మళ్లీ మేకప్ వేసుకుంటున్న మనీషా కొయిరాలా | Manisha Koirala in Rajkumar Santoshi's next film? | Sakshi
Sakshi News home page

మళ్లీ మేకప్ వేసుకుంటున్న మనీషా కొయిరాలా

Published Tue, Sep 30 2014 12:16 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

మళ్లీ మేకప్ వేసుకుంటున్న మనీషా కొయిరాలా - Sakshi

మళ్లీ మేకప్ వేసుకుంటున్న మనీషా కొయిరాలా

'నెల్లూరి నెరజాణా...' అంటూ ఒకేఒక్కడు లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మనీషా కొయిరాలా.. మళ్లీ మేకప్ వేసుకుంటోంది. కేన్సర్తో పోరాడి.. విజయం సాధించిన మనీషా ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తోంది. యోగాతో తనను తాను మళ్లీ పూర్తి ఆరోగ్యవంతురాలిగా తీర్చిదిద్దుకుంది. అన్నీ అనుకున్నట్లుగానే జరిగితే, రాజ్కుమార్ సంతోషి తీయబోయే తదుపరి చిత్రంలో ఆమె నటించే అవకాశం ఉంది.

మనీషా ఇప్పుడు చాలా బాగుందని, ఆరోగ్యం కూడా భేషుగ్గా ఉందని ఆమె మేనేజర్ సుబ్రతో ఘోష్ తెలిపారు. ప్రస్తుతం ఆమె స్క్రిప్టులు చదువుతోందని, రాజ్కుమార్ సంతోషి తదుపరి చిత్రం దాదాపు ఓకే అయిపోయిందని అన్నారు. స్క్రిప్టు ఆమెకు బాగా నచ్చిందని, అన్నీ బాగుంటే 2015 జనవరిలో షూటింగ్ మొదలవుతుందని చెప్పారు. ఈ చిత్రంలో మనీషా ప్రధానపాత్రలో నటిస్తుందని, పంకజ్ కపూర్ కూడా అందులో ఉంటారని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement