టీమిండియా స్టార్ క్రికెటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లి ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా అద్భుతంగా రాణిస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనం చూస్తున్న కోహ్లికి రెండేళ్ల క్రితం కోహ్లికి చాలా వ్యత్యాసం ఉంది. రెండేళ్ల కిందట కింగ్ కోహ్లి ఫామ్ కోల్పోయి, కెరీర్‌లో అత్యంత హీన దశకు ఎదుర్కొన్నాడు. 2019 డిసెంబర్ నుంచి 2022 జులై వరకు కోహ్లి కెరీర్ పరంగా ఎన్ని అవమానులు పడాలో అన్నీ పడ్డాడు.
ఫామ్ కారణంగా కెప్టెన్సీని సైతం కోల్పోయాడు. అనర్హులచే మాటలు పడ్డాడు. ఓ దశలో అసమర్థ కెప్టెన్‌గా ముద్ర వేయించుకున్నాడు. అలాంటి దశ నుంచి కోహ్లి 2022 ఆగస్ట్‌లో బయటపడ్డాడు. కోహ్లి కష్టకాలం నాటితో ముగిసింది. అతను తిరిగి ఫామ్‌ను అందుకున్నాడు. అయితే కమ్ బ్యాక్‌లో కోహ్లి మనుపటి కంటే భీకరంగా మారిపోయి, ప్రత్యర్ధి బౌలర్ల పాలిట సింహస్వప్నంలా తయారయ్యాడు. ఫార్మాట్ ఏదైనా కోహ్లిని ఔట్ చేయడం బౌలర్లకు స్థాయికి మించిన పని అయిపోయింది. 2022 ఆగస్ట్ నుంచి సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ వరకు కోహ్లి గణాంకాలు గమనిస్తే విషయం ఇట్టే అర్దమవుతుంది.
In the annals of Virat Kohli's cricketing journey, 2023 is poised to be remembered as the year of his triumphant 𝑪𝑶𝑴𝑬𝑩𝑨𝑪𝑲🔥 pic.twitter.com/OvG1lXXxyx
— CricTracker (@Cricketracker) December 30, 2023
2019 డిసెంబర్ నుంచి 2022 జులై వరకు కోహ్లి తన కెరీర్‌లో (అన్ని ఫార్మాట్లు) మొత్తం 79 ఇన్నింగ్స్‌లు ఆడి ఒక్క సెంచరీ కూడా లేకుండా (24 అర్దసెంచరీలు) 35.47 సగటున 2554 పరుగులు చేయగా.. ఆతర్వాతి కాలంలో 59 ఇన్నింగ్స్‌ల్లో 10 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీల సాయంతో 62.12 సగటున 2920 పరుగులు చేశాడు. ఈ లెక్కలు చాలు కోహ్లి కమ్‌బ్యాక్‌లో ఎంత భీకరంగా ఉన్నాడో చెప్పడానికి.
కమ్‌బ్యాక్‌లో కోహ్లి లెక్కలు చూసి ప్రపంచ బౌలర్లు దడుసుకుంటున్నారు. కోహ్లి ఫామ్ ఇలాగే కొనసాగితే, మున్ముందు అతన్ని ఆపడం ఆసాధ్యమని భయపడుతున్నారు. కోహ్లి జోరుకు అడ్డుకట్ట పడితే టీమిండియా జైత్రయాత్రకు కూడా బ్రేకులు పడతాయని అభిప్రాయపడుతున్నారు. కాగా, సౌతాఫ్రికాతో ఇటీవల ముగిసిన తొలి టెస్ట్‌లో సహచర బ్యాటర్లంతా విఫలమైనా కోహ్లి సెకెండ్ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment