పెర్ల్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ 31 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కాగా 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఆదిలోనే కెప్టెన్ రాహుల్ వికెట్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి భారత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే వీరిద్దరూ ఔటయ్యాక భారత జట్టు మిడిలార్డర్ కూప్పకూలింది. చివర్లో శార్ధుల్ ఠాకూర్ మెరుపులు మెరిపించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు సాధించింది.
కాగా భారత మిడిలార్డర్ విఫలంపై ఓపెనర్ శిఖర్ ధావన్ మ్యాచ్ అనంతరం స్పందించాడు. బోలాండ్ పార్క్‌లో వికెట్ చాలా నెమ్మదిగా ఉందని ధావన్ తెలిపాడు. 300 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం భారత మిడిలార్డర్‌కు అంత సులభం కాదని అతడు అభిప్రాయపడ్డాడు. అదే విధంగా దక్షిణాఫ్రికా బ్యాటర్లు టెంబా బావుమా, వాన్ డెర్ డుస్సేన్‌పై ధావన్ ప్రశంసల వర్షం కురిపించాడు.
‘మాకు మంచి ఆరంభం లభించింది. రాహుల్ వికెట్ కోల్పోయినా నేను, విరాట్.. స్కోర్ బోర్డును ముందుకు నడిపించాము. కానీ వికెట్ వికెట్ చాలా నెమ్మదిగా ఉంది. మంచు ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు భారీ షాట్లు ఆడడం అంత సులభం కాదు. మేము ఈ మ్యాచ్‌లో సెంచరీ భాగస్వామ్యం కూడా నమోదు చేయలేకపోయాం. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాం. అది మా బ్యాటింగ్ యూనిట్‌పై ప్రభావం చూపింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు టెంబా బావుమా, వాన్ డెర్ డుస్సేన్ అద్భుతంగా ఆడార’ని శిఖర్ ధావన్ అన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో ధావన్ 79 పరుగులు సాధించాడు. ఇక భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే బోలాండ్ పార్క్ వేదికగా శుక్రవారం జరగనుంది.
చదవండి: ఒక వైపు కెప్టెన్, వైస్ కెప్టెన్‌కి పాజిటివ్.. అయినా టీమిండియా ఘన విజయం..
Comments
Please login to add a commentAdd a comment