Virat Kohli Shares Pictures From Training Session Ahead Of South Africa Tests - Sakshi
Sakshi News home page

IND Vs SA: విరాట్‌ సిద్ధమయ్యాడు.. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలే!

Published Fri, Dec 24 2021 8:47 AM | Last Updated on Fri, Dec 24 2021 9:19 AM

Virat Kohli shares pictures from training session ahead of South Africa Tests - Sakshi

దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌ ​(బ్యాక్సింగ్‌డే టెస్ట్‌)కు ముందు టీమిండియా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. డిసెంబర్‌26న సెంచూరియన్‌ వేదికగా తొలి టెస్ట్‌ ప్రారంభం కానుంది. కాగా ఇప్పటివరకు దక్షిణాఫ్రికా గడ్డపై ఒక్క టెస్ట్‌ సిరీస్‌ కూడా భారత్‌ గెలవలేదు. ఇక కోహ్లి సారథ్యంలోని భారత జట్టు తొలి టెస్ట్‌ సిరీస్‌ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నెట్స్‌లో చెమటోడ్చుతున్నాడు. తన ప్రాక్టీస్ సెషన్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలను ట్విట్టర్‌లో అభిమానులతో కోహ్లి పంచుకున్నాడు.

దీంతో బ్యాక్సింగ్‌డే టెస్ట్‌కు రన్‌మిషన్‌ కోహ్లి సిద్దమయ్యాడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా కోహ్లి గత కొంతకాలంగా అంత ఫామ్‌లో లేడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లి సెంచరీ సాధించి రెండేళ్లు దాటింది. దీంతో దక్షిణాఫ్రికా సిరీస్‌లోనైనా ‍కోహ్లి సెంచరీ సాధిస్తాడాని అభిమానులు ఆశిస్తున్నారు. అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న కెప్టెన్సీ వివాదం నేపథ్యంలో కోహ్లి ఎలా రాణిస్తాడో వేచి చూడాలి. కాగా విరాట్‌ కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలిగించి రోహిత్‌ శర్మను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

చదవండి: ఆసియా కప్‌లో భారత్‌ శుభారంభం.. దుమ్మురేపిన హర్నర్‌, యశ్‌దల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement