IND vs SA 3rd Test Updates:
భారత్ 223 ఆలౌట్, దక్షిణాఫ్రికా 17/1
తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. కెప్టెన్ డీన్ ఎల్గర్(3)ను బుమ్రా ఔట్ చేశాడు. క్రీజ్‌లో మార్క్రమ్(8), కేశవ్ మహారాజ్(6) ఉన్నారు.
8: 46 PM: సఫారీ పేసర్ల విజృంభణ.. టీమిండియా 223 ఆలౌట్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో టీమిండియా నిరాశపరిచింది. సఫారీ పేసర్ల ధాటికి 223 పరుగులకే చాపచుట్టేసింది. కెప్టెన్ కోహ్లి(79) ఓంటరి పోరాటం చేయడంతో గౌరవప్రదమైన స్కోర్‌ను సాధించగలిగింది. సఫారీ బౌలర్లు రబాడ 4, మార్కో జన్సెన్ 3, ఒలీవియర్, ఎంగిడి, కేశవ్ మహారాజ్ తలో వికెట్ సాధించారు.
కోహ్లి(79) ఔట్.. తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా
క్రీజ్‌లో పాతుకుపోయిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి(79) ఎట్టకేలకు ఔటయ్యాడు. రబాడ బౌలింగ్‌లో వెర్రిన్‌కు క్యాచ్ ఇచ్చి 211 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. క్రీజ్‌లో ఉమేశ్ యాదవ్, షమీ ఉన్నారు.
టీమిండియా ఎనిమిదో వికెట్ డౌన్
డ్రింక్స్ బ్రేక్‌కు ముందు టీమిండియాకు మరో షాక్ తగిలింది. రబాడ బౌలింగ్‌లో బుమ్రా డకౌటయ్యాడు. ఫలితంగా టీమిండియా 210 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. క్రీజ్లో కోహ్లి(78), ఉమేశ్ యాదవ్ ఉన్నారు.
శార్ధూల్ ఔట్
రెండో టెస్ట్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించిన శార్ధూల్ ఠాకూర్(12) ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. వచ్చీ రాగానే భారీ షాట్లతో విరుచుకుపడిన అతను.. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో కీగన్ పీటర్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫలితంగా టీమిండియా 205 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. క్రీజ్లో కోహ్లి(73), బుమ్రా ఉన్నారు.
జన్సెన్ విజృంభణ.. 175 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా
దక్షిణాఫ్రికా యువ పేసర్ మార్కో జన్సెన్ విజృంభణతో టీమిండియా 175 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది. అశ్విన్ 2 పరుగులు మాత్రమే చేసి జన్సెన్ బౌలింగ్‌లో వెర్రిన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజ్‌లో కోహ్లి(56), శార్ధూల్ ఠాకూర్ ఉన్నాడు.
167 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా
మార్కో జన్సెన్ టీమిండియాపై మరోసారి ప్రతాపం చూపుతున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఇదివరకే కీలకమైన పుజారా వికెట్ పడగొట్టిన అతను.. రిషబ్ పంత్(27)ను కూడా పెవిలియన్‌కు పంపాడు. దీంతో టీమిండియా 167 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లి(50), అశ్విన్ క్రీజ్‌లో ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా
116 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. రహానే(9) వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. రబాడ బౌలింగ్‌లో వెర్రిన్‌కు క్యాచ్ ఇచ్చి రహానే ఔటయ్యాడు. క్రీజ్‌లో విరాట్ కోహ్లి(29), పంత్ ఉన్నారు.
టీమిండియా మూడో వికెట్ డౌన్
క్రీజ్‌లో నిలదొక్కుకున్నట్లు కనిపించిన పుజారా 43 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మార్కో జన్సెన్ బౌలింగ్‌లో వెర్రిన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా 95 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. క్రీజ్లో కోహ్లి(17), రహానే ఉన్నారు.
5: 06 PM: టీమిండియా స్కోరు: 85/2 (34.3).
పుజారా 35, కోహ్లి 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రొటిస్ బౌలర్లు రబడ, ఒలివర్ చెరో వికెట్ తీశారు.
4: 00 PM: లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 75/2 (28).
కోహ్లి 15, పుజారా 26 పరుగులతో క్రీజులో ఉన్నారు.
3: 36 PM: టీమిండియా ప్రస్తుత స్కోరు: 53/2 (22.1). కెప్టెన్ కోహ్లి 5, పుజారా 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.
2: 53 PM: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. మయాంక్ అగర్వాల్‌ను రబడ అవుట్ చేశాడు. స్కోరు: 33/2. విరాట్ కోహ్లి, పుజారా క్రీజులో ఉన్నారు.
2: 48 PM: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. కేఎల్ రాహుల్ అవుట్.
ఒలివర్ బౌలింగ్‌లో టీమిండియా ఓపెనర్ రాహుల్ పెవిలియన్ చేరాడు. వికెట్ కీపర్ వెరెన్‌కు క్యాచ్ ఇచ్చి 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. పుజారా క్రీజులోకి వచ్చాడు.
2: 30 PM:
కేఎల్ రాహుల్ 12, మయాంక్ అగర్వాల్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు 31/0.
మూడో టెస్టులో రెండు మార్పులతో భారత జట్టు బరిలోకి దిగింది. గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన విరాట్ కోహ్లి.. విహారి స్ధానంలో జట్టులోకి రాగా, సిరాజ్ స్థానంలో ఉమేశ్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక దక్షిణాఫ్రికా ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది.
తుది జట్లు:
భారత్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, విరాట్ కోహ్లి(కెప్టెన్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్
సౌతాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, కైలీ వెరెనె(వికెట్ కీపర్), మార్కో జాన్‌సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువానే ఒలివర్, లుంగి ఎంగిడి.
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో తుది సమరానికి భారత్ సిద్దమైంది. ఒక్కో టెస్టు గెలిచి భారత్, దక్షిణాఫ్రికా 1–1తో సమంగా ఉన్న సంగతి తెలిసిందే. తొలి సారి సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ సాధించి చరిత్ర సృష్టించాలన్న పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
చదవండి: క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. సూపర్ మ్యాన్‌లా.. వీడియో వైరల్!
Comments
Please login to add a commentAdd a comment