కోలీవుడ్‌లో నయనతార, విఘ్నేశ్ శివన్‌లకు బ్రాండ్ ఉంది. పదేళ్ల క్రితం ప్రేమలో పడి.. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న రికార్డు వీరిది. అయితే పెళ్లికి ముందు నుంచే ఏ చిన్న అకేషన్ వచ్చినా ఈ జంట విదేశాలకు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేసిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడాన్ని ఈ జంట ఆనవాయితీగా పెట్టుకున్నారనే చెప్పాలి. అలా పుట్టిన రోజు, పెళ్లి రోజులు వస్తున్నాయంటే ఈ జంట నుంచి రకరకాల ఫొటోల కోసం నెటిజన్లు ఎదురు చూసేస్థితికి వారిని తీసుకొచ్చారు.
తాజాగా వీరిని స్ఫూర్తిగా తీసుకున్నట్లు ఉన్నారు దర్శకుడు అట్లీ. దర్శకుడు శంకర్ శిష్యుడు అయిన అట్లీ రాజా రాణి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రమే మంచి విజయాన్ని సాధించడంతో ఆ తరువాత విజయ్ వంటి స్టార్ హీరోకు అవకాశం కల్పించారు. ఆయనతో మెర్శల్, తెరి, బిగిల్ వంటి హిట్ చిత్రాలను చేసి హిట్ కొట్టారు. ఇక ఇటీవల బాలీవుడ్‌కు వెళుతూ బాద్షా షారూఖ్‌ఖాన్ హీరోగా జవాన్‌తో అట్లీ సక్సెస్ అయ్యారు.
ఇదిలా ఉంటే.. నటి ప్రియనుప్రేమించి 2014లో పెళ్లి చేసుకున్నారు. కాగా తొమ్మిది ఏళ్ల తరువాత ఇటీవలే తల్లిదండ్రులు అయ్యారు. ఇక అసలు విషయం ఏమంటే నయనతార, విఘ్నేష్ శివన్ తరహాలోనే ఈ జంట ఎలాంటి అకేషన్ వచ్చినా, లేకపోయినా ప్రత్యేకంగా ఫొటోలు తీయించుకుని మరీ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ జంట దిగిన రొమాంటిక్ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment