విరాట్‌ను అభినందించిన సచిన్‌.. త్వరలోనే తన రికార్డు బద్దలు కొట్టాలని సందేశం | CWC 2023 IND Vs SA: Sachin Tendulkar Comments After Virat Equals His 49 ODI Centuries Record Goes Viral - Sakshi
Sakshi News home page

CWC 2023 IND Vs SA: నాకు 49 నుంచి 50కి చేరేందుకు 365 రోజులు పట్టింది.. నువ్వు కొద్ది రోజుల్లోనే నా రికార్డు బద్దలు కొట్టాలి: సచిన్‌

Published Mon, Nov 6 2023 8:24 AM | Last Updated on Mon, Nov 6 2023 10:44 AM

CWC 2023 IND VS SA: Sachin Tendulkar Comments After Virat Equals His 49 ODI Centuries Record - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా సౌతాఫ్రికాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి క్రికెట్‌ దిగ్గజం​ సచిన్‌ టెండూల్కర్‌ అత్యధిక వన్డే సెంచరీల రికార్డును (49) సమం చేసిన విషయం తెలిసిందే. తన రికార్డును సమం చేసిన అనంతరం సచిన్‌.. విరాట్‌ను అభినందించాడు. చాలా బాగా ఆడావు విరాట్‌. నాకు 49 నుంచి 50 వరకు చేరేందుకు (వయసు) 365 రోజులు పట్టాయి. కానీ నువ్వు రాబోయే కొద్ది రోజుల్లోనే 49 నుంచి 50కి చేరుకొని (సెంచరీలు) నా రికార్డు బద్దలు కొడతావని ఆశిస్తున్నా. నీకు నా అభినందనలు అంటూ సచిన్‌ ట్వీట్‌ చేశాడు. 

సచిన్‌ అభినందనలు అందుకున్న తర్వాత ఈ విషయమై విరాట్‌ కూడా స్పందించాడు. తన ఆరాధ్య ఆటగాడి (సచిన్‌) రికార్డు సమం చేయడం​ గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు. తాను ఎప్పటికీ సచిన్‌‌ అంత గొప్ప ఆటగాడిని కాలేనని తెలిపాడు. తన పుట్టిన రోజున సెంచరీ సాధించడం, అది సచిన్‌ రికార్డు సమం చేసే సెంచరీ కావడం గొప్ప అనుభూతిని కలిగిస్తుందని అన్నాడు. కాగా, 49 సెంచరీలు చేసేందుకు సచిన్‌కు 451 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. విరాట్‌ కేవలం 277 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించడం​ విశేషం. 

ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో విరాట్‌ రికార్డు సెంచరీతో (121 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 101 పరుగులు) చెలరేగడంతో టీమిండియా సౌతాఫ్రికాను 243 పరుగుల తేడాతో చిత్తు చేసింది. రవీంద్ర జడేజా (9-1-33-5) బంతితో సఫారీల భరతం పట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. విరాట్‌, శ్రేయస్‌ (77), రోహిత్‌ (24 బంతుల్లో 40; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), జడేజా (15 బంతుల్లో 29 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేయగా.. జడేజా మాయాజాలం దెబ్బకు సౌతాఫ్రికా 27.1 ఓవర్లలో 83 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

చదవండి: విరాట్‌ కోహ్లి= సచిన్‌ టెండూల్కర్‌

నా హీరో రికార్డు సమం చేయడం​ గౌరవంగా భావిస్తున్నా: విరాట్‌ కోహ్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement