్టీస్‌తో మ్యాచ్‌లో బంతి తడిగా మారినా పట్టు దొరుకుతుందని వారి ప్రయత్నం. అయితే శనివారం కివీస్‌తో మ్యాచ్‌లో తర్వాత బౌలింగ్ చేయాల్సి వచ్చినా మంచు సమస్య రాకుండానే మ్యాచ్ ముగిసిపోయింది! -
ఆఖరిసారి అలాగే...
ముంబై: మరో ఐదు రోజులు... అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికేందుకు కౌంట్‌డౌన్ మొదలైన నేపథ్యంలో సచిన్ బుధవారం తన ఆఖరి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ఉదయం 9.55 గంటలకు డ్రెస్సింగ్ రూమ్ నుంచి మైదానంలోకి అడుగుపెట్టిన మాస్టర్‌కు స్టేడియం సిబ్బంది శుభాకాంక్షలు చెప్పారు. 25 ఏళ్ల కిందట రంజీ ట్రోఫీలో సచిన్ అరంగేట్రం చేసినప్పుడు ఉన్న గ్రౌండ్ స్టాఫ్.. మాస్టర్‌కు బోకే ఇచ్చి అభినందనలు తెలిపారు. తర్వాత మైదానం సిబ్బంది మొత్తాన్ని పిలిచి, వాళ్లందరితో కలిసి ఫొటోలు దిగాడు. 10.45 నిమిషాలకు సంజయ్ పటేల్, కాశీ విశ్వనాథన్‌తో కలిసి వచ్చిన బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్... సచిన్‌ను ఆలింగనం చేసుకున్నారు. తర్వాత ఇద్దరు కలిసి కొద్దిసేపు చర్చలు జరిపారు. మొత్తానికి సచిన్ ఎలాంటి భావోద్వేగాలను బయటకు కనపడనీయకుండా ఎప్పటిలాగే ప్రాక్టీస్ చేసుకున్నాడు. -
వెటెల్ ‘సిక్సర్’
లాంఛనం ముగిసింది. ఊహించిన ఫలితమే వచ్చింది. ఈ సీజన్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ ఇండియన్ గ్రాండ్‌ప్రి రేసులో విజేతగా నిలిచాడు. మూడో ఏడాదీ ఈ టైటిల్ నెగ్గి ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. ఈ క్రమంలో వెటెల్ వరుసగా నాలుగో ఏడాది డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో ఆరో విజయంతో ‘డబుల్ హ్యాట్రిక్’ సాధించాడు. అంతేకాకుండా కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్‌లో రెడ్‌బుల్ జట్టును వరుసగా నాలుగో ఏడాది విజేతగా నిలిపాడు. గ్రేటర్ నోయిడా: అదే జోరు... అదే వేగం... సర్క్యూట్ మారినా.. తన దూకుడు తగ్గించకుండా రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ దూసుకుపోతున్నాడు. ప్రాక్టీస్ సెషన్లో... క్వాలిఫయింగ్ సెషన్లో ఆధిపత్యం చలాయించిన 26 ఏళ్ల ఈ జర్మన్ డ్రైవర్ ప్రధాన రేసులోనూ హల్చల్ చేశాడు. ఆద్యంతం ఆధిక్యం కనబరుస్తూ ఇండియన్ గ్రాండ్‌ప్రిలో వరుసగా మూడో ఏడాది చాంపియన్‌గా అవతరించాడు. బుద్ధ అంతర్జాతీయ సర్క్యూట్లో ఆదివారం జరిగిన 60 ల్యాప్‌ల ఈ రేసును వెటెల్ గంటా 31 నిమిషాల 12.187 సెకన్లలో పూర్తి చేశాడు. 2011, 2012లలో కూడా ఇండియన్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన వెటెల్‌కు ఈ సీజన్లో వరుసగా ఆరో విజయం... ఓవరాల్‌గా 10వ గెలుపు కావడం విశేషం. ఈ రేసుకు ముందు వెటెల్... బెల్జియం, ఇటలీ, సింగపూర్, కొరియా, జపాన్ గ్రాండ్‌ప్రిలలో కూడా అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఈ రేసులో రెడ్‌బుల్ జట్టుకే చెందిన మార్క్ వెబెర్ 39వ ల్యాప్‌లో వైదొలిగినా... వెటెల్ ప్రదర్శనతో రెడ్‌బుల్ జట్టుకు వరుసగా నాలుగో ఏడాది కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ కూడా దక్కింది. తాజా విజయంతో వెటెల్ ఈ సీజన్లో మరో మూడు రేసులు మిగిలి ఉండగానే అధికారికంగా డ్రైవర్స్ ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఖాయం చేసుకున్నాడు. 2010, 2011, 2012లలో కూడా వెటెల్ డ్రైవర్స్ ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఒకే సీజన్లో వరుసగా 6 అంతకంటే ఎక్కువ విజయాలు నమోదు చేసిన నాలుగో డ్రైవర్‌గా వెటెల్ గుర్తింపు పొందాడు. గతంలో అస్కారి (వరుసగా 9 రేసులు), షుమాకర్, జిమ్ క్లార్క్ (7 రేసులు) ఈ ఘనత సాధించారు. ఈ సీజన్లో 19 రేసులకుగాను 16 రేసులు పూర్తయ్యాయి. వెటెల్ 10 రేసుల్లో విజయం సాధించి మొత్తం 322 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 207 పాయింట్లతో అలోన్సో రెండో స్థానంలో ఉన్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రి నవంబరు 3న జరుగుతుంది. ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా టాప్-5లో నిలిస్తే వరుసగా నాలుగో ఏడాది డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాయమయ్యే పరిస్థితిలో బరిలోకి దిగిన వెటెల్ కేవలం విజయమే లక్ష్యంగా దూసుకుపోయాడు. రెండో స్థానంలో నిలిచిన రోస్బర్గ్కు వెటెల్‌కు మధ్య 29 సెకన్ల తేడా ఉండటం ఈ రేసులో వెటెల్ ఆధిపత్యానికి నిదర్శనం. లోటస్ జట్టు డ్రైవర్ రొమైన్ గ్రోస్యెన్ మూడో స్థానంలో నిలువగా... మసా (ఫెరారీ), పెరెజ్ (మెక్లారెన్) వరుసగా నాలుగైదు స్థానాలతో సరిపెట్టుకున్నారు. ప్రపంచ మాజీ చాంపియన్ ఫెర్నాండో అలోన్సో (ఫెరారీ) 11వ స్థానంతో సంతృప్తి పడటంతో అతనికి ఒక్క పాయింట్ కూడా దక్కలేదు. భారత్‌కు చెందిన ‘సహారా ఫోర్స్ ఇండియా’ జట్టుకు ఈ రేసు కలిసి వచ్చింది. ఆ జట్టు ఇద్దరు డ్రైవర్లు టాప్-10లో నిలిచి తమ ఖాతాలో పాయింట్లు వేసుకున్నారు. పాల్ డి రెస్టా ఎనిమిదో స్థానంలో... అడ్రియన్ సుటిల్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. మార్క్ వెబెర్ (రెడ్‌బుల్) 39వ ల్యాప్‌లో రేసు నుంచి వైదొలగగా... కాటర్‌హమ్ జట్టు డ్రైవర్లు చార్లెస్ పిక్ 35వ ల్యాప్‌లో... గియెడో గార్డె తొలి ల్యాప్‌లోనే రేసు నుంచి తప్పుకున్నారు.