తుది పోరులో దక్షిణాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోవడానికి భారత్ సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా రెండో టెస్టుకు గాయం కారణంగా దూరమైన విరాట్ కోహ్లి తుది జట్టులోకి వచ్చాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌కు గాయం కారణంగా సిరాజ్ దూరం కావడంతో ఉమేశ్ యాదవ్‌కు స్ధానం దక్కింది. ఇక ఎటువంటి మార్పులు లేకుండానే దక్షిణాఫ్రికా బరిలోకి దిగింది.
కాగా ఆరంభంలో పేసర్లు ప్రభావం చూపించడంతో పాటు బౌన్స్ కారణంగా బ్యాట్స్‌మెన్ కూడా బాగా పరుగులు సాధించే అవకాశం ఉంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పొడిబారి స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. కాబట్టి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకోవడం ఉత్తమమైన నిర్ణయం అనే చెప్పుకోవాలి.
తుది జట్లు:
భారత్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, విరాట్ కోహ్లి(కెప్టెన్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్
సౌతాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, కైలీ వెరెనె(వికెట్ కీపర్), మార్కో జాన్‌సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువానే ఒలివర్, లుంగి ఎంగిడి.
చదవండి: Ind Vs Sa 3rd Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
Comments
Please login to add a commentAdd a comment