తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో విజయ్, రహానేల సమయోచిత ప్రదర్శనతో మూడో రోజు ఆట ముగిసేసరికి రెండో టెస్టు భారత్ చేతుల్లోకి వచ్చేసింది. ప్రస్తుతం ఉన్న 157 పరుగుల ఆధిక్యానికి నాలుగో రోజు వీలైనన్ని పరుగులు జోడిస్తే... టీమిండియా మ్యాచ్‌పై ఆశలు పెట్టుకోవచ్చు. అయితే తొలి టెస్టులో మాదిరిగా లంకేయులు అద్భుతం చేయకుండా జాగ్రత్తపడాలి.