
సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన భారత్
హైదరాబాద్: భారత్, ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ కొనసాగుతోంది. సెకండ్ ఇన్నింగ్స్లో భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. మురళి విజయ్, శిఖరధావన్లు క్రీజులో ఉన్నారు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 109.4 ఓవర్లకు 505 పరుగులు చేసి ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 408 పరుగులకు ఆలౌటయిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా 97 పరుగులు ఆధిక్యత సాధించింది.
ఈ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా జట్టు క్రీడాకారులు స్మిత్ 133 పరుగులు, జాన్సన్ 88, రోజర్స్ 55, ఎస్.ఇ.మార్ష్ 32, వార్నెర్ 29, వాట్సన్ 25,ఎంఆర్ మార్ష్ 11, హద్దీన్ 6,స్టార్క్ 52, లియాన్ 23 పరుగులు చేసి అవుటయ్యారు. హాజల్ఉడ్ 32 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.