
స్మిత్, వోజెస్ శతకాలు
ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 258/2
పెర్త్: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో శతకాల మోత మోగుతోంది. సోమవారం తమ రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (170 బంతుల్లో 131 బ్యాటింగ్; 17 ఫోర్లు), వోజెస్ (180 బంతుల్లో 101 బ్యాటింగ్; 15 ఫోర్లు) అజేయ శతకాలు సాధించారు. దీంతో నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 63 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది.
దీంతో ప్రస్తుతం 193 పరుగుల ఆధిక్యంతో ఉంది. అంతకుముందు కివీస్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 153.5 ఓవర్లలో 624 పరుగుల వద్ద ముగించింది. రాస్ టేలర్ (374 బంతుల్లో 290; 43 ఫోర్లు) కొద్దిలో ట్రిపుల్ శతకం మిస్ అయ్యాడు. అయితే ఆసీస్ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన పర్యాటక జట్టు ఆటగాడిగా నిలిచాడు. స్టార్క్‌కు నాలుగు, లియోన్‌కు మూడు వికెట్లు పడ్డాయి.