అవకాశం వస్తే ఆయనతో.. | Nayantara To Romance Ilayathalapathy In Vijay | Sakshi
Sakshi News home page

అవకాశం వస్తే ఆయనతో..

Published Mon, May 16 2016 5:01 AM | Last Updated on Mon, Sep 4 2017 12:10 AM

అవకాశం వస్తే ఆయనతో..

అవకాశం వస్తే ఆయనతో..

కోలీవుడ్‌లో నంబర్‌ఒన్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న నటి నయనతార. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ ఆమెను వరుస విజయాలు టాప్ రేంజ్‌లో నిలబెట్టాయి. విశేషం ఏమిటంటే ఇటీవల ప్రముఖ నటుల కంటే యువ హీరోలతోనే నయనతార నటించిన చిత్రాలే మంచి విజయాన్ని సాధిం చాయి. దీంతో తను కూడా చిన్నా పెద్ద హీరోలని చూడకుండా కథా పాత్రలకే ప్రాముఖ్యత నిస్తున్నారు. మాయ చిత్రం నయనను లేడీఓరి యెంటెడ్ హీరోయిన్‌న చేసింది. ఇటీవల ఆమె ప్రముఖ కథానాయకుడి సరసన చిత్రాలు చేయలేదనే చెప్పాలి.

ముఖ్యంగా ఇళయదళపతి విజయ్‌తో రొమాన్స్ చేసి చాలా కాలమైంది. విల్లు చిత్రంలో తొలిసారిగా విజయ్ తో జత కట్టారు. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఆ తరువాత శివకాశి చిత్రంలో ఇళయదళపతితో సింగల్ సాంగ్‌లో లెగ్ షేక్ చేశారు.ఆ తరువాత విజయ్‌తో నటించే అవకాశాలు వచ్చినా తను ఇతర చిత్రాలతో బిజీగా ఉండడం తో వాటిని నయనతార అంగీకరించలేని పరిస్థితి. దీంతో వీరిద్దరు కలి సి నటిస్తే చూడాలన్న ఆకాంక్ష ప్రేక్షకుల్లో నెలకొంది. కరెక్ట్‌గా అలాం టి కోరికనే నయనతార ఇటీవల వెల్లడించడం విశేషం. విజయ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి నటించడానికి మంచి అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను అని నయనతార తన మనసులోని మాటను వ్యక్తం చేశారు. మరి దర్శక నిర్మాతలు ఇంకెందుకు ఆలస్యం ఈ సూపర్ జంట కోసం కథలు రెడీ చేసుకోండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement