డియర్.. నా సెకండ్ ఇన్నింగ్స్ కాదిది! | Dear Maya not my second innings in Bollywood, says Manisha Koirala | Sakshi

డియర్.. నా సెకండ్ ఇన్నింగ్స్ కాదిది!

Published Sun, Aug 28 2016 1:11 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

డియర్.. నా సెకండ్ ఇన్నింగ్స్ కాదిది! - Sakshi

డియర్.. నా సెకండ్ ఇన్నింగ్స్ కాదిది!

‘‘ఫిల్మ్ ఇండస్ట్రీకి నేనెప్పుడూ దూరంగా లేను. నా సెకండ్ ఇన్నింగ్స్ కాదిది. మధ్యలో రెండు మూడేళ్లు గ్యాప్ వచ్చిందంతే. ఇకపై ఏడాదికి ఓ సినిమా చేస్తా’’ అన్నారు మనీషా కొయిరాలా. ‘ఒకే ఒక్కడు’, ‘బొంబాయి’, ‘క్రిమినల్’ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ ఈ నేపాలీ భామ సుపరిచితురాలే. క్యాన్సర్ వ్యాధిని జయించిన తర్వాత ఇప్పుడు బాలీవుడ్‌లో ‘డియర్ మాయ’ అనే సినిమా చేస్తున్నారు. అల్రెడీ తమిళంలో ‘ఒరు మెల్లియ కోడు’ అనే సినిమా చేశారు.
 
  ఇక వరుసగా సినిమాలు చేస్తానంటున్నారు. ‘‘ఈతరం ప్రేక్షకులు అన్ని రకాల సినిమా లను ఆదరిస్తున్నారు. రిస్క్ చేయడానికి కథానాయికలకు బెరుకు ఎందుకు? మంచి ఫ్లాట్‌ఫార్మ్ ఉంది. కేవలం ఆటపాటలకు పరిమితం కావల్సిన అవసరం లేదు. మంచి మంచి పాత్రలు లభిస్తాయి. డిఫరెంట్, ప్యారలల్ సినిమాలంటూ లేవిప్పుడు. ప్రేక్షకులు అన్నిటినీ చూస్తున్నారు’’ అన్నారామె.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement