'ఆ హీరోయిన్లలో ఒక్కరితోనైనా రొమాన్స్ చేయాలి' | Sushant Singh now wants Tabu, Madhuri or Manisha to be his heroine | Sakshi
Sakshi News home page

'ఆ హీరోయిన్లలో ఒక్కరితోనైనా రొమాన్స్ చేయాలి'

Published Tue, Jul 5 2016 7:28 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

'ఆ హీరోయిన్లలో ఒక్కరితోనైనా రొమాన్స్ చేయాలి' - Sakshi

'ఆ హీరోయిన్లలో ఒక్కరితోనైనా రొమాన్స్ చేయాలి'

న్యూఢిల్లీ: లవ్ ఎఫైర్లతో తరచూ వివాదాలలో చిక్కుకుంటున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్. రూమర్ల కారణంతో ప్రేయసితో గొడవపడి బ్రేకప్ చెప్పేశాడు. ఇక విషయానికొస్తే.. యంగ్ హీరోలు తనకంటే తక్కువ వయసుండే హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడానికి ఒకే చెబుతుంటారు. అయితే సుశాంత్ మాత్రం తన టేస్ట్ ఏంటో చెప్పకనే చెబుతున్నాడు. తనకు ఒకవేళ అవకాశం ఇస్తే, కష్టసాధ్యమైనా సరే ముగ్గురు మాజీ హీరోయిన్లతో రొమాన్స్ చేస్తానని అంటున్నాడు.

'ఎక్ దో తీన్' అంటూ కుర్రకారు గుండెల్లో రెండు దశాబ్దాల కిందట వేడి పుట్టించిన మాధురీ దీక్షిత్, డైరెక్టర్ల హీరోయిన్ గా, అందానికే హంగులు అద్దినట్లుగా ఉండే మనీషా కొయిరాలా, ఇప్పటికీ తనకంటూ గుర్తింపునిచ్చే క్యారెక్టర్లలో కనిపించే టబుతో కలిసి నటించాలని ఆశ పడుతున్నాడు సుశాంత్. ఎందుకుంటే ఆ ముగ్గురు సూపర్ హీరోయిన్లు. వారి అందం తనకు నిద్రలేని రాత్రులను కల్పించిందని చెప్పుకొచ్చాడు. ఆ ముగ్గురిలో కనీసం ఒక్కరితోనే రొమాన్స్ చేసే అవకాశం రావాలని మనసులో మాట చెప్పేశాడు. సుశాంత్ నటించిన ఎం.ఎస్ ధోనీ: ద అన్ టోల్డ్ స్టోరీ, రాబ్తా మూవీలు ఈ ఏడాది విడుదల కానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement