Viral Video: విరాట్‌ నీలో ఈ టాలెంట్‌ కూడా ఉందా..? | CWC 2023: King Kohli Has Unique Talent Of Singing Too, Video Goes Viral - Sakshi
Sakshi News home page

CWC 2023: విరాట్‌ నీలో ఈ టాలెంట్‌ కూడా ఉందా..?

Published Mon, Nov 6 2023 10:36 AM | Last Updated on Mon, Nov 6 2023 11:10 AM

CWC 2023: King Kohli Has Unique Talent Of Singing Too, Video Surfaces On Occasion Of His Birthday - Sakshi

టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి క్రికెటింగ్‌ టాలెంట్‌ గురించి మనందరికీ తెలుసు. కింగ్‌ కోహ్లి పరుగుల యంత్రంగా, రికార్డుల రారాజుగా, ఛేజింగ్‌ మాస్టర్‌గా సుపరిచితం. అయితే అతనిలో ఓ క్రికెటేతర టాలెంట్‌ కూడా ఉందని మనలో చాలామందికి తెలియకపోవచ్చు. విరాట్‌లో ఓ అద్భుతమైన సింగర్‌ దాగి ఉన్నాడు. విరాట్‌ 35వ పుట్టినరోజు సందర్భంగా ఓ అభిమాని విరాట్‌లోని సింగింగ్‌ టాలెంట్‌ను ప్రపంచాని​కి పరిచయం చేశాడు.

ఈ వీడియో పాత వీడియోనే అయినప్పటికీ.. చాలా అరుదుగా కనిపించింది. ఇందులో విరాట్‌ ఫిమేల్‌ సింగర్‌తో కలిసి ఓ బాలీవుడ్‌ పాట పాడతాడు. విరాట్‌ జన్మదినం సందర్భంగా నరుందర్‌ అనే అభిమాని పోస్ట్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఈ వీడియో చూసి విరాట్‌ అభిమానులు సంబురపడిపోతున్నారు. తమ ఆరాధ్య క్రికెటర్‌లో ఈ టాలెంట్‌ కూడా దాగి ఉందా అని ఆశ్చర్యపడుతున్నారు.

చదవండి: సచిన్‌, కోహ్లి.. ఎవరు గొప్ప..?

కోహ్లి తన పుట్టినరోజున సచిన్‌ అత్యధిక వన్డే సెంచరీల రికార్డును (49 సెంచరీలు) సమం చేయడంతో ఈ వీడియోకు మరింత పాపులారిటీ పెరిగింది. మొత్తానికి విరాట్‌ మేనియాతో నిన్నటి నుంచి సోషల్‌మీడియా షేక్‌ అవుతుంది.

కాగా, వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా సౌతాఫ్రికాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ తన ఆరాధ్య క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అత్యధిక వన్డే సెంచరీల రికార్డును (49) సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్‌ శతక్కొట్టడంతో (121 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 101 పరుగులు)  పాటు జడేజా బంతితో (9-1-33-5) మ్యాజిక్‌ చేయడంతో భారత్‌ 243 పరుగుల తేడాతో సఫారీలను చిత్తు చేసింది.  

చదవండి: సచిన్‌ అంత గొప్ప ఆటగాడిని కాను, కాలేను: విరాట్‌ కోహ్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement