ఆఖరిసారి అలాగే... | Srinivasan greets Tendulkar on his last training day | Sakshi
Sakshi News home page

ఆఖరిసారి అలాగే...

Published Thu, Nov 14 2013 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM

ఆఖరిసారి అలాగే...

ఆఖరిసారి అలాగే...

 ముంబై: మరో ఐదు రోజులు... అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికేందుకు కౌంట్‌డౌన్ మొదలైన నేపథ్యంలో సచిన్ బుధవారం తన ఆఖరి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఉదయం 9.55 గంటలకు డ్రెస్సింగ్ రూమ్ నుంచి మైదానంలోకి అడుగుపెట్టిన మాస్టర్‌కు స్టేడియం సిబ్బంది శుభాకాంక్షలు చెప్పారు.
 
 25 ఏళ్ల కిందట రంజీ ట్రోఫీలో సచిన్ అరంగేట్రం చేసినప్పుడు ఉన్న గ్రౌండ్ స్టాఫ్.. మాస్టర్‌కు బోకే ఇచ్చి అభినందనలు తెలిపారు. తర్వాత మైదానం సిబ్బంది మొత్తాన్ని పిలిచి, వాళ్లందరితో కలిసి ఫొటోలు దిగాడు. 10.45 నిమిషాలకు సంజయ్ పటేల్, కాశీ విశ్వనాథన్‌తో కలిసి వచ్చిన బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్... సచిన్‌ను ఆలింగనం చేసుకున్నారు. తర్వాత ఇద్దరు కలిసి కొద్దిసేపు చర్చలు జరిపారు. మొత్తానికి సచిన్ ఎలాంటి భావోద్వేగాలను బయటకు కనపడనీయకుండా ఎప్పటిలాగే ప్రాక్టీస్ చేసుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement