జోహాన్స్‌బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియాపై దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో 3 టెస్ట్‌ల సిరీస్‌ను 1-1 ప్రోటిస్ సమం చేసింది. ఈ క్రమంలో కేప్‌టౌన్‌లో జరగనున్న మూడు టెస్ట్ ఇరు జట్లుకు కీలకం కానుంది. అయితే ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ సాధించని భారత్‌కు ఇది సువర్ణ అవకాశం. ఇది ఇలా ఉంటే టీమిండియాను గాయాల బెడద వెంటాడుతుంది. ఇప్పటికే గాయం కారణంగా రోహిత్ శర్మ సౌతాఫ్రికా పర్యటనకు దూరం కాగా, కెప్టెన్ విరాట్ కోహ్లి వెన్ను నొప్పి కారణంగా రెండో టెస్ట్ నుంచి తప్పుకున్నాడు. రెండో టెస్ట్ అనంతరం విలేకరల సమావేశంలో టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడాడు. కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడో టెస్ట్‌కు విరాట్ కోహ్లి తిరిగి వస్తాడని ఆశిస్తున్నట్లు ద్రవిడ్ తెలిపాడు.
"విరాట్ కోహ్లి ప్రస్తుతం మెడ నొప్పి నుంచి కోలుకున్నాడు. త్వరలో కేప్ టౌన్‌లో నెట్ సెషన్‌లో పాల్గొంటాడని భావిస్తున్నాను. అతడి గాయంపై ఎప్పటికప్పుడు వైద్యులతో చర్చిస్తున్నాను. అతడు మూడో టెస్ట్‌కు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాను. ఈ సిరీస్‌లో టీమిండియా బ్యాటింగ్ ప్రదర్శనపై ద్రవిడ్‌ని ప్రశ్నించగా.. ఇక్కడి పిచ్‌లపై బ్యాటింగ్ రెండు జట్లకు సవాలుగా మారింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. మేము మరో 50-60 పరుగులు సాధించింటే బాగుండేది. అదే విధంగా హనుమ విహారి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అద్భుతంగా ఆడాడు. గతంలో శ్రేయాస్ అయ్యర్ మాకు బాగా బ్యాటింగ్ చేశాడు. అవకాశం వచ్చినప్పుడు యువ ఆటగాళ్లు బాగా రాణిస్తున్నారు. అఖరి టెస్ట్‌లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంటామని భావిస్తున్నాను" అని ద్రవిడ్ పేర్కొన్నాడు.
చదవండి: మోస్ట్ వాల్యూబుల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా మహ్మద్ రిజ్వాన్ ..
Comments
Please login to add a commentAdd a comment