విజయ్‌ ‘బిగిల్‌’ ట్రైలర్‌ వచ్చేసింది! | Bigil Official Trailer is Out | Sakshi
Sakshi News home page

విజయ్‌ ‘బిగిల్‌’ ట్రైలర్‌ వచ్చేసింది!

Published Sat, Oct 12 2019 7:04 PM | Last Updated on Sat, Oct 12 2019 7:12 PM

Bigil Official Trailer is Out - Sakshi

త‌మిళ బడా స్టార్ విజ‌య్‌ తాజా సినిమా ‘బిగిల్’ ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కిన ‘బిగిల్’  సినిమా దీపావళి సందర్భంగా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌గా కనిపిస్తుండగా ఆయన సరసన న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు. బాలీవుడ్ న‌టుడు జాకీ ష్రాఫ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు సంగీతం ఏఆర్ రెహ‌మాన్.. ఈ సినిమాలో ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా, కోచ్‌గా విభిన్నమైన షేడ్స్‌తో విజ‌య్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. పూర్తి మాస్‌ యాక్షన్‌ థ్రిలర్‌గా విజయ్‌ ఫ్యాన్స్‌కు పండుగ బొనాంజాలా సినిమా ట్రైలర్‌ ఉంది.  అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో బిగిల్‌ తెరకెక్కింది. విజ‌య్ - అట్లీ కాంబినేష‌న్‌లో గతంలో వ‌చ్చిన తెరీ, మెర్స‌ల్ సినిమాలు భారీ విజ‌యం సాధించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement