నేను సంతోషంగా ఉన్నా..! | Manisha Koirala gets a fit body post cancer | Sakshi
Sakshi News home page

నేను సంతోషంగా ఉన్నా..!

Published Tue, Sep 23 2014 11:09 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

నేను సంతోషంగా ఉన్నా..! - Sakshi

నేను సంతోషంగా ఉన్నా..!

 లక్ష్యసాధనకు ఆత్మవిశ్వాసాన్ని మించిన ఆయుధం లేదని నిరూపించారు అలనాటి బాలీవుడ్ గ్లామర్‌డాల్ మనీషా కొయిరాలా. భయంకరమైన కేన్సర్ వ్యాధిని జయించడం కోసం ఆమె ఎంతగానో పోరాడారు. చివరకు అనుకున్నది సాధించారు కూడా. ఇప్పుడు మనీషా పూర్తి ఆరోగ్యవంతురాలు. తాజాగా జిమ్‌లో వ్యాయామం చేసి బయటికొస్తూ మనీషా తీయించుకున్న  ఈ ఫొటోగ్రాఫే అందుకు నిదర్శనం. ఈ ఫొటోని ట్విట్టర్‌లో పోస్ట్ చేసి, తన ఆరోగ్యం పట్ల ఆనందం వెలిబుచ్చారామె. ‘‘మరణం అంచులదాకా వెళ్లి తిరిగొచ్చాను. ఆత్మవిశ్వాసంతో కేన్సర్‌ను సైతం జయించాను. దైవ ప్రార్థనలు, మెడిటేషన్, యోగా, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ, మితాహారం...ఇవన్నీ నా పునర్‌వైభవానికి కారణాలయ్యాయి. దేవుని దయ వల్ల సంతోషంగా ఉన్నాను. ఇక ముందు కూడా ఇలాగే ఉంటానని ఆశిస్తున్నాను. నా గురించి ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని మనీషా ట్వీట్ చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement