బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫిఖర్ రహీమ్ (243 బంతుల్లో 116; 15 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత సెంచరీ ఆ జట్టును పరాజయం నుంచి తప్పించలేకపోయింది.
10 వికెట్లతో విండీస్ గెలుపు
కింగ్స్‌టౌన్: బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫిఖర్ రహీమ్ (243 బంతుల్లో 116; 15 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత సెంచరీ ఆ జట్టును పరాజయం నుంచి తప్పించలేకపోయింది. మంగళవారం ఇక్కడ ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ఐదో రోజు 15.3 ఓవర్లలో 58 పరుగులు జోడించిన బంగ్లా తమ రెండో ఇన్నింగ్స్‌లో 314 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో 13 పరుగుల విజయలక్ష్యాన్ని విండీస్ 2.4 ఓవర్లలో అందుకుంది. రహీమ్ తన పోరాట పటిమతో బంగ్లాను ఇన్నింగ్స్ ఓటమి పాలుకాకుండా మాత్రమే కాపాడగలిగాడు. సిరీస్‌లో విండీస్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు శనివారం నుంచి సెయింట్ లూసియాలో జరుగుతుంది.