
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగునున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆడడం దాదాపు ఖాయమైంది. జొహాన్స్‌బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌కు గాయం కారణంగా కోహ్లి దూరమైన సంగతి తెలిసిందే. ఈ టెస్ట్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాదించింది. దీంతో మూడు టెస్ట్‌ల సిరీస్ 1-1తో సమమైంది. ఇక మూడో టెస్ట్‌కు ముందు ఓ అరుదైన రికార్డు కోహ్లిని ఊరిస్తుంది.
దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లుగా సచిన్ సచిన్ టెండూల్కర్(1161), రాహుల్ ద్రవిడ్(624) పరుగులతో ఉన్నారు. అయితే దక్షిణాఫ్రికాలో 611 పరుగులు చేసిన కోహ్లి.. ద్రవిడ్ రికార్డును అధిగమించడానికి కేవలం 14 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇక కోహ్లి తన కేరిర్‌లో 99వ టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు. ఇక భారత్- దక్షిణాఫ్రికా మధ్య మూడో టెస్ట్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: Ind Vs Sa: హనుమ విహారికి నో ఛాన్స్.. పంత్‌కు అవకాశం... సిరాజ్ స్థానంలో అతడే! ఎందుకంటే..
Comments
Please login to add a commentAdd a comment